భారీ వాహనాలను అలవోకగా డ్రైవ్ చేస్తున్న ఈ బామ్మను చూసి వామ్మో..! అనాల్సిందే. చాలా చాకచక్యంగా నడిపేస్తోంది. అంతేకాదు హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌ని కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది కూడా. అలాంటి వాహనాలను నడపడం కేవలం మగవాళ్లు మాత్రమే చేయగలరన్న మూసధోరణిని మూలనపడేసింది. సామర్థ్యం ఉంటే ఎవ్వరైనా.. చేయగలరని చేసి చూపించింది ఈ సూపర్ బామ్మ..!. ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..
మణి అమ్మగా పిలచే రాధామణి అమ్మ..కేరళకు చెందిన 71 ఏళ్ల మహిళ. తన అద్భతమైన డ్రైవింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె జేసీబీలు దగ్గర నంచి క్రేన్ల వంటి భారీ వాహనాల వరకు ప్రతీది ఈజీగా నడిపేస్తుంది. అంతేకాదండోయే ఏకంగా విభిన్న హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్‌ల 11 పొందిందట. తాను ఈ హెవీ వెహికల్స్‌ని ఇంత అలవోకగా నడపడానికి కారణం.. తన భర్తదే క్రెడిట్ అంటోంది. మహిళలు అస్సలు డ్రైవింగ్ నేర్చకోవడానికి ముందుకురాని కాలంలో ఆమె తన భర్త అండదండలతో భారీ వాహనాలను డ్రైవ్ చేయడం నేర్చుకుంది.
అలా ఆమె 1981లో ఫోర్ వీలర్ లైసెన్స్ పొందింది. ఆ తర్వాత 1984లో హెవీ వెహికల్ లైసెన్స్ పొందింది. ఆ టైంలో కేరళలో మహిళలు హెవీ వెహికల్ లైసెన్స్ పొందడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. అంతేగాదు తాను ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌ని ఎలా స్థాపించారో కూడా వివరించారు. 2004లో భర్త మరణంతో రాధమణి ఈ రంగంలో పలు అడ్డంకులను ఎదుర్కొంది. అయిన ప్పటికీ పట్టుదలతో డ్రైవింగ్ స్కూల్ భాద్యతలు చేపట్టి డ్రైవింగ్ కమ్యూనిటీ లీడర్ స్థాయికి ఎదిగింది. మొదట్లో అది ఏ2Z డ్రైవింగ్ స్కూల్ ఆ తర్వాత కాలక్రమేణ ఏ2Z ఇన్‌స్టిట్యూట్‌గా మారింది.
ఇక్కడ మణి అమ్మ..అన్ని రకాల భారీ పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ ఇస్తుంది. ఈ వయసులో కూడా ఆమె చదువు కొనసాగిస్తోంది. ఆమె ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేస్తోంది. అంతేగాదు తాను మొదట్లో భారీ వాహనాల డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడూ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో గర్తు చేసుకున్నారు. ఆ టైంలో డ్రైవింగ్ నేర్చకోవడం ఓ సవాలుగా ఉండేదన్నారు మణి అమ్మ.
అంతేగాదు చిన్న వాహనాల కంటే భారీ వాహనాల నడపటమే సులభమని ఆమె నొక్కిచెబుతున్నారు. తాను ఎన్ని ఆటంకాల ఎదురైనా అంకితభావంతో వేర్వేరు భారీ వాహనాల 11 లైసెన్స్‌లు పొందినట్లు చెప్పుకొచ్చారు. నేర్చుకోవాలన్న అభిరుచి ఉన్నవాళ్లకి వయోభేదం పెద్ద సమస్య కాదంటున్నారు. అలాగే డ్రైవింగ్ అనేది ఏ ఒక్క లింగానికో పరిమితం కాదని రాధామణి నొక్కి చెబుతున్నారు. నిజంగా రాధామణి గ్రేట్ కదూ. మన అమ్మమల కాలంలోనే ఆమె ఇంత అలవోకగా నేర్చుకోవడమే గాక ఇతరులకు మెళ్లకువలు నేర్పిస్తున్నారు. పైగా మహిళలు ఈ రంగంలోకి ధైర్యంగా రావొచ్చు, సంకోచించాల్సిన పని లేదంటన్నారు రాధామణి.
(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..)
Comments
Please login to add a commentAdd a comment