
సాక్షి, బంజారాహిల్స్: అంకితభావం, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో డ్రైవింగ్ నేర్చుకుని తెలంగాణ రవాణా శాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్ట మొదటి మరుగుజ్జుగా రికార్డు సృష్టించిన డాక్టర్ శివలాల్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ మంగళవారం శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. శివలాల్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా, రోల్‌మోడల్‌గా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
బంజారాహిల్స్‌లో నివసించే శివలాల్ తన ఎత్తుకు సరిపడా కారు క్లచ్, బ్రేక్‌లు ఏర్పాటు చేసుకొని మూడు నెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని అధికారులను ఒప్పించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అభినందనీయమని సజ్జనార్ అన్నారు. లిమ్కాబుక్ ఆఫ్‌రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న శివలాల్ భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరారు. ఈ మేరకు ఆయన శివలాల్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment