dwarf
-
మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా..
తెలంగాణలో తొలి ఉద్యోగం నాకే రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. గాంధీ భవన్ వెళ్లినప్పుడు ఆయన నాకు ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఆయన నెరవేరుస్తుండడం హ్యాపీగా ఉంది.. :::రజిని అధికారంలోకి గనుక వస్తే.. అంటూ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సర్కార్ ఏర్పాటు అవుతున్న తరుణంలో వాటిని నెరవేర్చేందుకు సిద్ధమైపోయింది. రేపు డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణం ముఖ్యమంత్రిగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ హామీలు నెరవేర్చడంపైనా ఆయన స్పష్టమైన ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. తొలి ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో తొలి ఉద్యోగం రజినీ అనే యువతికి దక్కనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని అధికార యంత్రాంగాన్ని రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం అని స్వయంగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడా గ్యారెంటీని నెరవేర్చేందుకు రెడీ అయిపోయారు. అక్టోబర్ 17వ తేదీన.. నాంపల్లికి చెందిన రజిని అనే ఓ దివ్యాంగురాలు గాంధీభవన్‌కు వెళ్లి రేవంత్‌రెడ్డిని కలిశారు. రజిని రెండేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతోంది. పీజీ చేసిన తనకు ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రావట్లేదని తన బాధను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పింది. అప్పుడు రేవంత్ రెడ్డి .. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం నీకే ఇస్తాం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార సభ ఉంటుంది. ఆ సభకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ వస్తారు. ఆ సభలోనే మొదటి ఉద్యోగం నీకేనమ్మా. ఇది నా గ్యారెంటీ’’ అంటూ రేవంత్ ఆమెకు హామీ ఇచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు మీద స్వయంగా ఆయన రజినీ పేరు రాసి.. కింద సంతకం కూడా చేశారు. As PCC President of Telangana , promised first job to Rajini, a physically challenged girl from Nampally as soon as #Congress comes to power. I filled the Congress guarantee card with Rajini's name. Rajini, who completed post graduation expressed her grief that she is not… pic.twitter.com/JFSha8a56M — Revanth Reddy (@revanth_anumula) October 17, 2023 నెలన్నర తర్వాత.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో తొలి ఉద్యోగం రజినికే దక్కబోతోంది. కానీ, ప్రమాణ స్వీకారమే రెండు రోజులు ముందుగానే జరుగుతోంది. -
పురస్కారం..: పచ్చనాకు సాక్షిగా...
చేనులోని గోధుమను ఎప్పుడైనా పలకరించారా? అది తన గోడు వెళ్లబుచ్చుకోదు. మన గోడు ఏమిటో శ్రద్ధగా వింటుంది. మన ఆకలి తీరుస్తుంది... అందుకే గోధుమ అంటే నార్మన్ బోర్లాగ్‌కు అంత ఇష్టం. మన దేశం కరువు కోరల్లో చిక్కుకుపోయిన ఒకానొక సమయంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు అద్భుతాన్ని సృష్టించాయి. రైతు కంట్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయన ఫోటో మన రైతుల ఇండ్లలో కనిపిస్తుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇనిషియేటివ్ (బీజీఆర్‌ఐ) అంతర్జాతీయ అవార్డ్‌కు ఎంపికైన డా.పర్వీన్, మెంటర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపికైన తొలిభారతీయ శాస్త్రవేత్త... నార్మన్ బోర్లాగ్ అనే పేరు వినబడగానే అమెరికన్ పేరులా అనిపించదు. ఆత్మీయనేస్తంలా ధ్వనిస్తుంది. మెక్సికోలో ఇంటర్నేషనల్ మైజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా పనిచేసిన బోర్లాగ్ రోగనిరోధక శక్తితో కూడిన, అధిక దిగుబడి ఇచ్చే డ్వార్ఫ్(చిన్న) గోధుమ వంగడాలను సృష్టించి రైతునేస్తం అయ్యాడు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. మన దేశం కరువు కోరల్లో చిక్కుకున్న విషాదకాలంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు మనకు ఎంతో ఉపయోగపడ్డాయి. కరువు కోరల నుంచి రక్షించాయి. గోధుమ ఉత్పత్తిలో మన రైతులు స్వయంసమృద్ధి సాధించేలా చేశాయి. అందుకే ఉత్తరభారతంలోని రైతుల ఇండ్లలో ఆయన ఫోటో కనిపిస్తుంది. బోర్లాగ్ కుమార్తె జీని బోర్లాగ్ తండ్రి కృషిని ముందుకు తీసుకెళుతోంది. గ్లోబల్ వీట్ కమ్యూనిటీని బలోపేతం చేయడంలో విశేషమైన కృషి చేస్తున్న జీని బోర్లాగ్ ‘సూపర్ ఉమెన్ ఆఫ్ వీట్’ గా పేరుగాంచింది. బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇన్షియేటివ్(బీజిఆర్‌ఐ) చైర్‌పర్సన్‌గా గోధుమ రంగానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను రైతుల దగ్గరికి తీసుకెళుతుంది. 2010లో ఏర్పాటు చేసిన జీని బోర్లాగ్ లాబ్ వుమెన్ ఇన్ ట్రిటికమ్ మెంటర్ అవార్డ్‌ను గోధుమరంగంలో విశిష్ట కృషి చేసిన వారికి, కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డ్‌కు గానూ పంజాబ్‌కు చెందిన శాస్త్రవేత్త డా.పర్వీన్ చూనెజ ఎంపికైంది. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. గతంలో మన దేశం నుంచి డా.మిథాలీ బన్సాల్, డా.సాను ఆరోరా ఎర్లీ కెరీర్ విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపియ్యారు. పర్వీన్ ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు పీహెచ్డీ చేయడం విశేషం. వివిధ దేశాల నుంచి ఎర్లీ కెరీర్ విన్నర్స్‌తో పాటు మెంటర్స్‌ను కూడా ఎంపిక చేస్తుంది బీజిఆర్‌ఐ. మెంటర్ విభాగంలో ఈ అవార్డ్ అందుకోనుంది పర్వీన్. మన దేశం నుంచి ఈ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ సైంటిస్ట్‌గా ప్రత్యేకత సాధించింది పర్వీన్. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో జన్మించిన పర్వీన్ కెఎన్ జైన్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. సందేహాలను తీర్చుకోవడంలో ఎప్పుడూ సంశయించేది కాదు. లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్విటీలో బీఎస్సీ చేసింది. 1992లో పీహెచ్డీ పూర్తి చేసింది. 1996లో డీఎస్టీ యంగ్ సైంటిస్ట్ అవార్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, న్యూ దిల్లీ ‘ఔట్‌స్టాండింగ్ ఉమెన్ సైంటిస్ట్’ అవార్డ్‌తో సహా ఎన్నో అవార్డ్లు అందుకుంది. ఇంటర్నేషనల్ వీట్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఉంది. ‘పర్వీన్లో మార్గదర్శక నైపుణ్యాలే కాదు, గొప్ప స్నేహలక్షణాలు ఉన్నాయి. ఆమె దగ్గర పనిచేయడం అంటే ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకునే అవకాశమే కాదు, క్రమశిక్షణ కూడా అలవడుతుంది’ అంటున్నారు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ సర్వ్‌జీత్ సింగ్. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. -
శభాష్ శివలాల్.. మరుగుజ్జు వ్యక్తిని అభినందించిన సజ్జనార్, ఎందుకో తెలుసా?
సాక్షి, బంజారాహిల్స్: అంకితభావం, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో డ్రైవింగ్ నేర్చుకుని తెలంగాణ రవాణా శాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొట్ట మొదటి మరుగుజ్జుగా రికార్డు సృష్టించిన డాక్టర్ శివలాల్‌ను టీఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ మంగళవారం శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించారు. శివలాల్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా, రోల్‌మోడల్‌గా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లో నివసించే శివలాల్ తన ఎత్తుకు సరిపడా కారు క్లచ్, బ్రేక్‌లు ఏర్పాటు చేసుకొని మూడు నెలల పాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని అధికారులను ఒప్పించి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం అభినందనీయమని సజ్జనార్ అన్నారు. లిమ్కాబుక్ ఆఫ్రికార్డ్స్లో స్థానం దక్కించుకున్న శివలాల్ భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని కోరారు. ఈ మేరకు ఆయన శివలాల్ ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేశారు. -
దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తి మనోడే!
India's First Dwarf Driving License: ప్రపంచంలో అందరికి ఏవేవో లోపాలు ఉంటాయి. కొంతమంది వాటిని అధిగమించి తమలో ఉన్న నైపుణ్యాలకు పదునుపెట్టి స్ఫూర్తిదాయకంగా నిలవడానికి ప్రయత్నిస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి అలానే చేసి అందరికి స్ఫూర్తిగా నిలాచాడు. (చదవండి: అందరూ!....వెక్కిరించి అవమానించే ఏకైక వైకల్యం...నత్తి!!) అసలు విషయంలోకెళ్లితే...కరీంనగర్ జిల్లాకి చెందిన గట్టిపల్లి శివపాల్ సుమారు మూడు అడుగుల ఎత్తులో ఉండే 42 ఏళ్ల మరుగుజ్జు వ్యక్తి. అంతేకాదు మరుగుజ్జువాళ్లలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. అయితే అతన్ని ప్రజలు తనని ఎత్తు కారణంగా హేళన చేస్తుండేవారని చెబుతున్నాడు. ఈ క్రమంలో అతను తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని, పైగా తనలాంటి వాళ్లకి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రజలు కూడా సుముఖంగా లేరని వాపోయాడు. అయితే తన స్నేహితురాలి సాయంతో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, ప్రస్తుతం తాను అక్కడే 20 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ మేరకు అతను ఎక్కడికైన వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసినప్పుడల్లా వారు తన రైడ్‌ని రద్దుచేసేవారని, పైగా తన భార్యతో కలిసి బయటకి వెళ్లినప్పుడల్లా రకరకాలుగా కామెంట్లు చేసేవారని శివపాల్ అన్నాడు. దీంతో అప్పుడే శివపాల్ తానే స్వయంగా కారు నడపాలనే నిర్ణయించుకున్నాడు. పైగా అందుకోసం ఇంటర్నెట్లో విపరీతంగా సర్చ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే శివపాల్‌కి యూఎస్‌లో ఒక వ్యక్తి అప్లోడ్ చేనిన వీడియో ఒకటి అతన్ని ఆకర్షించింది. అంతేకాదు ఆ వీడియోలో కారుని తన ఎత్తుకు తగిన విధంగా సెటప్ చేస్తే సులభంగా డ్రైవ్ చేయవచ్చునని వివరించి ఉంది. దీంతో అతను అనుకున్నదే తడువుగా తన స్నేహితుడి సాయంతో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. అయితే రవాణా శాఖకు ఎత్తుపై కొన్ని మార్గదర్శకాలను కలిగి ఉన్నందున లైసెన్స్ పొందడం మరొక అతి పెద్ద సవాలుగా మారింది. ఈ మేరకు శివపాల్ అధికారులకు విజ్ఞప్తి చేసి సరైన డ్రైవింగ్ టెస్ట్ చేయించి డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. అంతేకాదు డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మరుగుజ్జు వ్యక్తిగా నిలవడమే కాక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి నామినేట్ అయ్యాడు. దీంతో చాలామంది మరుగుజ్జు వ్యక్తులు శివపాల్ని డ్రైవింగ్ శిక్షణ కోసం సంప్రదించడం విశేషం. అంతేకాదు శివపాల్ వచ్చే ఏడాది శారీరక వికలాంగుల కోసం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. (చదవండి: హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!) -
క్యూట్ కపుల్.. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’
సాక్షి, చింతామణి: ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్న ఆంగ్ల సామెత ఈ జోడిని చూస్తే అర్థమవుతుంది. వరుడు బెంగళూరుకు చెందిన విష్ణు (28), వధువు కోలారుకు చెందిన జ్యోతి (25). బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరిలోనూ వయసుకు తగ్గట్టు శరీర పెరుగుదల లోపించింది. ఇప్పుడు ఈ జంటను చూసిన వారంతా క్యూట్ కపుల్ అంటూ మురిసిపోతున్నారు. కర్ణాటకలో చింతామణి వద్దనున్న కైవార క్షేత్రంలో ఆదివారం వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. (చదవండి: భార్యపై అనుమానం.. నిద్రలో ఉండగా సిలిండర్ ఆన్ చేసి..) -
మరుగుజ్జు.. శివలాల్ సాధించాడు!
బంజారాహిల్స్: అతడి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది.. లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఓ మరుగుజ్జును అందరికీ ఆదర్శంగా నిలిపింది.. హైదరాబాద్ బంజారాహిల్స్‌రోడ్ నంబర్–10లోని గౌరీశంకర్ కాలనీలో నివసించే జి.శివలాల్(39) మరుగుజ్జు. బీకాం చదివాడు. భార్య కూడా మరుగుజ్జే. వీరికి ఒక కొడుకు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో దారి వెంట వెళుతుంటే ‘పొట్టివాడు’అంటూ కొందరు గేలిచేసేవారు. వీడు సైకిల్ కూడా తొక్కలేడంటూ నవ్వేవారు. ఈ అవమానాలు శివలాల్లో పట్టుదలను పెంచాయి. సైకిల్ ఏం ఖర్మ, ఏకంగా కారే నడిపిద్దామని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది..! గతే డాది నవంబర్ 27న ఓ కారు కొనుక్కున్నాడు. క్లచ్, బ్రేక్ అందదు కాబట్టి కారును రీమోడలింగ్ చేయించాడు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అదే కారులో డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టి నెలరోజుల్లోనే పూర్తిగా తర్ఫీదు పొందాడు. గత మార్చి 12న కారు నడిపించుకుంటూ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అయితే, ఇంతవరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరుగుజ్జులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇవ్వలేదు. ఉన్నతాధికారులు వారంపాటు ఈ విషయంపైనే చర్చించి చివరకు ఈ నెల 6న శివలాల్‌కు పర్మనెంట్ లైసెన్స్ జారీ చేశారు. తెలంగాణలో ఉన్న సుమారు 400 మంది మరుగుజ్జులలో డిగ్రీ చేసిన మొట్టమొదటివ్యక్తి శివలాల్. అంతేకాకుండా మొదటగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మరుగుజ్జు కూడా ఆయనే కావడం గమనార్హం. చదవండి: 3 పేర్లు 3 ఫోన్ నంబర్లు.. స్రవంతికి పెళ్లయినా వదల్లేదు.. -
మరుగుజ్జును వివాహమాడిన యువతి
టీ.నగర్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మరుగుజ్జును యువతి ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం రక్షణ కల్పించాలని కోరుతూ కరూర్ మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. వివరాలు శుక్రవారం వెల్లడయ్యాయి. కరూర్ సమీపంలోని తేరూరుకు చెందిన విఘ్నేశ్వరన్ (25) నాలుగు అడుగుల ఎత్తు ఉన్నాడు. ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఫేస్బుక్లో శివగంగైకు చెందిన ఫార్మసీ విద్యార్థిని పవిత్రతో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు వివాహం చేసుకునేందుకు నిర్ణయించారు. ఇందుకు ఇరు కుటుంబాలు వ్యతిరేకత తెలిపాయి. ఇలా ఉండగా బుధవారం కరూర్ ఈశ్వరన్ ఆలయంలో పవిత్రను విఘ్నేశ్వరన్ వివాహం చేసుకున్నాడు. అనంతరం తమకు భద్రత కల్పించాలని కోరుతూ కరూర్ మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. -
ఒక్కటైన మరు గుజ్జు జంట
మాలూరు: రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న వరుడు, రెండు అడుగుల ఎత్తు ఉన్న యువతితో వివాహం ఈ నెల 25న హోసకోట తాలూకా జడిగేనహళ్లి గ్రామంలో జరుగ నుండి వివాహ ముందు రోజు శాస్త్రాలను నిర్వహించారు. తాలూకాలోని యశవంతపుర గ్రామానికి చెందిన దివంగత కృష్ణమూర్తి భాగ్యమ్మ దంపతుల కుమారుడు అనిల్‌కుమార్(28), బెంగుళూరు రూరల్ జిల్లా విజయపుర పట్టణానికి చెందిన మునియప్ప, సత్యనారాయణమ్మల కుమార్తె వరలక్ష్మి(22)ల వివాహం నిశ్చయమైంది.అనిల్‌కుమార్ 2.5 అడుగుల ఎత్తు ఉన్నారు. అనిల్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ వరకు చదివాడు. అనిల్‌కుమార్‌కు వివాహం చేయాలని పోషకులు అతి కష్టంపై అంతే ఎత్తు ఉన్న 2 అడుగుల ఎత్తున ఉన్న వరలక్ష్మిని వెతికి వివాహం నిశ్చయించారు. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తయింది. సోమవారం హోసకోటలోని కాలభైరవేశ్వర దేవాలయంలో వివాహం జరుగనుంది. -
పెళ్లి కూతురైన కత్రినా...?
సాక్షి, సినిమా : సినీ ప్రియులంతా ఈ వేసవిలో రాబోయే బ్లాక్‌బాస్టర్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాటిలో కింగ్ షారుక్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘జీరో’ ఒకటి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న సమాచారమైన ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో షారుక్‌తో పాటు కత్రినా కైఫ్, అనుష్క శర్మ, అభయ్ డియెల్లు నటిస్తున్నారు. అయితే కత్రినా తప్ప మిగిలిన వారంతా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే షారుక్ ఈ చిత్రంలో మరుగుజ్జుగా కనిపించనున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన పోస్టు చేశారు. మిగతా పాత్రలకు సంబంధించన విషయాలను మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. తాజాగా కత్రినా పోస్టు చేసిన ఓ ఫొటో ఆమె పాత్రపై ఉత్కంఠ రేపుతోంది. సంప్రదాయ బెంగాలీ పెళ్ళికూతురి అలంకరణలో కత్రినా ఉన్నారు. బెంగాలీ పెళ్లికూతురు ధరించే బింది, మెడకు, చెవులకు భారీ ఆభరణాలు ధరించారు. అలానే బెంగాలీ వధువు ధరించే సంప్రదాయ ‘శంక పోలో’ను కూడా ధరించారు. ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని భావిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి మరణానంతరం చిత్రీకరించిన సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. -
నాడు కమల్ హాసన్.. నేడు షారుక్ ఖాన్
సాక్షి, న్యూఢిల్లీ : షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘జీరో’ తొలి టీజర్ విడుదలైన విషయం తెల్సిందే. వచ్చే డిసెంబర్ నెలలో విడుదల కానున్న ఈ చిత్రంలో షారుక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో ఎలా నటిస్తున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. సరిగ్గా 29 ఏళ్ల క్రితం కమలా హాసన్ నటించిన ‘అపూర్వ సహోదరులు’ చిత్రాన్ని తమిళ, తెలుగుభాషల్లో విడుదల చేయగా కలెక్షన్లు హోరెత్తాయి. తమిళనాట అప్పటి వరకు నెలకొన్న అన్ని రికార్డులను ఆ సినిమా బద్ధలు కొట్టింది. ఆ తర్వాత ఆ సినిమా రికార్డును అధిగమించినది రజనీకాంత్ నటించిన ‘బాషా’ చిత్రం మాత్రమే. అపూర్వ సహోదరులు అంతటి ఆదరణ పొందడానికి కారణం ‘అప్పు’ పాత్రలో కమల్ హాసన్ మరుగుజ్జుగా కనిపించడమే. మోకాళ్ల వరకే పూర్తి కాలున్నట్లుగా కమల్ హాసన్ ఆ చిత్రంలో కనించడానికి కమలహాసన్‌తోపాటు దర్శకుడు ఎంతో కష్టపడ్డారు. అది ఎలా సాధ్యమైందన్న విషయాన్ని కమలా హాసన్గానీ, ఆ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావుగానీ వెల్లడించకుండా 2008 సంవత్సరం వరకు గోప్యంగా ఉంచారు. ఈ రహస్యం ఇప్పటి కూడా అందరికి తెలియకపోవచ్చు. ఆ చిత్రంలో మరుగుజ్జు పాత్ర కోసం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్నిగానీ, గ్రాఫిక్స్గానీ ఉపయోగించలేదు. సింగీతం శ్రీనివాస్ రావు కథనం ప్రకారం. కమల్ హాసన్ ఎక్కువ వరకు వెనక కాళ్లు కనిపించకుండా మోకాళ్లపై నడిచారు. అందుకనే ఎక్కువ షాట్లు క్లోజప్లోనే ఉంటాయి. ఇక కమల్ హాసన్ పక్కకు తిరిగి నడుస్తున్నట్లుగా చూపించాల్సి వచ్చినప్పుడు కందకం తవ్వి అందులో మోకాలి వరకు కమల్‌ను నిలబెట్టి ఇసుకతో పూడ్చి నడిపించారు. మోకాళ్లపై నడుస్తున్నప్పుడు ఎక్కువ వరకు సహజంగా కనిపించేందుకు, మోకాలి చిప్ప నొప్పి పెట్టకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన బూట్లను వాడారు. ఇక తోటి నటుల మధ్య ఎదురుగా కాకుండా అటూ ఇటూగా ఉన్నప్పుడు కూడా కందకం టెక్నిక్‌నే వాడారు. పాటల సందర్భంలో, ముఖ్యంగా సర్కస్ మిత్రులతో కలిసి కాళ్లూపుతూ పాటలు పాడినప్పుడు కమల్ ప్రత్యేకంగా రూపొందించిన కత్రిమ కాళ్లను వాడారు. ఆ కాళ్లను వంచిన మోకాళ్లకు తగిలించి కదిలేలా చేశారు. అప్పు పాత్రలో కమల్ హాసన్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోకాళ్ల వరకు కాళ్లను కత్తిరించినట్లు కనిపిస్తుంది తప్పా, పూర్తి సహజత్వం కనిపించదు. అయినప్పటికీ ఆ ప్రయోగం నచ్చడంతో సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఆ తర్వాత 2001లో విడుదలైన ఆషిక్ సినిమాలో జానీ లివర్ ఇలాంటి టెక్నిక్కే ఉపయోగించి మరుగుజ్జు పాత్రలో నటించారు. ఇక 2006లో విడుదలైన ‘జాన్ ఏ మన్’ చిత్రంలో అనుపమ్ ఖేర్ మరుగుజ్జు పాత్రలో నటించారు. ఆ సినిమాలో ఆయన మోకాళ్ల వరకు కాళ్లు మడిచే నడిచారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా 40 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్లో పాల్గొనడం వల్ల ఆయన మోకాలి చిప్పలు అప్పట్లో వాచి పోయాయి. ఇప్పుడు కూడా మెట్లు ఎక్కుతుంటే మోకాలి చిప్పలు కలుక్కుమంటున్నాయని అనుపమ్ ఖేర్ అప్పుడప్పుడు చెబుతుంటారు. ఇప్పుడు ‘జీరో’ చిత్రంలో షారూక్ ఖాన్ మరుగుజ్జుగా ఎలా నటిస్తున్నారన్నది ఆసక్తికరమైన తాజా ప్రశ్న. కమల్ హాసన్, అనుపమ్ ఖేర్లలాగా మోకాలి చిప్పలను దెబ్బతీసుకోకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి షారుక్ ఖాన్ నటించారు. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది హాబిట్’ లాంటి చిత్రాల్లో ఉపయోగించిన పీటర్ జాక్సన్ ‘పర్స్పెక్టివ్ టెక్నిక్’ను ఇందులో ఉపయోగించారు. దీనికి విస్తతమైన సెట్లు అవసరం అవుతాయి. తోటి పాత్రలకన్నా షారుక్ ఖాన్‌ను చాలా దూరంగా ఉంచి షూటింగ్ చేయడం వల్ల షారుక్ ఖాన్ పొట్టిగా కనిపిస్తారు. ఆ తర్వాత పాత్రల మధ్య ఆ దూరం కనిపించకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగిస్తారు. ఇందులో కూడా కెమేరా పనితనం బాగా లేకపోయినా, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో మిక్సింగ్ బాగాలేకున్నా, సినిమా మొత్తం నిడివిలో ఒకేతీరు పర్స్పెక్టివ్ లేకున్నా సహజత్వం లోపిస్తుంది. -
50 మంది మరుగుజ్జులు నటించే 5జీ
తమిళసినిమా: మరుగుజ్జు కళాకారులు 50 మంది కలిసి 5జీ అనే చిత్రంలో నటించనున్నారు. తొలి ప్రపంచ మరుగుజ్జు కళాకారుల సంఘం ఫిలిం ఇండస్ట్రి డిసేబుల్డ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఊఐఈఅఅగిఅ)కు చెందిన 50 మంది మరుగుజ్జు కళాకారులతో ఆ సంఘం నిర్మిస్తున్న చిత్రం 5జీ. దేశంలోనే మరుగుజ్జులు అధికంగా గల పరవకోట్టై గ్రామానికి చెందిన దేవేంగా కళాకారుడు కే.రాజ బాలాజి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రపంచం మరుగుజ్జు మధ్య బంధుత్వాన్ని పెంపొందించి మానవత్వాన్ని ప్రేరేపించడమే ఈ 5జీ చిత్ర ప్రధానాంశంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇందులో మానవత్వం కలిగిన పలువురు తమిళ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారని చెప్పారు.ఈ చిత్రాన్ని ప్రపంచ మరుగుజ్జుల దినోత్సవం డిసెంబర్ మూడో తేదీ నుంచి ప్రారంభించనున్నామని దర్శకుడు కే.రాజా బాలాజీ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. -
మరుగుజ్జు పాత్రలో బాద్షా
బాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ స్టార్‌గా తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బాద్షా షారూఖ్ ఖాన్ రూట్ మారుస్తున్నాడు. తన సమకాలీన నటులైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు వరుసగా ప్రయోగాలు చేస్తుండటంతో షారూఖ్ కూడా ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. ఇటీవల ఫ్యాన్ సినిమాతో కాస్త రూట్ మార్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయినా మరోసారి ప్రయోగానికి రెడీ అవుతున్నాడీ సూపర్ స్టార్. ప్రస్తుతం రాయిస్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న షారూఖ్, ఆ సినిమా పూర్తయిన తరువాత ది రింగ్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాంజానా లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఆనంద్, షారూఖ్‌ను మరుగుజ్జు పాత్రలో చూపించనున్నాడట. ఈ సినిమాను షారూఖ్ తన సొంతం నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించనున్నాడు. -
ఎత్తు లేకున్నా... ఎంతో ఎత్తుకు..!
కనీసం నాలుగు అడుగులు దాటని ఎత్తు... వయసేమో రెండు పదులు... ప్రతిభ ఉన్నా కాలంతో పోటీపడదామంటే ప్రోత్సాహం కరువు... గుర్తించే వాళ్లు అంతకన్నా లేరు... ఇవీ మరుగుజ్జుల కష్టాలు... అలాగని వాళ్లు మనో ధైర్యాన్ని వీడలేదు... క్రీడల్లో తమకున్న నైపుణ్యానికి మరింత పదును పెట్టారు... మంచి ఫలితాలు సాధించారు... తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. మరుగుజ్జులంటే అందరికీ చిన్నచూపే... సమాజంలో వారికి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు... ప్రతిభ ఉన్నా బండెడు కష్టాలే... అందుకే వాళ్లు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లతోనో... సర్కస్‌లో జోకర్లుగానో... చిరు వ్యాపారులుగానో స్థిరపడిపోతున్నారు. ఇవేమీ లేనివాళ్లు బతుకు బండిని భారంగా లాగిస్తున్నారు. అయితే సమాజంలో తమకూ ఏదో విధమైన గుర్తింపు దక్కాలన్న ఆశయం వారిని క్రీడాకారుల్ని చేసింది. తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించేలా చేసింది. ఫలితంగా మరుగుజ్జులు డ్వార్ఫ్ క్రీడల్లో, పారా ఒలింపిక్స్‌లో సత్తా చాటుతున్నారు. ఇంతింతై... మరుగుజ్జు క్రీడాకారుల కోసం అమెరికాలో డ్వార్ఫ్ అథ్లెటిక్ అసోసియేషన్ 1985లో ఏర్పాటైంది. మరుగుజ్జు క్రీడలను అభివృద్ధి చేసి, వాటికి ప్రాచుర్యం కల్పించి, క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ సంఘం ఏర్పడింది. అలా తామూ ఏ క్రీడలనైనా ఆడగలమనే ధీమాను సాధించడమే కాకుండా మరుగుజ్జులకు పోటీలూ ఉన్నాయని ప్రపంచానికి చాటినట్లయింది. అలా మొదలైన వారి ప్రస్థానం ప్రపంచ క్రీడల్లో ప్రత్యేకంగా కొనసాగుతోంది. మరుగుజ్జులకు ప్రత్యేకం అథ్లెటిక్స్... ఫుట్‌బాల్... బాస్కెట్‌బాల్... స్విమ్మింగ్... బ్యాడ్మింటన్... ఫ్లోర్ హాకీ... వాలీబాల్... ఆర్చరీ.. టెన్నిస్... పవర్‌లిఫ్టింగ్... షూటింగ్... కర్లింగ్... ఇలా పలు క్రీడల్లో ప్రావీణ్యం ఉండి.. క్రీడాకారుడిగా సత్తా చాటాలనుకునే మరుగుజ్జుల కోసం ప్రతీ నాలుగేళ్లకోసారి ప్రపంచ క్రీడలు జరుగుతాయి. ఇప్పటిదాకా ఆరుసార్లు ప్రపంచ డ్వార్ఫ్ క్రీడలు జరగ్గా... చివరిసారిగా 2013లో అమెరికాలోని మిచిగాన్ ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. 2013 ప్రపంచ క్రీడల్లో 17 దేశాలకు చెందిన 395 మంది మరుగుజ్జులు పోటీల్లో పాల్గొన్నారు. 1993లో తొలిసారిగా ఈ పోటీలకు అమెరికాలోని చికాగో ఇల్లినాయిస్లో నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేది వీరే మరుగుజ్జుల పోటీల్లో పాల్గొనాలనుకునే వారి ఎత్తు నాలుగు అడుగుల పది అంగుళాలు మించకూడదు. కండరాలు అసాధారణంగా పెరగడం వల్ల కాళ్లు, చేతుల్లో వాపు వచ్చిన వారిని ఇందులో పాల్గొనేందుకు అనుమతినిస్తారు. అయితే ఈ పోటీల్లో పాల్గొనే వాళ్లంతా మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక డ్వార్ఫ్ క్రీడలు ఎక్కడ జరిగినా నిబంధనలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఈ క్రీడల్లో పాల్గొనే వాళ్లు పారా ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగుతుంటారు. అందుకే మరుగుజ్జులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ఈ క్రీడల్లో పాల్గొనే వారికి ఫ్యూచర్స్, జూనియర్స్, ఓపెన్, మాస్టర్స్ వయస్సు గ్రూపుల్లో పోటీలు నిర్వహిస్తారు. వీరికి అత్యున్నత క్రీడలు ఒకరకంగా ప్రపంచ డార్ఫ్ గేమ్సే. మరుగుజ్జు క్రీడాకారులు ఏ దేశానికి చెందిన వారైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. తమ దేశానికి చెందిన చెఫ్ డి మిషన్ ద్వారా పోటీల్లో పాల్గొనవచ్చు. ఒకవేళ చీఫ్ డి మిషన్ లేకపోతే పోటీల్లో పాల్గొనేందుకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. మనకూ ఉన్నారు... మరుగుజ్జు క్రీడల్లో మనవాళ్లూ తక్కువేమీ తినలేదు. భారత్ తరఫున ఈ క్రీడల్లో పాల్గొనేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాదు అంతర్జాతీయ వేదికల్లో రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు. గత ఏడాది జరిగిన ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లో పతకాల పంట పండించారు. 9 బంగారు పతకాలతో సహా మొత్తం 18 పతకాలు సాధించి భారత్‌ను ఆరో స్థానంలో నిలిపారు. 16 మంది పోటీల్లో పాల్గొనగా.. జోబీ మాథ్యూ, రాజన్న, ప్రకాశ్, ఆకాశ్ మాధవన్, నళిని, రేణు కుమార్‌లు తమ సత్తా చాటి పలు విభాగాల్లో పతకాలు సాధించారు. ఆల్‌రౌండర్ జోబి కేరళకు చెందిన 38 ఏళ్ల మరుగుజ్జు జోబీ మాథ్యూ అర్మ్ రెజ్లర్‌గా అందరికీ సుపరిచితమే. ప్రాక్సిమల్ ఫెమోరల్ ఫోకల్ డెఫీషియన్సీ (పీఎఫ్‌ఎఫ్‌డీ) కారణంగా జోబి 60 శాతం వైకల్యంతో పుట్టాడు. పీఎఫ్‌ఎఫ్‌డీ వల్ల జోబి కాళ్లలో ఏమాత్రం ఎదుగుల లేకపోయినా.. మిగిలిన శరీరం మొత్తం వయసుకు తగ్గట్లుగానే పెరిగింది. మూడు అడుగుల ఐదు అంగుళాల పొడవున్న ఈ కేరళ మరుగుజ్జు తాను ఎత్తు పెరగలేకపోయినా ఏమాత్రం నిరాశ చెందలేదు. కాళ్లు సహకరించకపోయినా.. మిగిలిన శరీరంలో అందరి లాగే పెరుగుదల ఉండటంతో జిమ్‌కి వెళ్లి తీవ్రంగా సాధన చేశాడు. అందుకు జోబికి తగిన ఫలితం దక్కింది. బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్‌లో సత్తా చాటాడు. స్పెయిన్‌లో జరిగిన 29వ ప్రపంచ ఆర్మ్ రెజ్లింగ్‌లో చాంపియన్‌గా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. అంతేకాదు ప్రపంచ డ్వార్ఫ్ క్రీడల్లోనూ దుమ్ము రేపాడు. అథ్లెటిక్స్ క్లాస్ 3లో షాట్‌పుట్, డిస్కస్ త్రో, జావిలిన్ త్రో తోపాటు సీనియర్ క్లాస్ 1 బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. ఇక జోబి జనరల్ కేటగిరీలోనూ, వైకల్య విభాగంలోనూ రెజ్లింగ్, ఫెన్సింగ్, బాడీ బిల్డింగ్‌లో చాలా సార్లు సత్తా చాటి ఎన్నో పతకాలను సొంతం చేసుకున్నాడు. -
మరుగుజ్జుగా...
వర్తమాన భారతీయ సినీ చరిత్రలో కమల్‌హాసన్ చేసినన్ని ప్రయోగాత్మక పాత్రలు బహుశా వేరే నటుడు చేసి ఉండరేమో. ఆయన చేసినవాటిలో ముఖ్యంగా ‘విచిత్ర సోదరులు’లో మరుగుజ్జు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో కమల్ ఎలా ఒదిగిపోయారన్నది ఇప్పటికీ ఆసక్తికరమైన ప్రశ్నే. ఆ తర్వాత చాలామంది మరుగుజ్జుగా చేశారు కానీ, కమల్ స్థాయిలో రక్తి కట్టించలేకపోయారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ త్వరలో మరుగుజ్జుగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. సల్మాన్ ఎప్పటినుంచో ప్రయోగాత్మక పాత్ర చేయా లని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ సమయంలోనే ఈ పాత్ర వరించింది. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ద్వారా సల్మాన్ ఆకాంక్ష నెరవేరనుంది. ఇటీవల ‘తను వెడ్స్ మను’, ‘రాన్‌జానా’లాంటి చిత్రాల ద్వారా దర్శ కునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ ఎల్ రాయ్ చెప్పిన కథ సల్మాన్‌కి బాగా నచ్చిందట. ఇందులో మరుగుజ్జుగా నటించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట సల్మాన్‌ఖాన్. చూద్దాం.. కమల్ స్థాయిలో సల్మాన్ ఆ పాత్రను మరిపించగలరో లేదో!