పెళ్లి కూతురైన కత్రినా...? | Katrina Reveals Her Look In Zero Film As Bengali Bride | Sakshi
Sakshi News home page

పెళ్లి కూతురైన కత్రినా...?

Published Thu, Apr 12 2018 11:04 AM | Last Updated on Thu, Apr 12 2018 11:04 AM

Katrina Reveals Her Look In Zero Film As Bengaly Bride - Sakshi

కత్రినా కైఫ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన జీరో సినిమాకు సంబంధించిన ఫోటో

సాక్షి, సినిమా : సినీ ప్రియులంతా ఈ వేసవిలో రాబోయే బ్లాక్‌బాస్టర్స్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాటిలో కింగ్‌ షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న చిత్రం ‘జీరో’ ఒకటి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ఏ చిన్న సమాచారమైన ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో షారుక్‌తో పాటు కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ, అభయ్‌ డియెల్‌లు నటిస్తున్నారు.

అయితే కత్రినా తప్ప మిగిలిన వారంతా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే షారుక్‌ ఈ చిత్రంలో మరుగుజ్జుగా కనిపించనున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన పోస్టు చేశారు. మిగతా పాత్రలకు సంబంధించన విషయాలను మాత్రం చాలా గోప్యంగా ఉంచారు.

తాజాగా కత్రినా పోస్టు చేసిన ఓ ఫొటో ఆమె పాత్రపై ఉత్కంఠ రేపుతోంది. సంప్రదాయ బెంగాలీ పెళ్ళికూతురి అలంకరణలో కత్రినా ఉన్నారు. బెంగాలీ పెళ్లికూతురు ధరించే బింది, మెడకు, చెవులకు భారీ ఆభరణాలు ధరించారు. అలానే బెంగాలీ వధువు ధరించే సంప్రదాయ ‘శంక పోలో’ను కూడా ధరించారు.

ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలని భావిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి మరణానంతరం చిత్రీకరించిన సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement