మరుగుజ్జుగా... | Salman Khan as dwarf in Anand L Rai's next love-story? | Sakshi
Sakshi News home page

మరుగుజ్జుగా...

Published Thu, Jun 5 2014 11:24 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మరుగుజ్జుగా... - Sakshi

మరుగుజ్జుగా...

వర్తమాన భారతీయ సినీ చరిత్రలో కమల్‌హాసన్ చేసినన్ని ప్రయోగాత్మక పాత్రలు బహుశా వేరే నటుడు చేసి ఉండరేమో. ఆయన చేసినవాటిలో ముఖ్యంగా ‘విచిత్ర సోదరులు’లో మరుగుజ్జు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో కమల్ ఎలా ఒదిగిపోయారన్నది ఇప్పటికీ ఆసక్తికరమైన ప్రశ్నే. ఆ తర్వాత చాలామంది మరుగుజ్జుగా చేశారు కానీ, కమల్ స్థాయిలో రక్తి కట్టించలేకపోయారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ త్వరలో మరుగుజ్జుగా కనిపించడానికి సిద్ధమవుతున్నారు. సల్మాన్ ఎప్పటినుంచో ప్రయోగాత్మక పాత్ర చేయా లని ఉవ్విళ్లూరుతున్నారు.
 
 ఆ సమయంలోనే ఈ పాత్ర వరించింది. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ద్వారా సల్మాన్ ఆకాంక్ష నెరవేరనుంది. ఇటీవల ‘తను వెడ్స్ మను’, ‘రాన్‌జానా’లాంటి చిత్రాల ద్వారా దర్శ కునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ ఎల్ రాయ్ చెప్పిన కథ సల్మాన్‌కి బాగా నచ్చిందట. ఇందులో మరుగుజ్జుగా నటించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట సల్మాన్‌ఖాన్. చూద్దాం.. కమల్ స్థాయిలో సల్మాన్ ఆ పాత్రను మరిపించగలరో లేదో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement