మరుగుజ్జు పాత్రలో బాద్షా | Shah Rukh Khan is going to play a dwarf | Sakshi
Sakshi News home page

మరుగుజ్జు పాత్రలో బాద్షా

Published Sat, Sep 17 2016 3:15 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

మరుగుజ్జు పాత్రలో బాద్షా

మరుగుజ్జు పాత్రలో బాద్షా

బాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ స్టార్గా తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న బాద్షా షారూఖ్ ఖాన్ రూట్ మారుస్తున్నాడు. తన సమకాలీన నటులైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు వరుసగా ప్రయోగాలు చేస్తుండటంతో షారూఖ్ కూడా ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. ఇటీవల ఫ్యాన్ సినిమాతో కాస్త రూట్ మార్చే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అయినా మరోసారి ప్రయోగానికి రెడీ అవుతున్నాడీ సూపర్ స్టార్.

ప్రస్తుతం రాయిస్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న షారూఖ్, ఆ సినిమా పూర్తయిన తరువాత ది రింగ్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాంజానా లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఆనంద్, షారూఖ్ను మరుగుజ్జు పాత్రలో చూపించనున్నాడట. ఈ సినిమాను షారూఖ్ తన సొంతం నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్  బ్యానర్లో నిర్మించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement