50 మంది మరుగుజ్జులు నటించే 5జీ | 5 g movie featuring 50 dwarfs | Sakshi
Sakshi News home page

50 మంది మరుగుజ్జులు నటించే 5జీ

Published Fri, Oct 27 2017 5:15 AM | Last Updated on Fri, Oct 27 2017 5:15 AM

5 g movie featuring 50 dwarfs

తమిళసినిమా: మరుగుజ్జు కళాకారులు 50 మంది కలిసి 5జీ అనే చిత్రంలో నటించనున్నారు. తొలి ప్రపంచ మరుగుజ్జు కళాకారుల సంఘం  ఫిలిం ఇండస్ట్రి డిసేబుల్డ్‌ ఆర్టిస్ట్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ (ఊఐఈఅఅగిఅ)కు చెందిన  50 మంది మరుగుజ్జు కళాకారులతో ఆ సంఘం నిర్మిస్తున్న చిత్రం 5జీ. దేశంలోనే మరుగుజ్జులు అధికంగా గల పరవకోట్టై గ్రామానికి చెందిన దేవేంగా కళాకారుడు కే.రాజ బాలాజి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ప్రపంచం మరుగుజ్జు మధ్య బంధుత్వాన్ని పెంపొందించి మానవత్వాన్ని ప్రేరేపించడమే ఈ 5జీ చిత్ర ప్రధానాంశంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఇందులో మానవత్వం కలిగిన పలువురు తమిళ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారని చెప్పారు.ఈ చిత్రాన్ని ప్రపంచ మరుగుజ్జుల దినోత్సవం డిసెంబర్‌ మూడో తేదీ నుంచి ప్రారంభించనున్నామని దర్శకుడు కే.రాజా బాలాజీ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement