ముంబై: రాష్ట్రంలో సెంట్రల్ మోటర్ వెహికల్ చట్టం 2021 అమలు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంఘిస్తే బారీగానే జరిమానాలను విధిస్తారు. ఈమేరకు మహారాష్ట్ర రవాణా శాఖ డిసెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది.
తొలుత మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసేందుకు విముఖత చూపినా.. రాష్ట్రంలో తరచూ జరుగుతున్న ట్రాఫిక్ ఉల్లంఘనలు, పెరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా దీన్ని అమలు చేసేందుకు రవాణా శాఖ సంకల్పించింది. దీని ప్రకారం గురువారం కొత్త నిబంధనల నోటిఫికేషన్ విడుదలైంది. నిబంధనలను ఉల్లంగించిన ద్విచక్ర వాహనాలకు వెయ్యి, ఫోర్ వీలర్ వాహనాలకు రెండు వేలు, ఇతర భారీ వాహనాలు నడిపేవారు నాలుగు వేల రూపాయల చొప్పున జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుమునుపు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే జరిమానాగా విధించేవారు. ఈ చట్టం ప్రకారం నిబంధనలను ఉల్లంగించినా, ఫోన్ మాట్టాడుతూ వాహనాలను నడిపినా తడిసిమోపెడవుతుంది!
చదవండి: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్... దెబ్బతో అకౌంట్లో డబ్బులన్నీ మాయం!
వాహనాలకు రిఫ్లెక్టర్ లేకపోయినా, ఫ్యాన్సీ నెంబర్ ఫ్లేట్స్ అమర్చినా.. వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. గతంలో ఇందుకు రెండువందల రూపాయలు జరిమానాగా విధించేవారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనాలకు నడిపిన వారికి ఏకంగా రూ.5 వేలు జరిమానా తప్పదు.
కాగా మోటారు వాహనాల చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం జరిమానా మొత్తాన్ని పెంచారు. ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను అమలు చేయడానికి వెనుకాడింది.ఐతే తాజాగా వాటిని అమలు చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.
చదవండి: ఒమిక్రాన్ ఎలుకల నుంచి మనుషులకు సోకిందా? ఎంతవరకు నిజం..
Comments
Please login to add a commentAdd a comment