సెల్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే లైసెన్స్ రద్దు
- రవాణ శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడిపితే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ వాహనదారులను హెచ్చరించారు. ఢిల్లీలోని సచివాలయంలోని ఆయన చాంబర్‌లో గెహ్లాట్ శనివారం మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘిస్తుండటంతో తరచుగా ప్రమాదాలు జరగుతున్నాయని అన్నారు.
దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వాహనదారులు డ్రైవ్ చేస్తున్నప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఢిల్లీలో చాలా మంది అది పాటించడం లేదని చెప్పారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు ఇక్కట్లు తప్పవని హెచ్చరించారు.