Licence cancell
-
ఖాతాదారులకు గట్టి షాక్.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న 'యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్' లిమిటెడ్ బిజ్నోర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, 'యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బిజ్నోర్' వద్ద తగినంత మూల ధనం లేని కారణంగా లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు జులై 19న ప్రకటించింది. ఆ రోజు బ్యాంక్ సమయం ముగిసే సమయానికి కార్యకలాపాలు నిర్వర్తించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకు ప్రస్తుతం డిపాజిటర్లకు డబ్బు ఇచ్చే పరిస్థితిలో లేదని ఆర్బీఐ తెలిపింది. ఈ సమయంలో కస్టమర్లు తప్పకుండా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కావున బ్యాంకింగ్ కార్యకలాపాలకు అనుమతిస్తే కస్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం లేదని సంబంధిత సంస్థ నివేదించింది. కాగా RBI ఈ బ్యాంకులో ఎవరూ డిపాజిట్ చేయకూడదని సూచించింది. (ఇదీ చదవండి: భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ బంద్.. ఇక వారికి మాత్రమే!) బ్యాంక్ అందించిన డేటా ప్రకారం.. ఇప్పటికి 99.98 శాతం మంది కస్టమర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి తమ పూర్తి మొత్తం తీసుకునే అవకాశం ఉంది. కావున డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవకాశం లేదు. ఆర్బీఐ గత ఏప్రిల్ నుంచి గత మార్చి వరకు 9 కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు తెలిసింది. -
కరోనా రోగులపై చార్జీల బాదుడు : షాక్
సాక్షి, ముంబై: దొరికిందే చాన్స్ అన్నట్టుగా కోవిడ్-19 రోగులనుంచి అధిక చార్జీలను వసూలు చేస్తున్న ఆసుపత్రికి థానే మున్సిపల్ కార్పొరేషన్ భలే షాక్ ఇచ్చింది. భారీగా చార్జీలు వసూలు చేశారంటూ ఒక ప్రైవేటు ఆసుపత్రి లైసెన్సును రద్దు చేసింది. (చెవుల్లో కూడా కరోనా వైరస్) కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరిన రోగులనుంచి అధికంగా చార్జీలు వసూలు చేశారన్న ఆరోపణలతో మహారాష్ట్ర, థానే నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్‌ను శనివారం నిలిపివేసింది. అలాగే కోవిడ్-19 సెంటర్‌ను కూడా రద్దు చేసింది. థానే మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆడిట్ కమిటీ నివేదిక మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 15 ఆస్పత్రుల ద్వారా 27 లక్షల రూపాయల మేర అదనపు చార్జీలను వసూలు చేసినట్టు ఆడిట్ కమిటి నివేదించింది. దీని ఆధారంగా ఘోడ్‌బందర్ రోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లైసెన్స్‌ను నెల పాటు నిలిపివేసినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు. జూలై 12 వరకు ఇక్కడ చికిత్స పొందుతున్న 797మంది రోగులనుంచి 56 బిల్లుల్లో 6,08,900 రూపాయలను అదనంగా వసూలు చేసిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో చేరిన రోగుల చికిత్సను పర్యవేక్షించడానికి, వారికి చార్జీల భారం లేకుండా నియంత్రించేందుకు ఇద్దరు అధికారులను నియమించామన్నారు. మరోవైపు అసుపత్రులపై నిఘా కొనసాగుతుందనీ, మిగిలిన ఆసుపత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ సందీప్ మాలావి ప్రకటించారు. -
అప్పట్లోనే రూ.6.50 లక్షల చలానా
భువనేశ్వర్: గతంలో ట్రాఫిక్ చలానాలు వేలల్లో వస్తేనే వాహనదారులు గుండెలు బాదుకునేవారు. అలాంటిది ఇప్పుడు కొత్త మోటారు వాహన చట్టం-2019 అమల్లోకి వచ్చాక ట్రాఫిక్ చలానాలు ఏకంగా లక్షల్లోకి మారిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగలాండ్‌లో రిజస్టర్ అయిన ఓ ఒడిశా ట్రక్కుపై ఏకంగా రూ.6.50లక్షల చలానా విధించారు అధికారులు. అయితే కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రాకముందు ఈ భారీ చలానాను విధించడం గమనార్హం. ఒడిశా సంబల్పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ట్రక్కుపై ఈ భారీ చలానా విధించారు. గత నెల 10న ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటికింకా కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రాలేదు. నూతన చట్టం సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం ఏడుసార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లఘించాడంటూ.. ఆ ప్రాంత ఆర్టీవో రూ. 6.53లక్షల చలానా విధించాడు. వీటిలో గత ఐదేళ్ల నుంచి రోడ్డు ట్యాక్స్ కట్టనందుకుగాను.. రూ.6,40,500 చలానా విధించగా.. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి ఇతర కాగితాలు లేకపోవడమే కాక, పర్మిట్ షరతులను ఉల్లంఘిచినందుకు గాను మిగతా మొత్తాన్ని విధించారు. (చదవండి: లుంగీవాలాకు కంగారు పుట్టించే వార్త..) చనిపోయిన వ్యక్తి లైసెన్స్ క్యాన్సిల్ ఇదిలా ఉండగా అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే సంఘటన ఒకటి రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. జలవార్ జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారులు సీటు బెల్ట్ ధరించకపోవడమే కాక, అతివేగంతో వెళ్తున్నాడనే కారణంతో ఓ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తికి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఏ వ్యక్తి పేరు మీదనైతే నోటీసులు జారీ చేశారో.. అతడు ఏడాది క్రితమే మరణించడం గమనార్హం. -
సెల్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే లైసెన్స్ రద్దు
- రవాణ శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ హెచ్చరిక సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడిపితే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ వాహనదారులను హెచ్చరించారు. ఢిల్లీలోని సచివాలయంలోని ఆయన చాంబర్లో గెహ్లాట్ శనివారం మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘిస్తుండటంతో తరచుగా ప్రమాదాలు జరగుతున్నాయని అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వాహనదారులు డ్రైవ్ చేస్తున్నప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఢిల్లీలో చాలా మంది అది పాటించడం లేదని చెప్పారు. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు ఇక్కట్లు తప్పవని హెచ్చరించారు.