రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న 'యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్' లిమిటెడ్ బిజ్నోర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, 'యునైటెడ్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బిజ్నోర్' వద్ద తగినంత మూల ధనం లేని కారణంగా లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు జులై 19న ప్రకటించింది. ఆ రోజు బ్యాంక్ సమయం ముగిసే సమయానికి కార్యకలాపాలు నిర్వర్తించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
బ్యాంకు ప్రస్తుతం డిపాజిటర్లకు డబ్బు ఇచ్చే పరిస్థితిలో లేదని ఆర్‌బీఐ తెలిపింది. ఈ సమయంలో కస్టమర్లు తప్పకుండా ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. కావున బ్యాంకింగ్ కార్యకలాపాలకు అనుమతిస్తే కస్టమర్ల మీద ప్రభావం చూపే అవకాశం లేదని సంబంధిత సంస్థ నివేదించింది. కాగా RBI ఈ బ్యాంకులో ఎవరూ డిపాజిట్ చేయకూడదని సూచించింది.
(ఇదీ చదవండి: భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ బంద్.. ఇక వారికి మాత్రమే!)
బ్యాంక్ అందించిన డేటా ప్రకారం.. ఇప్పటికి 99.98 శాతం మంది కస్టమర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) నుంచి తమ పూర్తి మొత్తం తీసుకునే అవకాశం ఉంది. కావున డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవకాశం లేదు. ఆర్‌బీఐ గత ఏప్రిల్ నుంచి గత మార్చి వరకు 9 కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment