మంచి దొంగ.. లైసెన్స్‌ ఇచ్చేశాడు.. | Thief Returns Driving Licence to Woman Via Courier | Sakshi
Sakshi News home page

మంచి దొంగ.. లైసెన్స్‌ ఇచ్చేశాడు

Published Mon, Apr 2 2018 3:51 PM | Last Updated on Mon, Apr 2 2018 4:31 PM

Thief Returns Driving Licence to Woman Via Courier - Sakshi

పూణె : ఒక వస్తువు పోగొట్టుకున్నామంటే తిరిగి పొందడం కష్టం. దొంగతనం జరిగిన తర్వాత ఆ వస్తువులు మళ్లీ సొంతదారులకు చేరడం అనేది కల్లే. ఇక ఏటీఎం కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్సులు వంటివి పోగొట్టుకుంటే మళ్లీ అప్లై చేయాలంటే కాస్త తలనొప్పి వ్యవహారమే. అయితే దొంగతనం చేసినవారు...ఆ వస్తువుల్ని తిరిగి మనకి పంపిస్తే ఆ ఆనందమే వేరు కదా. పూణెకి చెందిన స్వప్న డేకి అచ్చంగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత నెల 28న తనకు వచ్చిన పార్శిల్‌ తెరచి చూసిన ఆమె స్వీట్‌ షాక్‌కు గురయ్యానని చెప్పారు. అందుకు కారణం పోయిందనుకున్న డ్రైవింగ్‌ లైసెన్స్‌ తిరిగి పొందడమే.

ఎంజీ రోడ్డులోని తన బొటిక్‌ను మూసివేసిన తర్వాత ప్రతీ సాయంత్రం వాకింగ్‌కు వెళ్లడం స్వప్న డేకు అలవాటు. రోజూ స్కూటర్‌పై వెళ్లే ఆమెకు  కొడుకు ఈ మధ్యనే ఒక ఎస్‌యూవీ కారును బహుమతిగా ఇచ్చాడు. ​మార్చి 17 సాయంత్రం కారు పార్క్‌ చేసి వాకింగ్‌ ముగించుకుని వచ్చేసరికి  కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న పర్సును దుండగుడు చోరీ చేశాడు. అందులో డ్రైవింగ్‌ లైసెన్స్‌ తో పాటు డబ్బులు కూడా ఉన్నాయి. అయితే  పర్స్‌ను కొట్టేసిన దొంగ... బ్రాండెడ్‌ పర్సును, అందులో ఉన్న రూ. 1500లను తనతో పాటే అట్టిపెట్టుకుని లైసెన్స్‌ని మాత్రం కొరియర్‌ చేసి నిజాయితీని చాటుకున్నాడు. దీంతో స్వప్న డేకు మళ్లీ లైసెన్స్‌ కోసం అప్లై చేయాల్సిన పని తప్పింది. డబ్బులు కొట్టేసినా.. లైసెన్స్‌ తిరిగి ఇచ్చేశాడు గనుక అతడు మంచి దొంగ  అని సంబరపడిపోతున్నారు స్వప్న.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement