
సాక్షి, వైఎస్సార్: వినూత్న కార్యక్రమానికి వైఎస్సార్ కడప జిల్లా వేదికైంది. దేశంలో మొదటిసారిగా ట్రాన్స్ జెండర్‌కు డ్రైవింగ్ లైసెన్స్‌ను జిల్లా రవాణా శాఖ అధికారులు కల్పించారు. ఇంత వరకు దేశంలో ట్రాన్స్ జెండర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కల్పించని విషయం తెలిసిందే. రవాణ శాఖ డీటీసీ బసిరెడ్డి నేతృత్వంలో 32 మందికి శనివారం లైసెన్సును అందించారు. దీంతోపాటు ఆన్‌లైన్‌లో స్త్రీ, పురుషులతో పాటు ట్రాన్స్ జెండర్ ఆప్షన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ హరికిరణ్, జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్, ఎస్పీ అభిషేక్ మహంతిల చేతుల మీదుగా వీరికి లైసెన్సులను పంపిణీ చేశారు.