
సాక్షి, హైదరాబాద్: వేరుశనగ కొనుగోలుకు అంగీకరిస్తూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది. రాష్ట్రంలో రైతులు 3.2 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట వేశారని, 2.40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని, వేరుశనగ కొనుగోలుకు సహకరించాలని కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు జనవరి 8న లేఖ రాశారు. స్పందించిన కేంద్రం తెలంగాణలో పండిన వేరుశనగలో 96 వేల మెట్రిక్ టన్నుల మేరకు సేకరిస్తామని తెలిపినట్లు మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నా ఫెడ్, ఆయిల్‌ఫెడ్ సం స్థల ద్వారా వేరుశనగ కొనుగోలు జరపనుందన్నారు. కేంద్ర నిర్ణ యంపట్ల హరీశ్ హర్షం వ్యక్తం చేశారు. వేరుశనగ కొనుగోలు కేం ద్రాలను వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment