![Harish Rao letter to Congress president Kharge and Rahul Gandhi](/styles/webp/s3/article_images/2024/09/20/harish.jpg.webp?itok=FfWPPNk3)
కేసీఆర్‌పై సీఎం చేస్తున్న అసభ్య వ్యాఖ్యలపై స్పందించండి
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాందీకి హరీశ్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘మాజీ సీఎం చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులపై సీఎం రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకర భాష, నేరపూరిత వ్యాఖ్య లపై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. రేవంత్ వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ అధిష్టానం ద్వంద్వ వైఖరి అవల ంబిస్తోందన్నారు.
ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్‌కు హరీశ్‌రావు గురు వారం బహిరంగ లేఖ రాశారు. ‘కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. రాహుల్ తీవ్రవాది అంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్.. రేవంత్‌పై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఢిల్లీలో ఒక నిబంధన, గల్లీలో మరో నిబంధన అన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రేవంత్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న రేవంత్‌పై కఠినచర్య లు తీసుకోవాలి’అని హరీశ్ లేఖలో డిమాండ్ చేశారు.
రుణమాఫీ కోరితే నిర్బంధిస్తారా?
‘ఆంక్షలు, కంచెలు లేని ప్రభుత్వం, ప్రజాపాలన అంటూ డబ్బాకొట్టుకుంటున్న రేవంత్ ప్రభుత్వం రుణమాఫీ కోరిన రైతులను నిర్బంధిస్తోంది. ప్రజాభవన్ చుట్టూ కంచెలు, ఆంక్షలు ఎందుకు? ప్రజాభవన్‌కు రైతులు తరలివస్తుంటే సీఎం ఎందుకు భయ పడుతున్నారు? రుణమాఫీపై మాట తప్పినందుకు అది రేవంత్ ప్రభుత్వానికి ఉరితాడుగా మారుతుంది’అని హరీశ్‌రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment