సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గమనించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమేనన్నారు.
అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకున్నారు. ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు సీబీఎస్‌ఈ నిర్వహించే సీటెట్‌తో పోల్చితే డబుల్‌గా ఉండటం గమనార్హం. మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం’’ అని హరీష్‌రావు తెలిపారు.
ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు
Comments
Please login to add a commentAdd a comment