న్యూఢిల్లీ: చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ఆన్‌లైన్ ఫిర్యాదు బాక్స్‌ను కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులకు వీలు కల్పించే పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్) ఈ-బాక్స్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు.
అయితే గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 70 శాతం పిల్లలకు ఈ అవకాశం లభిస్తుందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. ఎన్‌సీపీసీఆర్ వెబ్‌సైట్ ద్వారా బాధితులైనా, పెద్దలెవరైనా ఫిర్యాదులు చేయొచ్చు. చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిలో బొమ్మల రూపంలో దీంట్లో వివరణ ఉంది.
లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ఈ-బాక్స్
Published Sat, Aug 27 2016 9:38 AM | Last Updated on Fri, Oct 19 2018 8:23 PM
Advertisement