ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆదాయం సంతృప్తినిస్తుంది | Today Telugu Horoscope On November 23rd, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆదాయం సంతృప్తినిస్తుంది

Published Sat, Nov 23 2024 5:30 AM | Last Updated on Sat, Nov 23 2024 8:36 AM

Daily Horoscope On 23th November 2024 in Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.అష్టమి రా.10.08 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: మఖ రా.10.20 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.9.34 నుండి 11.14 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.58 నుండి 7.44 వరకు, అమృతఘడియలు: రా.7.46 నుండి 9.31 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.12, సూర్యాస్తమయం: 5.20. 

మేషం: వ్యయప్రయాసలతో పనులు పూర్తి. మీ కష్టం వృథా కాగలదు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి,వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

వృషభం: పరిస్థితులకు ఎదురీదాల్సిన సమయం. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబంలో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మిథునం: సన్నిహితుల నుండి శుభవర్తమానాలు. ఆదాయం ఆశాజనకం. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దూరప్రయాణాలు. ఓర్పుగా వ్యవహరించండి. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆదాయం సంతృప్తినిస్తుంది. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. దైవదర్శనాలు.

కన్య: రుణఒత్తిడులు పెరుగుతాయి. ఆస్తులు విక్రయాలు నిలిచిపోతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రయాణాలలో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి.

తుల: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనూహ్యంగా అనుకూలిస్తాయి.

వృశ్చికం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూముల వివాదాలు తీరతాయి. ఇంటి కొనుగోలు యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు: రుణభారాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆరోగ్యం సహకరించదు, వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం: దూరప్రయాణాలు. దైవదర్శనాలు. పనుల్లో అవాంతరాలు. ఆర్థికంగా ఇబ్బందులు. మానసిక ఆవేదన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: పనులు మరింత వేగంగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. కొత్త ఒప్పందాలు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలం.

మీనం: కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. రుణభారాలు తగ్గవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అంచనాల మేరకు నడుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement