
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.తదియ 12.54 వరకు తదుపరి చవితి, నక్షత్రం: ఉత్తరాభాద్ర ప.12.21 వరకు, తదుపరి రేవతి,వర్జ్యం: రా.11.32 నుండి 1.01 వరకు, దుర్ముహూర్తం: సా.4.27 నుండి 5.14 వరకు, అమృత ఘడియలు: ఉ.7.55 నుండి 8.11 వరకు.
సూర్యోదయం : 6.23
సూర్యాస్తమయం : 6.02
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువర్గంతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
వృషభం... శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలాభ సూచనలు. బంధువుల నుంచి పిలుపు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు. విందువినోదాలు.
మిథునం... ప్రముఖ వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
కర్కాటకం... మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలలో ఆటంకాలు. ఉద్యోగాలలో కొన్ని చికాకులు. దైవదర్శనాలు.
సింహం.... అనుకోని ప్రయాణాలు. సోదరులు, సోదరీలతో వివాదాలు. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. శ్రమ తప్పదు. బంధువులతో చర్చలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
కన్య.... గతం గుర్తుకు వస్తుంది. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారం. దైవదర్శనాలు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు రాగలదు.
తుల.... మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.
వృశ్చికం... వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. అనారోగ్యం. చిత్రమైన సంఘటనలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
ధనుస్సు... రుణయత్నాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమార్పులు.
మకరం..... నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రత్యేకత చాటుకుంటారు.
కుంభం... వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. శ్రమాధిక్యం. బంధువర్గంతో అకారణంగా వివాదాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
మీనం.... మరింత ఉత్సాహంగా గడుపుతారు. మీ సేవలు అందరూ గుర్తిస్తారు. పనుల్లో పురోగతి. ఆకస్మిక ధనలాభం. కుటుంబసభ్యులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
Comments
Please login to add a commentAdd a comment