
సాక్షి, న్యూఢిల్లీ : మానవ అక్రమ రవాణా రాకెట్ నిందితురాలు ప్రభా మున్నీతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిసున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ రాజధానిలోని పంజాబి బాగ్ ప్రాంతంలో ప్రభా మున్నీని పోలీసులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఆమె పక్కన కూర్చుని ఉన్న కేజ్రీవాల్ ఫోటో నెట్టింట్లో దుమారం రేపుతోంది.
ఐదేళ్లుగా పరారీలో ఉన్న ప్రభా మున్నీని సోమవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌జీవో పేరిట ప్లేస్‌మెంట్ ఏజెన్సీని నిర్వహించే ప్రభామున్నీ జార్ఖండ్ యువతులకు ఉద్యోగాలను ఎరవేసి వారిని ఢిల్లీకి పిలిపించి మానవ అక్రమ రవాణా రాకెట్‌లో భాగంగా వారిని విక్రయిస్తుందని పోలీసులు ఆరోపిస్తున్నారు.
జార్ఖండ్‌లో ఆమెపై పలు కేసులున్నాయని పోలీసులు చెప్పారు. 2013 నుంచి పరారీలో ఉన్న ప్రభా మున్నీ ఎంతమంది యువతులను ఈ రాకెట్‌లో బాగంగా వంచించిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభా మున్నీ ప్రస్తుతం జార్ఖండ్ పోలీసుల రిమాండ్‌లో ఉందని విచారణలో భాగంగా ఆమెను ప్రశ్నించిన మీదట మరిన్ని వాస్తవాలు వెలుగుచూడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment