మానవ అక్రమ రవాణా.. ఎయిర్‌ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు | 4 Air India Staffers One Passenger Arrested In Delhi Airport In Alleged Human Trafficking, See Details - Sakshi
Sakshi News home page

మానవ అక్రమ రవాణా.. ఎయిర్‌ ఇండియా సిబ్బంది, ప్రయాణికుడి అరెస్టు

Published Fri, Dec 29 2023 3:59 PM | Last Updated on Fri, Dec 29 2023 5:53 PM

Air India Staffers One Passenger Arrested In Delhi Airport - Sakshi

ఫ్రాన్స్‌లో ఇటీవల నిలిపివేసిన భారతీయులు ప్రయాణిస్తున్న విమానంలో పది మంది ఎవరూ తోడు లేని మైనర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా నలుగురు ఎయిర్ ఇండియా సిబ్బంది, ఒక భారతీయ ప్రయాణికుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు యూకే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఆ సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) వారిని అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. 

విమానాశ్రయంలోని ఇ‍మిగ్రేషన్‌ అధికారులకు దిల్‌జోత్‌సింగ్‌ అనే ప్రయాణికుడి డాక్యుమెంట్లపై కొంత అనుమానం రావడంతో వివరాలు సేకరించారు. దాంతో ఆయన ఎయిర్‌లైన్ సిబ్బందిని సంప్రదించడానికి బదులుగా ఎయిర్‌ ఇండియా సాట్స్‌ సిబ్బంది సహాయం కోరాడు. వెంటనే అధికారులకు అనుమానం రెట్టింపైంది. సీఐఎస్‌ఎఫ్ బృందం అప్రమత్తమై దిల్లీ ఎయిర్‌పోర్ట్ అథారిటీ సహకారంతో విచారణ చేపట్టింది. అయితే సింగ్‌కు సహకరించిన మరో నలుగురు ఎయిర్‌ ఇండియా స్టాఫర్లను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..?

ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విమానంలో మైనర్లు ఉన్నట్లు అధికారులు ఇటీవల గుర్తించారు. మానవ అక్రమ రవాణా కోణంలో ఈ కేసును విచారిస్తున్నట్లు తెలిసింది. ఎయిర్‌ ఇండియా సాట్స్‌ సీఈఓ సంజయ్‌గుప్తా స్పందిస్తూ నిందితుడికి సహకరించిన సంస్థ సిబ్బందిని విధుల్లో నుంచి సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు. మానవ అక్రమ రవాణాపై కంపెనీ పకడ్బందీ చర్యలు చేపడుతుందని తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement