
జగ్గారెడ్డి(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : మానవ అక్రమ రవాణా కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విచారణ మొదటి రోజుముగిసింది. మూడు రోజుల కస్టడికి తీసుకున్న పోలీసులు జగ్గారెడ్డిని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో న్యాయవాది సమక్షంలో విచారించారు. పాస్ పోర్ట్ ,ఏజెంట్ ల వివరాల కు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లు అయన తరపు న్యాయవాది మీడియాకు వెల్లడించారు.
తాను ఒక ప్రజా ప్రతినిధిని కనుక తన నియోజకవర్గం నుండి ఎంతో మంది సంతకాల కోసం వస్తుంటారని జగ్గారెడ్డి సమాధానం చెప్పినట్లు సమాచారం. 14 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కేసులో చాలా మంది వ్యక్తులు మారారని చెప్పారన్నారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి జగ్గారెడ్డి పోలీసులకు చెప్పారని న్యాయవాది తెలిపారు. సోమవారం బెయిల్ పిటీషన్ పై వాదనలు ఉన్నాయన్నారు.
జగ్గారెడ్డిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. పది రోజులు కస్టడీకి ఇవ్వాలని మార్కెట్ పోలీసులు కోరగా.. న్యాయమూర్తి మూడు రోజులకు అనుమతిచ్చారు. సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు విచారణకు అనుతించారు. జగ్గారెడ్డి న్యాయవాది సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. మరో రెండు రోజుల పాటు జగ్గారెడ్డిని విచారించనున్నారు.
మొన్న జగ్గారెడ్డి.. నిన్న గండ్ర.. నెక్ట్స్ ‘ఓటుకు నోట్లేనా’ !?
Comments
Please login to add a commentAdd a comment