గోవా వ్యభిచార కూపం నుంచి బాలికకు విముక్తి | Minor girl rescued from Goa hotel; 7 held | Sakshi
Sakshi News home page

గోవా వ్యభిచార కూపం నుంచి బాలికకు విముక్తి

Published Tue, Jul 15 2014 1:44 PM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM

గోవా వ్యభిచార కూపం నుంచి బాలికకు విముక్తి

గోవా వ్యభిచార కూపం నుంచి బాలికకు విముక్తి

గోవాలోని ఓ హోటల్లో వ్యభిచార కూపంలో ఇరుక్కుపోతున్న ఓ బాలికను పోలీసులు రక్షించారు. ఒడిషాకు చెందిన ఈ 16 ఏళ్ల బాలికను బలవంతంగా లాక్కొచ్చి వ్యభిచారంలోకి దించారని, ఆమెను కాపాడి ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆమెను ఒడిషా నుంచి అపహరించి గోవాలో అమ్మేసినట్లు తెలిసిందని ఇన్స్పెక్టర్ పరేష్ నాయక్ చెప్పారు. అరెస్టయిన నిందితులంతా ఒడిషాకు చెందినవారేనని ఆయన తెలిపారు.

అంజునా బీచ్ గ్రామంలోని ఓ హోటల్ నుంచి బాలికను కాపాడారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో అంజునా పోలీసు బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. బాలికను వైద్యపరీక్షలకు పంపామని, ఆమె వాంగ్మూలం నమోదుచేస్తున్నామని, నిందితులందరిపైనా మనుషుల అక్రమ రవాణా కేసు పెట్టామని ఇన్స్పెక్టర్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement