
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న షికాగో సెక్స్ రాకెట్ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్‌ఆర్సీ)లో పిటిషన్ దాఖలైంది. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు మహిళలను అక్రమంగా తరలిస్తున్న ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించాలని న్యాయవాది అరుణ్ హెచ్‌ఆర్సీలో పిటిషన్ వేశారు.
సెక్స్‌రాకెట్‌లో సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నందున సమాజంపై అది ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషన్‌లో తెలిపారు. షికాగో సెక్స్‌రాకెట్ లాంటి వ్యవహారాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని న్యాయవాది అరుణ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇది చదవండి : షికాగో సెక్స్‌రాకెట్: గుట్టువిప్పిన సినీతారలు