
సాక్షి, అమరావతి: మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 10 ఏహెచ్‌టీయూ యూనిట్లు ఏర్పాటు చేస్తూ హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న వాటితో కలిపి 13 యూనిట్లకు ప్రత్యేక బృందాలు కేటాయించనున్నారు. ఇన్స్‌పెక్టర్, ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయిస్తారు. రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా సీఐడీ అడిషనల్ డీజీని నియమించనుంది.
చదవండి: రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: సజ్జల
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment