ఆ విమానం ఎట్టకేలకు టేకాఫ్‌ ! | 303 Indians grounded at airport in France allowed to leave | Sakshi
Sakshi News home page

ఆ విమానం ఎట్టకేలకు టేకాఫ్‌ !

Published Mon, Dec 25 2023 6:26 AM | Last Updated on Mon, Dec 25 2023 6:26 AM

303 Indians grounded at airport in France allowed to leave - Sakshi

పారిస్‌: మానవ అక్రమ రవాణా అనుమానంతో మూడ్రోజులపాటు తమ అ«దీనంలో ఉంచుకున్న విమానాన్ని ఫ్రాన్స్‌ అధికారులు ఎట్టకేలకు విడిచిపెట్టారు. 303 మందికిపైగా ప్రయాణికులతో దుబాయ్‌ నుంచి బయల్దేరిన ఆ విమానం ఇంధనం నింపుకునేందుకు ఫ్రాన్స్‌లోని పారిస్‌ దగ్గర్లోని వ్యాట్రీ విమానాశ్రయంలో గురువారం దిగింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది భారతీయులే.

ఈ విమానం ద్వారా మానవ అక్రమ రవాణా జరుగుతోందంటూ వచ్చిన సమాచారంతో ఫ్రాన్స్‌ అధికారులు దాన్ని తమ అ«దీనంలోకి తీసుకుని దర్యాప్తు మొదలెట్టడం తెల్సిందే. 303 మందిని విడివిడిగా విచారించాలని భావించిన నలుగురు జడ్జీలు, అసలు ఈ ప్రక్రియే అస్తవ్యస్తంగా ఉందంటూ మొత్తం కేసు విచారణనే రద్దుచేశారు. దాంతో విమానం టేకాఫ్‌కు అడ్డంకులు తొలిగాయి. వాస్తవానికి ఈ విమానం నికరాగువాకు వెళ్లాలి. తాజా ఉదంతం నేపథ్యంలో అది నికరాగువా వెళ్తుందా, లేక భారత్‌కో, దుబాయ్‌కో తిరిగొస్తుందా అన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement