పవన్‌ కల్యాణ్‌ లెక్క తప్పింది!.. శాసనసభ సాక్షిగా బయటపడ్డ నిజం ఇదే | CM Chandrababu Dep CM Pawan Kalyan Self Goal With Human Trafficking Figures, More Details Inside | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ లెక్క తప్పింది!.. శాసనసభ సాక్షిగా బయటపడ్డ నిజం ఇదే

Published Sat, Nov 16 2024 2:06 PM | Last Updated on Sat, Nov 16 2024 3:00 PM

CM Chandrababu Dep CM Pawan Self Goal With Human Trafficking Figures

అమరావతి, సాక్షి: కూటమి పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన సంచలన ఆరోపణలపై.. అసెంబ్లీ సాక్షిగా నిజం నిగ్గు తేలింది. మహిళల అక్రమ రవాణాకు సంబంధించిన లెక్కలపై ఓ స్పష్టత ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో..

గత ఐదేళ్లలో మహిళల అక్రమ రవాణా కేసులు 34 మాత్రమే నమోదుకాగా.. వీటిల్లో 46 మందిని బాధితులుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు.. గణాంకాలతో సహా అసెంబ్లీలో ప్రకటించింది. అసెంబ్లీలో వెల్లడైన ఈ సమాధానంతో.. గతంలో పవన్‌, చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధమని తేలిపోయింది.

గతేడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్‌ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్సార్‌సీపీ హయాంలో వలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, ఇందుకు వలంటీర్‌ వ్యవస్థ కారణమైందని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు, టీడీపీ కూడా ఇదే ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు.. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలకు వేసిన ప్రశ్నతో ఆ లెక్క తేలింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement