న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2016లో 8వేలకు పైగా మానవ అక్రమ రవాణా కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. సగటున రోజుకు 63 మందిని పోలీసులు రక్షించినట్లు పేర్కొంది. ఈ ఘటనల్లో 182 మంది విదేశీయులతో సహా 23వేల మంది బాధితులను రక్షించినట్లు వెల్లడించింది. ఈ కేసుల్లో 58 శాతం మంది బాధితులు 18 ఏళ్లలోపు వారే కావటం గమనార్హం. వీటిల్లో 3,579 కేసుల(44శాతం)తో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవగా, రాజస్తాన్(1,422 కేసులు), గుజరాత్(548), మహారాష్ట్ర(517), తమిళనాడు(434) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment