అమెరికాలో అమ్మాయిల అక్రమ రవాణాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్ | Four Telugu people arrested in Human trafficking Case in USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో అమ్మాయిల అక్రమ రవాణాలో నలుగురు తెలుగువాళ్ల అరెస్ట్

Published Tue, Jul 9 2024 2:24 PM | Last Updated on Tue, Jul 9 2024 3:00 PM

 Four Telugu people arrested in Human trafficking Case in USA

ట్రెంటన్‌: అమెరికా న్యూజెర్సీ స్టేట్‌లో హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ కేసులో నలుగురు తెలుగువాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించడం గమనార్హం.

ప్రిన్స్‌టన్‌ పోలీసుల వివరాల ప్రకారం.. గిన్స్‌బర్గ్‌ లేన్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. 2024 మార్చి 13న ప్రిన్స్‌టన్‌ పోలీసు సీఐడీ విభాగం సంతోష్‌ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పని చేయిస్తున్నట్లు తేలింది. వీరంతా బలవంతంగా పని చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారినుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

తర్వాత జరిపిన దర్యాప్తులో ప్రిన్స్‌టన్‌, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. సంతోష్‌, ద్వారకతో పాటు చందన్‌ దాసిరెడ్డి, అనిల్‌ మాలె సైతం వీరికి సహకరించినట్లు తెలిసింది. ఈ నలుగురిపైనా అరెస్ట్‌ వారెంట్ జారీ చేసింది.

గిన్స్‌బర్గ్‌ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్‌మెంట్‌లో చాలామంది పని చేస్తుండడం గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా.. డాలస్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలో నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement