
హన్మకొండ: ప్రభుత్వంతో కొట్లాడే దమ్ము.. సమస్యలపై మాట్లాడే సత్తా, ధైర్యం ఉన్నవారిని శాసన మండలికి పంపాలని, ఇవన్నీ తనకు ఉన్నాయని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం ఆయన హన్మకొండ విద్యానగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1.2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని భర్తీ చేస్తానన్న సీఎం కేసీఆర్ తన హామీ విస్మరించారని విమర్శించారు. విద్యావ్యాపారం చేసే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే ఆయన స్థాయి పెరిగిందని, విద్యా వ్యాపారులు ప్రైవేట్ వర్సిటీలకు అధిపతులయ్యారని ఎద్దేవా చేశారు. కాగా, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మహాకూటమి నాయకులతో చర్చించి తనకు మద్దతు ఇచ్చేలా అందులోని పార్టీలను ఒప్పించి గౌరవం నిలుపుకోవాలని ఆయనను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment