telangana inti party
-
తెలంగాణ ఇంటి పార్టీలో చేరిన వెదిరె చల్మారెడ్డి
సాక్షి, నల్గొండ: టీజేఏసీ వ్యవస్థాపకుడు కోదండరాం నాయకులను చేయగలరు కానీ.. ఆయన మాత్రం నాయకుడు కాలేరని వెదిరె చల్మారెడ్డి విమర్శించారు. టీజేఎస్ రైతు విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఆయన తన అనుచరులతో కలిసి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం వెదిరె మీడియాతో మాట్లాడుతూ... ఏదైనా పార్టీలో సమష్టి నిర్ణయం ఉంటుందని కానీ, జన సమితిలో మాత్రం అభిప్రాయాలు అందరివీ తీసుకుని ఆఖరుకు నిర్ణయం మాత్రం కోదండరాం ఒక్కరిదే ఉంటుందని ఆరోపించారు. ఆయన నియంత పోకడలతో పార్టీని నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుతం పార్టీలో వంద మందితో సమావేశం ఏర్పాటు చేసే శక్తి పార్టీ నేతలలో ఒక్కరు కూడా లేరని, కేవలం భజనపరులే ఉన్నారని ఆయన ఎద్దేవ చేశారు. అలాగే చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. తాను నల్లగొండ జిల్లా వాసిగా వచ్చే పట్టభద్రుల ఎన్నికల్లో కలసి పనిచేద్దామని కూడా చెప్పానని, కానీ కోదండరాం తానే స్వయంగా నిలబడుతున్నానని తనకు మద్దతు ఇవ్వాలని కోరారని వెల్లడించారు. ఓ అభ్యర్థి ఇలా మద్దతు అడగటం చరిత్రలో ఇదే మొదటిసారని సుధాకర్ పేర్కొన్నారు. -
దమ్మున్న వారిని శాసనమండలికి పంపాలి
హన్మకొండ: ప్రభుత్వంతో కొట్లాడే దమ్ము.. సమస్యలపై మాట్లాడే సత్తా, ధైర్యం ఉన్నవారిని శాసన మండలికి పంపాలని, ఇవన్నీ తనకు ఉన్నాయని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం ఆయన హన్మకొండ విద్యానగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1.2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని భర్తీ చేస్తానన్న సీఎం కేసీఆర్ తన హామీ విస్మరించారని విమర్శించారు. విద్యావ్యాపారం చేసే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే ఆయన స్థాయి పెరిగిందని, విద్యా వ్యాపారులు ప్రైవేట్ వర్సిటీలకు అధిపతులయ్యారని ఎద్దేవా చేశారు. కాగా, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధం కావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మహాకూటమి నాయకులతో చర్చించి తనకు మద్దతు ఇచ్చేలా అందులోని పార్టీలను ఒప్పించి గౌరవం నిలుపుకోవాలని ఆయనను కోరారు. -
కుట్రతోనే నా కొడుకును అరెస్ట్ చేశారు
నల్లగొండ టౌన్: ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నారన్న కారణంతో డాక్టర్‌ను అరెస్ట్ చేసిన చరిత్ర ఇంతవరకు ఎక్కడా లేదని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం నల్లగొండలో ప్రజా సంఘాల నాయకులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఫీజులు ఎక్కువ వసూలు చేస్తే అందుకు సంబంధించి నోటీసులు ఇవ్వాలి. స్పందించని పక్షంలో చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎలాంటి నోటీసులు లేకుండా డీఎంహెచ్ఓను అడ్డం పెట్టుకుని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నా కుమారుడు డాక్టర్ సుహాస్‌ను అరెస్ట్ చేయడం, ఆస్పత్రిని సీజ్ చేయడం ఎంతవరకు సమంజసం’అని ప్రశ్నించారు. ఐసీయూలో పేషెంట్లు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా ఆస్పత్రిని సీజ్ చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజకీయంగా కుట్ర పన్ని సుహాస్‌ను అరెస్ట్ చేయించిందని ఆయన ఆరోపించారు. ఇది నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి సొంతంగా వచ్చిన ఆలోచన కాదని, పైనుంచి కింది వరకు రాజకీయ కుట్రతోనే జరిగిందని ఆరోపించారు. తానూ ఉద్యమంలో పనిచేశానని.. దేనికీ భయపడనన్నారు. ‘చావు నాకు బోనస్.. నా కొడుకుకు నేను పిరికి మందు తాపలేదు.. నా కొడుకు దగ్గర పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటా.. కానీ నువ్వెవరు మమ్మల్ని అనడానికి’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుహాస్‌పై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేసి ఆస్పత్రి సీజ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో ప్రజా సంఘాలను కలుపుకొని ప్రభుత్వ తీరును ఎండగడతామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆదివారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడుతున్న చెరుకు సుధాకర్ -
మన కోసం జ్వలించినవాళ్లను గౌరవిద్దాం
ఆకలితో ఉన్నవాళ్ళను భూగోళం ఎట్లా కనపడుతుందని అడిగితే విసిరిన అన్నం ముద్దల్లా ఆరు ఖండాలు సముద్రమంత ఆకలితో మధ్య మధ్యలో నేనే అన్నాడట... ఇప్పటికీ కరుణ లేని కరోనా, మృత్యు కోవిదురాలై ప్రతి వాకిట మృత్యుపేటిక పేర్చి నిజంగానే భూగోళం ఎట్లా కనపడుతుందంటే ప్రతి ఖండమూ దహన వాటిక తీరు తగలబడుతుందని అనక తప్పదు. కరోనా గురించి వార్త రాస్తున్న వాళ్ళు చచ్చిపోతున్నారు.. కరోనాను నిలువరించే ముందు వరుస యోధులు డాక్టర్లు, నర్సులు చచ్చిపోతున్నారు. ఈ మహమ్మారిపై పాటల ఖడ్గాన్ని ఝళిపిస్తున్న పాటగాళ్లు, కళాకారులు చచ్చిపోతున్నారు. ఊరు, పేరు లేని నిరుపేదలు, మట్టిమనుషుల చావులు సర్కారు లెక్కల్లోకి రానే రావడం లేదు. బహుశా మునుపెన్నడూ లేని ఒక భయానక మృత్యుధూళి మన కాళ్ళకింది భూమిని సునామీగా పెకిలించి ఎంతో మంది అద్భుత మానవతా మూర్తుల్ని, యోధుల్ని, మన కోసం జీవితమంతా జ్వలించిన వాళ్ళను దహన వాటికకు తరలిస్తున్నది. దిక్కుతోచక, భయ విహ్వలతతో అంతిమ సంస్కారంలోనూ పాల్గొనక వారి జీవిత కాల సేవాతత్పరతను, స్ఫూర్తిని, ఎత్తిపట్టే చివరి నివాళి కరువు అవుతుందని మన కాలపు యోధుడు ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉ.సా) అకాలమరణం గుర్తు చేస్తున్నది. ఎక్కడో గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరులో పుట్టిన డెబ్బయి ఏళ్ళ ఉ.సా అనేక విప్లవ, బహుజన ఉద్యమాల సాధికారత, సార్వత్రికత.. నిరంతర సన్నద్ధత.. ఆ మొన్నటి అర్ధరాత్రి ఉద్యమాల ఉపాధ్యాయుడి ఊపిరిని కరోనా కబళించేదాక ఆయన విశ్రమించిన జీవన ఘడియలు లేవు. మంగలి కత్తికి, పోరాటపు కొడవలికి ఎంత పదునో చీకొండ మొదలు గిరిజన పోరాటం నడిపిన ఉసానే చెప్పగలడు. కామందు కాఠిన్యం, ఆకలితో ఉన్న పాపను జోకొట్టిన జోలపాట మార్ధవం, కవులు, కళాకారులు ఏంచెయ్యాలో చెప్పే ప్రబోధం, పాటగా అలవోకగా రాస్తూ కాలానికి తాళం వేస్తూ కరువును, కులం బరువును, ఆధిపత్యకులాల దరువును తెలుగు నేల మీద సరిగా అంచనా వేసి దేశీ – దిశ కోసం కారంచేడులో రొమ్ము విరుచుకొని రుదిర క్షేత్రంలో నిలబడడం ఆయనకే సాధ్యమయ్యింది. కరోనా మహమ్మారి కాలంలో మనుషుల విపరీత ప్రవర్తన ఎవరిని వదలడం లేదు. చెన్నైలో, ఇంకా చాలా చోట్ల డాక్టర్లు చనిపోతే శ్మశాన వాటికలో ఖననానికి, దహనానికి అడ్డుపడ్డ అమానవీయ సంఘటనలు ఎన్ని? సేవా మూర్తులకు మనమిచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించింది ఇందుకనే. చెరుకు సుధాకర్ ముందలపడి అంత్యక్రియలు చేస్తే ఆహాహా అంటున్న మిత్రులారా! ఉ.సాకు, జీవితమంతా జ్వలిస్తూ బతికిన ప్రతివాళ్ళకు మనమెట్లాగూ మరణాంతర పురస్కారాలు ఇవ్వలేము, కడచూపులో భాగమవ్వడం మన బాధ్యత. ఇప్పటికే కరోనాపై పలు పుకార్లు మానవ సంబంధాలను చాలా దెబ్బతీశాయి. జరగాల్సిన నష్టం జరిగింది. ఉ.సా నడిచిన ఉద్యమ దారుల్లో ఎదిగి వచ్చిన మిత్రులారా! రండి! మనం సేవాదళ్‌గా ప్రజలకు ఈ కరోనా కష్టకాలంలో మరిం తగా చేరువ కావలసి ఉన్నది. ఏ ఒక్క చావు అగౌరవంగా మట్టిలో కలవకుండా మనం సహకరిద్దాం. మనవాళ్ళ అంత్యక్రియలను కరోనా కాలంలో గౌరవం తగ్గకుండా కొనసాగిద్దాము. ఐసోలేషన్ సెంటర్లలో, హాస్పిటల్స్‌లో సేవలకు స్వచ్ఛందంగా ముందుకు వద్దాం, ఉ.సా కరోనా కాలంలో చనిపోయి మనకు కొత్త బాధ్యతను అప్పజెప్పి వెళ్ళిండు. ఆ బాధ్యతను పూర్తి చేస్తే ఉ.సా.ను సంపూర్ణంగా గౌరవించినట్లే. వ్యాసకర్త: తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు మొబైల్ : 98484 72329 -
‘కేసీఆర్‌కు కరోనా కన్నా పెద్ద వైరస్ సోకాలి’
సాక్షి, గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): తెలంగాణ అమరవీరుల, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా కన్నా పెద్ద వైరస్ సోకాలని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. మంగళవారం ఆదర్శ్‌నగర్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, తెలంగాణ ఇంటి పార్టీ 3వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. (సందిగ్ధంలో టీడీపీ అధ్యక్షుడి ఎంపిక) ఈ సందర్భంగా జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. సుధాకర్ మాట్లాడుతూ జై తెలంగాణ అని రక్తం చిందించిన ఉద్యమకారులు నేడు జైలులో ఉంటే తెలంగాణ రద్దు అన్న ద్రోహులు నేడు కేసీఆర్ చుట్టూ అధికారంలో ఉన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని తెలిపారు. సమావేశంలో 1969 ఉద్యమ కారులు, రామరాజు, శ్రీహరి, కొండస్వామి, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, సందీప్, హరీశ్‌యాదవ్ పాల్గొన్నారు. (కోడికి చారానా.. మసాలాకు బారానా) -
మిమ్మల్ని మించిన సైకోలు ఉండరు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గాంధీ హాస్పిటల్లో వైద్య సేవలపై, సెక్రటేరియట్‌ను కోవిడ్ హాస్పిటల్‌గా మార్చడంపై ప్రతిపక్షాలు చేసిన సూచనలపై ఆయన అహంకారపూరితం గా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వేల మందికి ఎమర్జెన్సీ వైద్య సేవలందించే గాంధీ హాస్పిటల్‌ను పూర్తి స్థాయి కరోనా హాస్పిటల్‌గా మారుస్తున్నామని ప్రకటించి, లక్ష ల మందిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రతిపక్షాల సూచనలను విమర్శించడం సరికాదని అన్నారు. కరోనా పారాసిటమాల్‌తో తగ్గుతుందని, మాస్కులు మా అందరికీ ఉన్నా యా అని వెకిలి నవ్వు నవ్వి, సైకో వైఖరి ని అవలంబించింది సీఎం కేసీఆర్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. ఖాళీగా ఉన్న సెక్రటేరియట్‌ను ఐసోలేషన్ వార్డు కింద మార్చి, దగ్గర్లో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి చాంబర్ నుంచి పర్యవేక్షించడం వివేకమైన పని అన్నారు. కొత్త హాస్పిటల్స్‌ను కోవిడ్ స్పెషాలిటీగా మార్చి, ఉస్మాని యా, గాంధీ, నిమ్స్‌లో ఆధునిక, ఎమర్జెన్సీ వైద్యసేవలు నిరాటంకంగా జరగాలన్న తమ సూచన వారికి శాడిస్టు తీరుగా కనపడిందా? అని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. -
ఐక్యంగా పోరాడుదాం: సుధాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి, తెలంగాణ ఇంటి పార్టీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. శుక్రవారం టీజేఎస్ కార్యాలయానికి ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ వెళ్లారు. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై చర్చించి రెండు పార్టీలు కలసి ఐక్య పోరాటాలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈ నెల 19న అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన తెలంగాణలో నియంతృత్వ పాలన నడుస్తోందని తెలంగాణ చెరుకు సుధాకర్ ఆరోపించారు. శుక్రవారం ఆదర్శ్‌నగర్‌లోని తెలంగాణ ఇంటి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ తెలంగాణను ఏమీ చేయలేకపోయింది కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రజలందరినీ అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని చెరుకు సుధాకర్ ఆరోపించారు. -
హుజూర్‌నగర్‌లో పోటీ చేస్తాం...
సూర్యాపేట: హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ పోటీలో ఉంటుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్లో జరిగిన పార్టీ ద్వితీయ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. నల్లగొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే రాజీనామా చేస్తారన్న సమాచారం ఉందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా ఇంటి పార్టీకి ఒక అసెంబ్లీ స్థానం కేటాయిస్తామని కాంగ్రెస్ మాటిచ్చిందని, అనివార్య కారణాలతో ఇవ్వలేకపోయిందని గుర్తుచేశారు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి గెలుపు కోసం, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటి పార్టీ కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించి హుజూర్‌నగర్‌కు జరిగే ఉప ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలని కోరారు. -
పవన్.. ఇరురాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై సీమాంధ్ర రాజకీయ నేతల వెకిలిచేష్టలు చూస్తుంటే బాధేస్తోందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ప్రగతిభవన్ నుంచి డబ్బులు ఏపీకి పంపారని, హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలను కొడుతున్నారనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మంగళవారం ఇక్కడి ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. పవర్‌స్టార్ జోకర్ స్టార్ కావొద్దని సూచించారు. తెలంగాణలో ఉన్న చంద్రబాబు, పవన్, బండ్ల గణేశ్, బెల్లంకొండ ఆస్తులపై ఏనాడైనా దాడి జరిగిందా.. అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఇంజనీర్లను, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాదని కాళేశ్వరం ప్రాజెక్టును సీమాంధ్ర కాంట్రాక్టర్లు చేపట్టిన విషయం ఈ నేతలకు తెలియదా.. అని ప్రశ్నించారు. కట్టుబట్టలతో తెలంగాణ నుంచి తరిమికొట్టారని చంద్రబాబు అనడం తగదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ పోరాడినా తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడాన్ని జిమ్మేదార్ అంటారా.. అని కేటీఆర్ మాటలను ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రూ.2 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారన్నారు. కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్‌లో 240 మందికిపైగా పోటీ చేయడంతోనే కేసీఆర్ పరువు గంగలో కలిసిపోయిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, లేకుంటే ఇలానే జరుగుతుందన్నారు. దేశం మొత్తం వీవీ ప్యాడ్లను లెక్కించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని తెలిపారు. -
పవన్.. ఇరురాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై సీమాంధ్ర రాజకీయ నేతల వెకిలిచేష్టలు చూస్తుంటే బాధేస్తోందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. ప్రగతిభవన్ నుంచి డబ్బులు ఏపీకి పంపారని, హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలను కొడుతున్నారనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మంగళవారం ఇక్కడి ఇంటి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడారు. తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. పవర్‌స్టార్ జోకర్ స్టార్ కావొద్దని సూచించారు. తెలంగాణలో ఉన్న చంద్రబాబు, పవన్, బండ్ల గణేశ్, బెల్లంకొండ ఆస్తులపై ఏనాడైనా దాడి జరిగిందా.. అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న ఇంజనీర్లను, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాదని కాళేశ్వరం ప్రాజెక్టును సీమాంధ్ర కాంట్రాక్టర్లు చేపట్టిన విషయం ఈ నేతలకు తెలియదా.. అని ప్రశ్నించారు. కట్టుబట్టలతో తెలంగాణ నుంచి తరిమికొట్టారని చంద్రబాబు అనడం తగదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీ పోరాడినా తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడాన్ని జిమ్మేదార్ అంటారా.. అని కేటీఆర్ మాటలను ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను రూ.2 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారన్నారు. కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్‌లో 240 మందికిపైగా పోటీ చేయడంతోనే కేసీఆర్ పరువు గంగలో కలిసిపోయిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, లేకుంటే ఇలానే జరుగుతుందన్నారు. దేశం మొత్తం వీవీ ప్యాడ్లను లెక్కించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని తెలిపారు. -
బీసీల లెక్కలు తేల్చాకే ‘పంచాయతీ’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకొని అసభ్యకర భాషలో విమర్శిస్తున్నారని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. సుప్రీంకోర్టుకు బీసీ జనాభా లెక్కలు సమర్పించి రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడి ఆదర్శ్‌నగర్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ద్వారా జరిగే మార్పులు ఏమీ ఉండవని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బు తీవ్ర ప్రభావం చూపిందన్నారు. తెలంగాణ అమరులు, ఉద్యమకారుల సంక్షేమం గురించి కేసీఆర్ ఒక్కమాట కూడా ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. వివిధ పత్రికలు, చానెళ్లను చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో యాజమాన్యాలను బెదిరించడం అప్రజాస్వామికమన్నారు. సుధాకర్ సమక్షంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధికార ప్రతినిధి కాసుల కృష్ణ ఇంటి పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఇంటి పార్టీయేనని, అందుకే ఈ పార్టీలో చేరుతున్నానని కాసుల కృష్ణ తెలిపారు. సమావేశంలో ఇంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొమ్మాట వెంకటేశ్వర్లు, బుర్ర శ్రీనివాస్‌గౌడ్, నేతలు కొమురయ్య, హరీశ్‌యాదవ్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ స్ఫూర్తిని అందుకోని కాంగ్రెస్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిలా శ్రమించాల్సింది. ఆయనలా పాదయాత్రలతో వివిధ వర్గాలను సమీకరించాల్సి ఉండే..’అని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అభిప్రాయపడ్డారు. ‘కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ప్రజా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలంగాణ ఇంటి పార్టీకి మొదట నకిరేకల్ స్థానాన్ని కేటాయిస్తున్నట్లు వార్తలు వెలువడినా, ఆ తర్వాత దక్కలేదు. అయినా, కూటమిలో కొనసాగుతూ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నాం’అని ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. తెలంగాణ ఇచ్చిన ఘనతను కాంగ్రెస్ ఉద్యమంగా ముందుకు తీసుకురాలేకపోయింది. కేసీఆర్‌పై వ్యతిరేకత ఆయుధం తప్ప ఇతర ఆయుధాలేవీ లేనట్టు వ్యవహరించింది. ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వలేక పోయింది. ఈ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్‌కు ఆక్సిజన్ అందించిన వైఎస్సార్ రాష్ట్రంలో గతంలో మరణశయ్యపై ఉన్న కాంగ్రెస్‌కు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆక్సిజన్ అందించారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు తక్కువేం కాదు. ఈ సంక్షేమ పథకాల గురించి కాంగ్రెస్ ఎక్కువగా ప్రచారం చేసుకోలేదు. వైఎస్సార్ పథకాలను కాంగ్రెస్ ఓన్ చేసుకోలేక పోయింది. వైఎస్ఆర్ తన పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌ను రెండు సార్లు అధికారంలోకి తీసుకువచ్చారు. పాదయాత్ర ద్వారా 90 శాతం ప్రజానీకానికి ఆయన చేరువయ్యారు. ఆ పనిని తెలంగాణ కాంగ్రెస్ చేయలేక పోయింది. ఒక నాయకుడు అధికారం దక్కించుకోవడానికి వైఎస్ జగన్‌లా చమటోడ్చాలి. ఆయనను చూసి నాయకులు ఎంతైనా నేర్చుకోవాలి. బీసీలను విస్మరించిన టీడీపీ ఎన్టీఆర్ రాకతో సామాజిక మార్పులు చోటు చేసుకుని కింది స్థాయి వర్గాలకు అధికారం అందుబాటులోకి వచ్చింది. టీడీపీ పునాదులు బీసీ, అణగారిన వర్గాల్లోనే ఉన్నాయి. చంద్రబాబును ఖమ్మం, కూకట్‌పల్లికి పరిమితం చేసి ఉంటే బావుండేది. హైదరాబాద్ నిర్మాతను తానే అని తెలంగాణ ఉద్యమ కారులను రెచ్చగొట్టిన చంద్రబాబు, ఆధునిక తెలంగాణ నిర్మాతను అని అనడం పాత గాయాన్ని కెలకడమే. ఈ ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా టీడీపీ తీసుకున్న 13 సీట్లలో బీసీలను విస్మరించింది. బీసీని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలి టీపీసీసీ సారథి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గతంలోని భూస్వామ్య మసస్తత్వాలున్న నేతలకంటే భిన్నంగా ఉండడం మహాకూటమికి కలిసివచ్చే అంశం. ఎవరికి వారుగా అభ్యర్థులను నిర్ణయించుకని, వారి చుట్టే రాజకీయం తిరగకుండా అదుపు చేసి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి భిన్నంగా ఉండేది. ఉత్తమ్‌పై నేను పోటీ చేస్తానని ప్రకటించడం..వ్యక్తీకరించిన నిరసన సామాజిక వర్గాల తరఫున మాత్రమే. కాంగ్రెస్ బీసీని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలన్నది మా డిమాండ్. -
కూటమిలో రె‘బెల్స్’.. పొత్తు చిత్తేనా..?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ :మహాకూటమి పొత్తు లెక్కలు మహా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. కూటమిలో భాగంగా ఆయా పార్టీలకు కేటాయిస్తున్న లెక్కలు దారితప్పుతున్నాయి. ముఖ్యంగా తొలి జాబితాలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ కలిపి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు, రెండు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కూటమిలో భాగంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ తన అభ్యర్థిగా ఎర్ర శేఖర్‌ను ప్రకటించింది. అయితే ఆశ్చర్యకరంగా అదే స్థానానికి తెలంగాణ జన సమితితో పాటు తెలంగాణ ఇంటి పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. టీజేఎస్ తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.రాజేందర్‌రెడ్డి పేరును ప్రకటించగా.. తెలంగాణ ఇంటి పార్టీ తమ అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రకటిస్తూ జాబితా వెల్లడించింది. అంతేకాకుండా తెలంగాణ ఇంటి పార్టీ జడ్చర్ల అభ్యర్థిగా వి.శివకుమార్, నారాయణపేట అభ్యర్థిగా జనగారి నవిత పేర్ల ను ప్రకటించారు. జడ్చర్ల స్థానానికి మహాకూటమి నుంచి కాంగ్రెస్ నేత మల్లు రవి పేర్లు ఇప్పటికే వెల్లడించారు. ఇక దేవరకద్ర అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో నిలవాలని భావిస్తుండగా... టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతమ్మ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు మక్తల్‌లో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరికి టికెట్ ఇప్పించేందుకు డీకే.అరుణ ఢిల్లీలో యత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మహాకూటమి ఉన్నట్లా, విచ్ఛినమైనట్లేనా అనే చర్చ మొదలైంది. ఎత్తుకు పైఎత్తు! ముందస్తు ఎన్నికల్లో భాగంగా మహాకూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. ఎన్నికల బరిలో నిలిచే విషయంలో ఎక్కువ స్థానాలు దక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్ను గద్దె దింపడం కోసం అన్ని రాజకీయపక్షాలు కలిపి మహాకూటమిగా జత కట్టిన విషయం తెలిసిందే. అయితే కూటమిలోని పార్టీలన్నీ కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు తహతహలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తు లెక్కల విషయంలో సయోధ్య కుదరక అన్ని పార్టీలు కూడా సతమతమవుతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా పొత్తులు ఓ కొలిక్కి రావడం లేదు. తాజాగా నోటిఫికేషన్ వెలువడి.. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఎనిమిది, టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీజేఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన టీజేఎస్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో భాగంగా మహబూబ్‌నగర్ నుంచి రాజేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు కూటమిలో భాగంగా టీడీపీకి ఇదివరకే రెండు స్థానాలు కేటాయించగా.. దేవరకద్ర నుంచి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సీతమ్మ బుధవారం నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. అంతేకాకుండా మహాకూటమి నుంచి టీడీపీ, కాంగ్రెస్‌కు సీట్లు కేటాయించిన మహబూబ్‌నగర్, జడ్చర్లకు తెలంగాణ ఇంటి పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడం విశేషం. అంతేకాకుండా ఇంకా మహాకూటమి అభ్యర్థి ఖరారు కాని నారాయణపేట నుంచి ఈ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మక్తల్ సీటుపై పీటముడి మక్తల్ అసెంబ్లీ స్థానం విషయంలో మళ్లీ కొత్త అంశం తెరపైకి వచ్చింది. కూటమి భాగస్వామ్యంలో భాగంగా టీడీపీకి ఈ స్థానాన్ని కేటాయించారు. అందుకు అనుగుణంగా టీడీపీ తరఫున ఆ పార్టీ అభ్యర్థిగా కె.దయాకర్‌రెడ్డి బుధవారం నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ అంత సులువుగా వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. మక్తల్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ బీసీ కోటాలో సిట్టింగ్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరికి ఇవ్వాలంటూ మాజీ మంత్రి డీకే.అరుణ ఢిల్లీలో అధిష్టానం వద్ద యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో పాటు శ్రీహరికి మక్తల్‌లో పట్టు ఉందని కొన్ని సర్వేల నివేదికలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అంతేకాదు గత ఎన్నికల్లో మక్తల్ నుంచి పోటీ చేసిన దయాకర్‌రెడ్డి బీజేపీ మద్దతు ప్రకటించినా మూడో స్థానంలో నిలిచారని కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం మీద సీట్ల పంపిణీ కథ మొదటికి వచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీడని ఉత్కంఠ ఓవైపు కూటమి చిచ్చు రగులుతుండగా... మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల అంశం ఆ పార్టీ కేడర్‌కు మరింత ఉత్కంఠతకు గురిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రెండు విడతల్లో భాగంగా విడుదల చేసిన జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి తొమ్మిది స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఇక రెండు స్థానాలు కూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించారు. అయితే మరో మూడు స్థానాల విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. దేవరకద్ర, నారాయణపేట, కొల్లా పూర్‌కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో రెండు గ్రూపులుగా ఉన్న డీకే.అరుణ, జైపాల్‌రెడ్డి ఎవరికి వారు తమ వర్గం నేతలకు టికెట్లు ఇప్పించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరు వర్గాలు కూడా ఢిల్లీలో మకాం వేయడంతో అభ్యర్థుల ఖరారు విషయంలో మరింత జాప్యం జరుగుతోంది. -
టీడీపీ కనుసన్నల్లో అభ్యర్థుల ఎంపిక
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. బుధవారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ వైఖరి పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ కనుసన్నల్లోనే మహా కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి నుంచి కూటమి రాజకీయాలు నడిపిస్తే ఉద్యమకారుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నిం చారు. బీసీలకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి, పొన్నాల వంటి నాయకులకు సీట్లు నిరాకరించారని, విద్యార్థి నాయకులను సైతం పిలవలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ నుంచి 30 స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దించుతున్నట్లు తెలిపారు. హుజూర్నగర్ నుంచి తాను పోటీ చేస్తానని పేర్కొన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ.. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్న ప్రొఫెసర్ కోదండరాం ఇది నీకు భావ్యమా అని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. బీసీలు ఢిల్లీ గల్లీ ల్లో టికెట్ల కోసం బిచ్చగాళ్లుగా తిరుగుతున్నారన్నా రు. మంద కృష్ణమాదిగ, గద్దర్, ఆర్.కృష్ణయ్య వంటి నాయకులు ఎక్కడున్నారని నిలదీశారు. మనందరం కలిసి ఎందుకు ప్రత్యామ్నాయం కాకూడదని ప్రశ్నిం చారు. త్వరలోనే అందరితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. -
కూటమి నుంచి ఔట్..21 మంది అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలో తెలంగాణ ఇంటి పార్టీకి చోటు లభించకపోవడంతో స్వతంత్రంగానే ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే 21మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మహాకూటమిలో టీడీపీ ఆధిపత్యం, పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అనేక మంది సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటు కేటాయిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పెద్దలు మాట తప్పారని విమర్శించారు. సీటు ఇస్తానని ఢిల్లీ పిలిపించుకొని అవమానించారని మండిపడ్డారు. తెలంగాణ ఇంటిపార్టీ తరపున మొత్తం 52 మందిని బరిలోకి దింపుతామని వెల్లడించారు. రెండో జాబితాను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా, హుజుర్నగర్ నుంచి చెరుకు సుధాకర్, నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఆయన భార్య చెరుకు లక్ష్మీ ఇంటిపార్టీ తరపున పోటీ చేయనున్నారు. -
బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారు: ఇంటి పార్టీ
హైదరాబాద్: మహా కూటమి తరపున తెలంగాణ ఇంటి పార్టీకి సీట్లు కేటాయించకపోవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కూటమి జాబితా అమరావతిలో తయారవుతుందని, ఇంటి పార్టీని మొదటి నుంచి దూరం చేయాలని చూశారని ఆరోపించారు. కూటమిలో ఉద్యమకారులకు ద్రోహం జరిగిందన్నారు. తాము మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలో రెండు సీట్లు అడిగామని వెల్లడించారు. ఢిల్లీలో బీసీ లీడర్లు పాలెగాళ్లు అయ్యారని ఆరోపించారు. కూటమి సీట్లలో సామాజిక న్యాయమే లేదని వ్యాక్యానించారు. సీట్ల జాప్యానికి కోదండరాం, ఉత్తమ్ కుమార్ రెడ్డిలే కారణమన్నారు. నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో తాను పోటీ చేయదలచుకున్నానని తెలిపారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ కూడా మోసం చేసిందని విమర్శించారు. ఆర్ధిక సమానత్వం కోసం పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఇంటి పార్టీ నేత జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సామాజిక, ఆర్ధిక న్యాయం దొరకడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్యమంలో ఆత్మత్యాగం చేసిందెవరని ప్రశ్నించారు. త్యాగాలు ఒకరివి భోగాలు మరొకరికి చేరుతున్నాయన్నారు. ఎదుగుతున్న బీసీ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, చెరకు సుధాకర్లకు సీట్లు ఇవ్వలేదని విమర్శించారు. సీపీఐ, కాంగ్రెస్, టీజేఎస్ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకుల చేతిలో ఉన్నాయని, సామాజిక న్యాయం చేయని వారికి తమ మద్ధుతు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. తెలంగాణ ఇంటి పార్టీ ఉద్యమ కారులకు అండగా ఉంటుందని, మంచి కూటమితో ముందుకు వస్తామని తెలిపారు. డబ్బులు, మద్యానికి లొంగకుండా ప్రజలు ఓటు వేయాలని కోరారు. అంతకుముందు తెలంగాణ ఇంటి పార్టీ ఆద్వర్యంలో అమరుల స్థూపానికి చెరకు సుధాకర్, చంద్రకుమార్‌లు నివాళులు అర్పించారు. -
‘ఆ స్థానంలో నా భార్య పోటీ చేస్తారు’
సాక్షి, హైదరాబాద్ : నకిరేకల్ స్థానం నుంచి తన భార్య చెరుకు లక్ష్మి పోటీ చేస్తారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రకటించారు. తెలంగాణ ఇంటి పార్టీకి కుంతియా ఒక సీటు ప్రకటించారని.. మహబూబ్‌నగర్, షాద్ నగర్ స్థానాలను కూడా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీపై కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. ఆ పార్టీ ఎక్కడిదని వారు అనడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో ఉద్యమాలు చేశామని ఆయన గుర్తుచేశారు. నకిరేకల్‌పై కాంగ్రెస్ బ్రదర్స్ పట్టువదలకపోవడంతో ఆయన శనివారం కుంతియా, ఉత్తమ్లతో భేటీ అయ్యారు. నకిరేకల్ సీటు తమకు కేటాయించినట్లు కుంతియా తెలిపారని.. తమను గెలిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. కాగా ఆ స్థానంలో కోసం టీడీపీ, కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఆ సీటును చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ స్పందించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
హైదరాబాద్: ముందస్తు ఎన్నికలపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మైండ్‌గేమ్‌కు ధీటుగా మహాకూటమిలో వేగం, సమన్వయం ఉండాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. కొందరే లబ్ధి పొందాలనే వైఖరితో ఉంటే కూటమి దెబ్బతింటుందని హెచ్చరించారు. మహాకూటమి ఆచరణ, ప్రణాళికలు రూపొందించేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు గోల్కొండ హోటల్‌కు తమను పిలిచారని, ఆ తర్వాత ఉలుకూపలుకూలేదని, తాను ఫోన్లు చేసినా స్పందించడంలేదన్నారు. సీట్ల సర్దుబాటు విషయంలో సామాజికపార్టీ అయిన ఇంటి పార్టీని చిన్నచూపు చూస్తున్నదని ఆరోపించారు. కాం గ్రెస్ నుండి స్పందన రా కుంటే త్వరలోనే రాజకీయ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతామన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఉద్యమకా రులు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కలసి మహాకూటమిగా ఏర్పడాలని మొదట ప్రతిపాదించింది తెలంగాణ ఇంటి పార్టీ అని గుర్తుచేశారు. ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్‌కు తెలుగుదేశం పార్టీ దగ్గరైందని, కూటమి కావాలన్న ఇంటిపార్టీ దూరమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ముందస్తుకు వెళ్లడం కేసీఆర్ వైఫల్యం
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ప్రజలు ఐదేళ్లు పాలించమని తీర్పు చెబితే సీఎం కేసీఆర్ వారి ఆకాంక్షలకు విరుద్ధంగా ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని, ఇది ఆయన వైఫల్యమేనని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. సోమవారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ వాదులపై దాడులు చేసిన మహేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్లను కేసీఆర్ టీఆర్ఎస్లో చేర్చుకున్నారన్నారు. కేజీ టు పీజీ విద్య మాటలకే పరిమితమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల పాఠశాలలను ఈ ప్రభుత్వం మూసివేసిందన్నారు. మహాకూటమిలో కాంగ్రెస్, ఉదమ్యకారుల అభిమానాన్ని చూరగొనేందుకు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలన్నారు. అధికారం దక్కాలంటే ఆ పార్టీ కొన్ని సీట్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. 1969 ఉద్యమకారులకు ఉచిత ఆరోగ్య బీమా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు జిల్లా కేంద్రం, హైదరాబాద్‌లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు పోటీచేసే చోట తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న నాయకులను అభ్యర్థులుగా ప్రకటించాలన్నారు. -
గెలిపించిన సెంటిమెంటే టీఆర్ఎస్ను ఓడిస్తుంది
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి కారణమైన తెలంగాణ సెంటిమెంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తుందని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఉద్యమ ఆకాంక్షలకు భిన్నంగా మహాకూటమి కూర్పు ఉంటే ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులు, సామాజిక వర్గాలకు సముచిత స్థానం ఉంటేనే మహాకూటమి లేదా ప్రజాకూటమి విజయం సాధిస్తుందన్నారు. మహాకూటమి కూర్పులో అపసవ్యత ఉందని, కూటమి సారథ్యంలో తెలంగాణ ఉద్యమ శిఖరాలు, ముఖాలు లేవన్నారు. టీడీపీ ఈ కూటమి కూర్పులో ప్రధానం కావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. టీడీపీకి తెలంగాణలో బలం ఉంటే సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే, హైదరాబాద్ పరిసరాల్లోనే ఎందుకు సీట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. సమావేశంలో నరసింహగౌడ్, కుందూరి దేవేందర్‌రెడ్డి, రామేశ్వర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, పరిగి రామన్న మాదిగ పాల్గొన్నారు. ‘నోటా సినిమాను అడ్డుకోండి’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ‘నోటా’ సినిమాను విడుదల చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓ పార్టీకి లబ్ధి చేకూర్చేలా రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉస్మానియా జేఏసీ నేత పున్నా కైలాశ్ నేత ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రధాన పరిశీలనాధికారితో పాటు నోటా చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నోటా, ఎన్టీఆర్ తదితర పేర్లతో సినిమాలు తీస్తున్నారన్నారు. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపే అవకాశం ఉంది. -
‘తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఎక్కడ ?’
హైదరాబాద్: కొట్లాడి సాధించుకున్న కొత్త రాష్ట్రంలో జీవితాలను త్యాగం చేసిన ఉద్యమకారులకు గుర్తింపు లేకుండా పోయిందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇస్తోందంటూ శుక్రవారం గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపాన్ని నీటితో శుద్ధి చేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, మారోజు వీరన్న, గూడ అంజన్నలు తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఇలాంటి మహనీయులను ప్రభుత్వం విస్మరించిందని, వీరి కుటుంబాలకు కనీస గుర్తింపు, గౌరవం లేకుండా పోయిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దొమ్మాట వెంకటేశ్, విద్యార్థి సంఘం అధ్యక్షుడు దేవరకొండ నరేశ్, సాంస్కృతిక సైన్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు తదితరులు పాల్గొన్నారు. -
12న బీసీ సాధికారత సభ
హైదరాబాద్: జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీల హక్కులు, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రావాల్సిన వాటా సాధించేందుకు అన్ని కుల, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల బీసీ నేతలతో కలసి ఆగస్టు 12న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘బీసీ సాధికారత సభ’బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కన్వీనర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. సభకు ముఖ్యఅతిథిగా కేంద్ర మాజీమంత్రి శరద్‌యాదవ్ హాజరుకానున్నట్లు చెప్పారు. సభ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్, తెలంగాణ జన సమితి నాయకులు పి.ఎల్.విశ్వేశ్వర్రావు, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్‌తో కలసి మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా బీసీల తలరాతలు మారడంలేదని, ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారతాయనుకుంటే ఇంకా అధ్వానంగా తయారయ్యాయని, ఉమ్మడి రాష్ట్రంలో ఆయా కులాల ఫెడరేషన్లకు ప్రభుత్వాలు నిధులు కేటాయించేవని, ఇప్పుడు అదీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలు, సిద్ధాంతాలను పక్కనబెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినట్టుగా అదే స్ఫూర్తితో బీసీ ఉద్యమం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ‘మనమెంతో మన వాటా అంత’అనే నినాదంతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సభలో కర్ణాటక, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, అశోక్ గెహ్లాట్‌తోపాటు బీసీ మేధావులు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, సీపీఐ నాయకుడు బాలమల్లేష్, తెలంగాణ ఇంటి పార్టీ ప్రతినిధి దొమ్మాట వెంకటేశ్, వైద్య సత్యనారాయణ పాల్గొన్నారు. -
సామాజిక వర్గాలకు అధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: సామాజిక వర్గాలకు అధికారం– సకల జనాల సంక్షేమం, ఉద్యమకారులకు గౌరవం దక్కాలనే లక్ష్యంతో ఆవిర్భవించిన తెలంగాణ ఇంటి పార్టీ మొదటి వార్షికోత్సవానికి సిద్ధమైంది. శనివారం నల్లగొండ పట్టణంలో భారీఎత్తున వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ‘సాక్షి’తో మాట్లాడారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి న కేసీఆర్ దళిత ఉద్యమాలను అణచివేస్తున్నారని అన్నారు. దళితుల భూములను ప్రభుత్వం గుంజుకొని దౌర్జన్యం చేస్తోందని ఆరోపించారు. ఆంధ్రా కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయిన వేళ.. ఇంటికో ఉద్యోగమని చెప్పి నిరుద్యోగులను మోసం చూస్తున్న వేళ.. ఉద్యమ, సామాజికశక్తులను సంఘటితం చేస్తూ 2017 జూన్ 2న తెలంగాణ ఇంటి పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. మల్లన్నసాగర్, నేరెళ్ల సంఘటన, ఆడబిడ్డల ఆర్తనాదాలు, రైతుల జీవన్మరణ పోరాటాలు, సమస్య ఎక్కడున్నా అక్కడ చిలకపచ్చ తెలంగాణ ఇంటి పార్టీ జెండా ఎగిరిందని అన్నారు. తెలంగాణ అమర గాయకుడు గూడ అంజన్న సంస్మరణ సభ పెట్టే తీరికలేని ప్రభుత్వాల తీరు ను తెలంగాణ ఇంటి పార్టీ ఎండగట్టిందని చెప్పారు. సబ్బండ వర్ణాల ఆశల సింగిడి... సబ్బండ వర్ణాల ఆశల సింగిడిగా ఇవాళ తెలంగాణ ఇంటి పార్టీ ఎదిగిందని, మట్టి నేల మీద వెట్టి బతుకుల మధ్య పరుచుకున్న వెచ్చని బొంత లాంటి ఒక సెంటిమెంటు, ఒక కమిట్మెంట్, ఒక ఆచరణాత్మక డాక్యుమెంటు ఇంటి పార్టీ అని సుధాకర్ పేర్కొన్నారు. సకల జనుల పోరాటాల్లో ఎదిగిన ఉద్యమ జేఏసీలకు, కుల సంఘాల నేతలకు, వివిధ పార్టీల్లో నష్టపోయి కష్టపడిన ఉద్యమబిడ్డలను తెలంగాణ ఇంటి పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోందని అన్నారు. కేసీఆర్ తన నాలుగేళ్ల పాలనలో ప్రజావ్యతిరేక నిర్ణయాలతో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, ప్రతికా ప్రకటనలకు, పనికిరాని రీడిజైనింగ్ పనులతో వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. ‘సాలు దొరో నీ పాలన– ఏలిన కాడికి సాలు’అనే యువతను పార్టీలోకి ఆహ్వానించి వారినే ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెడతామని చెప్పారు. పార్టీని బలోపేతం చేయటం కోసం తెలంగాణ స్టూడెంట్ యూనియన్(టీఎస్‌యూ), యూత్ వింగ్, లీగల్ సెల్, తెలంగాణ సాంస్కృతిక సైన్యం ఏర్పాటు చేశామన్నారు. -
కోదండరాం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు
సాక్షి, నల్గొండ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఉద్యమ ద్రోహులు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ జన సమితి అద్యక్షుడు కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై కోదండరాం ముందుకు రావకపోవడంతోనే తెలంగాణ ఇంటి పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు దళితులకు ముఖ్యమంత్రి పదవి అంటూ ఇచ్చిన హామీ ఎటు పోయిందని చెరుకు ప్రశ్నించారు. కార్పోరేట్లకు వేల ఎకరాలు భూములు ఇస్తుంటే దళితులకు మూడెకరాల భూమి ఏమైందని కోదండరాం ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తెలంగాణలో ఉద్యమ శక్తుల ఐక్యత పోవద్దని కోదండరాంకు చెప్పినా తన మాటను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జన సమితి కలిసి పార్టీ ఏర్పాటు అయితే సామాజిక న్యాయం జరిగేదని అన్నారు. తమ పార్టీని విలీనం చేస్తే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడిగినా కోదండరాం నుంచి సమాధానం రాలేదని చెరుకు సుధాకర్ తెలిపారు. కోదండరాం ఒంటెద్దు పోకడలతోనే కొత్త పార్టీలు వచ్చాయని విమర్శించారు. మీరు పెట్టపోయే పార్టీ ఎవరికోసం, పార్టీ పెట్టడానికి వనరులు ఎక్కడివి ? మీ వెనుక ఎవరు ఉన్నారు ? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి పార్టీ పెట్టారో సమాధానం చెప్పాలంటూ కోదండరాంను చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. -
రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తాం
నందిగామ(షాద్‌నగర్): షాద్‌నగర్ రాజకీయాల్లో తెలంగాణ ఇంటి పార్టీ త్వరలోనే నూతన ఒరవడి సృష్టిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. నందిగామకు చెందిన విద్యావేత్త ఎర్ర రామేశ్వర్‌గౌడ్ తన అనుచరులతో కలసి ఆదివారం షాద్‌నగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో సుధాకర్ సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ తమ పార్టీ ప్రజల ఆంక్షలమేరకు పనిచేస్తుందని అన్నారు. అంతకుముందు కొత్తూరులో రామేశ్వర్‌గౌడ్ భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. బైపాస్ చౌరస్తాలోని అంబేడ్కర్, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.