
చెరుకు సుధాకర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : నకిరేకల్ స్థానం నుంచి తన భార్య చెరుకు లక్ష్మి పోటీ చేస్తారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ప్రకటించారు. తెలంగాణ ఇంటి పార్టీకి కుంతియా ఒక సీటు ప్రకటించారని.. మహబూబ్‌నగర్, షాద్ నగర్ స్థానాలను కూడా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. తమ పార్టీపై కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. ఆ పార్టీ ఎక్కడిదని వారు అనడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో ఉద్యమాలు చేశామని ఆయన గుర్తుచేశారు. నకిరేకల్‌పై కాంగ్రెస్ బ్రదర్స్ పట్టువదలకపోవడంతో ఆయన శనివారం కుంతియా, ఉత్తమ్‌లతో భేటీ అయ్యారు.
నకిరేకల్ సీటు తమకు కేటాయించినట్లు కుంతియా తెలిపారని.. తమను గెలిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన పేర్కొన్నారు. కాగా ఆ స్థానంలో కోసం టీడీపీ, కాంగ్రెస్ తీవ్రంగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఆ సీటును చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిందే.