సామాజిక శక్తులకు అధికారమే లక్ష్యం | Power is goal to the social forces | Sakshi
Sakshi News home page

సామాజిక శక్తులకు అధికారమే లక్ష్యం

May 31 2017 1:56 AM | Updated on Sep 5 2017 12:22 PM

సామాజిక శక్తులకు అధికారమే లక్ష్యం

సామాజిక శక్తులకు అధికారమే లక్ష్యం

ఉద్యమకారులకు గౌరవం, నిరుపేదలకు సంక్షేమం, సామాజిక శక్తులకు అధికారమే లక్ష్యంగా, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా

- దాని సాధనకే తెలంగాణ ఇంటి పార్టీ
- ‘సాక్షి’తో పార్టీ నేత చెరుకు సుధాకర్‌
జూన్‌ 2న పార్టీ ఆవిర్భావం
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో సభ
 
సాక్షి, హైదరాబాద్‌: ఉద్యమకారులకు గౌరవం, నిరుపేదలకు సంక్షేమం, సామాజిక శక్తులకు అధికారమే లక్ష్యంగా, ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా  ‘తెలంగాణ ఇంటి పార్టీ’ ని ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ నేత డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ చెప్పారు. ‘‘రాష్ట్రంలో అధికా రంలో ఉన్నది తెలంగాణ ఉద్యమకారుల ప్రభుత్వం కాదు. తెలంగాణ వ్యతిరేకులతో నిండిన ఫక్తు రాజకీయ పార్టీ ప్రభుత్వం’’ అని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భవించిన జూన్‌ 2న తెలంగాణ ఇంటి పార్టీని ప్రారంభి స్తున్నామని మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ‘‘పార్టీ ఆవిర్భావ సభ జూన్‌ 2న మధ్యాహ్నం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరుగుతుంది.

ప్రజా గాయకుడు గద్దర్, జేఏసీ చైర్మన్‌ కోదండరాం, నేతలు విమలక్క, మందకృష్ణ మాదిగలను సభకు ఆహ్వానిం చాం. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమ కారులు కూడా పాల్గొంటారు’’ అని వివరిం చారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సమైక్య పాలన అభివృద్ధి నమూనానే సీఎం కేసీఆర్‌ కొనసాగిసు ్తన్నారని చెరుకు ఆరోపిం చారు. అవకాశవాద నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని డొల్లతనా న్ని చాటుకున్నారని, ఆ డొల్లతనమే ఇప్పుడు తెలంగాణకు పెను భారంగా మారిందన్నా రు. ‘ఉద్యమకారుడే అధికారానికి కేంద్ర బిందువు కావాలి. తెలంగాణ ఆత్మగౌరవం, ఉద్యమకారుల ఆత్మరక్షణ కోసం స్వచ్ఛంద దళాలను ఏర్పా టు చేస్తాం.

రాష్ట్రంలోని కుటుంబ పాలనను వ్యతిరేకిస్తున్నాం. జనాభాలో 52 శాతమున్న ఉన్న బీసీల పట్ల వివక్షను నిలదీస్తాం. బీసీ మంత్రులు సన్నబి య్యం ప్రచారానికి, మొక్క లు నాటడానికి, మద్యం వ్యవస్థను నడప డానికి, పాలాభి షేకాలకు, సబ్సిడీ గొర్రెలు, చేపల పెంపకం చుట్టూ తిప్పడానికే పనికొ స్తారా?’ అని ప్రశ్నించారు. బీసీని తక్షణం ఉప ముఖ్య మంత్రిని చేయాలని డిమాండ్‌ చేశారు. 2019లో బీసీ అభ్యర్థిని సీఎం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందన్నారు. ‘తెలంగాణ ఉద్యమ వేదికగా మేం ఉద్యమ శక్తులను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి తెలంగాణ కోసం పోరాడిన గ్రామ జేఏసీలను కలుపుకొని వెళ్తున్నాం. ఇప్పటికే 20 వేల మంది ఉద్యమకారుల చరిత్రను రికార్డు చేశాం. వారికోసం 10 వేల ఎకరాల భూమిని కేటాయించడం కూడా మా ఎజెండాలో ఉంది’ అని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement