సాక్షి, హైదరాబాద్ : మహాకూటమిలో తెలంగాణ ఇంటి పార్టీకి చోటు లభించకపోవడంతో స్వతంత్రంగానే ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే 21మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మహాకూటమిలో టీడీపీ ఆధిపత్యం, పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అనేక మంది సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటు కేటాయిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పెద్దలు మాట తప్పారని విమర్శించారు. సీటు ఇస్తానని ఢిల్లీ పిలిపించుకొని అవమానించారని మండిపడ్డారు. తెలంగాణ ఇంటిపార్టీ తరపున మొత్తం 52 మందిని బరిలోకి దింపుతామని వెల్లడించారు. రెండో జాబితాను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కాగా, హుజుర్‌నగర్ నుంచి చెరుకు సుధాకర్, నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఆయన భార్య చెరుకు లక్ష్మీ ఇంటిపార్టీ తరపున పోటీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment