
మీడియాతో మాట్లాడుతున్న చెరుకు సుధాకర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. బుధవారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద కాంగ్రెస్ వైఖరి పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ కనుసన్నల్లోనే మహా కూటమి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి నుంచి కూటమి రాజకీయాలు నడిపిస్తే ఉద్యమకారుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నిం చారు. బీసీలకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. పెద్దిరెడ్డి, పొన్నాల వంటి నాయకులకు సీట్లు నిరాకరించారని, విద్యార్థి నాయకులను సైతం పిలవలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీ నుంచి 30 స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దించుతున్నట్లు తెలిపారు. హుజూర్‌నగర్ నుంచి తాను పోటీ చేస్తానని పేర్కొన్నారు.
త్వరలో భవిష్యత్ కార్యాచరణ..
అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్న ప్రొఫెసర్ కోదండరాం ఇది నీకు భావ్యమా అని చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. బీసీలు ఢిల్లీ గల్లీ ల్లో టికెట్ల కోసం బిచ్చగాళ్లుగా తిరుగుతున్నారన్నా రు. మంద కృష్ణమాదిగ, గద్దర్, ఆర్.కృష్ణయ్య వంటి నాయకులు ఎక్కడున్నారని నిలదీశారు. మనందరం కలిసి ఎందుకు ప్రత్యామ్నాయం కాకూడదని ప్రశ్నిం చారు. త్వరలోనే అందరితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment