హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ద్రోహుల పార్టీ అని తెలంగాణ ఇంటి పార్టీ అధినేత డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ పలు విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ ఇంటి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు బడ్జెట్‌లో అన్యాయం చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగానే ఎప్పుడూ హడావుడి చేసే తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ‘బెల్లంకొట్టిన రాయి’లా ఉన్నారని దుయ్యబట్టారు.
తన అవినీతి మీద ప్రధాని మోదీ కొరడా ఝళిపిస్తారేమోనని కేసీఆర్ జంకుతున్నారని అన్నారు. అందుకే ఢిల్లీలో మోదీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అవినీతి మూటలను మోసినందుకు మరో కుటుంబ సభ్యుడు సంతోష్ కుమార్‌ను పెద్దల సభకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎంతోమంది మేధావులున్నా కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మార్చిలో మే«ధావులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామన్నారు.
తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక అ«ధ్యక్షుడు సందీప్ చమార్, తదితరులు తెలంగాణ ఇంటి పార్టీలో చేరారు. అనంతరం సందీప్‌ను పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. సమావేశంలో తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొమ్మాట వెంకటేశ్, నాయకులు ఇస్లావత్ బాలాజీ నాయక్, ప్రసాద్, దేవేందర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, చంద్రకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment