
కేసీఆర్ వెయ్యిరోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు
కేసీఆర్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచిందని..
జూన్ 2న కొత్తగా ‘తెలంగాణ ఇంటి పార్టీ’: చెరుకు సుధాకర్
హైదరాబాద్: కేసీఆర్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచిందని.. ఆయన వెయ్యి రోజుల పాలనంతా రోజుకో అబద్ధంతోనే సాగిందని తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులన్నీ ఒక్కటైతేనే చక్కటి పాలన ఉంటుందన్నారు. రాష్ట్రం లో జూన్ 2న కొత్తగా ఆవిర్భవించనున్న ‘తెలంగాణ ఇంటి పార్టీ’లోకి జేఏసీ చైర్మన్ కోదండరాంను ఆహ్వానిస్తూ లేఖను పంపినట్లు చెప్పారు.
బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చెరుకు సుధాకర్ మాట్లాడుతూ దళితుల్ని సీఎంగా చేస్తానని, నీళ్లు, నిధులు, నియామకాల్లో మొదటి ప్రాధాన్యత తెలంగాణ ప్రజలకేనని, ఉద్యమకారులు ఆశిం చిన విధంగానే పాలన ఉంటుందని చెప్పిన కేసీఆర్ సీమాంధ్ర పారిశ్రామిక వేత్తలకే ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. లక్ష ఉద్యోగాల కోసం చేపట్టిన ర్యాలీని కేసీఆర్ ప్రభు త్వం భగ్నం చేయడం తెలంగాణ ప్రజలు జీవితంలో మర్చిపోలేరన్నారు. కోదండరాంపై జరిగిన దాడిని తెలంగాణ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావిస్తున్నా మన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, టీయూవీ స్టూడెంట్ అధ్యక్షుడు సందీప్ చమార్, 1969 నాటి ఉద్యమ కారులు పాల్గొన్నారు.