
జూన్ 2న కొత్త పార్టీ
తెలంగాణ ఉద్యమ వేదిక, ఇతర అను బంధ సంఘాల ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ వెల్లడించారు.
కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం: చెరుకు సుధాకర్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ ఉద్యమ వేదిక, ఇతర అను బంధ సంఘాల ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ వెల్లడించారు. మంగళవారం ఆయన సూర్యాపేటలో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెలివేసిన ఉద్యమ కారులు, మేధావులను ఒక్క తాటిపైకి తీసుకొస్తామన్నారు.
సామాజిక తెలంగాణ లక్ష్యమే తమ ఉమ్మడి ధ్యేయమని చెప్పారు. ఉద్యమకారులను ఏకం చేసిన ప్రొఫెసర్ కోదండరాంను పక్కన పెట్టి, ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆంధ్రా నాయకులతో కుమ్మక్కైన వారికి అందలం ఎక్కించడం తెలంగాణ రాష్ట్రానికే అవమానకరమన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడం లక్ష్యంగానే తమ పోరాటం ఉంటుందని ఆయన చెప్పారు.