
సిద్దాంతాలు నచ్చితే ఎవరైనా రావొచ్చు: జానా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సిద్దాంతాలు నచ్చిన వారెవరైనా పార్టీలో చేరవచ్చని మాజీ మంత్రి కె.జానారెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ తిరిగి సొంతగూటికి రావడంపై ప్రశ్నించగా.. ఆయన పై విధంగా స్పందించారు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్ దిగ్విజయ్‌తో భేటీ అయిన విషయం తనకు తెలియదన్నారు. కాగా, ఎంపీ ,ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి దిగ్విజయ్‌కు జానారెడ్డి పలు ప్రతిపాదనలు ఇచ్చినట్టు సమాచారం. అయితే అంతకు ముందు అదే జిల్లాకు చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ దిగ్విజయ్‌తో సమావేశమయ్యారు.