సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. రాజగోపాల్‌రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరస్పర విమర్శలతో రెచ్చిపోయారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై చేసిన వ్యాఖ్యలపట్ల వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
రేవంత్ పెద్ద తప్పు చేశారు
తాజాగా జరిగిన పరిణామాలు సైతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అసహనం కలిగించాయి. చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. తనను ఎన్నికల్లో ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు. ఇకపై రేవంత్‌రెడ్డి ముఖం కూడా చూడనని వెంకట్‌రెడ్డి అన్నారు.
(చదవండి: మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా?)
పార్లమెంట్ సమావేశాల తర్వాత మునుగోడు వెళ్తానని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో శుక్రవారం ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. చెరుకు సుధాకర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
(చదవండి: పావులు కదుపుతున్న హస్తం నేతలు.. రేవంత్‌పై ఢిల్లీ పెద్దలు సీరియస్!)
Comments
Please login to add a commentAdd a comment