
హైదరాబాద్: టోల్‌ప్లాజాల పేరుతో దోపిడీకి పాల్పడుతోన్న రాష్ట్ర ప్రభుత్వం మెట్రో పేరిట మరో దోపిడీకి తెరలేపిందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆరోపించారు. మెట్రోలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో కార్యాచరణ రూపొందించామని చెప్పారు.
తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్ అధ్యక్షతన ‘మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో ఉపాధి, ఉద్యో గాలు స్థానికులకే దక్కాలి, మెట్రో చార్జీలు తగ్గాలి, మెట్రో రైలు అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి’అనే అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో పలువురు వక్తలు మాట్లాడుతూ, మెట్రో ఓ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రతినిధి దుబ్బాక గోపాలకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంజూరైన మెట్రో ప్రారంభోత్సవంలో ఆయన పేరును ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment