అలాయ్-బలాయ్ ఎవరికి?
అభిప్రాయం
తెలంగాణ రాకముందు దత్తన్న అలాయ్-బలాయ్ ఒక చర్చ, తీరొక్క పూవు పేర్చిన బతుకమ్మ వైవిధ్యం, వైనం-జీవం ఉట్టిపడిన పండుగ. అది ఇప్పుడు ఒక అధికారిక విన్యాసం కాకూడదు. తంతు కాకూడదు.
‘‘అరే బాయ్! దిల్ ఖోల్‌కే గలే మిలావ్! ఏ ఇస్ దూల్‌కి సిల్‌సిలా హై’’ - నిజమే - సినారే‘రిమ్ జిమ్ - రిమ్ జిమ్ హైదరాబాద్’లో కులాలు, మతాలు వేరైనా మనమంతా ఒకటే భాయీ! సినిమా పాట వ్రాసి అర్ధ శతాబ్దం కావస్తు న్నది. హైదరాబాద్‌లో అద్భు తమైన సహజీవనాన్ని రిక్షావాలాతో ‘మట్టిలో మాణి క్యం’ సినిమా చలనచిత్రంలో తెరకెక్కించింది నిన్నటి నిజం. దేశమంతా మత ఘర్షణలు చోటు చేసుకుం టున్నప్పుడు హైదరాబాద్ స్టేట్‌లో కొనసాగుతున్న హిందూ, ముస్లిం మత సామరస్యానికి పరస్పరం గౌర వించుకొని పండుగలు, పబ్బాలు, దసరా, పీర్ల పండు గలకు ‘అలాయ్-బలాయ్’తో ఆత్మీయ ఆలింగనం చేసుకుంటుంటే ముక్కున వేలేసుకొని గాంధీగారు ‘గంగా, జమున తహజీబ్’ అని మురిసిపోయిండ్రట. ఇది శతాబ్దం కిందటి ముచ్చట. కత్తులు దూసుకుం టున్న రాజకీయ పక్షాలను కాదని ప్రజలు అలాయ్- బలాయ్ తీసుకుంటుంటే ప్రతి దసరాకు పాలపిట్ట, జమ్మిచెట్టు, పీర్ల అలావా మురిసిపోతూనే ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలను ఏకం చేసేందుకు 13 ఏళ్లుగా సాగుతున్న సీనియర్ బీజేపీ నేత, పార్లమెంట్ ఎంపీ, కేంద్రమంత్రి, బడుగుల ప్రతినిధి బండారు దత్తాత్రేయ ‘అలాయ్-బలాయ్’ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మొన్న ముగిసింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయు డుతో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసిం హన్ అనేక పార్టీల నాయకులు, మంత్రులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కవులు, కళాకారులు, మేధావులు, అధికారులు హాజరైనారు. ఎంతోమందికి సన్మానం కూడా జరిగింది. రెండు రాష్ట్రాల సీఎంలు హాజరు కాకపోయినా, అన్ని రంగాల్లో అనేక అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని దత్తన్న సలహా ఇచ్చిండ్రు. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఇప్పిస్తా నని, బడుగు, బలహీన వర్గాల సమ్మిళితమైన అభివృ ద్ధితో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని దత్తన్న అన్నారు. తెలంగాణ రాకముందు దత్తన్న అలాయ్- బలాయ్ ఒక చర్చ, తీరొక్క పూవు పేర్చిన బతుకమ్మ వైవిధ్యం, వైనం-జీవం ఉట్టిపడిన పండుగ. అది ఇప్పుడు ఒక అధికారిక విన్యాసం, తంతు కాకూడదు.
ఈసారి అలాయ్-బలాయ్‌కి కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ ముఖం చాటేశారు. సమైక్య రాష్ట్రంలో తెలం గాణ ఉద్యమకారులను అరిగోస పెట్టించిన గవర్నర్ నరసింహన్ మాత్రం ‘ప్రేమతో స్నేహం చేయాలి. ఒక రికొకరు ఆత్మీయతతో ఆలింగనం చేసుకోవాలి. అలా య్-బలాయ్‌తో దత్తన్న అదే గుర్తు చేస్తున్నరు. జీవితం చాలా చిన్నది. శతృత్వం కాదు, ప్రేమను పెంచుకోవాలి’ అన్నారు. గతం గుర్తుకొచ్చిన వాళ్లకు కార్యక్రమంలో ఉడుకుతున్న వంటకాల కంటే తమ కడుపు తుక తుక ఉడుకుతున్నట్లు అనిపించింది. ఈ మాట బాగా అర్థమ య్యింది కాబట్టే అలాయ్-బలాయ్ వేదికమీద ఎవరి అక్కరకు వాళ్లు ఏదో మాట్లాడి వెళ్లిపోయిండ్రు. దత్తన్నకు పాలకుల కుమారులు, కుమార్తెలు, అల్లుళ్లు అంటే చాలా ముద్దు. తప్పేంలేదు కానీ, అదే ప్రేమతో వేముల రోహిత్ తల్లిదండ్రులకు, సెంట్రల్ యూని వర్సిటీ పిల్లలకు జరిగిన సంఘటనలపై విచారం, ఆవే దన వ్యక్తం చేస్తే ఎంత బాగుండునో?
అలాయ్-బలాయ్ తన పరిధి పెంచుకొని తెలం గాణలో కొత్త నాయకత్వానికి, కొత్త సామాజిక పునా దులకు, అట్టడుగు వర్గాల సాధికారతకు కేంద్ర బిందువు కావాలి. తెలంగాణ గడ్డమీద చెట్టంత మనిషి దత్తన్న. బీజేపీ అంటే పడనివాళ్లు కూడా ‘బోల్‌బాలా’ దత్తన్న అంటే ఆయన నిజాయితీ అంటే ఇష్టపడతారు. కానీ రాష్ట్రం సాధించిన క్రెడిట్‌ను కేసీఆర్‌తో పాటు తాము స్వంతం చేసుకొని, భవిష్యత్తు తెలంగాణ రాజ కీయాల్లో తమదైన ముద్ర వేయాల్సిన బాధ్యత దత్తాత్రే యన్నమీద ఉన్నది కదా? ‘చిప్‌కో’ ఉద్యమంలో బహు గుణ లెక్క మన బహుజన దత్తన్న ఉద్యమ, సామాజిక శక్తులను ‘హత్తుకోవాలని’ అంటున్నాం.
తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారుల్ని వచ్చే ఏడైనా అలాయ్-బలాయ్‌లో వేల సంఖ్యలో సన్మానించండి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు జైళ్లకు పోయి వీరోచిత చరిత్ర నిర్మించినందుకు ఓయూ, కాకతీయ, ఇతర తెలంగాణ విద్యార్థి నాయకులకు, ఉద్యోగ సంఘాలు, ఉద్యమ జేఏసీలు, కమ్యూనిస్టు పార్టీ వాళ్లు, దళిత నాయకులు అశుద్ధ భారతాన్ని నిలదీసిన బెజ వాడ జాన్సన్, దళితులకు శాస్త్రీయ సంగీతం నేర్పిన కృష్ణ ముస్లిమ్, క్రిస్టియన్, మైనారిటీ పెద్దలు, మహిళా నేతలు, కుల సంఘనేతలకు పెద్దపీట వేయాలని కోరు కుందాం. తెలంగాణ సెంటిమెంట్ ఎవరి ‘ఇంటి పార్టీ’కి అక్కరకు వస్తుందో తెలిసినప్పుడు అలాయ్-బలాయ్ సెంటిమెంట్ కూడా తెలంగాణలో క్రొత్త శక్తులకు అక్క రకు రాకపోతే ఆయన ఎదిగివచ్చిన బడుగుల కులాలకు అక్కరకు రాదు.
కర్నూల్ జిల్లాలోని దేవరగట్టులో కర్రల కొట్లాటలో వాళ్లు అలాయ్-బలాయ్ తీసుకుంటుంటే ఆత్మీయతతో దత్తన్న కొనసాగించిన 13 ఏళ్ల తెలంగాణ అలాయ్- బలాయ్. ఇప్పటికైనా ప్రజల పక్షం ఉండే రాజకీయ శక్తుల ఆత్మీయ ఆలింగనం కావాలి. అంతేకానీ, ఎవరో ‘దత్తత’ తీసుకున్నట్లు, పరాయిది కావద్దు.
డా॥చెరుకు సుధాకర్
తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షులు మొబైల్ : 90006 00744