కొందరి జీవితాన్ని బయోపిక్‌గా రీల్‌కు ఎక్కించాలన్నా, బయోగ్రఫీగా అక్షరబద్దం చేయాలన్నా సులువు కాదు. సూర్యాపేటలో 1922 ఫిబ్రవరి15న కల్లు గీసే ముత్తిలింగం –గోపమ్మలకు పుట్టిన బొమ్మగాని భిక్షం సమాజ సేవ బహుముఖీనం. జీవించిన 90 ఏండ్లూ ఆయన ఆరడుగుల ఎర్రజెండా... బడుగు జనుల విముక్తి ఎజెండా. ఆయన అనుభ వాల్ని కొంపెల్లి వెంకట్ మాట–ముచ్చటగా తీసు కొచ్చిండు.
‘‘ఇంత ఉద్యమ చరిత్రలో ఎన్నడూ కంట కన్నీరు కార్చి నోణ్ణి కాదు. నేను ఆ రోజుల్లో అన్‌క్వశ్చన్డ్ లీడర్ని రా నాయనా! ప్రజా ఉద్యమాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వాళ్ళలో లీనం గావాలే, అన్ని థాట్స్ హ్యుమాన్ బీయింగ్‌కు అవ సరం...’’ ఇవన్నీ జీవన చరమాంకంలో ఆయన వలపోత, కలబోత. ఇందులో ఎన్ని సింగిడీలో! ఆయన పార్లమెంట్ ఎన్నికలకు మా నాయన, సుద్దాల హన్మంతుతో పాటు గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థులుగా మేమూ పాల్గొన్నాం.
హిమాయత్‌నగర్‌లో మఖ్దూమ్ భవన్‌కు ముగ్గుబోయక ముందు మా ఇంట్లో ఎన్నోసార్లు సేద తీరినప్పుడూ, ఉపన్యాసం ఇచ్చినప్పుడూ అట్లా తదేకంగా చూడడం నా జీవితంలో కలి గిన గొప్ప అవకాశం. ఆయన నల్ల గొండ పార్లమెంట్‌కు మళ్ళీ 1996లో పోటీ చేసినప్పుడు... జల సాధన కోసం జలఖడ్గం విసిరినట్లుగా తెలంగాణ ఆర్తి చెప్పడానికి 480 మంది అభ్యర్థుల్ని దుశర్ల సత్యనారాయణ, మేము నిలబెట్టినం.
89 ఏళ్ల వయస్సులో తొంటి విరిగి ఇన్‌ఫెక్షన్‌తో పోరా డుతూ 2011 మార్చి 26న ఆయన చని పోయిండ్రు. అదే రోజు నల్లగొండ జిల్లా సంగెంలో రాత్రి తెలంగాణ ఆట–పాట– మాట సభ నిర్వహించుకొని నేను, సాంబ శివుడు తిరిగి వస్తూ పొద్దున అంత్యక్రియలకు హాజరవుదామని అనుకున్నాం. దారిలో సాంబశివుడు హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న సాంబశివుణ్ణి ఆసుపత్రికి, ఇంటికి తరలించే పనిలో ధర్మభిక్షం చివరి చూపు కరువయింది. 15 ఫిబ్రవరి 2021లో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ప్రారంభమయిన శత జయంతి వార్షికోత్సవాలు, 2022లో నేడు రవీంద్ర భారతిలో ముగుస్తాయి.
-చెరుకు సుధాకర్
వ్యాసకర్త ఇంటిపార్టీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment