
పార్లమెంట్ విశ్వాసం పొందిన ప్రచండ
కాఠ్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’సోమవారం పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానం నెగ్గారు. పార్లమెంట్‌లో ప్రచండ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్ సెంటర్) మూడో అతిపెద్ద పారీ్టగా ఉంది.
సోమవారం పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో 275 మంది సభ్యులకుగాను హాజరైన 158 మందిలో ప్రచండ ప్రభుత్వానికి అనుకూలంగా 157 మంది ఓటేశారు. ప్రచండ సభ విశ్వాసం పొందినట్లు పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. ప్రచండ 2022లో ప్రధాని పగ్గాలు చేపట్టాక గత 18 నెలల్లో పార్లమెంట్ విశ్వాసం పొందడం ఇది నాలుగోసారి.
Comments
Please login to add a commentAdd a comment