Communist Party
-
US Election2024: ఆరుగురు భారతీయుల విజయకేతనం
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఆరుగురు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు. ప్రస్తుత కాంగ్రెస్‌లో ఐదుగురు ప్రతినిధులు ఉండగా.. ఈ ఎన్నికలతో అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ల సంఖ్య ఆరుకు పెరిగింది. వర్జీనియా నుంచి ఎన్నికైన తొలి భారతీయుడిగా న్యాయవాది సుహాస్ సుబ్రమణ్యం చరిత్ర సృష్టించారు.అమీ బెరా.. డెమొక్రాట్ అభ్యర్థిగా కాలిఫోరి్నయాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమీ బెరా విజయం సాధించారు. రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్టీన్ బిష్ను ఆయన ఓడించారు. యూఎస్ ప్రతినిధుల సభలో ఆయన సీనియర్ భారతీయ అమెరికన్. 2012లో రిపబ్లికన్ అభ్యర్థిని ఓడించిన బెరా 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కు ప్రాతినిధ్యం వహించారు. యూఎస్ ప్రతినిధుల సభకు చేరిన మూడో భారతీయ వ్యక్తిగా నిలిచారు. 1957లో కాలిఫోరి్నయా 29వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో కాలు పెట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా దలీప్ సింగ్ సౌంద్ చరిత్ర సృష్టించిన 50 ఏళ్ల తరువాత అమీ బెరా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. మొదట స్వల్ప ఓట్ల తేడాతో గెలిచినా.. తరువాత పర్యాయాల్లో ఆధిక్యాన్ని కొనసాగించారు. థానేదార్ రెండోసారి.. మిషిగన్‌లోని పదమూడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు థానేదార్ రెండోసారి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్‌ను 35 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓడించారు. తాను అందించిన సేవలు, శ్రామికులు, యూనియన్ల పక్షాన నిలబడటం, అబార్షన్ హక్కుల కోసం పోరాటం తన విజయానికి కారణమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు మద్దతు తెలిపిన యూనియన్లు, గ్రూపులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా రాజ్యాంగ హక్కులకోసం తాను పోరాడతానని హామీ ఇచ్చారు. రోఖన్నా.. 2016 నుంచికాలిఫోరి్నయాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రటిక్ ప్రతినిధి రో ఖన్నా మూడోసారి ఎన్నికయ్యారు. డెమొక్రాట్లకు బలమైన పట్టున్న 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో రిపబ్లికన్ అనితా చెన్ను సునాయాసంగా ఓడించారు. 2016లో మైక్ హోండాను ఓడించి ఖన్నా తొలిసారి అమెరికా సభకు ఎన్నికయ్యారు. ఖన్నా హౌస్ ఆర్మ్డ్ సరీ్వసెస్ కమిటీలో, పర్యవేక్షణ, జవాబుదారీ కమిటీల్లో పనిచేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణాన సిలికాన్ వ్యాలీలోని కొన్ని భాగాలను కలిగి ఉన్న డిస్ట్రిక్ట్.. 1990 నుంచి డెమొక్రాట్లకు కంచుకోటగా ఉంది. ఇల్లినాయిస్ నుంచి రాజా కృష్ణమూర్తి.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యా రు. రిపబ్లికన్ అభ్యర్థి మార్క్ రిక్‌పై దాదా పు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో కృష్ణమూర్తి విజయం సాధించారు. 2016లో తొలిసారి కాంగ్రెస్‌కు ఎన్నికైన ఆయన.. చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో అనుమానిత కార్యకలాపాలపై దృష్టి సారించిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న న్యాయవాది అయిన కృష్ణమూర్తి.. మాజీ డిప్యూటీ స్టేట్ కోశాధికారితో సహా రాష్ట్రం తరఫున అనేక పదవులు నిర్వహించారు. ప్రమీలా జయపాల్వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రమీలా జయపాల్ మరోసారి గెలుపొందారు. మలయాళీ అయిన జయపాల్ నాయర్ రిపబ్లికన్ అభ్యర్థి డాన్ అలెగ్జాండర్‌ను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. జయపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్లామ్–డంక్ లిబరల్ సీటు. ఇది డెమొక్రాట్లకు బలమైన జిల్లా. గెలుపు అనంత రం ఎక్స్ వేదికగా మద్దతు దారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘వాషింగ్టన్ 7వ జిల్లా కు ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వంగా ఉంది. అందరితో కలిసి పురోగతి కోసం పనిచేయడానికి, అవకాశాల కోసం పోరాటం కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను. నాకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరూ హృదయపూర్వక కృతజ్ఞతలు’అని ఆమె పేర్కొన్నారు. సుహాస్ సుబ్రమణ్యం రికార్డు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం. ఇప్పటివరకు వర్జీనియా స్టేట్ సెనేటర్‌గా ఉన్న సుబ్రమణ్యం.. వర్జీనియానుంచి ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. డెమొక్రటిక్‌లకు కంచుకోట అయిన వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసి రిపబ్లికన్ పారీ్టకి చెందిన మైక్ క్లాన్సీని ఓడించారు. ప్రస్తుతం ఐదుగురు భారతీయ అమెరికన్లతో కూడిన కాంగ్రెస్‌లో ఆయన సమోసా కాకస్‌లో చేరారు. సుబ్రమణ్యం తండ్రిది బెంగళూరు. తండ్రిది చెన్నై. తాత మిలటరీలో పనిచేయడంతో తండ్రి ఎక్కువకాలం సికింద్రాబాద్‌లో గడిపారు. బెంగళూరులోని మెడికల్ కాలేజీలో చదువుకున్న ఇద్దరూ పెళ్లి చేసుకుని 70వ దశకంలో అమెరికాకు వలస వచ్చారు. తమ కొడుకు యూఎస్ కాంగ్రెస్‌లో ఉంటారని ఊహించి ఉండదు. సుహాస్ భార్య మిరాండాది వర్జీనియా. ఇద్దరు కుమార్తెలు. ‘ఈ జిల్లాకు సేవలందించడం గౌరవంగా భావిస్తున్నా’ అని సుబ్రమణ్యం పేర్కొన్నారు. అలాగే ‘నా పేరెంట్స్ కొన్ని విలువలు నేర్పారు. నా భారతీయ మూలాలు కోల్పోకూడదన్నది అందులో ఒకటి. అందుకే వేసవిలో ఇండియాకు వెళ్తుంటా. ఇప్పటికీ అక్కడ నాకు కుటుంబం ఉంది. ఆ వారసత్వాన్ని కొనసాగించడం నాకు చాలా ముఖ్యం. నా నేపథ్యం, నా వారసత్వం గురించి గర్వంగా చెప్పుకుంటా’అని చెప్పే సుబ్రమణ్యం.. భారత్–అమెరికా మధ్య బలమైన బంధం ఉండాలని కోరుకుంటున్నారు. -
కామ్రేడ్స్‌పై కపట ప్రేమ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఆయా పార్టీలను తన రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు అన్న విషయం కూడా జగది్వదితమే. తాజాగా ఆయన ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్స్’ అంటూ కమ్యూనిస్టులతో లోపాయికారీ వ్యవహారాలు నడుపుతుండటం ఆయన నైజాన్ని చెప్పకనే చెబుతోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత గత నెల 26న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో పాటు ఆ పార్టీ కీలక నేతలు ఎంఏ గఫర్, సీహెచ్ బాబూరావు, వై.వెంకటేశ్వరరావు ఆయన్ను కలసి అభినందించారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ.. సీఎం దృష్టికి ప్రజా సమస్యలు తీసుకెళ్లినట్టు వివరించారు. ఆ తర్వాత గత నెల 31న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర కీలక నేతల బృందం బాబును కలిసి అభినందించి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించినట్టు ప్రకటించారు. కలయికలో మర్మం అదేనా?.. ఉభయ కమ్యూనిస్టు నేతలు పోటీ పడి మరీ సీఎంను కలిసి ప్రజా సమస్యలు వివరించడంలో తప్పులేదని.. అయితే దీని వెనుక పెద్ద మంత్రాంగం నడిచిందని వామపక్ష శ్రేణులే చెబుతున్నాయి. బాబు పథకం ప్రకారమే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ ద్వారా కమ్యూనిస్టు నేతలను తన వద్దకు పిలిపించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు నుంచి వామపక్షాలకు టచ్‌లో ఉన్న జనార్దన్ వారిని టీడీపీకి అనుకూలంగా మలుచుకునేలా పనిచేశారని కమ్యూనిస్టు శ్రేణులే చెబుతున్నాయి. ఎన్నికల ముందు పాలకపక్షానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు ప్రజాసంఘాలు ఉద్యమించడంతో టీడీపీకి మేలు జరిగేలా జనార్దన్ ప్రయత్నాలు చేసినట్టు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చాక వారిని బాబు వద్దకు తీసుకెళ్లడంలో కూడా జనార్దన్ కీలకంగా వ్యవహరించారన్నారు. ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు ఉద్యమించకుండా ఉండేందుకే ఈ తతంగం నడిచిందని, అందుకే తమ పార్టీ నేతలపై బాబు కపట ప్రేమ కనబరచారని కమ్యూనిస్టు నేతలు చెబుతున్నారు. పథకంలో భాగమే లోకేశ్ స్పందన.. తండ్రికి తగ్గట్టుగానే తనయుడు లోకేశ్ సైతం కామ్రేడ్స్‌పై ఎన్నడూ లేని ప్రేమను ఒలకబోయడం వెనుక చంద్రబాబు పథకం ఉందని చెబుతున్నారు. ఈ నెల 1న శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సందర్భంగా సీపీఎం నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా స్పందిస్తూ.. తాము ఎటువంటి నిరసనకు పిలుపు ఇవ్వకపోయినా తమ నేతలను అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నారా లోకేశ్ ఎక్స్‌లో స్పందిస్తూ “మమ్మల్ని మన్నించండి కామ్రేడ్స్’ అంటూ పోస్టు చేశారు. కమ్యూనిస్టుల గృహనిర్భందం నెపాన్ని పోలీసులపై నెట్టేశారు. ఈ వ్యవహారాలన్నీ చూశాక.. పాలకపక్షాన్ని ప్రశ్నించే కమ్యూనిస్టుల్లో మార్పు వచి్చందా? పథకం ప్రకారం పాలకపక్షమే వారిని ప్రజల్లో పలచన చేస్తోందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏడాదిన్నరలో నాలుగోసారి..
కాఠ్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’సోమవారం పార్లమెంట్లో విశ్వాస తీర్మానం నెగ్గారు. పార్లమెంట్లో ప్రచండ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్ సెంటర్) మూడో అతిపెద్ద పారీ్టగా ఉంది. సోమవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో 275 మంది సభ్యులకుగాను హాజరైన 158 మందిలో ప్రచండ ప్రభుత్వానికి అనుకూలంగా 157 మంది ఓటేశారు. ప్రచండ సభ విశ్వాసం పొందినట్లు పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. ప్రచండ 2022లో ప్రధాని పగ్గాలు చేపట్టాక గత 18 నెలల్లో పార్లమెంట్ విశ్వాసం పొందడం ఇది నాలుగోసారి. -
మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
వ్లాదిమిర్ పుతిన్ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే దేశం రష్యా. చాలా సంవత్సరాలుగా పుతిన్ ఏలుబడిలో ఉన్న రష్యాలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు కీలకంగా మారనుంది. అందుకు కారణం.. ఆ దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం. గతంలో ఒక్కరోజులో పోలింగ్ పూర్తయ్యేది. అయితే.. దేశ చరిత్రలో తొలిసారిగా వరసగా మూడు రోజులపాటు అంటే 15, 16, 17 తేదీల్లో పోలింగ్‌కు రష్యా సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ ప్రారంభమైందక్కడ.. ప్రస్తుత పదవీకాలంతో కలిపి పుతిన్ ఇప్పటికే నాలుగు సార్లు(2000, 2004, 2012, 2018)లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో ప్రధానిగానూ సేవలందించారు. మానవహక్కుల గొంతుక, విపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెల మారుమూల కారాగారంలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఈసారి పుతిన్ వ్యతిరేక ఓటింగ్ పెరుగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. ఉక్రెయిన్‌పై దురాక్రమణతో ప్రస్తుతం తన అధీనంలో ఉన్న నాలుగు ఉక్రెయిన్ రీజియన్లలోనూ ఈ ఎన్నిక క్రతువు కొనసాగనుంది. పుతిన్ హవా.. అధ్యక్ష రేసులో పుతిన్ విజయబావుటా ఎగరేస్తారని ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అయినా సరే పౌర హక్కులను కాలరాస్తూ, నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతినబూనారు. ఎన్నికల రణరంగంలో పుతిన్‌ను ఓడిస్తామంటూ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా(ఎల్‌డీపీఆర్) తరఫున అభ్యరి్థగా లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ అభ్యరి్థగా వ్లాదిస్లేవ్ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యరి్థగా నికోలే ఖరిటోనోవ్‌లు ఎన్నికల బరిలో నిలిచారు. దేశ ఓటర్లలో పుతిన్‌కు 75 శాతం మద్దతు ఉందని, ఈ ముగ్గురు తలో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్ అంచనాలు విశ్లేíÙస్తున్నాయి. పోలింగ్ ఎక్కడెక్కడ? పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురువారం కంటే ముందే మొదలుపెట్టారు. శుక్రవారం సాధారణ ఓటింగ్ మొదలైంది. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై పుతిన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. రష్యా భూభాగంలో ఎలాగూ మెజారిటీ సాధిస్తానని పుతిన్ బలంగా నమ్ముతున్నారు. ఉక్రెయిన్ ప్రాంతాల్లో గెలిచి తమది అధర్మ యుద్ధం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని పుతిన్ యోచిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు, రెఫరెండమ్‌లు ఇప్పటికే నిర్వహించారు. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని ప్రపంచదేశాలు మొత్తుకున్నా పుతిన్ పట్టించుకోవట్లేదు. ఈసారి 11.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా సరే ఓటేయొచ్చు. మార్చి 19 కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడి కావచ్చు. తుది ఫలితాలు తెలియాలంటే మార్చి 29వ తేదీకా ఆగాల్సిందే. 2018 గత అధ్యక్ష ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకెన్నాళ్లు పుతిన్ పాలిస్తారు? మరో రెండు పర్యాయాలు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనువుగా చట్టం చేసి 2021లో పుతిన్ దానిపై సంతకం చేశారు. ఈసారి గెలిచి, 2030లోనూ గెలిస్తే 2036దాకా పుతిన్ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు. రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యంత ఎక్కువకాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ పేరు ఇప్పటికే చరిత్రకెక్కింది. కుంభస్థలిని కొట్టగలరా ? పోటీలో ఏ అభ్యర్థి నిలబడాలి అనేది దాదాపు దేశ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) నిర్ణయిస్తుంది. ఎల్‌డీపీఆర్ నేత లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ నేత వ్లాదిస్లేవ్ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్‌లు ఈసారి బరిలో దిగారు. పుతిన్‌ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీరు వ్యతిరేకించలేదు. యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక విపక్ష నేత బోరిస్ నదేహ్‌దిన్‌ను పోటీకి నిలబడకుండా సీఈసీ అడ్డుకుంది. అభ్యరి్ధత్వానికి సరిపడా సంతకాలను సేకరించలేకపోయారని ఆయన అభ్యరి్ధత్వాన్ని తిరస్కించింది. మరో అభ్యర్ధి యెకటేరియా డుంట్సోవానూ సీఈసీ ఇలాగే పక్కకునెట్టింది. పుతిన్‌ను ప్రధానంగా విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. స్లట్స్కీ, దవాన్‌కోవ్, ఖరిటోనోవ్‌లు దేశ సమైక్యత విషయానికొచ్చేసరికి పుతిన్‌కు పరోక్షంగా మద్దతు పలుకుతారు. ఈ లెక్కన దేశ సమైక్యత జెండా పట్టిన పుతిన్‌కే ఎక్కువ ఓట్లు పడతాయి. దీంతో వీళ్లు పుతిన్‌ను ఓడించడం అనేది అసంభవం. పుతిన్‌కు నిజంగా అంతటి ఫాలోయింగ్ ఉందా? రష్యా పౌరులు ఆంక్షల చట్రం, నిఘా నీడలో జీవిస్తారని పశి్చమదేశాలు తరచూ ఆరోపిస్తుంటాయి. దీంతో పుతిన్‌ను ఇష్టపడే ఎన్నుకుంటున్నారా లేదంటే మరో ప్రత్యామ్నాయం లేక పుతిన్‌కు జై కొడుతున్నారా అనేది ఇతమిద్ధంగా ఎవరికీ తెలీదు. పుతిన్ పాపులారిటీ 80 శాతాన్ని దాటేసిందని అక్కడి ప్రభుత్వేతర ఎన్నికల మేథో సంస్థ ‘ది లెవడా సెంటర్’ ఇటీవల ప్రకటించింది. అయితే 2023 చివరి నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరవరలు ఎగిసిన నేపథ్యంలో పుతిన్ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగాయని సంస్థ విశ్లేషించడం గమనార్హం. తనను వ్యతిరేకించే వాళ్లను పుతిన్ అస్సలు సహించలేడని పుతిన్‌కు గతంలో ప్రసంగాలు రాసి ఇచ్చిన అబ్బాస్ గలియమోవ్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ వల్లే 'ఇండియా' పురోగతి తగ్గింది: నితీష్ కుమార్
పాట్నా: కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమిలో పెద్దగా పురోగతి లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే కాంగ్రెస్ దృష్టి పెట్టిందని విమర్శించారు. అందుకే కూటమిలో దూకుడు తగ్గిందని చెప్పారు. బీజేపీ హటావో.. దేశ్ బచావో పేరుతో పాట్నాలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడానికి అందరం అంగీకరించామని తెలిపిన నితీష్ కుమార్.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన తర్వాతనే ఇండియా కూటమి మరో భేటీ జరిగేలా కనిపిస్తోందని వెల్లడించారు. ఇండియా కూటమి కాంగ్రెస్ వల్లే దెబ్బతింటోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే లోక్ సభ ఎన్నికలపై సన్నద్ధత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. కాగా.. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. మొదటి సమావేశం బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో పాట్నాలో జరిగింది. రెండో సమావేశం బెంగళూరు వేదికగా నిర్వహించారు. ఇక మూడోసారి ముంబయిలో ఆగష్టు 31న భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. సీట్ల షేరింగ్‌లో పార్టీల మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నవంబర్‌లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించింది. ఇదీ చదవండి: కేంద్రానికి రాజస్థాన్ సర్కార్ షాక్!.. ఇద్దరు ఈడీ అధికారుల అరెస్టు -
Miryalaguda: ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట.. ఇప్పుడు అనాథగా..
కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు అనాథగా మారిందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌కు అక్కడ నాయకుడు లేకుండా పోయాడని, ఇందుకు కారణం పార్టీ అధినాయకత్వం వైఖరేనని అక్కడి శ్రేణులు కుమిలిపోతున్నాయి. రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. కానీ, గెలిచిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడంతో అక్కడ చాలాకాలం పాటు కేడర్‌ను నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చివరి క్షణంలో బీసీ పేరుతో హైదరాబాద్ నుంచి ఇంకో నాయకుడిని తెచ్చి కేడర్ నెత్తిన పెట్టారు. ఎన్నికలు అయ్యాక ఆయన పత్తా లేడు. ఇక, ఇప్పుడు పార్టీని కాపాడుకుంటూ, కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పొత్తు పేరుతో కామ్రేడ్లు తమ నెత్తిన కూర్చుంటున్నారని అక్కడి కాంగ్రెస్ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. కామ్రేడ్లకు సీట్లు ఇచ్చే విషయంలో ఇతర జిల్లాలకు చెందిన నేతలు తమ ఏరియాలో సీట్లు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటే నల్లగొండ జిల్లాకు చెందిన బడా నాయకులు మాత్రం తమకేమీ పట్టనట్టు మిర్యాలగూడను అనాథగా వదిలేశారని, కనీసం ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయించాల్సిందేనని పట్టుపట్టే నాయకుడే లేకుండా పోయాడని కేడర్ ఆవేదన వ్యక్తం చేసింది. అదే జరిగితే, కామ్రేడ్లతో పొత్తు కుదిరితే మళ్లీ ఐదేళ్ల పాటు తాము అనాథలుగానే మిగిలిపోవాల్సి వస్తుందని నిట్టూరుస్తున్నారు. ఏం చేయగలరు.. ‘ఇండియా’ కూటమి కోసం త్యాగం చేయడం తప్ప...! చదవండి: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత కీలక ప్రసంగం.. మంత్రి అయినా సరే.. రఘునాథపాలెం: సామాన్య వ్యక్తి అయినా, మంత్రి అయినా ఎన్నికల నిబంధనల మేరకు పోలీసులు పక్కాగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచలక గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వాహనాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు సోమవారం తనిఖీ చేశారు. వాహనాల్లో ఉన్న మంత్రి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఇతర ప్రజాప్రతినిధులు పోలీసులకు పూర్తిగా సహకరించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అధికారులు తనిఖీ చేయడం సహజమని, తాను ఎప్పుడైనా సహకరిస్తానని మంత్రి పువ్వాడ అన్నారు. వారం రోజుల క్రితం పుట్టకోట క్రాస్ రోడ్డు వద్ద ఖమ్మం అర్బన్ పోలీసులు, కలెక్టర్ గౌతమ్ వాహనాన్ని సైతం తనిఖీ చేశారు. -
ఒక చారిత్రక ప్రణాళిక
మానవ జాతి చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం – ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ వెలువడటం. ప్రపంచ నడకను ఈ సిద్ధాంతం సమూలంగా మార్చివేసింది. మానవ పురోభివృద్ధికి సరికొత్త దారులు వేసింది. ‘ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ మొట్టమొదటగా వచ్చిన జర్మన్ భాషా ప్రచురణకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న 175 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సిద్ధాంత స్ఫూర్తితోనే రష్యా, చైనా విప్లవాలు మొదలుకొని ఎన్నో ప్రజాస్వామ్య విధానాలు అమలులోకి వచ్చాయి. భారత దేశంలో కూడా నేడు మనం అనుభవిస్తున్న జీవితాలు, అమలు జరుగుతున్న విధానాలు ఎన్నో కమ్యూనిస్టు భావజాల ప్రభావం నుంచి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. దోపిడీ, అణచివేత ఉన్నంత వరకూ కమ్యూనిస్టు ప్రణాళిక సజీవ సిద్ధాంతంగానే ఉంటుంది. ‘‘చెల్లాచెదురుగా ఉండే ప్రజలను, ఉత్పత్తి సాధనాలను, ఆస్తులను బూర్జువా వర్గం నిర్మూలిస్తున్నది. దీని ఫలితంగా రాజకీయ కేంద్రీకరణ ఏర్పడుతున్నది. బూర్జువా వర్గం తన గుత్తాధిపత్యాన్ని పెంచుకుంటున్నది. వివిధ ప్రయోజనాలను కలిగిన ప్రాంతాలను, స్వంత శాసనాలను, ప్రభుత్వాలను, పన్నులను కలిగి ఉన్న రాష్ట్రాలను తన ఆధిపత్యంలో ఒకే శాసనం, ఒకే జాతీయత, ఒకే భూ సరిహద్దు, ఒకే పన్నుల వ్యవస్థను రూపొందించి ఒకే జాతి ముద్దగా చేస్తు న్నది.’’ 1848 ఫిబ్రవరి 24న ప్రకటించిన ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో పేర్కొన్న విషయమిది. అంతర్జాతీయ కార్మిక సమాఖ్య అయిన కమ్యూనిస్టు లీగు సంస్థ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికా రచన బాధ్యతను తమకు అప్పగించిందని ఈ ప్రణాళిక రచయితలు ఫ్రెడరిక్ ఎంగెల్స్, కారల్ మార్క్స్ 1872 నాటి ప్రచురణకు రాసిన ముందుమాటలో పేర్కొన్నారు. మొదట ఈ ప్రణాళిక జర్మన్ భాషలో రాశారు. ఆ తర్వాత రచయిత మిస్ హెలెన్ మెక్ఫర్లేన్ జర్మన్ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించారు (మేనిఫెస్టో ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ). ఇది 1850లో రెడ్ రిపబ్లికన్ పత్రికలో లండన్‌లో అచ్చయ్యింది. 1848 లోనే ఫ్రెంచిలో ఫ్రెంచి విప్లవానికి కొన్ని నెలల ముందు పారిస్‌లో అచ్చ యింది. రష్యా, డేనిష్, పోలిష్ భాషలన్నింటిలోకీ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అనువాదమైంది. మొదటిగా వచ్చిన జర్మన్ ప్రచురణకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న 175 ఏళ్ళు పూర్తయ్యాయి. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ప్రభావం, పరిణామాల గురించి చెప్పాలంటే ఎన్ని పేజీలైనా సరిపోవు. ఇది మానవ జాతి చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టంగా, ప్రపంచ మార్గాన్ని నిర్దేశించిన సిద్ధాంత గ్రంథంగా నిలిచిపోయింది. అప్పటి వరకు ఉన్న ప్రపంచ నడకను ఈ సిద్ధాంతం సమూలంగా మార్చివేసింది. మానవ పురోభి వృద్ధికి సరికొత్త దారులు వేసింది. అది కేవలం విప్లవ పోరాటాల జయకేతనం మాత్రమే కాదు, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక రంగాలను సంపూర్ణంగా మలుపు తిప్పింది. ఈ రచన సాగించే నాటికి కారల్ మార్క్స్ వయసు 29 ఏళ్ళు, ఫ్రెడరిక్ ఎంగెల్స్కు 27 ఏళ్ళు మాత్రమే. ఇద్దరు నవ యువకులుగా ఉన్న సమయంలోనే పెట్టు బడిదారీ వ్యవస్థ పునాదులను పెకిలించే నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేసే అద్భుతమైన సిద్ధాంత గ్రంథాన్ని ప్రపంచానికి అందించారు. కారల్ మార్క్స్ అప్పటికే తొమ్మిదికి పైగా సిద్ధాంత గ్రంథాలను రాశారు. 1841లో ‘ద డిఫరెన్స్ బిట్వీన్ డెమొక్రిటియన్ అండ్ ఎపిక్యురన్ ఫిలాసఫీ ఆఫ్ నేచర్’ పేరుతో మొదలైన మార్క్స్ రచన, పరిశోధనల ప్రయాణం 1848కి వచ్చేసరికి కమ్యూనిస్టు పార్టీ ప్రణా ళికను అందించింది. మార్క్స్ రచనలలో మరొక విశేషమైన రచన ‘దాస్ కాపిటల్’ మొదటిభాగం 1867లో వచ్చింది. మార్క్స్ తన జీవితం అంతా కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచించినట్టు మనకు తెలుస్తున్నది. కమ్యూనిస్టు ప్రణాళిక ఒక రాజకీయ డాక్యుమెంటుగా కనిపించవచ్చు. కానీ అందులో తాత్విక సంవాదం ఎక్కువగా కనిపిస్తుంది. భూస్వామ్య సమాజంపై పెట్టుబడిదారీ విధానం విజయం సాధించి, సమాజంపై తన దుర్మార్గమైన దోపిడీ పంజాను విసురుతున్న తీరును కళ్ళకు కట్టినట్టుగా ఈ ప్రణాళిక చూపిస్తున్నది. దాదాపు డెబ్భై పేజీల రచనలో నాలుగు భాగాలు న్నాయి. మొదటి భాగం: బూర్జువాలు– కార్మికులు. రెండవ భాగం: కార్మికులు – కమ్యూనిస్టులు. మూడవ భాగం: సామ్యవాద – కమ్యూ నిస్టు సాహిత్యం. నాలుగవ భాగంలో వివిధ ప్రతిపక్ష పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఉంటాయి. ఇందులో మొదటి భాగం ముఖ్యమైనది. బూర్జువాలు– కార్మికులు అధ్యాయంలో ఆ రోజున్న సామాజిక స్వరూపాన్ని, పెట్టు బడిదారీ వ్యవస్థ దుర్మార్గాన్ని సంక్షిప్తంగా ప్రపంచం ముందుంచారు. ఈ రోజు మనం చూస్తున్న కార్పొరేట్ వ్యవస్థ దారుణమైన చర్యలను అత్యంత సూక్ష్మంగా వివరించారు. మొదటి పేరాలో పేర్కొన్న అంశం ఈ రోజు మనం చూస్తున్న ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు అద్దం పడుతున్నది. ‘‘ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం బూర్జువా వర్గపు వ్యవహారాలను నిర్వహించే ఒక యంత్రాంగంగా, అంగంగా మారిపోయింది’’ అని పేర్కొన్నారు. ఇటీవల మన దేశపు కార్పొరేట్ కంపెనీలకు ప్రస్తుత ప్రభుత్వం ఒక సబార్డినేట్‌గా పనిచేస్తున్నదన డంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా, ‘‘గతంలో ప్రజల భక్తి, గౌరవాలకు పాత్రమైన వృత్తులన్నింటినీ బూర్జువా వర్గం దిగజార్చింది. వైద్యులు, న్యాయవాదులు, కవులు, శాస్త్రవేత్తలను తన కింద పనిచేసే కూలివాళ్ళుగా మార్చి వేసింది’’ అంటూ చేసిన వ్యాఖ్య మన కళ్ళ ముందు అత్యంత స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది. ‘‘యంత్రాలు విస్తృతంగా ఉపయోగంలోకి రావడం వల్ల కార్మికుల శ్రమలో వ్యక్తిగత ప్రత్యేకత పూర్తిగా అంతరించింది. కార్మికుడికి ప్రాధాన్యత కరువైంది. కార్మికుడు యంత్రానికి తోకగా మారిపోయాడు. అతనికి ఉండవలసింది చాకచక్యం మాత్రమే. గానుగెద్దులాంటి యంత్రంలో తానో యంత్రంగా మారి పోయాడు’’ అంటూ చేసిన వివరణ ఈరోజు అత్యంత వాస్తవ దృశ్యంగా మనకు దర్శనమిస్తోంది. అది కార్మికుడికి కేవలం పొట్టపోసుకోవడానికి కావాల్సిన వసతులను మాత్రమే ఏర్పాటు చేస్తుందనీ, యంత్రాల వాడకమూ, శ్రమ విభజనా పెరిగే కొద్దీ కార్మికుడు తన ఉనికిని కోల్పోతాడనీ కమ్యూనిస్టు ప్రణాళిక ఆనాడే హెచ్చరించింది. దిగువ మధ్య తరగతివాళ్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులు, చేతి పనివాళ్ళు, రైతులు క్రమంగా తమ ఉపాధిని కోల్పోతారనీ, పెట్టుబడిదార్లతో పోటీ పడ లేక దివాళా తీస్తారనీ కూడా కారల్ మార్క్స్, ఎంగెల్స్ ఆనాడే ప్రకటించారు. ఇప్పుడు ఇది మరింత తీవ్రమైంది. దాదాపు అన్ని రంగాల్లో ఒకరిద్దరు పెట్టుబడిదార్లు మాత్రమే తమ గుత్తాధిపత్యాన్ని చలా యిస్తున్నారు. ఇది అప్పటికన్నా ఇప్పుడు మరింతగా అసమానతలను తీవ్రతరం చేస్తున్నది. కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ పరిస్థితులను వివరించి మాత్రమే ఊరుకోలేదు. ఆనాటి బూర్జువా దోపిడీని స్పష్టంగా విశ్లేషించి, దానికి పోరాటాలు మాత్రమే పరిష్కారంగా చూపారు. సంఘర్షణ, పోరాటాలు లేకుండా సమాజం ప్రగతిని సాధించలేదని ప్రకటించారు. ఇందులోనే కార్మికవర్గం నాయకత్వాన్ని ప్రతిపాదించిన వర్గపోరాటాల చరిత్రను ఉదహరించారు. కార్మిక వర్గానికి ఒక సందే శాన్ని కూడా ఈ ప్రణాళికలోనే అందించారు. ‘పోరాడితే పోయేది లేదు, బానిస సంకెళ్ళు తప్ప’, ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ నినాదాలను ప్రపంచానికి ఆయుధాలుగా అందించారు. కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ అందించిన సిద్ధాంత స్ఫూర్తితో ప్రపంచంలో ఎన్నో గొప్ప మార్పులు వచ్చాయి. రష్యా, చైనా విప్లవాలు మొదలుకొని ఎన్నో ప్రజాస్వామ్య విధానాలు అమలులోకి వచ్చాయి. భారత దేశంలో కూడా ఈనాడు మనం అనుభవిస్తున్న జీవితాలు, అమలు జరుగుతున్న విధానాలు ఎన్నో కమ్యూనిస్టు భావజాల ప్రభావం నుంచి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో దోపిడీ, అణచివేత, అసమానత, వివక్షతలు ఉన్నంత వరకూ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక సజీవ సిద్ధాంతంగానే ఉంటుంది. ఇది అక్షర సత్యం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆరాటం.. ఎక్కడి నుంచి పోటీ?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావడంతో ఎర్ర పార్టీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే జిల్లా నుంచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్నది వారి ఆరాటం. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే సీపీఐ, సీపీఎంలు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాయి? ఇదే అదను, దిగాలి బరిలోకి ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా అనేవారు. కాల క్రమంలో అదంతా గత వైభవంగా మిగిలిపోయింది. గతంలో మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి ఎవరో ఒకరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో దేవరకొండలో సీపీఐ తరపున రవీంద్ర కుమార్ గెలిచారు. కానీ ఆయన సొంత పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో కూడా గెలిచి దేవరకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్య నాయకులే కాదు.. రెండు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కేడర్ కూడా చాలావరకు అధికార పార్టీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లా నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు అసెంబ్లీలో అడుగుపెట్టడం కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు అంతా. ఇటువంటి క్లిష్ట సమయంలో వామపక్షాలకు మునుగోడు రూపంలో ఓ వరం లభించి పునర్జన్మ పొందినట్లు అయిందని చెప్పవచ్చు. మిర్యాలగూడ ఎవరికి? దేవరకొండ ఎవరికి? మునుగోడులో అధికార టీఆర్ఎస్కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతుగా నిలిచాయి. బీజేపీని ఓడించే లక్ష్యంతో రెండు పార్టీలు గులాబీకి దన్నుగా ఉన్నాయి. ఇప్పుడిదే వారికి కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి లెఫ్ట్, టీఆర్ఎస్ మధ్య పొత్తగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు గులాబీ పార్టీతో పొత్తుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. అదే జరిగితే జిల్లాలో రెండు పార్టీలు ఒక్కో స్థానాన్ని తమకు కేటాయించాలని అడగనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం మిర్యాలగూడ స్థానాన్ని, సీపీఐ మునుగోడు లేదా దేవరకొండ స్థానంలో ఒకదాన్ని తమకు కేటాయించాలని కోరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీపీఐ మునుగోడు కంటే దేవరకొండ సీటుపైనే మక్కువగా ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ నుంచి గెలిచి మోసం చేసి పార్టీ మారిన రవీంద్ర కుమార్‌ను దెబ్బ తీయాలని సీపీఐ నాయకత్వం భావిస్తోంది. అయితే జిల్లాలో సీపీఐకి అంతో ఇంతో కేడర్ ఉన్న నియోజకవర్గం అదే కావడం మరో కారణం. ఒకవేళ దేవరకొండలో అవకాశం రాకపోతే మునుగోడు సీటునే కోరనుంది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆ పార్టీ ఐదు సార్లు గెలవడం పార్టీ కేడర్ ఇంకా మిగిలే ఉండటంతో మునుగోడును ఇవ్వాలని బలంగా కోరే అవకాశం కనిపిస్తోంది. చదవండి: ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.? జూలకంటి రెఢీ ఇక సీపీఎం కూడా నల్గొండ జిల్లాలో ఒక సీటు కోరుదామనే ఆలోచనలో ఉందని సమాచారం. మిర్యాలగూడ సీటు తీసుకుని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో సీపీఎం ఉందని టాక్. ఇప్పటికీ అక్కడ ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఎలాగూ అక్కడి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనాలతో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి అక్కడ సిట్టింగ్‌కు సీటు ఇస్తే అధికార పార్టీకి చేతులు కాలే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో గులాబీ పార్టీ నాయకత్వం కూడా మిర్యాలగూడ సీటును సీపీఐఎం పార్టీకి కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓ సభలో తనకు టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. అంటే ఆయనకు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉనికే ప్రశ్నార్థకమైన తరుణంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు రూపంలో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. ఈ బంధం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే ఉబయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. -
తండ్రిబాటలో నడిచి..చరిత్ర సృష్టించి.. జిన్‌పింగ్ ప్రస్థానమిదే..
చైనా అధినేత షీ జిన్‌పింగ్ 1953 జూన్ 15న శాన్‌షీ ప్రావిన్స్‌లో జన్మించారు. ఆయన తండ్రి షీ షీ ఝాంగ్‌షువాన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా, చైనా ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. జిన్‌పింగ్ బాల్యం ఎక్కువగా యావోడాంగ్ అనే పల్లెటూరిలో గడిచింది. తండ్రి ఆదేశాల మేరకు సాంస్కృతిక విప్లవ సమయంలో రైతులతో కలిసి సాధారణ జీవితం గడిపారు. వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నారు. ప్రాథమిక విద్య అనంతరం సింగువా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. 1974లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యుడిగా చేరారు. పార్టీ శాఖ కార్యదర్శిగా రాజకీయ జీవితం ఆరంభించారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. 1979లో కే లింగ్లింగ్‌ను వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా కొద్ది కాలానికే ఆమె నుంచి విడిపోయారు. 1987లో ప్రముఖ జానపద గాయని పెంగ్ లియువాన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె షీ మింగ్జే ఉన్నారు. ఆమె అమెరికాలో చదువుకుంటున్నారు. జిన్‌పింగ్ 1999 నుంచి 2002 దాకా ఫుజియాన్ గవర్నర్‌గా, 2002 నుంమచి 2007 దాకా ఝెజియాంగ్ గవర్నర్‌గా వ్యవహరించారు. 2007లో కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ)లో చేరారు. 2008 నుంచి 2013 దాకా చైనా ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. తొలిసారిగా 2012లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శిగా, 2013లో చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పొగడ్తలు, తెగడ్తలు... 1949 అక్టోబర్ 1న పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భవించింది. ఆ తర్వాత జన్మించిన తొలి సీపీసీ ప్రధాన కార్యదర్శి జిన్‌పింగే. పార్టీలో ఎన్నో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. క్రమశిక్షణకు, అంతర్గతంగా ఐక్యతకు పెద్దపీట వేశారు. అవినీతిపై ఉక్కుపాదం మోపారు. సొంత పార్టీ మాజీ నేతలకు కూడా శిక్షలు విధించారు. ఇది చైనాలో ప్రశంసలందుకుంది. కానీ ఆయన విదేశాంగ విధానంపై భిన్న స్వరాలు వినిపించాయి. పదేళ్ల జిన్‌పింగ్ పాలనలో అమెరికాతో చైనా సంబంధాలు క్షీణించాయి. భారత్‌తో సరిహద్దు వివాదాలు పెచ్చరిల్లాయి. తైవాన్ విషయంలో జిన్‌పింగ్ దూకుడు విమర్శలపాలవుతోంది. హాంకాంగ్‌లో నేషనల్ సెక్యూరిటీ చట్టం విషయంలోనూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కరోనా పుట్టుకకు చైనాయే కారణమన్న నిందను మోయాల్సి వచ్చింది. జీరో–కోవిడ్ పాలసీ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందన్న వాదనలున్నాయి. జిన్‌పింగ్ తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. ఫలితంగా చైనా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఎదిగింది. -
చైనా కొత్త పొలిట్‌బ్యూరోలో మహిళలే లేరు
బీజింగ్: ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదల చేసిన కొత్త పొలిట్ బ్యూరోలో ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేదు. 25 ఏళ్లలో చైనా కమ్యునిస్ట్ పార్టీలో ఇలా జరగడం తొలిసారి. మునుపటి పొలిట్‌బ్యూరోలో కూర్చున్న ఏకైక మహిళ సన్ చున్లాన్ పదవీ విరమణ చేశారు. తదనంతరం ఇంతవరకు ఏ ఇతర మహిళలను నియమించ లేదు. జిన్‌పింగ్ ఏడుగురు సభ్యుల పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీని నలుగురు మిత్ర దేశాలతో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇద్దరు మాజీ కార్యదర్శులు ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్న లీ కియాంగ్ కొత్త ప్రీమియర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ మేరకు సింగపూర్ నేషనల్ యూనవర్సిటీలో చైనీస్ రాజకీయ నిపుణుడు ఆల్పెడ్ ములువాన్ మాట్లాడుతూ...చైనా ప్రజలే ఆయనను మూడోవసారి పాలించాలని కోరుకున్నారని చెప్పారు. అంతేగాదు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ దశాబ్దానికి రెండు సార్లు పగ్గాలు చేపట్టిన పాలనను ముగించిన కొద్దిసేపటికే నాయకత్వ పునర్వ్యవస్థీకరణ జరగడం విశేషం. (చదవండి: ‘ప్రపంచానికి చైనా అవసరం’.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ వ్యాఖ్యలు) -
అసమానతలు రూపుమాపడమే అజెండా
‘ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’... ప్రపంచంలోని ఏ మూలనైనా సరే ఈ పేరు వినగానే ఆశ్చర్యం, కోపం, జాగరూకత వంటి అనేక భావాలు వ్యక్తమవుతాయి. అంతేకాదు.. పెత్తందారీ పోకడలు, అప్రజాస్వామిక, అణచివేత ధోరణులు, దురహంకార పూరిత దేశంగా కొందరికీ... భారీ ప్రాజెక్టులు, విశాలమైన రహ దారులతో అభివృద్ధికి వేగంగా బాటలు వేసుకున్న దేశంగా ఇంకొందరికీ గుర్తుంటుంది. విషయం ఏమిటంటే.. ఈ ఆలోచన లన్నింటి వెనుక ఉన్న శక్తి.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ). అక్టోబరు 16వ తేదీ నుంచి తన ఇరవయ్యవ జాతీయ కాంగ్రెస్ సమావేశాలను ఇది నిర్వహించుకుంటోంది. ఈ సమావేశాల తరువాత షీ జిన్‌పింగ్ అనూహ్యంగా... మూడోసారి పార్టీ జనరల్ సెక్రటరీగా ఎంపిక కానున్నారు. పాలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఇంకో ఆరుగురి ఎంపిక కూడా ఈ సమావేశాల్లోనే జరుగుతుంది. చైనాలో నాయకత్వ మార్పును సూచించే రెండు సమావేశాల్లో ఇది ప్రధానమైంది. వచ్చే ఏడాది మార్చిలో చైనా ప్రభుత్వ నాయకత్వం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌నూ మార్చేయనుంది. బహుశా ఆ తరు వాతి కాలంలో దేశానికి ఒక కొత్త ప్రీమియర్ నియామకం జరిగే అవకాశం ఉంది. చిట్టచివరిగా పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు చోటు చేసు కున్నది 2017 మధ్యకాలంలో! అప్పటికీ, ఇప్పటికీ చైనాలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలో ఒక బలీయమైన శక్తిగా ఎదగాలన్న దాని ఆకాంక్ష వ్యక్తీకరణకూ వేదిక ఈ సమావేశాలే. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు ఈ సమావేశాలు నాయకత్వ మార్పిడి జరిగే వేదిక గానే కాకుండా... గత సమావేశాల నుంచి సాధించిన ప్రగతిని సమీక్షించేందుకూ, రానున్న ఐదేళ్లలో చేపట్టాల్సిన అంశాలపై ప్రణాళిక రచనకూ కేంద్రం. ఇదంతా జనరల్ సెక్రటరీ సమర్పించే నివేదిక ద్వారా వ్యక్తమవుతుంది. 2017లో షీ జిన్ పింగ్ సుమారు మూడున్నర గంటలపాటు ఏకధాటిగా ప్రసం గించి ‘కలల చైనా’ అన్న ఇతివృత్తంపై మాట్లాడారు. ఈసారి అటువంటి అద్భుత ప్రసంగమే జరగవచ్చు. షీ జిన్‌పింగ్ పార్టీ జనరల్ సెక్రటరీగా మూడోసారి ఎంపిక కావడం ఇప్పుడు లాంఛనమే. 2012లో జిన్‌పింగ్ అధికారం చేపట్టినప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉండేది. గృహనిర్మాణం వంటి రంగాల్లో లోటుపాట్లేవీ పైకి కనిపించేవి కూడా కాదు. గృహ వినియోగం క్రమేపీ పెరుగుతూండేది. ఎగు మతులు లక్ష్యంగా పెట్టుబడులూ వస్తూండేవి. అంతేకాదు... స్థానికంగా వ్యాపారం చేసుకునే వాతావరణమూ ఇప్పటిలా కాకుండా... చాలా సానుకూలంగా ఉండేది. మైనార్టీల అణచివేత వంటి చైనా అరాచకాల గురించి అప్పట్లోనూ అందరికీ తెలుసు కానీ అదింకా సామూహిక కారాగారాలు ఏర్పాటు చేసే స్థాయికి చేరలేదు. హాంకాంగ్‌తో సంబంధాలూ ఒడుదొడుకుల్లేకుండానే సాగేవి కానీ ‘నేషనల్ సెక్యూరిటీ లా’ పేరుతో ఇప్పుడు ఆ పరి స్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో చైనాను ఓ ప్రత్యర్థి/పోటీదారుగానే చూశారు కానీ విధ్వంసం సృష్టించే దేశంగా చూడలేదు. ఇరుగు పొరుగుతో చైనా సంబంధాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. కోవిడ్–19 కట్టడిలో విఫలమైన తరువాత, ఉక్రె యిన్‌పై రష్యా దాడులకు మద్దతు తరువాత చైనాను బాధ్యతాయుతమైన దేశంగా పరిగణించడమూ తగ్గింది. తైవాన్ సరిహద్దులపై క్షిపణులు ప్రయో గించడం, అది కూడా అమెరికా స్పీకర్ అక్కడకు వెళ్లి తిరిగి వచ్చిన వెంటనే జరగడం ప్రపంచం దృష్టిని దాటలేదు. అందుకేనేమో... చైనా ఓ నిరపాయకరమైన దేశం కాదన్న భావనపై అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల్లోనూ ఏకాభిప్రాయం ఏర్పడుతోంది. ఇవన్నీ ఒకవైపున సాగుతూండగానే జిన్‌పింగ్ చైనాలో కమ్యూనిస్టు పార్టీని అన్నింటికీ కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. పార్టీ, ప్రభుత్వం మధ్య ఘర్షణ; అపోహల వంటివాటికి స్థానం లేకుండా దేశంలోని అన్ని రకాల సంస్థలకూ డీఫ్యాక్టో ఛైర్మన్‌గా మారిపోయాడు. అందుకే షీ జిన్‌పింగ్‌ను ‘ఛైర్మన్ ఆఫ్ ఎవ్రీథింగ్’ అని కూడా పిలుస్తూ ఉంటారు. పార్టీ అంతర్గత రాజకీయాల్లోనూ నాయకత్వానికి పోటీని పూర్తిగా తొలగించారు షీ జిన్‌పింగ్. నాయకత్వానికి పోటీ కాస్తా వర్గపోరుగా మారిపోతూండటం... పుకార్లు ప్రచారంలో పెట్టడం ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీసే ప్రయత్నం జరుగు తూండటం వంటివన్నీ తగ్గిపోయాయి. సవాలు విసిరిన స్థానిక అవినీతిని కూడా జిన్‌పింగ్ దీటుగానే ఎదుర్కొన్నాడు. అవినీతి నిర్మూలన ప్రయత్నాలు కాస్తా రాజకీయ ప్రక్షాళనకూ దారి తీశాయి. కానీ ఈ ప్రస్థానంలో ఉమ్మడి నాయకత్వమన్న ఆలోచనకు ఫుల్స్టాప్ పడింది కూడా. జిన్‌పింగ్‌కు అన్ని విధాలుగా మద్దతు లభించేందుకు వీలుగా దాదాపు 30 ఏళ్ల తరువాత ‘మూల నేత’ అన్న భావనను ముందుకు తెచ్చారు. జిన్‌పింగ్ సాధించిన అనేకానేక ఘనతల్లో చైనీస్ మిలటరీ ప్రక్షాళన కూడా ఒకటి. లంచాలకు మరిగారన్న ఆరోపణపై ఉన్నత స్థానంలో ఉన్న పలువురు అధికారులను కటకటాల వెనక్కు తోసేశారు. అదే సమయంలో మానవ హక్కులపై పోరాడుతున్న అనేకమంది న్యాయవాదులనూ అరెస్ట్ చేయడం, ఫెమినిస్టు వర్గాలపై కూడా ఉక్కుపాదం మోపడం, విదేశీ భావజాలం వ్యాపించకుండా అణచివేయడం కోసం యూనివర్సిటీ తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటివి ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు గురైన చర్యలు. ప్రపంచంలో చాలా దేశాల మాదిరిగానే చైనా కూడా బలీయమైన శక్తిగా ఎదగాలని కోరుకుంటోంది. అయితే వాణిజ్య యుద్ధాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి సవాళ్లు బయటి నుంచి ఎదురవుతున్నాయి. అయితే చైనా తన అధికారాన్ని విస్తరించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సవాళ్లూ లేక పోలేదు. స్థానికంగా ఆర్థిక వ్యవస్థ మందగించడం, వినియో గమూ తగ్గిపోతూండటం వాటిల్లో కొన్ని మాత్రమే. ఏంట్ గ్రూప్ పబ్లిక్ ఇష్యూపై చెలరేగిన వివాదం వ్యాపారం చేసుకునే వాతావరణంపై సందేహాలు లేవనెత్తింది. పైగా కోవిడ్ కట్టడికి చేపట్టిన అనేక చర్యలు చైనాలో సాధారణ పరిస్థితులు నెల కొంటాయన్న ఆలోచనలపై చన్నీళ్లు చల్లాయి. చైనీయుల్లోనూ నిరాశా నిస్పృహలనూ, కోపాన్నీ పెంచాయి. సుమారు రెండు వేల మంది పార్టీ ప్రతినిధులు పైన పేర్కొన్న అనేక అంశాలపై పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్లడం, భవిష్యత్తు ప్రణాళికను ఆమోదించడం వంటి కార్యక్రమాలు చేపట్టడానికి బీజింగ్‌లో సమావేశమవుతున్నారు. చైనాలోని అసమానతలను రూపుమాపడానికి అవసరమైన సామూహిక వృద్ధి అన్న పార్టీ కేంద్ర భావన ఈ చర్చల్లో ప్రధాన భూమిక పోషించనుంది. స్థానికంగా వినియోగాన్ని పెంచడం, కొత్త కొత్త ఆవిష్కరణలు, స్థానికంగా పోటీతత్వాన్ని మరింత పెంచడం ద్వారా అసమానతలను తగ్గించాలని చైనా యోచి స్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి సమావేశాల తరువాత చైనా ప్రపంచం దృష్టిలో తన ఇమేజ్ను మార్చు కునేందుకు ప్రయత్నిస్తుందన్న అంచనాలున్నాయి. ఏం జరుగనుందో వచ్చే వారం రోజుల్లో బహిర్గతమవుతుంది. అవినాశ్ గోడ్బోలే , వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, ఓపీజేజీయూ (‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
ఆట నిర్ణయమైపోయింది!
నేటి నుంచి జరగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ కాంగ్రెస్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారాన్ని మరింతగా స్థిరపర్చే దిశగా పయనిస్తుందని అంచనా. పార్టీలోని ఇతర కీలక నాయకులు పదవుల నుంచి తప్పుకుంటున్నప్పటికీ జనరల్ సెక్రటరీ స్థానానికి ఢోకా లేదన్నది స్పష్టం. పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్న కొన్ని వందలమందికి ఇప్పటికే పార్టీ కాంగ్రెస్‌లో జరిగే ఫలితం గురించి తెలుసు. అనుకోనిది జరిగితే తప్ప పార్టీ కాంగ్రెస్‌లో ఆడబోయే ఆట ఇప్పటికే నిర్ణయమైపోయింది. అయితే మూడోసారి పార్టీ జనరల్ సెక్రటరీ కాబోతున్న జిన్‌పింగ్‌కు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు సవాలు విసరనున్నాయి. అసమానతలను రూపుమాపడానికి అవసరమైన సామూహిక వృద్ధి అన్న పార్టీ కేంద్ర భావన ఈ చర్చల్లో ప్రధాన భూమిక పోషించనుంది. స్థానికంగా వినియోగాన్ని పెంచడం, కొత్త ఆవిష్కరణలు, స్థానికంగా పోటీతత్వాన్ని పెంచడం ద్వారా అసమానతలను తగ్గించాలని చైనా యోచిస్తోంది. ముఖ్యంగా చైనా ప్రపంచం దృష్టిలో తన ఇమేజ్ను మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందన్న అంచనాలున్నాయి. అధ్యక్షుడి స్థానం సుస్థిరం చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) 20వ జాతీయ కాంగ్రెస్ నేడు బీజింగ్‌లో ప్రారంభం కానుంది. ప్రతి అయిదేళ్ల కోసారి జరిగే ఈ సమావేశం రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమా వేశంలో ప్రకటనలు, తీర్మానాలు, తదనుగుణంగా కొత్త స్టాండింగ్ కమిటీ ఎన్నిక, 25 మంది వ్యక్తుల పోలిట్ బ్యూరోలో కొద్ది మంది ముఖ్య నాయ కుల బృందం ఏర్పాటవుతాయి. సాంప్రదాయికంగా, సీసీపీ జనరల్ సెక్రటరీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, చైనా ప్రధాని లీ కికియాంగ్‌తో సహా అత్యున్నత నాయకత్వం మార్పునకు పార్టీ కాంగ్రెస్ వేదికగా ఉండాలి. అయితే జిన్‌పింగ్ పాలన సాధారణం కంటే ఎక్కువే అని చెప్పాలి. 2017లో జరిగిన 19వ కాంగ్రెస్ తదుపరి తరం దేశ నేత గురించి బయటపెట్టలేదు. కానీ ఆ మరుసటి సంవత్స రమే జిన్‌పింగ్ నిబంధనలు మార్చివేసి జీవితకాల పాలకుడిగా తనను తాను నియమించుకున్నారు. అదే సమయంలో రాజ కీయ ప్రక్షాళన ద్వారా తన ప్రత్యర్థులను దారిలోకి తెచ్చు కున్నారు. పార్టీ అధినేత కంటే ప్రధానికి అధికారాలు తక్కువ కాబట్టి ఈ కాంగ్రెస్‌లో లీ పదవికి గ్రహణం పట్టడం తప్పదని భావిస్తున్నారు. చైనాలో పార్టీ కాంగ్రెస్ జరుగుతున్న సమయం కూడా చైనా రాజకీయ గతానికి చెందిన అస్థిరతను గుర్తు చేస్తుంది. తొలి పార్టీ కాంగ్రెస్ దాదాపు నూరేళ్ల క్రితం జరిగింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకుండా విప్లవో ద్యమ పార్టీగా ఉన్నప్పుడు అది జరిగింది. అయితే ప్రతి అయిదేళ్లకు ఒకసారి కాంగ్రెస్‌ని నిర్వహించడం అనేది 1977 నుంచి మాత్రమే జరుగుతూ వస్తోంది. మావో అనంతర అధికారిక వ్యవస్థను నెలకొల్పాలి అని పార్టీ అప్పటినుంచే ప్రయత్నించింది మరి. చైనా మరింతగా నిరంకుశాధికారంపై ఆధారపడుతుందని సంకేతాలు వెలువరిస్తూ, వ్యవస్థీకృత నాయకత్వ వారసత్వం అమల్లోకి వచ్చింది. ఈ నిరంకుశాధికార వ్యవస్థతోనే ప్రపంచం వ్యవహారాలు నడపాలి. శక్తిమంతమైన పార్టీ చీఫ్ కొంతమేరకు సమానులలో ప్రథముడు అని భావించడమే దీనివెనుక ఉన్న భావం. ఆ విధంగా తక్కిన నాయకత్వంతో పాటు, రిటైరైన నాయకులు చైనాలో కొత్త మావో ఆవిర్భవించకుండా నిరోధి స్తారని అందరూ భావించారు. అయితే జిన్‌పింగ్ ఎదుగుదల ఈ ఆలోచనలను తోసిపుచ్చింది. చైనా కమ్యూనిస్టు పార్టీ ఇన్చార్జ్ ఎవరు అనే ప్రశ్నే ఇప్పుడు తలెత్తదు. 20వ కాంగ్రెస్ తర్వాత నాయకత్వ మార్పు జరగకపోవచ్చు. ఇప్పటికైతే, చైనా శాశ్వత నాయకుడు జిన్‌పింగ్ అనే చెప్పాలి. పార్టీ కాంగ్రెస్ జరగడానికి ముందే పార్టీలో అంతర్గత అధి కార పోరాటాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అనే ఈవెంటు... చక్కగా చిత్రీకరించిన డ్యాన్స్ అన్నమాట. అనుకోనిది జరిగితే తప్ప పార్టీ కాంగ్రెస్‌లో ఆడబోయే ఆట ఇప్పటికే నిర్ణయమై పోయింది. నెలలు, బహుశా సంవత్సరాలుగా తెరవెనుక సాగుతూ వచ్చిన అనుకూల ప్రచారం, హెచ్చరికలు, అవినీతి ఆరోపణలు, ఆకర్షించడం, బలవంతపెట్టడం, తారుమారు చేయడం వంటివి ఫలితాన్ని ఇప్పటికే నిర్దేశించాయి. కమ్యూ నిస్టు పార్టీ లోపల జరిగే వ్యవహారాలు జిన్‌పింగ్ నేతృత్వంలో మరింత పారదర్శకం కాకుండా పోయాయి. పార్టీలో అత్యు న్నత స్థానాల్లో ఉన్న కొన్ని వందలమందికి ఇప్పటికే పార్టీ కాంగ్రెస్‌లో జరిగే ఫలితం గురించి తెలుసు. ఈ దఫా కాంగ్రెస్‌లో ప్రకటించబోయేది ఏమిటంటే పార్టీ గమ్యానికి మార్గనిర్దేశం చేయడం, జిన్‌పింగ్ అధికారాన్ని మరోసారి పొడిగించడం మాత్రమే. ఈ సంవత్సరం పార్టీ కాంగ్రెస్‌కు మూడువేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. సత్ప్రవర్తన, ప్రస్తుత నాయ కులకు సన్నిహితంగా ఉండటం, సంకేత చర్య వంటి రివార్డుల ద్వారా పార్టీలోని వివిధ శ్రేణుల నుంచి ప్రతినిధులను ఎన్ను కుంటారు. పార్టీ కాంగ్రెస్‌లో కొంతమంది ప్రతినిధులు ఎలాంటి సమస్యలూ సృష్టించకుండా జిన్‌పింగ్ అధ్యక్షతలోని ఒక చిన్న కమిటీ ప్రతినిధుల తుది జాబితాను ఆమోదిస్తుంది. పార్టీలో ముందుగానే తీసుకున్న నిర్ణయాలను నామమాత్రపు చర్చతో ప్రతినిధులు ఆమోదిస్తారు. పార్టీ కాంగ్రెస్ ప్రధాన పని 200 మంది కేంద్ర కమిటీ సభ్యుల కొత్త జాబితాను, 170 మంది ప్రత్యామ్నాయ సభ్యుల జాబితాను ఆమోదించడమే. కొత్తగా ఎంపికయ్యే 200 మంది కేంద్రకమిటీ సభ్యులు పాలిట్ బ్యూరోలోని 25 మంది సభ్యులను ఎన్నుకుంటారు. తర్వాత పాలిట్ బ్యూరో పార్టీకి చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులను నిర్ణయిస్తుంది. పార్టీ కాంగ్రెస్‌లో అనేక అంశాలపై అధ్యయనాలు జరుగు తుంటాయి. ప్రత్యేకించి పనికి సంబంధించిన నివేదికలు చైనా రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితిని సంగ్రహంగా సమీక్షిస్తుం టాయి. ఈ నివేదికలను నాయకత్వమే పార్టీ కాంగ్రెస్‌కి సమర్పిస్తుంది. తైవాన్ పట్ల కఠిన పదజాలంలో వ్యాఖ్యలుం టాయి. చైనాలో ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన సంకే తాలు కూడా వాటిలో ఉంటాయి. అయితే ప్రధాన సమస్య ఏమిటంటే, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎవరై ఉంటారని తెలుసుకోవడమే. స్టాండింగ్ కమిటీ సభ్యుల అనధికారిక పదవీ విరమణ వయస్సు 68 సంవత్స రాలు. కానీ విధేయులు, కీలకమైన నేతలు మరింతకాలం పదవుల్లో కొనసాగుతారు. అయితే జిన్‌పింగ్‌తో కలిసి చాలా కాలం పనిచేసిన వారికి కొన్ని పదవులు కట్టబెట్టనున్నట్లు కనిపిస్తోంది. వీరిలో చెన్ మినెర్ ఒకరు. జిన్‌పింగ్ వారసుడు ఆయనే అని చెబుతుంటారు. మరొకరు డింగ్ జూకియంగ్. జిన్ పింగ్ విధేయులు ఎంతమంది ఎక్కువగా ఉంటే ఆయన అంత బలంగా కనిపిస్తారు. ఈ కాంగ్రెస్‌లో కూడా ఆయన విధేయు లతో కూడిన స్టాండింగ్ కమిటీనే ఉంటుందని ఊహించవచ్చు. అయితే ప్రస్తుతం చైనాను వెంటాడుతున్న ఆర్థిక అస్థిరత వల్ల అధ్యక్షుడిపై పార్టీ కాంగ్రెస్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ విమర్శలే రావచ్చు. కాబట్టి సైద్ధాంతిక అవసరాలను దాటి ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే వారికి జిన్‌పింగ్ కాస్త ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అంటే మరింతగా మార్కెట్‌కు ప్రాధాన్యమిచ్చే వాంగ్ యాంగ్ వంటి ఆర్థిక వేత్తలకూ, లియు హె వంటి హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న దౌత్యవేత్త లకూ అగ్రస్థానం లభించవచ్చు. చైనా రాజకీయ నాయకత్వంలో జిన్‌పింగ్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా సైద్ధాంతికంగా కానీ, దమ్ము ఉన్న వారుకానీ నిల బడే వారులేరు. మరొక కీలక సమస్య ప్రధానమంత్రి పదవి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న లి కెకియాంగ్ తప్పుకోవచ్చని స్పష్టమవుతోంది. జిన్ పింగ్ దీర్ఘకాలిక సహచరుడు, షాంఘై పార్టీ చీఫ్ లి క్వియాంగ్ కొత్త ప్రధాని కావచ్చను కుంటున్నారు. అయితే ఈ ఏడాది షాంఘై లాక్డౌన్ కలిగించిన విధ్వంసం కారణంగా ఈయనకు కీలక పదవి లభిస్తుందంటే సందేహాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా, పార్టీపై జిన్ పింగ్ పట్టు సడలక పోతే తప్పకుండా లి క్వియాంగ్‌నే ఆయన ప్రధానిగా ఎంచు కోవచ్చు. మొత్తం మీద చైనా పార్టీ కాంగ్రెస్ జిన్ పింగ్ అధి కారాన్ని మరింతగా స్థిరపరిచే దిశగానే కొనసాగవచ్చు. జేమ్స్ పామర్ వ్యాసకర్త పాత్రికేయుడు, కాలమిస్ట్ (‘ఫారిన్ పాలసీ’ సౌజన్యంతో) -
జిన్‌పింగ్ పట్టాభిషేకం
తలపెట్టినవేవీ కొనసాగక విఫలుడై సెలవంటూ వెళ్లిపోవాల్సిన చైనా అధినేత జిన్‌పింగ్ సంప్రదాయానికి భిన్నంగా వరసగా మూడోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కాబోతున్నారు. వారంపాటు జరిగే పార్టీ కాంగ్రెస్ సమావేశాలు ఆదివారం ప్రారంభమవుతాయి. వచ్చే మార్చిలో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్పీసీ) సమావేశాలు దేశానికి కొత్త ప్రధానిని ఎన్నుకున్నా, దేశాధ్యక్షుడిగా మాత్రం జిన్‌పింగే కొనసాగుతారు. అయిదేళ్లకోసారి నిర్వహించే పార్టీ మహాసభలో జరిగే సిద్ధాంత చర్చలూ, తీసుకునే నిర్ణయాలూ లాంఛనప్రాయమైనవే. అన్నీ ముందే ఖరారవు తాయి. పార్టీ కాంగ్రెస్ చేయాల్సిందల్లా వాటికి ఆమోదముద్రేయడమే. మావో తిరుగులేని అధి నేతగా, యావజ్జీవ అధ్యక్షుడిగా దీర్ఘకాలం కొనసాగడం వల్ల దేశం నష్టపోయిందని భావించిన డెంగ్ ఆ ఒరవడికి స్వస్తి పలికారు. ఎవరైనా రెండు దఫాలు మాత్రమే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండేలా నియమావళి మారింది. జిన్‌పింగ్ 2018లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో దీన్ని తిరగ దోడగలిగారు. సమష్టి నాయకత్వాన్ని ప్రవచించే కమ్యూనిస్టు పార్టీల్లో క్రమేపీ ఏకవ్యక్తి ప్రాబల్యం పెరగడం అసాధారణమేమీ కాదు. అందుకు చైనా భిన్నంగా ఉండకపోవటంలో ఆశ్చర్యం లేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా 2012లో పగ్గాలు చేపట్టినప్పుడు సామాజిక, ఆర్థిక రంగాల్లో 60 సంస్కరణలు తీసుకొస్తున్నట్టు జిన్‌పింగ్ ప్రకటించారు. వాటి వర్తమాన స్థితిగతులెలా ఉన్నాయో గమనిస్తే మూడోసారి ఆయన్ను నెత్తిన పెట్టుకోవాల్సినంత అగత్యం కనబడదు. ఎందుకంటే ఎగు మతి ఆధారిత ఆర్థిక వ్యవస్థను దేశీయ వినియోగ ఆధారితం చేస్తానన్నది జిన్‌పింగ్ ప్రధాన వాగ్దానం. అదికాస్తా ఎటోపోయింది. ఆర్థిక రంగంలో ఇకపై ‘మార్కెట్ శక్తులకు’ మరింత ప్రాధాన్యతనిస్తామనీ, వనరుల పంపిణీలోనూ వాటికే అగ్రతాంబూలమిస్తామనీ చెప్పినా జరిగింది అందుకు విరుద్ధం. వాస్తవానికి ప్రైవేటు రంగాన్ని మరింత బిగించారు. చైనా బహుళజాతి ఈ– కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా యున్ ఇందుకు తిరుగులేని ఉదాహరణ. అలీబాబా ఒక దశలో అమెజాన్‌కు దీటుగా కనబడింది. అంతర్జాతీయ వ్యాపార యవనికపై జాక్ తళుకులీనారు. కానీ రుణాలివ్వడంలో చైనా బ్యాంకులనుసరించే ఛాందస ధోరణులను 2020లో నిశితంగా విమర్శించిన కొన్నాళ్లకే ఆయన కథ ముగిసిపోయింది. జాక్ మా ఆ సంస్థ చైర్మన్‌గా తçప్పుకొని ప్రస్తుతం సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. డెంగ్ ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని జిన్‌పింగ్ తొలిసారి అధినేత అయ్యేనాటికి చైనా ఆర్థికంగా మెరుగ్గానే ఉంది. కానీ అది ముందుకు కదలడం లేదు. 7.5 శాతం వృద్ధిరేటు సాధించా లన్న తపన తీరని కలగా మిగిలిపోయింది. ఆర్థిక రంగానికి పెను ఊతం ఇస్తేనే అది పట్టాలెక్కు తుందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడింది. అందుకే అప్పట్లో సంస్కరణలపై జిన్‌పింగ్ ఊరిం చారు. కానీ ఆ పనిచేస్తే చివరకు ఎటు దారితీస్తుందోనన్న భయాందోళనలు నాయకత్వాన్ని వదలడం లేదని వర్తమాన చైనా తీరుతెన్నులు చూస్తే అర్ధమవుతుంది. ధనిక, బీద తారతమ్యాలు సరేగానీ... ఆదాయం తగినంతగా ఉన్నవారు కూడా పొదుపు వైపే మొగ్గుతున్నారు. వేరే సంపన్న దేశాల్లో పౌరుల పొదుపు మొత్తం జీడీపీలో గరిష్ఠంగా 33 శాతం ఉండగా, చైనాలో అది 45 శాతం దాటింది. ప్రభుత్వపరంగా సామాజిక భద్రత పథకాలు లేకపోవడం... అనుకోని విపత్తు వస్తే, అవసరాలు ఏర్పడితే ఆసరా దొరకదన్న ఆందోళన అందుకు కారణం. తగినంత వినియోగం లేక పోతే సరుకంతా ఏం కావాలి? వాటిని ఉత్పత్తి చేసిన ఫ్యాక్టరీలు ఏం కావాలి? అనుత్పాదక రుణాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈమధ్యకాలంలో అవినీతి కూడా మితిమీరిందని తరచు వెలువడే కథనాలు వెల్లడిస్తున్నాయి. అధికారానికి వచ్చినప్పుడు అవినీతిని చీల్చిచెండాడతానని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. ఆ పేరుమీద తన వ్యతిరేకులను అదుపు చేయటం మినహా ఆయన పెద్దగా సాధిం చిందేమీ కనబడదు. ఇక కోవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ల వినియోగంకన్నా లాక్డౌన్లపైనే ఎక్కు వగా ఆధారపడుతున్న దేశం చైనా. భారీ వ్యయాన్ని తప్పించుకోవడానికి లాక్డౌన్లు అమలు చేస్తున్నా ఇది ఉత్పాదకతను తీవ్రంగా దెబ్బతీసింది. ఒకపక్క బీజింగ్‌లో పార్టీ కాంగ్రెస్ మొదలు కాబోతుండగా పారిశ్రామిక నగరం షాంఘైలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంక్షలూ మొదలవుతున్నాయి. ఇది చివరకు లాక్‌డౌన్‌కు దారితీస్తుందేమోనన్న భయం పౌరుల్లో పెరిగింది. తాను విధించుకున్న పరిమితుల్లోనే 140 కోట్ల జనాభాగల చైనాలో సామాజిక సంక్లిష్టతలను అధిగమించడం ఎలా అన్న సంశయం జిన్‌పింగ్‌కు ఉన్నట్టే, దూకుడు ప్రదర్శిస్తున్న చైనాను నియంత్రించడమెలా అన్న చింత పాశ్చాత్య దేశాలకు పట్టుకుంది. ఇండో–పసిఫిక్ కూటమితో దాన్ని దారికి తీసుకురావటంతోపాటు కీలకమైన చిప్ తయారీ సాఫ్ట్వేర్ దానికి దక్కకుండా అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది మరో కొత్త పోటీకి దారితీయబోతోంది. గడిచిన సంవత్సరాల్లో చైనా వైఫల్యాలకు, అది ఆశించినంతగా ఎదగకపోవడానికి కారణాలేమిటో జిన్‌పింగ్ తన నివేదికలో వెల్లడిస్తారు. అయితే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఏకవ్యక్తిస్వామ్యమే ఇందుకు కారణమని చెప్పేటంత ప్రజాస్వామిక వాతావరణం పార్టీ కాంగ్రెస్‌లో లేదు. వరస వైఫల్యాలను కూడా బేఖాతరు చేసి అదే నేతను పదేపదే అందలం ఎక్కిస్తే జరిగేదేమిటో పొరుగునున్న రష్యాను చూసైనా నేర్చుకోనట్టయితే చైనాకు భవిష్యత్తు ఉండదు. -
అనంతపురంలో కమ్యూనిస్టు నేతల అత్యుత్సాహం
-
ఆయన జీవితంలో ఎన్ని సింగిడీలో!
కొందరి జీవితాన్ని బయోపిక్‌గా రీల్‌కు ఎక్కించాలన్నా, బయోగ్రఫీగా అక్షరబద్దం చేయాలన్నా సులువు కాదు. సూర్యాపేటలో 1922 ఫిబ్రవరి15న కల్లు గీసే ముత్తిలింగం –గోపమ్మలకు పుట్టిన బొమ్మగాని భిక్షం సమాజ సేవ బహుముఖీనం. జీవించిన 90 ఏండ్లూ ఆయన ఆరడుగుల ఎర్రజెండా... బడుగు జనుల విముక్తి ఎజెండా. ఆయన అనుభ వాల్ని కొంపెల్లి వెంకట్ మాట–ముచ్చటగా తీసు కొచ్చిండు. ‘‘ఇంత ఉద్యమ చరిత్రలో ఎన్నడూ కంట కన్నీరు కార్చి నోణ్ణి కాదు. నేను ఆ రోజుల్లో అన్క్వశ్చన్డ్ లీడర్ని రా నాయనా! ప్రజా ఉద్యమాలు ఎల్లప్పుడూ ఉంటాయి. వాళ్ళలో లీనం గావాలే, అన్ని థాట్స్ హ్యుమాన్ బీయింగ్‌కు అవ సరం...’’ ఇవన్నీ జీవన చరమాంకంలో ఆయన వలపోత, కలబోత. ఇందులో ఎన్ని సింగిడీలో! ఆయన పార్లమెంట్ ఎన్నికలకు మా నాయన, సుద్దాల హన్మంతుతో పాటు గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థులుగా మేమూ పాల్గొన్నాం. హిమాయత్‌నగర్‌లో మఖ్దూమ్ భవన్‌కు ముగ్గుబోయక ముందు మా ఇంట్లో ఎన్నోసార్లు సేద తీరినప్పుడూ, ఉపన్యాసం ఇచ్చినప్పుడూ అట్లా తదేకంగా చూడడం నా జీవితంలో కలి గిన గొప్ప అవకాశం. ఆయన నల్ల గొండ పార్లమెంట్‌కు మళ్ళీ 1996లో పోటీ చేసినప్పుడు... జల సాధన కోసం జలఖడ్గం విసిరినట్లుగా తెలంగాణ ఆర్తి చెప్పడానికి 480 మంది అభ్యర్థుల్ని దుశర్ల సత్యనారాయణ, మేము నిలబెట్టినం. 89 ఏళ్ల వయస్సులో తొంటి విరిగి ఇన్ఫెక్షన్తో పోరా డుతూ 2011 మార్చి 26న ఆయన చని పోయిండ్రు. అదే రోజు నల్లగొండ జిల్లా సంగెంలో రాత్రి తెలంగాణ ఆట–పాట– మాట సభ నిర్వహించుకొని నేను, సాంబ శివుడు తిరిగి వస్తూ పొద్దున అంత్యక్రియలకు హాజరవుదామని అనుకున్నాం. దారిలో సాంబశివుడు హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న సాంబశివుణ్ణి ఆసుపత్రికి, ఇంటికి తరలించే పనిలో ధర్మభిక్షం చివరి చూపు కరువయింది. 15 ఫిబ్రవరి 2021లో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రారంభమయిన శత జయంతి వార్షికోత్సవాలు, 2022లో నేడు రవీంద్ర భారతిలో ముగుస్తాయి. -చెరుకు సుధాకర్ వ్యాసకర్త ఇంటిపార్టీ అధ్యక్షుడు -
ప్రైవేట్‌పై చైనా కొరడా మతలబు?!
మావో అనంతర పాలకులు కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, రాజ్యాంగాన్ని మార్చడంద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, పట్టణ–గ్రామీణ, తీరప్రాంత– మైదాన ప్రాంతాల మధ్య విభజనలు బాగా పెరిగాయి. గత మూడు దశాబ్దాలుగా చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాంతానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చేస్తున్న ప్రయత్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యాసాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఆర్థిక కొలమానాల్లో అత్యున్నత స్థానంలో ఉంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితిలో మాత్రం లేదు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఇటీవలి పరిణామాలు, ప్రత్యేకించి అలీబాబా గ్రూప్, ఎవెర్ గ్రాండే వంటి ప్రైవేట్ కంపెనీలు ఎదుర్కొన్న సమస్యలు... చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ త్రీ రెడ్ లైన్ పాలసీపై, ప్రైవేట్ రంగంపై ప్రభుత్వ వైఖరి, దాని ఉద్దేశాలపై ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. చైనా స్థూల దేశీయోత్పత్తిలో 60 శాతం, సాంకేతిక ఆవిష్కరణల్లో 70 శాతాన్ని ప్రైవేట్ రంగమే అందిస్తోంది. 1995లో ప్రైవేట్ రంగం చైనాలో 18 శాతం ఉద్యోగా లను కల్పించగా 2018లో అది 87 శాతానికి పెరిగింది. చైనా ఎగు మతులు ఇదే కాలానికి గాను 34 శాతం నుంచి 88 శాతానికి పెరి గాయి. పై ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ముందు చైనా ఆర్థిక వ్యవస్థ ఎలా నిర్మాణమైందో మనం అర్థం చేసుకోవడానికి అయిదు అంశాలను పరిశీలించాలి. మొదటిది: 1950లు, 60లలో మావో సేటుంగ్ పాలనలో నిఖా ర్సైన కమ్యూనిస్టు సైద్ధాంతిక పునాదిపై, అటు సోవియట్ సహాయం, ఇటు స్వావలంబనకు పిలుపివ్వడం అనే రెండింటి సమ్మేళనంతో, దేశంలో పారిశ్రామిక పునాదిని నిర్మించడంపై చైనా గట్టిగా కృషి చేసి మరీ విజయం సాధించింది. అయితే 1970లు, 80లలో డెంగ్ జియాంవో పింగ్ అంతర్జాతీయ సహకారంతో ఆర్థికాభివృద్ధిపై ఎక్కు వగా దృష్టిపెట్టారు. 1990లలో నాటి దేశాధ్యక్షుడు జియాంగ్ జెమిన్ సైద్ధాంతిక, ఆర్థిక రంగాల్లో సంస్కరణలతో చైనాను అత్యధిక వృద్ధి స్థాయికి తీసుకెళ్లారు. కమ్యూనిస్టు పార్టీలో, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్ వాణిజ్యవేత్తలకు చోటు కల్పించడం, ఈ మేరకు రాజ్యాం గంలో కూడా మార్పులు తీసుకోవడం ద్వారా చైనాను వృద్ధి బాట పట్టించారు. ప్రైవేట్ యాజమాన్యానికి పలు హక్కులు కల్పిస్తూ ఒక నిబంధనను చేర్చారు. ప్రైవేట్ వ్యాపారులు కమ్యూనిస్టు పార్టీ నియం త్రణలో పనిచేయాల్సి ఉందని, పార్టీ పాలనకు వారు బేషరతుగా లోబడి ఉండాలని షరతు కూడా విధించారు. రెండు: ఈ విధానాల ఫలితంగా, 1978 నుంచి 2003 నాటికి ఎగుమతుల పరిమాణం 28 రెట్లకు పెరిగింది. 1952 నుంచి 1978 కాలంలో ఎగుమతుల్లో సాధించిన రెండు రెట్ల వృద్ధితో పోలిస్తే ఇది భారీ స్థాయి వృద్ధి అని చెప్పాలి. 1978–2003 కాలంలో సంస్కరణలు అమలు చేసి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించడానికి సుంకాలు, పన్నులు, వాణిజ్య ప్రోత్సాహకాలను ప్రతిపాదిస్తూ నాలుగు ప్రత్యేక ఆర్థిక మండళ్లను నెలకొల్పారు. ఎగుమతులను, అత్యున్నత టెక్నాల జీని దిగుమతి చేసుకోవడాన్ని ప్రోత్సహించడమే వీటి లక్ష్యం. దీంతో 1952లో చైనా జీడీపీలో పారిశ్రామిక రంగ వాటా 8 శాతం మాత్రమే ఉండగా, 2003 నాటికి 52 శాతానికి పెరిగింది. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 1952లో 4.6 శాతం ఉండగా 2003 నాటికి 15 శాతానికి పెరిగింది. ఇక పారిశ్రామికోత్పత్తిలో విదేశీ మదుపు సంస్థల వాటా 1990లో 2.3 శాతం ఉండగా 2003 నాటికి అది 35.9 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది. మూడు: 2003 నుంచి 2013 వరకు ఒక దశాబ్ది కాలంలో చైనా వార్షిక వృద్ధి రేటు 10.3 శాతంగా నమోదైంది. 2007 నాటికి 14.2 శాతం నమోదుతో ప్రపంచంలోనే అత్యన్నత వృద్ధి రేటును చైనా సాధించింది. 2008–2019 దశాబ్దంలో ఆర్థిక మాంద్య కాలంలో చైనా సగటు వృద్ధి రేటు 7.99 శాతానికి నమోదైంది. ఇది ఆ దశాబ్దంలో ఏ దేశమూ సాధించినంత అధిక వృద్ధి రేటు. 2004లో చైనా వస్తుతయారీ రంగం 625 బిలియన్ డాలర్ల విలువను నమోదు చేయగా 2019 నాటికి అది 3,896 బిలియన్లకు అమాంతంగా పెరిగింది. ఈ అసాధా రణమైన వృద్ధిరేటు వల్ల చైనా 2011లోనే ప్రపంచ తయారీరంగ కార్ఖానాగా మారింది. ఆ నాటికి ప్రపంచ తయారీరంగ ఉత్పత్తిలో చైనా వాటా 28.4 శాతంగా నమోదైంది. 2010లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఆవిర్భవించింది. నాలుగు: ఆర్థిక రంగ సంస్కరణలు ప్రైవేట్ భాగస్వామ్యానికి చోటు కల్పించినప్పటికీ, చైనా ప్రభుత్వరంగ సంస్థలు మొత్తం జీడీపీలో 23 నుంచి 27 శాతం వాటాను సాధించాయి. ఇవి పారి శ్రామిక రంగంలో 21 శాతం వాటాను కలిగి ఉండగా, నిర్మాణ రంగంలో 38.5 శాతం, హోల్‌సేల్, రిటైల్ రంగంలో 39 శాతం వాటాను, రవాణా, నిల్వ రంగంలో 77 శాతం వాటాను సాధించాయి. ఇక మొత్తం ద్రవ్యరంగంలో 88 శాతం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల్లో 24.6 శాతం ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్నాయి. 2000 సంవత్సరంలో ఫార్చ్యూన్ 500 జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 27 ప్రభుత్వ రంగ సంస్థలకు చోటు దక్కగా చైనా నుంచి 9 సంస్థలు స్థానం సంపాదించాయి. 2017 నాటికి ఈ జాబితాలో మొత్తం 102 ప్రభుత్వ రంగ సంస్థలకు గాను 77 సంస్థలు చైనాకు సంబంధించినవే ఉండటం గమనార్హం. చైనా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు 2017లో 22,310 బిలియన్ డాలర్లతో రికార్డు సృష్టించాయి. కాగా మొత్తం 7,676 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన సరకులను అమ్మగలిగాయి. ప్రత్యేకించి బొగ్గు, ఇనుము పెద్దగా లేని లోహాలు, ఉక్కు, విద్యుత్తు, నిర్మాణ పరి శ్రమ వంటి రంగాల్లోకి చైనా భారీ పెట్టుబడులను తరలించింది. వీటిలో కొన్ని పరిశ్రమలను అధికోత్పత్తి సామర్థ్యతతో నిర్మించారు. చైనా 2000 సంవత్సరంలో ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరింది. అప్పటినుంచి 2015 నాటికి 15 సంవత్సరాల వ్యవధిలో ఏటా 13 శాతం సగటు ఉత్పత్తి రేటుతో చైనా ఉక్కు ఉత్పత్తిని అతి భారీ స్థాయిలో కొనసాగించింది. ఒక్క ఉక్కు రంగంలోనే 2018లో 8.1 శాతం వృద్ధి రేటుతో 928 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని, సిమెంట్ రంగంలో 895 మిలియన్ టన్నుల అధికోత్పత్తి సామర్థ్యాన్ని చైనా సాధించింది. ఇది ప్రపంచ అధికోత్పత్తి సామర్థ్యంలో 45 శాతా నికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అయిదు: చైనాలో బ్యాంకింగ్ వ్యవస్థ 2016 నాటికి యూరో పియన్ యూనియన్ బ్యాంకింగ్ వ్యవస్థకంటే పెద్దదిగా మారింది. చైనా బ్యాంకుల సొంత ఆస్తుల విలువ 35 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది చైనా జీడీపీకి 3 రెట్లు ఎక్కువ. 2001 నుంచి చైనా బ్యాంకులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారీ స్థాయి మౌలిక వస తుల కల్పన ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు అందించాయి. దీంతో అధికోత్పత్తి సామర్థ్యం కలిగిన చైనా ప్రత్యేక ఆర్థిక మండళ్లు నిర్మాణ రంగ సామగ్రిని ఈ దేశాలకు భారీగా పంపించగలిగాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ 2017లో నిర్వహించిన 19వ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మార్క్సిస్ట్ దృక్పథం, వైధానికం తోడుగా 2049 నాటికి చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా మలుద్దామని పిలుపు నిచ్చింది. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ఆర్థిక విధానాలు చైనాను ఆర్థిక దిగ్గజంగా మార్చినప్పటికీ, గత మూడు దశాబ్దాల్లో పట్టణ–గ్రామీణ, తీరప్రాంత–మైదాన ప్రాంతాల మధ్య విభజనలు పెరి గాయి. 2019 నాటికి ఈ విభజన భారీ స్థాయికి చేరుకుంది. తీర ప్రాంతాల్లో నివసించే ఒక శాతం జనాభా దేశ మొత్తం సంపదలో 13 శాతాన్ని అదుపులో ఉంచుకున్నది. దీంతో చైనా సమాజంలో ఒక నయా సంపన్న వ్యవస్థ బలపడి కమ్యూనిస్టు పార్టీకి, దాని సిద్ధాం తానికి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగాన్ని నియంత్రించడానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ చేస్తున్న ప్రయ త్నాలు సోషలిస్టు సిద్ధాంతానికి తిరిగి మళ్లడం, సమాజంలోని వ్యత్యా సాలను తగ్గించడం అనే లక్ష్యానికి అనుగుణంగా ఉన్నట్లు కనిపి స్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు చైనా ఆర్థిక వ్యవస్థ బలిష్టంగానే ఉంది తప్ప కుప్పగూలిపోయే స్థితితో అయితే లేదు. డా. గద్దె ఓంప్రసాద్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్ సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ ‘ మొబైల్: 79089 33741 -
ఒక స్వప్నం... ముగ్గురు మొనగాళ్లు
‘‘ఈ శిశిరం వాకిట ఒంటరిగా నిలబడి ఎన్నెన్నో మనోహర దృశ్యాలను చూస్తున్నాను. ఈ శిశిరంలో ఒంటరిగానే ఎన్నెన్నో వసంత స్వప్నాలను కంటున్నాను’’. చైనాలో విప్లవానికి నాయ కత్వం వహించి కమ్యూనిస్టు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మావో జెడాంగ్ గొప్ప తాత్వికుడు, వ్యూహకర్త, నాయకుడు మాత్రమే కాదు.. గొప్ప కవి, రచయిత, స్వాప్నికుడు కూడా! చదువు పూర్తయిన తర్వాత పెకింగ్ (బీజింగ్) విశ్వవిద్యాల యంలో కొంతకాలం లైబ్రరీ అసిస్టెంట్‌గా మావో పనిచేస్తాడు. అక్కడ తన బాస్‌గా ఉన్న జెన్డుషీ ప్రభావంతో కమ్యూనిస్టుగా మారతాడు. అక్కడి నుంచి తిరిగి తన సొంత రాష్ట్రం హునాన్‌కు వచ్చినప్పుడు సియాంగ్ నదిలోని ఆరెంజ్ ద్వీపానికి వెళ్తాడు. అక్కడ కదలాడిన మనోభావాలతో రాసిన కవిత ఇది. ఇందులో ఆయన కల మెదులుతుంది. ఆ కలలో ఆకాశం కింద స్వేచ్ఛ కోసం పరితపించే లక్షలాది జీవులు కనబడతాయి. కవితలోని భావాలకు రెక్కలు తొడిగి మావో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తాడు. చైనా కమ్యూనిస్టు పార్టీకి ఇప్పుడు వందేళ్ల వయసు. మొన్ననే ఘనంగా శతవార్షికోత్సవం జరిగింది. చైనా కమ్యూ నిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, దేశాధ్యక్షుడు, మిలటరీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న షీ జిన్‌పింగ్ ఏం మాట్లాడుతాడోనని ప్రపంచం ఎదురు చూసింది. ఎందుకంటే, చైనా ఇప్పుడు అల్లాటప్పా దేశం కాదు. అగ్రరాజ్య హోదా కోసం అమెరికాను సవాల్ చేసే స్థితికి ఎదిగిన దేశం. అనేక అభివృద్ధిరంగాల్లో అది ఇప్పటికే అమెరి కాను దాటేసింది. కమ్యూనిస్టు చైనాకు నాయకత్వం వహించిన ఐదు తరాల నాయకశ్రేణుల్లో మావో, డెంగ్‌ల తర్వాత అంతటి అధికారాన్ని చలాయిస్తున్న మూడో వ్యక్తి షీ. అందువల్ల ఆయన చెప్పే మాటలకు ప్రపంచ ప్రాధాన్యత ఏర్పడింది. సరిగ్గా పదేళ్ల కిందట చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీపీ) ప్రధాన కార్యదర్శి పదవిని షీ జిన్‌పింగ్ చేపట్టాడు. చైనా స్వప్నాన్ని (చైనా డ్రీమ్) సాకారం చేయడమే తన లక్ష్యమని బాధ్యతలు స్వీకరించగానే షీ ప్రకటించాడు. చైనా జాతీయ పునరుజ్జీవనమే చైనా స్వప్నంగా ఆయన ప్రకటించుకున్నారు. అందులో భాగంగా రెండు ‘శతాబ్ది’ లక్ష్యా లను పెట్టుకున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు నిండే నాటికి (2021) చైనా సమాజం అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించామని మొన్నటి శతవార్షిక సభలో షీ ప్రకటించాడు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చి శతాబ్ది కాలం నిండే నాటికి (2049) చైనాను అగ్రరాజ్యంగా, ఆధునిక సోషలిస్టు దేశంగా రూపుదిద్దడం రెండవ లక్ష్యం. ఈ దిశగా తమ ప్రయాణం కొనసాగుతున్నదని ఆయన వెల్లడించారు. చైనా డ్రీమ్ అనే నినాదాన్ని షీ జిన్‌పింగ్ బాగా ప్రచారం లోకి తెచ్చారు. కానీ ఈ డ్రీమ్‌కు నూటా యాభయ్యేళ్ల చరిత్ర ఉన్నది. చైనాకు రమారమి నాలుగు వేల సంవత్సరాల చారిత్రక వార సత్వ సంపద ఉన్నది. ఈ విశ్వం మొత్తానికి చైనా కేంద్రస్థానంలో ఉన్నదని పూర్వపు రోజుల్లో చైనా ప్రజలు గట్టిగా నమ్మేవారు. మిగిలిన రాజ్యాలన్నీ ఉపగ్రహాల వంటివని అభిప్రాయపడే వారు. రోమన్ సామ్రాజ్యం ఆవిర్భవించడానికి రెండువేల ఏళ్లకు పూర్వమే చైనాలో చిన్ వంశస్తులు మొదటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. యూరప్‌లో పారిశ్రామిక విప్లవం ప్రభవించి వలస రాజ్యాలు ఏర్పడేంతవరకు ప్రపంచంలో సంపన్న దేశంగా చైనా కొనసాగింది. చరిత్ర క్రమంలో వివిధ దేశాల జీడీపీని శాస్త్రీయంగా లెక్కగట్టిన ఆంగస్ మాడిసన్ అంచనా ప్రకారం 16–17 శతాబ్దాల నడుమ ప్రపంచ దేశాల ఉమ్మడి జీడీపీలో 33 శాతం వాటా ఒక్క చైనాదే. వేలయేళ్ల కిందటనే అంతర్జాతీయ వర్తకం కోసం గోబీ ఎడారులు, టిబెట్ పీఠభూములు, సెంట్రల్ ఆసియా దేశాల మీదుగా యూరప్ ఖండం వరకు సిల్కు రోడ్డును చైనా వేసుకున్నదని చరిత్ర చెబుతున్నది. ఈ కారణాల రీత్యా ఆనాటి చైనా ప్రజలకుండే గర్వం నిర్హేతుకమైనది కాదని తేలుతున్నది. చైనా ప్రజల గర్వాన్ని, ఆత్మగౌరవాన్ని యూరప్ వలస పాలకులు దెబ్బతీశారు. చైనాను పరిపాలించిన చివరి రాజ వంశం పేరు చింగ్. వీరు హన్ జాతీయులు కాదు. మంచూ తెగ వారు. చైనాలో హన్ జాతీయుల జనాభా చాలా ఎక్కువ. ఇండియాలో హిందువుల జనాభా శాతం కంటే కూడా ఎక్కువ. కానీ, చింగ్ వంశీయుల పాలనలోనే చైనా సరిహద్దులు బాగా విస్తరించాయి. పందొమ్మిదో శతాబ్దపు తొలిరోజుల్లో చైనాలోని ఉన్నతాధికారులకు బ్రిటిష్ వలస పాలకులు నల్లమందును అలవాటు చేశారు. ఇది క్రమంగా జనంలోకి పాకింది. నల్ల మందు అక్రమ రవాణాను అరికట్టడానికి చింగ్ పాలకులు చర్యలు చేపట్టారు. ఆగ్రహించిన బ్రిటిష్‌వారు చైనాతో యుద్ధా నికి దిగారు. తర్వాత కాలంలో ఫ్రాన్స్ కూడా బ్రిటన్‌కు జత కలిసింది. చైనా మీద రెండుసార్లు యుద్ధాలు (ఓపియమ్ వార్స్) చేశారు. చింగ్ రాజవంశ నైతిక బలాన్ని దెబ్బతీశారు. ఎనిమిది యూరప్ దేశాలు కలిసి చైనాపై ‘బాక్సర్’ యుద్ధాలు చేశాయి. మంచూరియా ప్రాంతాన్ని జపాన్ ఆక్రమించింది. చైనాపై అవమానకరమైన షరతులు విధించారు. చైనా సమాజంలోని విద్యావంతులు, ఉన్నత వర్గాల ప్రజలు కుమిలిపోయారు. తమ దేశం పూర్వపు ఔన్నత్యాన్ని సాధించాలని కలలుగన్నారు. ‘చైనా డ్రీమ్’ అప్పుడే మొద లైంది. చైనాలో జాతీయోద్యమం ప్రారంభమైంది. మంచూ జాతీయులైన చింగ్ రాజవంశంపై తిరుగుబాటు ప్రారంభ మైంది. సన్‌యట్‌సేన్ నాయకత్వంలో కుమిటాంగ్ పార్టీ జాతీయ వాదులతో కలిసి రాజరికాన్ని కూలదోసింది. జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సమయంలోనే ఓ పదిహేడేళ్ల యువ కుడు తన పొడవాటి జుట్టును కత్తిరించి నిరసన వ్యక్తం చేశాడు. చింగ్ రాజుల ఏలుబడిలో పురుషులు కూడా జుట్టును పెంచు కోవాలి. ఈ శాసనాన్ని ఆ యువకుడు ధిక్కరించాడు. అతడి పేరు మావో జెడాంగ్. చైనాడ్రీమ్ను సాకారం చేయడానికి వేట అక్కడే మొదలైంది. మావో జెడాంగ్ ఓ రైతుబిడ్డ. పెద్ద ఆకతాయి. కుదురుగా ఉండే రకం కాదు. పదమూడేళ్లు నిండేసరికి అతికష్టంగా ఐదో క్లాసు ముగించాడు. ఇక లాభం లేదని వాళ్ల నాన్న పొలం పనిలో పెట్టాడు. అక్కడా కుదురుకోలేదు. హునాన్ ముఖ్యపట్టణమైన చాంగ్షా మిడిల్ స్కూల్లో చేర్చారు. అక్కడ ఏడాదిలో నాలుగు స్కూళ్లు మారాడు. కానీ లైబ్రరీలో గంటల తరబడి పుస్తకాలు చదివేవాడు. ఆ వయసులోనే ఆడమ్ స్మిత్, మాంటెస్క్యూ, డార్విన్, జాన్ స్టూవర్ట్‌మిల్, రూసో, స్పెన్సర్ల క్లాసిక్స్‌ను చది వేశాడు. ఈ లైబ్రరీ పిచ్చితో పెకింగ్ యూనివర్సిటీ లైబ్రరీలో గుమాస్తాగిరి ఉద్యోగంలో చేరాడు. అక్కడ జెన్డూషీ పరిచయం మావోను కమ్యూనిస్టుగా మార్చింది. చైనాలో పేరుకు జాతీయ ప్రభుత్వం ఏర్పడింది. కానీ, దేశమంతటా అరాచకం రాజ్యమేలింది. వార్ లార్డ్‌ల ఆధిపత్యం కింద దేశం ముక్కచెక్కలుగా చీలిపోయింది. ఈ దశలో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో విజేతలందరూ పారిస్‌లోని వెర్సయిల్ రాజప్రాసాదంలో (versailles treaty) వాటాలకోసం సమావేశమయ్యారు. ఇక్కడా చైనాకు అవమా నమే ఎదురైంది. జపాన్‌కు పెద్దమొత్తంలో నష్టపరి హారం చెల్లిం చాలని చైనాను ఆదేశించారు. చైనా హృదయం మళ్లీ గాయ పడింది. ఈ సమయంలోనే 1921లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. సొంతరాష్ట్రం హునాన్‌లో పార్టీ పనిని మావో ప్రారం భిస్తాడు. మార్క్సిస్టు మూల సిద్ధాంతాల ప్రకారం పట్టణాల్లోని కార్మిక వర్గం విప్లవానికి నాయకత్వం వహించాలి. కానీ చైనాలో అది కుదిరేపని కాదని మావో భావించారు. పెద్దసంఖ్యలో ఉన్న రైతులను సమీకరించి తిరుగుబాటు చేయాలని భావించాడు. మావో అంతరంగంలో కమ్యూనిస్టు ఎంత బలంగా ఉన్నాడో... జాతీయవాది కూడా అంతే బలంగా ఉండేవాడు. గతించిన చైనా వైభవాన్ని గురించి కథలు కథలుగా రైతులకు చెప్పేవాడు. వారిని సమీకరించి చింకాంగ్ కొండల్లో స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. చైనా డ్రీమ్ మావోను నిరంతరం వెన్నాడుతూనే ఉండేది. ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని’ ప్రకటించాడు. ఈ వాక్యం అనంతరకాలంలో డజన్లకొద్ది దేశాల్లో చేగువెరా సహా లక్షలాదిమంది యువకుల చేత తుపాకీ పట్టిం చింది. స్త్రీల సమస్యల గురించి ఆలోచిస్తూ ఆకాశం కేసి చూసి ‘మహిళలు ఆకాశంలో సగభాగం’ అన్నాడు. ఈనాటికీ మహిళా ఉద్యమాల రణన్నినాదం ఇదే. యుద్ధ వ్యూహాలతో రాటుదేలిన మావో చైనా కమ్యూనిస్టు పార్టీకి అగ్రనేతగా ఎదిగాడు. చరిత్ర ప్రసిద్ధిచెందిన లాంగ్ మార్చ్ వ్యూహకర్త ఆయనే, సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన నాయకత్వంలోనే చైనా విప్లవం విజయవంతమై 1949లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. రాజవంశాల పరిపాల నలో నామమాత్రపు అధికారం మాత్రమే ఉన్న టిబెట్, షింజి యాంగ్, మంగోల్ ప్రాంతాలను పూర్తిగా చైనా అధీనంలోకి తెచ్చుకున్నారు. భౌగోళిక– రాజకీయ సుస్థిరత ఏర్పడింది. చైనా డ్రీమ్‌లో మొదటిభాగం ముగిసింది. ఇంకా రెండు భాగాలు న్నాయి. ఒకటి: ఆర్థికాభివృద్ధిని సాధించడం; రెండు: అగ్ర రాజ్యంగా వెలుగొందడం. ఈ లక్ష్యాలను కూడా వేగంగా సాధిం చాలన్న తొందరలో మావో చేసిన తప్పులకు చైనా భారీ మూల్యం చెల్లించింది. వ్యవసాయ– పారిశ్రామిక ఉత్పత్తులను ఇబ్బడిముబ్బడిగా పెంచడం కోసం ప్రారంభించిన గొప్ప ముందడుగు (great leap forward) ఉద్యమం విఫలమైంది. లక్షలాదిమంది ఆకలి చావులకు బలయ్యారు. దీన్ని కప్పిపుచ్చు కోవడానికే మావో సాంస్కృతిక విప్లవం (Cultural revolution)ను ప్రారంభించారని విమర్శకుల అభిప్రాయం. మావో వైఫల్యాలను ప్రశ్నించిన వారందరూ ఈ కాలంలో శిక్షలకు గురయ్యారు. చైనా డ్రీమ్‌లో రెండో లక్ష్యాన్ని చేరకుం డానే మావో కన్నుమూశారు. డెంగ్ సియావో పింగ్ కూడా రైతుబిడ్డే. ఫ్రాన్స్‌లో చదువు కున్నాడు. అక్కడే కమ్యూనిజానికి ఆకర్షితుడయ్యాడు. మావోతో కలిసి లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నాడు. చైనా అంతర్యుద్ధంలో కమ్యూనిస్టుల తరఫున క్రియాశీల పాత్ర పోషించాడు. టిబెట్‌ను ‘దారికి తెచ్చే’ బాధ్యతను ఈయనే నిర్వహించాడు. కల్చరల్ రివల్యూషన్ కాలంలో మావో జెడాంగ్ ఆగ్రహానికి గురయ్యాడు. కానీ జౌఎన్‌లై చలవతో మళ్లీ పార్టీలో కీలక బాధ్యతలు దక్కించు కున్నాడు. మావో మరణానంతరం పార్టీ మీద, ప్రభుత్వం మీద డెంగ్ పట్టు బిగించగలిగాడు. మావో వారసుడుగా వచ్చిన హువాగువాఫెంగ్ను డమ్మీ చేసి అధికార చక్రాన్ని డెంగ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆధునీకరణ, ఆర్థిక సంస్కరణలు అనే జంటలక్ష్యాలను పెట్టుకున్నాడు. సోషలిస్టు మార్కెట్ ఎకానమీని ప్రారంభించాడు. చౌకగా లభించే మానవ వనరులను ఉప యోగించుకుని ప్రపంచపు వస్తూత్పత్తి కర్మాగారంగా చైనాను మార్చేశాడు. ఎగుమతులను ప్రోత్సహించాడు. విదేశీ పెట్టుబడు లకు తలుపులు తెరిచాడు. ఆర్థిక విధానాల్లో ఎంత సరళంగా ఉదారంగా ఉన్నాడో రాజకీయ వ్యవహారాల్లో అంత కఠినంగా ఉన్నాడు. సోవియట్ శిబిరం కుప్పకూలిన రోజుల్లోనే చైనాలో తియనాన్మెన్ స్క్వేర్ ఆందోళన ప్రారంభమైంది. ఈ ఆందోళన కారుల్ని డెంగ్ రక్తపుటేరుల్లో ముంచాడన్న విమర్శలున్నాయి. విమర్శలెట్లా వున్నా చైనా డ్రీమ్లోని రెండో లక్ష్యమైన ఆర్థిక వృద్ధిని డెంగ్ జమానా నెరవేర్చింది. కీలకమైన ఏ పదవినీ చేపట్ట కుండానే డెంగ్ డీఫ్యాక్టో సార్వభౌముడిగా పరిపాలన నడిపిం చాడు. ఆయన చనిపోయిన పన్నెండేళ్ల వరకు చైనా అదే బాటలో నడిచింది. అప్పుడొచ్చాడు అసలు సిసలైన మావో వారసుడు. షీ జిన్‌పింగ్ పుట్టింది కమ్యూనిస్టు కుటుంబంలో! కానీ సాంస్కృతిక విప్లవకాలంలో ఈ కుటుంబం అష్టకష్టాల పాలైంది. తండ్రిని జైల్లో పెట్టారు. తల్లిని విద్రోహి భార్యగా ప్రకటించి పరేడ్ చేయించారు. సోదరులు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. అయినా, కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కోసం పదిసార్లు ప్రయ త్నించి చివరకు సఫలమయ్యాడు. షీ రివల్యూ షనరీ కాదు. ఒక టెక్నోక్రాట్. కెమికల్ ఇంజనీ రింగ్ చదివాడు. పార్టీలో కిందిస్థాయి నుంచి పనిచేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. మావో కాలంలో తన కుటుంబం తీవ్ర కడగండ్ల పాలైనప్పటికీ తాను మాత్రం మావో శిష్యుడిననే షీ ప్రకటించుకున్నాడు. చైనా డ్రీమ్‌లో చివరి లక్ష్యసాధన కోసం అడుగులు వేస్తున్నాడు. చైనా పూర్వ రాజులు సిల్కు రోడ్డును భూమి మీద వేస్తే షీ భూమితోపాటు సముద్రం మీద కూడా వేశాడు. వ్యూహాత్మక భాగస్వామ్యాలతో అమెరి కాకు వణుకు పుట్టిస్తున్నాడు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు నూరేళ్ల వయసు వచ్చేలోగా చైనాను అగ్రరాజ్యంగా నిలబెట్టే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు. ఒకవేళ చైనా ఆ గమ్యాన్ని చేరు కుంటే భారత్ పరిస్థితి ఏమిటని మన పాలకులు, రాజకీయ వేత్తలు ఆలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
నూరేళ్ల జన చైనా జైత్రయాత్ర
చైనా కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవ త్సరాల ఉజ్వల చరిత్రకు సాక్షిగా ఈనాటి జనచైనా అరుణకాంతు లతో వెలుగులీనుతోంది. ఒక నిరు పేద స్థితి నుంచి రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా పురోగమించిన మహ త్తర విప్లవ నిర్మాణానికి చిహ్నంగా వారి ఎర్రజెండా ఎగురుతోంది. 140 కోట్ల ప్రజల కలలకు, ఉజ్వల భవిష్యత్తుకు బాసటగా నాయకత్వం వహిస్తూ వారి మన్న నలు పొందుతోంది. ఇదంతా తేలికగా సాధ్యమయ్యింది కాదు. అకుంఠిత దీక్షతో ఒక్క మాటగా, కలసికట్టుగా చేసిన జైత్రయాత్ర. అనేక కుట్రలను, శత్రుప్రేరిత చర్యలను తిప్పి కొడుతూ తనను తాను నిరూపించుకుంటూ సాగిన మహా ప్రయాణం. అయితే, అభూత కల్పనలను, అంతర్ విద్వేషా లను రెచ్చగొట్టాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ సాగిన ఒక చారిత్రక ఘట్టమే తియనన్మెన్ స్క్వేర్. 1989 జూన్ 4 నాడు తియనన్మెన్ స్క్వేర్‌లో పదివేల మంది విద్యార్థులను సైన్యం కాల్చి చంపిందని అమెరికా, పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు ఒక విష ప్రచారం చేశారు, చేస్తున్నారు. నిజంగా ఏం జరుగుతున్నది అని పరి శీలించకుండా, ఒకరి కథనాల ఆధారంగా మరొకరు వార్త లను వండి వడ్డించారు. చైనా విద్యార్థుల్లో కూడా కొందరు అందులో భాగమయ్యారు. ఆనాడు 500 బిలియన్ డాల ర్లున్న చైనా జీడీపీ నేడు 14,000 బిలియన్లకు చేరుకున్నది. చైనా ప్రజలు నేడు సంపన్నులై, గర్వంతో తలఎత్తుకొని వున్నారు. డెంగ్ చూపెట్టిన, ఆ తర్వాత నాయకులంతా అనుసరించిన మార్గంలో వారు ఈ స్థాయికి చేరారు. 1989 తర్వాత నేటివరకూ అక్కడి యువతరం, విద్యార్థులు ఎన్నడూ నిరసన తెలిపే అవసరం రాలేదు. ఇప్పటి చైనా మార్గం స్థానంలో ప్రజాస్వామ్యం పేరిట మరో వ్యవస్థని కోరుకుంటారేమోనన్న సూచనలేవీ మెజారిటీ ప్రజల్లో కన్పించటం లేదు. దేశంలో అమలు చేయవలసిన సంస్కరణల గురించి పార్టీ నాయకత్వంలో చర్చలు కొనసాగుతున్న కాలం. డెంగ్ అనుయాయే అయినా, కళ్ళెంలేని లిబరలైజేషన్ వైపు మొగ్గిన నేత హుయావొ. అది తప్పేనన్న ఆత్మవిమర్శతో ప్రధాన కార్యదర్శిగా రాజీనామా (16–1–1987) చేసి, పొలిట్‌బ్యూరోలో వుండగా 15–04–89న మరణించారు. నాటి సంతాప వాతావరణాన్ని, విభేదాలను వాడుకొని విద్యార్థులని ఎగదోశాయి పార్టీలోని కొన్ని శక్తులు, లాబీలు. దానికి ఆజ్యం పోశాయి విదేశాలు, విదేశీ మీడీయా. అలా ఏప్రిల్ 18–22న సంతాపం పేరిట వేలాదిమంది తరలి వచ్చారు. అదే ముదిరి 50 రోజులు కొనసాగింది. పాశ్చాత్య పెట్టుబడిదారీ విధానపు బూర్జువా ప్రజాస్వామ్యం బండారం తెలియని కొందరు విద్యార్థులు, అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ విగ్రహ నమూనాని తలకెత్తుకున్న కొందరు విద్యార్థులు కూడా అందులో వున్నారు. అమె రికాతో ప్రభుత్వపరంగా సంబంధాలు ఏర్పడి, ఇరుదేశాలూ హలో హలో అని పలకరించుకుంటున్న వాతావరణం. అప్పటి విద్యార్థి తరంలో పాశ్చాత్యదేశాల స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వాల గురించి పైపై అవగాహనే వుంది. అభివృద్ధి, సంపద, సౌకర్యాలు, టెక్నాలజీ... ఇవన్నీ కలిసి ‘రెడ్ జీన్’ని పలుచన చేస్తాయేమోనని కొంత ఆందోళన వున్న కాలం అది. డెంగ్ లిబరల్ ఆర్థిక సంస్క రణలు మొదలై పదేళ్ళు దొర్లినాయి. విదేశీ, దేశీ పెట్టుబడి దారులను అనుమతిస్తూనే స్వతంత్ర ‘నవచైనా నిర్మాణ స్వప్నం’ మొదలైంది. ‘చైనా తరహా సోషలిజం’ పేరిట అనుసరించిన వ్యూహం–ఎత్తుగడల ఫలితాలు ఈనాడు ప్రపంచమంతా చూస్తున్నది. సిద్ధాంత సంక్షోభం తలెత్త నీయకుండా ఆ ప్రమాదాన్ని పసిగట్టే ‘బూర్జువా లిబర లైజేషన్’కి వ్యతిరేకంగా చైనా పార్టీ ఆనాడే (1987) ఒక ఉద్యమాన్ని నిర్వహించింది. ఎన్ని సంస్కరణలు వచ్చినా నాలుగు మౌలికసూత్రాల చట్రానికి లోబడి మాత్రమే వుండాలని చైనాపార్టీ, ప్రభుత్వమూ ఆదేశిక సూత్రాలను ప్రకటించాయి(పార్టీ 13వ మహాసభలో, 1987 అక్టోబరు). సంస్కరణల క్రమంలో పెచ్చరిల్లిన బూర్జువా లిబరలైజే షన్ని ఎదుర్కోవాలని, అందరూ కట్టుబడి వుండాల్సిన ఆ సూత్రాలను పునరుద్ఘాటించారు. అవి: సోషలిస్టు పథం, జనతా ప్రజాతంత్ర నియంతృత్వం, మార్క్సిస్టు లెనినిస్టు మావో సిద్ధాంత నేతృత్వం, అన్నిటికన్నా కీలకమైన పార్టీ నాయకత్వం. ఈ సూత్రాలను కాదనేవారు కొందరు పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలపై దాడులను ఆర్గనైజు చేశారు. ప్రజా చైనా, పార్టీల భవితవ్యాన్ని దెబ్బ తీయటానికి, సామ్రాజ్య వాదుల ప్రోత్సాహంతో జరిగిన తిరుగుబాటు కుట్ర స్వభావాన్ని అర్థం చేసుకోకుండా, దాన్ని బలపరిచి, కొద్దిమంది తీవ్రమైన తప్పు చేశారు. ‘మొత్తం’ ఎంతమంది చనిపోయారు? చైనా లెక్క 300 (సైనికులతో సహా). జూన్ 3 రాత్రి గురించి నేటికీ వ్యాప్తిలోవున్న పుకారు: పదివేలమంది. అమెరికా గూఢచారి సంస్థ లెక్క– 500 మందిదాకా. యామ్నెస్టీ లెక్క 1000 దాకా. స్క్వేర్‌లో విద్యార్థుల మరణాలే లేవని, ఇతరచోట్ల అల్లర్లలో చనిపోయారని చైనా ప్రకటించింది. ‘అక్కడ’ రక్తపాతం జరగలేదని 2011లో అమెరికా రాయబార కార్యా లయం పంపిన రహస్య కేబుల్స్ చెప్పాయి. పాశ్చాత్య కపటాన్ని (నేటి భాషలో పోస్ట్ ట్రూత్) చైనా నిర్దిష్టంగా బట్టబయలుచేసింది. ఆ తరువాత నడిచిన చరిత్ర చైనా వారి సూత్రీకరణలు ఎంత సరైనవో నిరూపించింది. తూర్పు యూరప్‌లో, రష్యాలో లాగే చైనా ప్రభుత్వమూ, పార్టీ పతన మవుతాయని సామ్రాజ్యవాదులు కన్న కలలు వమ్మయేట్టు చైనా కమ్యూనిస్టు పార్టీ తన ప్రస్థానం కొనసాగిస్తున్నది. ‘పాశ్చాత్యీకరించబడిన’ ఆసియా అగ్రరాజ్యంగా చైనా వుండబోదు. సోషలిస్టు మార్కెట్ విధానాలతో, ప్రపంచీ కరణ సమయంలో ఏర్పడ్డ సౌలభ్యాలని తమ జాతీయ అభి వృద్ధికి మార్గంగా చేసుకుని జన చైనా మహాప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో చైనా లక్ష ణాలతో సృజనాత్మకంగా అభివృద్ధి చేసుకున్న సోషలిస్ట్ రాజ్యంగా మునుముందుకు దూసుకు వెళుతున్నది. ఇది సహించలేని సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ భయకంపిత చిహ్నాలే చైనాకు వ్యతిరేకంగా కూటములు కట్టడం, అడు గడుగునా చైనా వ్యతిరేక ప్రచారం కొనసాగించటం. వారి సంస్కృతిని, సాంకేతిక నైపుణ్యాన్ని కించపరచటం, అసలు ఈ ప్రపంచానికి పెద్ద ప్రమాదం చైనా అనే బూటకపువాదం యుద్ధభేరీలా మోగించటం. అయితే ప్రపంచ ప్రజల అభి ప్రాయం భిన్నంగా ఉంది. సామ్రాజ్యవాద, ఆధిపత్య శక్తుల దోపిడీ ప్రయోజనాలను, పీడక స్వభావాణ్ని ప్రపంచ ప్రజలు అవగతం చేసుకుంటూ జన చైనా వెనుక నిలుస్తు న్నారు, జేజేలు చెబుతున్నారు. వ్యాసకర్త భారత–చైనా మిత్ర మండలి ఉపాధ్యక్షులు మొబైల్ : 98498 06281 -
మరో15 ఏళ్లు జిన్‌పింగే అధ్యక్షుడు!
బీజింగ్: చైనాలో అధ్యక్షు డు జిన్‌పింగ్ రూపొందిం చిన 14వ పంచవర్ష ప్రణా ళిక విజన్ 2035కి అధికార కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ఆమోద ముద్ర వేసింది. నాలుగు రోజుల పాటు జరిగిన పార్టీ ప్లీనరీ సదస్సు గురువారం ముగిసింది. చివరి రోజు విజన్ 2035కి పార్టీ ఆమోదముద్ర వేయడంతో జిన్‌పింగ్ పదవికి మరో పదిహేనేళ్లు ఢోకా లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనిని ఆమోదించడం ద్వారా మరో 15 ఏళ్ల పాటు జిన్‌పింగ్ అధ్యక్ష పదవిలో కొనసాగుతారని సీపీసీ సంకేతాలు పంపినట్టయిందని భావిస్తున్నారు. సీపీసీ సెంట్రల్ కమిటీకి చెందిన 198 మంది సభ్యులు, మరో 166 మంది ప్రత్యామ్నాయ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 2021–2035 సంవత్సరాల్లో దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం రూపొందించిన ఈ దీర్ఘకాలిక ప్రణాళిక విజన్ 2035పై విస్తృతంగా చర్చలు జరిపాక దానిని ఆమోదించారు. చైనా పూర్తి స్థాయి స్వయం సమృద్ధిని సాధించడానికి, దిగుమతుల్ని పూర్తిగా నిషేధించి, స్వదేశీ మార్కెట్‌ని ప్రోత్సహించేలా దీనిని రూపొందించారు. కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో తర్వాత 67 ఏళ్ల వయసున్న జిన్‌పింగ్ పార్టీలో అత్యంత శక్తి్తమంతమైన నాయకుడిగా ఎదిగారు. దేశాధ్యక్షుడిగా రెండు సార్లు మించి పదవి చేపట్టకూడదన్న నిబంధనల్ని రాజ్యాంగ సవరణ ద్వారా 2018లో సవరించి తానే జీవిత కాలం అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటించుకున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పదవీ కాలం 2022తో ముగియనుంది. ఇప్పుడిక తాను రూపొందించిన విజన్ 2035కి ఆమోద ముద్ర పడడంతో మరో పదిహేనేళ్ల పాటు ఆయన పదవికి ఢోకా ఉండదు. -
చీలిక దిశగా నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ
కఠ్మాండు: నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’ మధ్య సయోధ్య కుదరక పోవడంతో అధికార పార్టీలో చీలిక దిశగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చైనా అనుకూలుడిగా పేరున్న ఓలి తరఫున నేపాల్‌లో చైనా రాయబారి హౌ యాంకుయి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం. చైనా రాయబారి గురువారం ప్రచండను ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపారు. ప్రధాని ఓలి రాజకీయ భవితవ్యం శుక్రవారం జరగనున్న పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తేలిపోనుంది. కాగా, కమ్యూనిస్ట్ పార్టీ స్టాండింగ్ కమిటీ ఇప్పటి వరకు 4 పర్యాయాలు భేటీ అయినా ఇద్దరు నేతల వివాద పరిష్కారం కోసం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోయింది. (భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు.. నేపాల్ ప్రధానికి షాక్) -
ఆయన కుటుంబానికి చైనా క్షమాపణ
బీజింగ్ : కరోనా వైరస్ గురించి ప్రజల్ని హెచ్చరించి జైలుపాలైన డాక్టర్ లి వెన్లియాంగ్ కుటుంబసభ్యులకు అధికార కమ్యూనిస్టు పార్టీ క్షమాపణలు చెప్పింది. గత డిసెంబర్లో వూహాన్‌కు చెందిన డా. లి సార్స్ లాంటి వైరస్ వూహాన్లో రాబోతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఏడుగురు కూడా ఇందుకు సంబంధించిన పోస్టులు చేశారు. దీంతో వాటిని వదంతులుగా భావించిన పోలీసులు వారిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కరోనా వైరస్ బారిన పడిన లీ చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. ఆయన మరణించిన కొద్దిరోజులకే తీవ్ర స్థాయిలో విజృంభించిన వైరస్ దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు దాదాపు 3,245 మంది మరణించారు. రాజీలేని నివారణ చర్యల అనంతరం వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగారు. కొద్దిరోజుల క్రితం డా. లీ హెచ్చరికల కేసుపై విచారణ జరిపిన సుప్రీం పీపుల్స్ కోర్టు వారి హెచ్చరికలు వదంతులు కావని తేల్చింది. వూహాన్ పోలీసుల తీరును ఖండించింది. ఈ నేపథ్యంలో అధికార కమ్యూనిస్టు పార్టీ డా. లీ విషయంలో తమ పొరపాటుకు చింతిస్తూ ఆయన కుటుంబానికి అధికారికంగా క్షమాపణలు తెలిపింది. ఆయన అంత్యక్రియలకు సంబంధించి ఆర్థిక సహాయం చేసింది. ఆయన మృతిని ‘వర్క్ ప్లేస్ ఇంజ్యూరీ కాంపెన్సేషన్’ కింద పరిగణిస్తామని పేర్కొంది. డా. లీతో పాటు మిగిలిన ఏడుగురిపై కేసులు పెట్టిన పోలీసుల తీరును సైతం తప్పుబడుతూ వారిపై చర్యలకు సిద్ధమైంది. -
కమ్యూనిస్టు పార్టీల పై గౌరవం పోయింది
-
మా ప్రధాన ఉద్దేశం అదే: రాఘవులు
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఇప్పటికీ ప్రాసంగికత ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, లెఫ్ట్‌వర్డ్ సంపాదకుడితో కలిసి రాఘవులు శుక్రవారం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ సిద్దాంతాలు యువతలోకి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇక సీపీ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21ను రెడ్‌బుక్ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్ష పుస్తకాలు ప్రింట్ చేశామని.. ఆరెస్సెస్‌కు గట్టి జవాబుగా కమ్యూనిస్టు మేనిఫెస్టో ఉందటుందని పేర్కొన్నారు. ‘‘ప్రజల చేతిలో ఆయుధం ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టో. ప్రపంచవ్యాప్తంగా రైట్‌వింగ్ సిద్ధాంతాలు వస్తున్నాయి. ఇవి చాలా ప్రమాదకరం. ఫ్రీ థింకింగ్, ఫ్రీ థాట్, అసమ్మతి తెలియజేయడం అనేది చాలా ముఖ్యం’అని వ్యాఖ్యానించారు. -
చైనా పురోగమనాన్ని ఏ శక్తీ ఆపలేదు
బీజింగ్: చైనా పురోగమనాన్ని ఏ శక్తీ ఆపజాలదని అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీ పాలనాపగ్గాలు చేపట్టి 70 ఏళ్లు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ పరేడ్‌నుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘చైనా స్థాయిని, చైనా ప్రజలు, జాతి పురోగతిని ఏ శక్తీ అడ్డుకోజాలదు. ప్రజల తరఫున పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను స్థాపిస్తున్నట్లు 70 ఏళ్ల క్రితం మావో ప్రకటించారు. అప్పటి వరకు ఉన్న దయనీయ పరిస్థితుల నుంచి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో దేశం పూర్తిగా మారిపోయింది’అని జిన్‌పింగ్ తన ప్రసంగంలో అన్నారు. ‘ఈ పురోగమనంలో శాంతియుత పునరేకీకరణ, ఒకే దేశం– రెండు వ్యవస్థలు, హాంకాంగ్, మకావోల సుసంపన్నం, స్థిరత్వం కొనసాగుతాయి’అని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పరేడ్‌లో క్షిపణి బ్రిగేడ్‌తోపాటు ఖండాంతర క్షిపణులు, చైనా మొదటి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ లియోనింగ్‌పై మోహరించిన జె–15 పోరాట విమానాలు, సూపర్సోనిక్ సీజే–100 క్షిపణులు, 99 ఏ రకం యుద్ధ ట్యాంకులు, ఆధునిక డ్రోన్లు తదితర 300 కొత్త ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించింది. పరేడ్ మైదానంలో మావో, జింటావో, జిన్‌పింగ్‌ల భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. -
నేతల తీరు మారినా.. కమ్యూనిస్టు సిద్ధాంతాలు మారవు
సాక్షి, అమరావతి : ‘‘కమ్యూనిస్టు సిద్ధాంతాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి... కానీ వాటిని అమలు చేయడంలో ప్రస్తుత నాయకుల తీరే మారుతోంది’’ అంటూ శతాధిక వృద్ధుడు, కమ్యూనిస్టు యోధుడు వీరపనేని రామదాసు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమకారుడిగా తనకంటూ చరిత్రలో స్థానం సంపాదించుకున్న రామదాసు 101 ఏళ్లు వయస్సులోనూ గత అనుభవాలను, ప్రస్తుత పరిస్థితిని కుండబద్దలుకొట్టినట్టు వివరించారు. విజయవాడలో ఆయనను కలిసిన ‘సాక్షి’ ప్రతినిధి వద్ద తన మనసులోని భావాలను పంచుకున్నారు. నేను చదివింది మూడవ తరగతి. కాని జీవితం చాలా పాఠాలు నేర్పింది. నా చుట్టూ ఉన్న సమాజంలో పేదలు, బాధితుల పక్షాన నిలిబడి అనేక పోరాటాలు చేశాను. గన్నవరం తాలూకా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా నేను పనిచేసిన కాలంలోనే కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఆయన గెలుపుకోసం నియోజకవర్గం అంతా రోజుల తరబడి కాలినడక పర్యటించిన సందర్భాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. గన్నవరం ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన దగ్గర్నుంచి సుందరయ్య నన్ను ఎంతగానో అభిమానించి ఉద్యమాల్లో ప్రోత్సహించారు. సుందరయ్యతోపాటు నండూరి ప్రసాదరావు, చండ్ర రాజేశ్వరరావు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి(బీఎన్ రెడ్డి), కొండపల్లి సీతారామయ్య, ఓంకార్, నెక్కలపూడి రామారావు, మైలవరపు రామారావు వంటి కాకలు తీరిన కమ్యూనిస్టు నేతలతో కలిసి ఉద్యమాల్లో పాలుపంచుకునే అవకాశం దక్కింది. చాలా సందర్భాల్లో బ్రిటీష్ పోలీసులు, అటు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోని పోలీసులు నా ఆచూకీ కోసం నా భార్య వెంకట సుబ్బమ్మను వేధించినప్పటికీ ఆమె నాకు అందించిన సహకారం మరిచిపోలేను. నా కుమార్తెకు విశాలాంధ్ర(స్వర్ణకుమారి), కుమారులకు డాంగే, కృశ్చేవ్ పేర్లు పెట్టుకున్నాను. నా పెద్ద కొడుకు రామారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జైలులో మూడేళ్లు.. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న నన్ను బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేసి మూడేళ్ల పాటు జైల్లో పెట్టారు. బళ్లారి జైలులో అక్కడ పురుగుల అన్నం, నల్లులతో పడిన ఇబ్బందులను నా జీవితంలో మరిచిపోలేను. అన్ని కష్టాలు పడి కమ్యూనిస్టు ఉద్యమంలో కొనసాగాను. అయినప్పటికీ గన్నవరం ప్రాంతంలో సర్పంచ్, సమితి ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో కొందరు నాయకుల తీరువల్ల తీవ్ర మనస్తాపంతో ఉద్యమానికి దూరం కావాలని తెలంగాణలోని వరంగల్ జిల్లా గోవిందరావుపేటకు వలస వెళ్లిపోయాను. నేను ఎక్కడ ఉన్నానో తెలుకుని అక్కడికి వచ్చిన సుందరయ్య తిరిగి గన్నవరం రావాలని కోరినా నేను సున్నితంగా తిరస్కరించాను. అయితే వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టు ఉద్యమం కోసం పనిచేయాలని సుందరయ్య కోరారు. అంత గొప్ప నాయకుడి కోరికను కాదనలేక అక్కడ రైతు, కూలీ ఉద్యమాలు నిర్మించాను. అప్పట్లో నాతో పాటు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసి నక్సలిజంలోకి వెళ్లిన కొండపల్లి సీతారామయ్య, ఓంకార్, కేజీ సత్యమూర్తి వంటి వారి అచూకీ కోసం పోలీసులు నన్ను తీవ్రంగా వేధించేవారు. ఒక దశలో పోలీసులు నన్ను చంపాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసి సుందరయ్య కాపాడారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని దెబ్బతీయాలని అప్పట్లో కాంగ్రెస్ పాలకులు నన్ను 14 నెలలపాటు జైలులో కూడా నిర్బంధించారు. ఉద్యమ పంథాపై అసంతృప్తి ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన నాకు అప్పటితరం, ఇప్పటి తరం మధ్య ఉద్యమ పంథా మారిన క్రమం కొంత అసంతృప్తికి గురిచేసింది. అప్పట్లో ఎంత గొప్ప కమ్యూనిస్టు నాయకుడైనా సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు సిద్ధాంతాలు కూడా నాయకుల తీరుతో మారుతున్నాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాలు చాలా గొప్పవి కాని, వాటిని అమలు చేయడంలోనే ఇప్పటి తరం నాయకుల తీరుతో నేను విభేదిస్తుంటాను. అదే విషయాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సీపీఎం నేతలు నన్ను కలిసినప్పుడు ఉద్యమ పంథాలో వారు అనుసరిస్తున్న వ్యక్తిగత పోకడలను ప్రస్తావించి మనసులోని వేదనను వెళ్లగక్కుతుంటాను. ఏదిఏమైనా నా చివరి శ్వాసవరకు కమ్యూనిస్టుగానే ఉంటాను అంటూ రామదాసు చెప్పుకొచ్చారు. ఇది చదవండి : పుచ్చలపల్లి సుందరయ్య.. నీకు సాటిలేరయ్యా! -
కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, కృష్ణా: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కమ్యూనిస్ట్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది’ అంటూ తన ట్విటర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేశారు. కేశినేనికి చెందిన ట్రావెల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది పాత బకాయిలు చెల్లించాలని శుక్రవారం నిరసస దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆయనపై కమ్యూనిస్ట్‌లు భగ్గుమంటున్నారు. కేశినేని వ్యాఖ్యలను వెనక్కితీసుకుకోవాలని విజయవాడ నగర సీపీఐ కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నాని.. తమ పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కార్మికులకు న్యాయం చేసేంత వరకు తమ పారాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా మొన్నటి వరకు టీడీపీ నేతలపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించిన నాని.. తాజాగా కమ్యూనిస్ట్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగామారి పోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది. — Kesineni Nani (@kesineni_nani) July 27, 2019 -
పుచ్చలపల్లి సుందరయ్య.. నీకు సాటిలేరయ్యా!
ఆయన సత్యాన్ని మాత్రమే నమ్మేవాడు. అదే మాట్లాడేవాడు. తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేవాడు. ప్రజా సమస్యలపై శివమెత్తేవాడు. సమస్యల పరిష్కారం కోసం ఎంతటి వారినైనా నిలదీసి అడిగేవాడు. అవసరమైతే కడిగేసే వాడు. ఎంపీగా ఉన్నా సైకిల్‌పైనే సభకు వెళ్లేవాడు. నిలువెల్లా నిరాడంబరతను నింపుకున్న ఆయన విలువల్లోనూ అగ్రభాగాన నిలిచారు. ఆయనే పుచ్చలపల్లి సుందరయ్య 1952.. న్యూఢిల్లీ.. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, సభలో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. ఉన్నట్టుండి ఓ గొంతు ఖంగుమంది. ‘అధ్యక్షా.. లేడీ మౌంట్ బాటన్ భారత పర్యటనకు ఎందుకు వస్తున్నారో ప్రధానమంత్రి నెహ్రూ చెప్పాలి. మన అంతర్గత వ్యవహారాలలో బ్రిటిష్ వాళ్ల జోక్యాన్ని మేం అంగీకరించబోం’ అంటూ ప్రతిపక్ష నాయకుడు, సీపీఐ పార్లమెంటరీ పక్షనాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య సభలో మండిపడుతున్నారు. నెహ్రూ అదే స్థాయిలో.. ‘సుందరయ్య గారూ. మీరేం మాట్లాడుతున్నారో తెలుసా? మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి’ అన్నారు. ‘నేనెందుకు ఉపసంహరించుకోవాలి. అసలింతకీ ఆమె ఎందుకు వస్తోంది? మన వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి కాకపోతే ఇప్పుడామెకు ఇండియాలో ఏం పని’ అని సుందరయ్య అనటం తో సభలో దుమారం చెలరేగింది. సుందరయ్య పట్టు వీడలేదు. సంయమనం పాటించాలని, సహనం కోల్పోవద్దన్న సర్వేపల్లి ఆదేశంతో గొడవ సద్దుమణిగింది. ఆ మర్నాడు ఉదయం సుందరయ్యను సర్వేపల్లి రాధాకృష్ణన్ అల్పాహారానికి ఆహ్వానించారు. మాటల మధ్యలో సుందరయ్యకు అసలు విషయం తెలిసింది. ’నెహ్రూకు అంత కోపం ఎందుకొచ్చిం దో నీకు తెలిసినట్టు లేదు. లేడీ మౌంట్ బాటన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్టు అందరూ మాట్లాడుకోవడం నెహ్రూకు నచ్చదు. అందుకే ఆయనకు అంత కోపం వచ్చింది’ అని సర్వేపల్లి చెప్పారు. సుందరయ్య ఖంగుతిన్నారు. ’అయ్యో.. నేను అనవసరంగా మాట్లాడానే. సారీ.. నా మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు సర్. నాకీ విషయం తెలిసుంటే ప్రశ్నలను మరోలా అడిగేవాణ్ణి’ అని చిన్నబుచ్చుకున్నారు. ఇది జరిగిన మర్నాడే నెహ్రూ తన ఇంటికి రాజ్యసభ సభ్యుల్ని డిన్నర్‌కు పిలిచారు. సుందరయ్య కూడా వెళ్లారు. ఆయన్ను చూసిన నెహ్రూ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడబోతుండగా.. ’సారీ మిస్టర్ నెహ్రూ. నిన్న సభలో జరిగిన దానికి బాధపడుతున్నా’ అని తీవ్ర ఆవేదనతో అన్నారు. నెహ్రూ సైతం అంతే క్రీడాస్ఫూర్తితో ఓ చిర్నవ్వు నవ్వి ’నేనూ సారీ చెబుతున్నా సుందరయ్య గారూ. నేను కూడా అంత కఠినంగా మాట్లాడకుండా ఉండాల్సింది’ అన్నారు. ఆ తర్వాత ఏ విషయం వచ్చినా సుందరయ్యను ఆదర్శంగా తీసుకోమని నెహ్రూ పదేపదే తన పార్టీ సభ్యులకు చెబుతూ వచ్చేవారు. సాధికారత ఆయన సొంతం చట్టసభలలో మాట్లాడేటప్పుడు చదవకుండా, పూర్వపరాలు, ప్రభావం, పర్యావసానాలు తెలుసుకోకుండా సుందరయ్య సభకు వచ్చేవారు కాదు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు మేధావులు, నిపుణులతో పాఠాలు చెప్పించే వారు. అంకెలు, సంఖ్యలతో సభకు వెళ్లమని చెప్పేవారు. మద్రాసు శాసనసభ నుంచి సుందరయ్య 1952లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైనప్పుడు ఆయనే సీపీఐ పార్లమెంటరీ నేత. ఉభయ సభలలో సీపీఐ పార్లమెంటరీ పార్టీ సభా నాయకుడు కూడా. ఆనాడు ఆంధ్రా నుంచి 17 మంది కమ్యూనిస్టులు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తే సుందరయ్య పార్టీ నేతగా ఢిల్లీలో ఉండి అన్నీ చక్కబెట్టేవారు. మారుమూల పల్లె నుంచి.. ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే 1న 1913లో నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా అలగానిపాడులో భూస్వామ్య కుటుంబంలో సుందరయ్య జన్మించారు. వెంకట్రామిరెడ్డి, శేషమ్మ దంపతుల ఆరో సంతానం. సుందరరామిరెడ్డి అని తల్లిదండ్రులు పేరు పెడితే కులం ముద్ర ఉండకూడదనుకుని పేరు చివర్న రెడ్డిని తొలగించుకున్నారు. ఓ అన్న, నలుగురు అక్కల తర్వాత పుట్టిన వాడు కావడంతో అల్లారుముద్దుగా పెరిగారు. ఆయన తర్వాత ఓ తమ్ముడు డాక్టర్ రామచంద్రారెడ్డి పుట్టినప్పటికీ ఆ కుటుంబంలో సుందరయ్యది ప్రత్యేక స్థానమే. వీధి బడిలో చదివారు. పెద్ద బాలశిక్ష ఆయన తొలి పాఠ్యపుస్తకం. ఆరేళ్ల వయసులో తండ్రి చనిపోతే తన పెద్దక్క సుందరయ్య, రామచంద్రారెడ్డిని తిరువళ్లూరు తీసుకెళ్లి చదివించింది. మూడు, నాలుగైదు తరగతులు తిరువళ్లూరులో చదివిన సుందరయ్య ఆ తర్వాత ఏలూరు, రాజమండ్రి, చెన్నైలో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. పిల్లల్ని ఎందుకు వద్దనుకున్నారంటే.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. పీపుల్స్ వార్ సిద్ధాంతాన్ని నెత్తికెత్తుకున్న కమ్యూనిస్టు పార్టీ 1942 ప్రాంతంలో ఆ పనిమీద సుందరయ్యను బొంబాయి పంపింది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టులు వేర్పాటు వాదులనే ముద్రవేసి అణచివేసింది. నిర్బంధాన్ని కొనసాగించింది. ఆ సమయంలో అజ్ఞాతంలో ఉన్న కామ్రేడ్స్‌తో సంబంధాల కోసం బొంబాయిలోని దిల్సాద్ చారీ, ఏఎస్ఆర్ చారీ అనే పార్టీ నేతల ఇంటికి సుందరయ్య వెళ్లి వస్తుండేవారు. అక్కడ పరిచయమైన లీలా అనే సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగిని 1943 ఫిబ్రవరి 27న పార్టీ ప్రధాన కార్యదర్శి పీసీ జోషీ, మరికొద్ది మంది పార్టీ నేతల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన మరుసటి ఏడాది 1944 చివర్లో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. పార్టీకి పూర్తి కాలం సేవలు అందించాలనే ఉద్దేశంతో పిల్లలకు దూరంగా ఉండిపోయిన ఆ జంట పెళ్లి చేసుకుని, పరిమిత సంతానాన్ని కని సుఖంగా ఉండమని మాత్రం పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించేవారు. సర్వస్వం పార్టీకే అంకితం తన వాటా కింద వచ్చిన యావదాస్తిని ప్రజా ఉద్యమాల కోసం సుందరయ్య ఖర్చు చేశారు. ఆయన అనేక విలువైన పుస్తకాలను రచించారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, తెలంగాణ ప్రజా పోరాటం–కొన్ని గుణపాఠాలు, ఆత్మకథ వంటివి వాటిలో కొన్ని. 1952లో రాజ్యసభ సభ్యునిగా, 1955 నుంచి 1967, 1978 నుంచి 1983 వరకు రెండుసార్లు రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సూచనలు, సలహాలు, వాదనలు ఇప్పటికీ విలువైనవే. అందరూ కార్లు వాడుతున్న కాలంలో పార్లమెంటుకు, అసెంబ్లీకి సైకిల్‌పై వెళ్లిన అతి సామాన్యుడు. 1985 మే 19న మరణించే వరకు ఆయన ప్రజల కోసం అహరహం శ్రమించారు. పేదరికం, దోపిడీ నుంచి పేదల విముక్తికి జీవితాన్ని అంకితం చేసిన మచ్చలేని మహామనిషి, దేశభక్తుడు. ఆకలి, దారిద్య్రం లేని సమసమాజం కోసం పోరాడిన విప్లవకారుడు. బడుగు, బలహీన వర్గాల పాలిట ఆశాజ్యోతి. 17 ఏళ్ల వయసులోనే అరెస్ట్ విద్యార్థి దశనుంచే ఆదర్శ భావాలు, త్యాగనిరతి పుణికి పుచ్చుకున్న సుందరయ్య 1930 ఏప్రిల్‌లో మహాత్మాగాంధీ పిలుపుతో చదువుకు స్వస్తి చెప్పి స్వాతంత్య్ర ఉద్యమంలో చేరి 17 ఏళ్ల వయసులోనే అరెస్ట్ అయ్యారు. మైనారిటీ తీరకపోవడంతో ఆయన్ను రాజమండ్రిలోని బోస్టన్ స్కూల్‌కు తరలించారు. అక్కడ కమ్యూనిస్టులతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వస్తూనే వ్యవసాయ కార్మికులను ఏకం చేసి భూస్వాములపై తిరుగుబాటు చేశారు. తన ఆత్మకథలో చెప్పుకున్నట్టుగా సుందరయ్యను కమ్యూనిస్టుగా తీర్చిదిద్దిన వారిలో అమీర్ హైదర్ ఖాన్ ప్రథములు. సామాన్య కార్యకర్తగా కమ్యూనిస్టు పార్టీలోకి అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత అదే పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అమీర్ హైదర్ ఖాన్ అరెస్ట్ తర్వాత దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించే పనిని తన భుజానికెత్తుకున్నారు. 1943లో బొంబాయిలో జరిగిన పార్టీ మహాసభలో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికైన సుందరయ్య మరణించే వరకు ఉమ్మడి పార్టీలోనూ ఆ తర్వాత ఏర్పడిన సీపీఐ (ఎం)లో వివిధ హోదాలలో పని చేశారు. 1939, 1942 మధ్య అజ్ఞాత వాసానికి వెళ్లిన సమయంలో సుందరయ్య కమ్యూనిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. 1943లో పార్టీపై నిషేధం ఎత్తివేసిన తర్వాత పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, కలకత్తా థీసిస్ ఆధారంగా సాయుధ పోరాటాన్ని ప్రభోదించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. 1948, 1952 మధ్య కాలంలో మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. –ఆకుల అమరయ్య, సాక్షి, అమరావతి -
నిబద్ధతకు నిరుపమాన నిదర్శనం
ప్రజావైద్యశాల స్థాపించేం దుకు 1971 ఆరంభంలో సూర్యాపేటకు వెళ్లాను. కీ.శే. వి. బుచ్చిరాములు నాడు సూర్యాపేట డివిజన్ సీపీఎం కార్యదర్శిగా ఉండేవారు. ఆ హాస్పిటల్ స్థాపనలో నాకు స్థానికంగా ఉండి సహకరించిన ఇద్దరిలో ఆయన ఒకరు. ఆ పరి చయం నేను సీపీఎంని వీడి వచ్చేవరకు (1991) కొనసాగింది. ఆ పిదప సీపీఎం(బీఎన్) పార్టీ ఏర్పడి నప్పటినుంచి తిరిగి సన్నిహితంగా కొనసాగింది. తర్వాత ఆయన కన్నుమూసేవరకు అరుదుగానైనా కలిసేవారు. ఈ సందర్బంగా సీపీఎం (బీఎన్) పార్టీ గురించి కొంత చెప్పాలి. ఆనాటివరకు సూర్యాపేట డివిజన్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి సీపీఎం తరపున బీఎన్, స్వరాజ్యం, వీఎన్లే పోటీచేసేవారు. వీరందరిదీ ఒకే కుటుంబం. కానీ 1993 ఎన్నికల కమిటీ ఇన్చార్జిగా డివిజన్ కార్యదర్శి బుచ్చిరాములు పేరు ప్రకటించింది పార్టీ. కానీ ఫైనల్‌గా పోటీచేసే అభ్యర్థిగా మల్లుస్వరాజ్యం పేరు ముందుకొచ్చింది. అప్పటికే సీపీఎం పార్టీలో అక్కడక్కడా ‘‘ఎప్పుడూ ఆ కుటుంబమేనా, ఈ రెడ్లోళ్లేనా’’ అనే గుసగుసలు వినిపించేవి. సాధారణ కార్యకర్తల్లో బుచ్చిరాములు నెమ్మదితరహా, నిజాయితీ పట్ల అభిమానం ఉండేది. జిల్లాపార్టీలో వివిధస్థాయిల్లో యువకులు అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు బుచ్చిరాములే ఈ సారి పార్టీ అభ్యర్థిగా నిలబడాలని పట్టుపట్టారు. దాంతో రాష్ట్ర కమిటీ కూడా దిగివచ్చి తమ నిర్ణయాన్ని మార్చుకుని బుచ్చిరాములు అభ్యర్థిత్వాన్నే బలపర్చక తప్పలేదు. పార్టీ తరఫున మోటూరు హనుమంతరావు పార్టీ జనరల్ బాడీలో ‘‘ఇన్నేళ్ల చరి త్రలో స్థానిక నాయకత్వం ‘మొండి’ వైఖరి కారణంగా ఈ ప్రకటన చేయక తప్పలేదు. ఇక గెలిపించుకునే బాధ్యత వారిదే’’ అన్నారు. తీరా ఎన్నికల్లో ఆయన వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. సహజం గానే ఆ ఓటమికి కారణం పార్టీలో ఒక వర్గం, ఆధిపత్య కులాల కుట్ర వల్లేనని ప్రచారమైంది. తన ఓటమి పట్ల బుచ్చిరాములు కిమ్మనలేదు కానీ సమర్థించినవారితో పాటు ఆయన్ని కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో వీరంతా తమ రాజకీయ అస్తిత్వం కోసం వేరే పార్టీ పెట్టారు. సీనియర్ అయిన బీఎన్ కూడా ఈ యువకుల తరఫున నిలబడటంతో సీపీఎం(బీఎన్) పార్టీ ఏర్పడింది. అణగారిన కులాల తరఫున పోరాడకుండా సీపీఎం తన లక్ష్యాన్ని సాధించలేదు అనే మౌలిక అవగాహన ఈ కొత్త పార్టీకి ఉండేది. ఈ అవగాహతోటే నేనూ ఈ కొత్త పార్టీ తరఫున ప్రచారానికి సిద్ధమయ్యాను. సీపీఎం(బీఎన్) నేతృత్వంలో కీ.శే దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా సూర్యాపేటలో సామాజిక న్యాయం కోసం పెద్ద బహిరంగ సభ జరిగింది. బుచ్చిరాములుతోసహా అందరూ ఆ సభ జయప్రదం కావడానికి విశేషంగా కృషి చేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో సీపీఎం(బీఎన్)ని రద్దుచేశారు. బీఎన్తోపాటు కొందరు ఎంసీపీఐలో చేరగా కొందరు టీడీపీలో, బుచ్చిరాములుతోపాటు మరి కొందరు తిరిగి సీపీఎంలో చేరారు. ఆనాటికే సామాజికన్యాయం కోసం పోరాడాలనే లక్ష్యం సీపీఎంలో కొందరిలో ఉండేది. ఈ మధ్య బుచ్చిరాములుతో మాట్లాడిన సందర్భంగా, సీపీఎం ప్రస్తుతం సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తోం దనీ, తెలంగాణలో సీపీఎం ఆ మార్గంలో మరింత శాస్త్రీయ అవగాహనతో సాగుతోందని అనుకున్నాం. బుచ్చిరాములు ‘రాళ్లెత్తిన కూలీ లెవ్వరు’ అనే పుస్తకం రాశారు. ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్య మం కోసం తొలినాళ్లలో కృషి చేసిన వారి గురించి సంక్షిప్తంగా వివరించారు. గ్రామస్థాయిలో ఎంతమంది మహిళలు, పురుషులు ఎంత అంకిత భావంతో పనిచేశారో ఆ పుస్తకంలో పొందుపర్చారు. ఎన్నో కష్టాలు, నష్టాలు ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు భరించి నిలబడిన నాటి పునాదిరాళ్లను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఆ పుస్తకాన్ని ఈ తరానికి తెలియని ‘తమకు తెలియని చరిత్ర’గా భావిస్తాను.అలాంటి చరిత్ర రచనకు అనుభవం, అర్హత ఉన్న వాళ్లు తప్పక ప్రయత్నించాలి. ఆ క్రమంలో నల్లగొండ జిల్లా నాటి సూర్యాపేట డివిజన్లో ఎర్రజెండా ఔన్నత్యానికి కృషి చేసిన తాను కూడా ఒక ప్రధానమైన పునాది రాయి అని బుచ్చిరాములు నిరూపించుకున్నారు. ఆయన ధన్యజీవి. (నేడు సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వర్ధెల్లి బుచ్చిరాములు శ్రద్ధాంజలి కార్యక్రమం సూర్యాపేటలో నిర్వహిస్తున్న సందర్భంగా) వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
అగ్రవర్ణాలదే ఆధిక్యం
1956 నాటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. హైదరాబాద్ రాష్ట్రంలోని కన్నడ ప్రాబల్యం ఉన్న జిల్లాలు కర్ణాటకకు, మరాఠీ ప్రభావం కలిగిన జిల్లాలు మహారాష్ట్రలో కలవగా, తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతమంతా ఆంధ్రప్రదేశ్‌తో కలిసింది. మద్రాస్ నుంచి విడివడిన ఆంధ్ర రాష్ట్రానికి 1955లో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1956లో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాయి. అప్పటి ఏర్పాటు ప్రకారం ఆంధ్ర అసెంబ్లీ సభ్యులకు రెండేళ్లు అదనపు గడువు అంటే 1962 వరకు ఇచ్చారు. 1952లో ఎన్నికైన హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ సభ్యులకు యథావిధిగా, 1957లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా ద్విసభ్య నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఒక నియోజకవర్గంలో ఇద్దరు సభ్యులను ఎన్నుకునేవారు. వారిలో ఒకరు జనరల్ కేటగిరి కాగా, మరొకరు రిజర్వుడ్ కేటగిరి. ఒక్కోసారి రెండు సీట్లకు రిజర్వుడ్ కేటగిరి వారే ఎన్నికైన సందర్భాలూ ఉన్నాయి. మక్తల్ ద్విసభ్య నియోజకవర్గంలో ఎన్నికైన ఇద్దరూ ఎస్సీ వర్గానికి చెందిన వారే. ఈ ఎన్నికలలో 68 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. 1952లో ఊపు మీదున్న పీడీఎఫ్ (కమ్యూనిస్టు పార్టీ) ప్రభావం ఈసారి తగ్గిపోయింది. 20 మందే ఈ పార్టీ నుంచి గెలిచారు. సామాజిక వర్గాల వారీగా విశ్లేషణ చూస్తే రెడ్ల ప్రభావం పెరిగింది. 1952లో ఉన్న బ్రాహ్మణ ఆధిక్యత గణనీయంగా తగ్గింది. వెలమలు పది మంది వరకు ఎన్నికయ్యారు. మొత్తం 30 మంది రెడ్లు ఎన్నికైతే కాంగ్రెస్ నుంచి 17, పీడీఎఫ్ నుంచి 8 మంది గెలిచారు. మరో ఐదుగురు ఇండిపెండెంట్లుగా గెలిచారు. గతసారి 26 మంది బ్రాహ్మణులు ఎన్నికైతే, 1957లో 18 మందే గెలిచారు. ఇంకా ముస్లింలు ఏడుగురు, బీసీలు ఆరుగురు గెలవగా, 22 మంది ఎస్సీలు విజయం సాధించారు. కమ్మ వర్గం వారు నలుగురు, వైశ్యులు, లింగాయత్‌లు ఇద్దరు చొప్పున గెలిచారు. ‘రెడ్డి ప్రాభవం’ తొలి ఎన్నిక (1952)ల కన్నా ఈసారి రెడ్డి సామాజికవర్గం నేతలు ఎక్కువ మంది శాసనసభకు ఎన్నికయ్యారు. 30 మంది ఎన్నిక కాగా, కాంగ్రెస్ నుంచి 17 మంది, పీడీఎఫ్ నుంచి 8 మంది ఉన్నారు. గతసారి పీడీఎఫ్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ పరిస్థితి ఉన్నా, 1957 నాటికి కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన రెడ్డి ప్రముఖులలో నూకల రామచంద్రారెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి వంటి వారున్నారు. పీడీఎఫ్ నుంచి భీమిరెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల కమలాదేవి తదితరులు ఉన్నారు. ఇండిపెండెంట్లుగా మరో ఐదుగురు ఎన్నికయ్యారు. ముస్లిం, కమ్మ, వైశ్య.. 1957 ఎన్నికల్లో ముస్లింలు ఏడుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. మాసూనా బేగం, నవాబ్ జంగ్ వంటి ప్రముఖులు వీరిలో ఉన్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ ఎన్నికల్లో నలుగురు విజయం సాధించగా, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, పీడీఎఫ్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్‌గా ఒకరు గెలుపొందారు. ఇక, వైశ్య సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరు ఎన్నికయ్యారు. ముషీరాబాద్ నుంచి సీతయ్య గుప్తా, కంటోన్మెంట్ నుంచి బీవీ గురుమూర్తి గెలుపొందారు. లింగాయత్ వర్గం నుంచి ఇద్దరు గెలుపొందారు. తగ్గిన బీసీ వర్గం ఎమ్మెల్యేలు వెనుకబడిన తరగతుల నుంచి ఈ ఎన్నికల్లో గెలిచిన వారి సంఖ్య గతంలో కన్నా తగ్గింది. కొండా లక్ష్మణ్ బాపూజీ (పద్మశాలి) ఈసారి నల్లగొండ జిల్లా చినకొండూరు నుంచి గెలుపొందారు. మొత్తంగా కాంగ్రెస్ నుంచి నలుగురు ఎన్నికయ్యారు. పీడీఎఫ్ నుంచి ధర్మభిక్షం (నకిరేకల్), ప్రజాపార్టీ తరఫున ఈ.చిన్నప్ప (మహబూబ్‌నగర్) గెలుపొందారు. ఎస్సీలు అత్యధికంగా కాంగ్రెస్ నుంచే.. ఎస్సీ ఎమ్మెల్యేలు అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 15 మంది గెలుపొందారు. పీడీఎఫ్ నుంచి ముగ్గురు, సోషలిస్టు పార్టీ నుంచి ఇద్దరు, ఎస్సీఎఫ్, ఇండిపెండెంట్లుగా ఒక్కొక్కరు చొప్పున నెగ్గారు. ప్రముఖ నేత జి.వెంకటస్వామి ఈ ఎన్నికల్లోనే సిర్పూరు నుంచి గెలుపొందారు. అలాగే మహిళా దళిత నేత టి.ఎన్.సదాలక్ష్మితో పాటు కోదాటి రాజమల్లు, జేబీ ముత్యాలరావు, అరిగే రామస్వామి, సుమిత్రాదేవి వంటి ప్రముఖులు కూడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ముగ్గురు జనరల్ స్థానాల నుంచి గెలుపొందారు. ఎస్టీ కేటగిరి నుంచి కాంగ్రెస్ తరఫున డి.నరసయ్య (ఇల్లెందు), కాశీరాం (ఆసిఫాబాద్) ఎన్నికయ్యారు. తగ్గిన బ్రాహ్మణ ఆధిక్యం 1952లో 26 మంది బ్రాహ్మణ నేతలు అసెంబ్లీకి ఎన్నికైతే.. 1957లో ఆ సంఖ్య 18కు తగ్గింది. వీరిలో అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 13 మంది గెలుపొందగా, పీడీఎఫ్ నుంచి నలుగురు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన ప్రముఖులలో పీవీ నరసింహారావు, హయగీవ్రాచారి, ముందుముల నరసింగరావు, ఎమ్.ఎస్.రాజలింగం తదితరులు ఉన్నారు. పీడీఎఫ్ నుంచి గెలిచిన వారిలో వెంకట కృష్ణ ప్రసాద్, కేఎల్ నరసింహారావు వంటి వారున్నారు. ఇండిపెండెంట్‌గా జుక్కల్ స్థానం నుంచి మాధవరావు గెలుపొందారు. పెరిగిన వెలమల ప్రభావం తొలి ఎన్నికలలో కంటే ఈసారి వెలమ సామాజిక వర్గం ప్రాతిని«ధ్యం మరింతగా పెరిగింది. 1957 ఎన్నికలలో మొత్తం పది మంది సభ్యులు అసెంబ్లీకి ఎన్నికైతే వారిలో ఆరుగురు కాంగ్రెస్ నుంచి, ముగ్గురు పీడీఎఫ్ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి జువ్వాది చొక్కారావు, జేవీ నరసింగరావు ప్రభృతులు ఉండగా, పీడీఎఫ్ నుంచి గెలిచిన ముఖ్యులలో చెన్నమనేని రాజేశ్వరరావు వంటి వారున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి జీవీ పీతాంబరరావు విజయం సాధించారు. సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు -
ఉమ్మడి ఏపీలో తొలి ఎన్నికలు
ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ప్రాంతం 1956లో ఆంధ్రప్రదేశ్‌గా అవతరించాక 1962లోనే మొదటిసారి రాష్ట్రమంతటా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి ఏపీ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 300. అంతే సంఖ్యలో నియోజకవర్గాలు ఏర్పాటు చేయగా, ప్రతి స్థానానికీ ఒక్కరే ప్రాతినిధ్యం వహించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఏర్పాటైన ద్విసభ్య నియోజకవర్గాలు రద్దయ్యాయి. ఈ వర్గాలకు విడివిడిగా నియోజకవర్గాలను కేటాయించారు. కోస్తా, రాయలసీమలో 194 అసెంబ్లీ స్థానాలుండగా తెలంగాణలో 106 సీట్లున్నాయి. తెలంగాణలోని ఈ 106 స్థానాల్లో 18 ఎస్సీలు, రెండు ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 86 జనరల్ సీట్లు. ఏపీ తొలి (ఏకైక) దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పదవిలో ఉండగా లోక్‌సభతోపాటు ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర ప్రాంతంతోపాటు తెలంగాణలో కూడా కమ్యూనిస్టులు మొదటిసారి సీపీఐ పేరుతో పోటీ చేశారు. రెండు చోట్లా సీపీఐ బలం తగ్గిందని ఈ ఎన్నికలు నిరూపించాయి. పంచాయతీరాజ్, సహకార వ్యవస్థల కారణంగా పాలకపక్షమైన కాంగ్రెస్ పునాదులు బలపడ్డాయి. తెలంగాణ ప్రాంతంలోని 106 అసెంబ్లీ స్థానాల్లో పాలకపక్షమైన కాంగ్రెస్‌కు 60 సీట్లు రాగా సీపీఐ పేరుతోనే పోటీ చేసిన కమ్యూనిస్టులకు 18 స్థానాలే దక్కాయి. కాంగ్రెస్ సీట్లు దక్కని తిరుగుబాటు అభ్యర్థులు, ఇండిపెండెంట్లకు కలిపి 18 సీట్లు లభించాయి. మొదటిసారి పోటీ చేసిన స్వతంత్ర పార్టీకి 3, సోషలిస్టులకు 2 సీట్లు దక్కాయి. పత్తర్‌గట్టీ నుంచి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ గెలిచి మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 300 సీట్లకుగాను కాంగ్రెస్ 177 స్థానాలతో ఘన విజయం సాధించింది. ఎన్నికల సమయంలో సీఎంగా ఉన్న సంజీవయ్యకు బదులు ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి మార్చి రెండో వారంలో ప్రమాణం చేశారు. నీలం కేబినెట్లో తెలంగాణ మంత్రులు.. ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ నేతలు ఎన్. రామచంద్రారెడ్డి (డోర్నకల్), మర్రి చెన్నారెడ్డి (తాండూరు), మీర్ అహ్మద్ అలీఖాన్ (మలక్‌పేట్), డా. ఎం.ఎన్. లక్ష్మీనరసయ్య (ఇబ్రహీంపట్నం) కేబినెట్ మంత్రులుగా చేరారు. పీవీ నరసింహారావు (మంథని), టీఎన్ సదాలక్ష్మి (ఎల్లారెడ్డి), బీవీ గురుమూర్తి (సికింద్రాబాద్ కంటోన్మెంట్) సహాయ మంత్రులయ్యారు. ముగ్గురు ఏకగ్రీవం! ఈ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ లేకుండా శాసనసభకు ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల నుంచి ఇదే సంస్థానానికి చెందిన కృష్ణరామ్ భూపాల్, వికారాబాద్ (ఎస్సీ రిజర్వ్డ్) నుంచి అరిగే రామస్వామి, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుంచి టి. రంగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1957లో ఆర్మూర్ నుంచి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ నేత టంగు టూరి అంజయ్య 1962లో హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నుంచి పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎంఐఎం అధినేత సలావుద్దీన్ ఒవైసీ పత్తర్‌గట్టీలో కాంగ్రెస్ మంత్రి మాసూమా బేగంను ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గద్వాల సంస్థానానికి చెందిన సోమ్ భూపాల్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఆత్మకూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యే జయలక్ష్మీదేవమ్మను ఓడించారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా ఎదిగిన డా. జి. సంజీవరెడ్డి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి మొదటిసారి కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికయ్యారు. పీవీ నరసింహారావు రెండోసారి కరీంనగర్ జిల్లా మంథని నుంచి కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో పీవీకి సహాయ మంత్రిగా స్థానం లభించింది. 1957 ఎన్నికల్లో సుల్తాన్‌బజార్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వాసుదేవ్ కృష్ణాజీ నాయక్ (కాంగ్రెస్) మళ్లీ 1962లో కూడా విజయం సాధించి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన 1972 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఈ పదవిలో కొనసాగారు. హైకోర్టు నుంచి కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికైన బి. రాందేవ్ పాతికేళ్ల తర్వాత ఎమ్మెల్సీగా మర్రి చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రి అయ్యారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన నల్లగొండ జిల్లా దంపతులు ఆరుట్ల కమలాదేవి (ఆలేరు), రామచంద్రారెడ్డి (భువనగిరి) ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. మొదటి రెండు ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన కమ్యూనిస్టు నేత బొమ్మగాని ధర్మభిక్షం ఈసారి నల్లగొండ నుంచి పోటీ చేసి వరుసగా మూడోసారి విజయం సాధించారు. అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి ఎన్. యతిరాజారావు వరంగల్ జిల్లా చెన్నూరు నుంచే ఈ ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. ఖమ్మం జిల్లా వేంసూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యా రు. అంతకుముందు ఆయన తమ్ముడు కొండల్రావు ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డా. మర్రి చెన్నారెడ్డి 256 ఓట్ల స్వల్ప మెజారిటీతో చంద్రశేఖర్‌పై గెలిచారు. బుగ్గారం ఎస్టీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థి కనగాల బుచ్చయ్య కేవలం 42 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌కు చెందిన కొమురం రామయ్యపై విజయం సాధించారు. కాంగ్రెస్ టికెట్‌పై చేర్యాల నుంచి మహమ్మద్ కమలాద్దీన్ అహ్మద్ గెలుపొందారు. కొన్నేళ్ల తర్వాత పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఆయన కేబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆయన బీజేపీలో కూడా చేరారు. శాసనసభకు మహిళలు 8మంది ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో ఆరుగురు మహిళలు కాంగ్రెస్ తరఫున, ఇద్దరు సీపీఐ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ తరఫున కుముదినీదేవి (వనపర్తి) సుమిత్రాదేవి (హైదరాబాద్ తూర్పు–ఎస్సీ), రోడా మిస్త్రీ (జూబ్లీహిల్స్ జనరల్), ఎస్ఎల్ దేవి (అందోల్), రెడ్డి రత్నమ్మ (రామాయంపేట), టీఎన్ సదాలక్ష్మి (ఎల్లారెడ్డి–ఎస్సీ), సీపీఐ నుంచి కేవల్ ఆనందదేవి (మెదక్), ఆరుట్ల కమలాదేవి (ఆలేరు) విజయం సాధించారు. ఓడిన ప్రముఖుల్లో కేవీ రంగారెడ్డి కవి, కమ్యూనిస్టు దిగ్గజం మఖ్దూం మొహియుద్దీన్ను మొదటి సాధారణ ఎన్నికల్లో ఓడించి తర్వాత మంత్రి పదవి చేపట్టిన మాసూమా బేగం పత్తర్‌గట్టీలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయారు. 1962కు ముందు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నేత కొండా వెంకట (కేవీ) రంగారెడ్డి మేడ్చల్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి వి. రామచంద్రరావు చేతిలో ఓడిపోయారు. 1957లో గెలిచిన కాంగ్రెస్ నేత జువ్వాడి చొక్కా రావు 1962లో కరీంనగర్లో సోష లిస్టు పార్టీ అభ్యర్థి అల్లిరెడ్డి కిషన్‌రెడ్డి చేతిలో పరాజయం చవిచూశారు. 1957లో హైదరాబాద్ బేగంబజార్ నుంచి గెలిచిన కాంగ్రెస్ మాజీ మంత్రి జేవీ నరసింగ్‌రావు ఈసారి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో స్వతంత్ర అభ్యర్థి జీవీ పీతాంబరరావు చేతిలో ఓటమిపాలయ్యారు. వర్ధన్నపేట నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలో నిలిచిన పెండ్యాల రాఘవరావు స్వతంత్ర అభ్యర్థి కుందూరు లక్ష్మీనరసింహారెడ్డి చేతిలో ఓడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి (సీపీఐ) నాగారం స్థానం నుంచి 101 ఓట్ల స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి అనిరెడ్డి రంగారెడ్డి చేతుల్లో ఓటమి చవిచూశారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కే ఆధిక్యం.. అసెంబ్లీతోపాటు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అంతర్భా గంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 43 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ 34, సీపీఐ 7 స్థానాలు కైవసం చేసుకున్నాయి. స్వతంత్ర పార్టీ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణ ప్రాంతంలోని 15 లోక్‌సభ స్థానాల్లో 3 ఎస్సీలకు, 3 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ 13 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన అవిభక్త సీపీఐ రెండు సీట్లలో విజయం సాధించింది. డీకే సత్యారెడ్డిపై రామేశ్వరరావు గెలుపు.. 1957లో మహబూబ్‌నగర్ నుంచి లోక్‌సభకు మొదటిసారి ఎన్నికైన జె. రామేశ్వరరావు (కాంగ్రెస్) 1962లో గద్వాల నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి డీకే సత్యారెడ్డిపై విజయం సాధించారు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో సత్యారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. వనపర్తి సంస్థానానికి చెందిన రాజా రామేశ్వరరావు తర్వాత మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. హైదరాబాద్ స్థానం నుంచి మొదటిసారి లోక్‌సభకు పోటీ చేసిన జీఎస్ మెల్కోటే (కాంగ్రెస్) తన సమీప ఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ వాహెద్ ఒవైసీపై విజయం సాధించారు. తర్వాత మెల్కోటే వరుసగా రెండుసార్లు ఇదే సీటు నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అబ్దుల్ వాహెద్ ప్రస్తుత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాత. అలాగే కాంగ్రెస్ తరఫున సంగెం లక్ష్మీబాయి వికారాబాద్ నుంచి రెండోసారి లోక్‌సభకు పోటీ చేసి స్వతంత్ర పార్టీ అభ్యర్థిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బాకర్ అలీ మీర్జా తన సమీప కమ్యూనిస్టు అభ్యర్థి, కార్మిక నేత సర్వదేవభట్ల రామనాథంపై కేవలం 784 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.1957 ఎన్నికల్లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ నాయకురాలు టి. లక్ష్మీకాంతమ్మ 1962లో ఖమ్మం లోక్‌సభ సీటు నుంచి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె అంతకుముందు రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన కమ్యూనిస్టు నేత టీబీ విఠల్‌రావును ఓడించారు. తొలి పార్లమెంటు ఎన్నికల్లో నల్లగొండ నుంచి భారీ మెజారిటీతో గెలిచిన కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణరెడ్డి మరోసారి నల్లగొండ నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కంచెనపల్లి పెద్ద వెంకటరామారావును ఓడించారు. -
కామ్రేడిత సంధి
-
ఇటాలో కాల్వీనో
ఇటాలియన్ తల్లిదండ్రులకు క్యూబాలో జన్మించాడు ఇటాలో కాల్వీనో(1923–1985). తమ దేశ మూలాలను మరిచిపోకూడదన్న పట్టింపుతో ఇటాలో అని నామకరణం చేసింది తల్లి. తన పేరు మరీ రణాభిముఖమైన జాతీయవాదపు పేరుగా వినబడుతుందని ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడు ఇటాలో. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైనికుడిగా పనిచేశాడు కూడా. పిల్లాడిగా ఉన్నప్పుడే ఇటాలో తల్లిదండ్రులు ఇటలీకి తిరిగొచ్చారు. తల్లిదండ్రులిద్దరూ విద్యాధికులే. శాస్త్రవిజ్ఞానాలంటే ఎక్కువ ఆదరముండే ఇంట్లో, సాహిత్యాన్ని ప్రేమించడం ఇటాలోను అధముడిగా పరిగణించేలా చేసింది. చాలా సందేహాల మధ్య సాహిత్యం వైపు మరలాడు. రీజన్‌కు ప్రాధాన్యత ఇచ్చే రచయిత. రాసిందానికంటే కొట్టేసేది ఎక్కువ, అంటాడు. ‘అవర్ ఆన్సెస్టర్స్’ ట్రయాలజీ, ‘ఇన్విజిబుల్ సిటీస్’, ‘ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ ఎ ట్రావెలర్’ నవలలు ఆయన రచనల్లో పేరెన్నికగన్నవి. ‘కాస్మియోకామిక్స్’, ‘ద క్రో కమ్స్ లాస్ట్’, ‘నంబర్స్ ఇన్ ద డార్క్’, ‘ఆడమ్, వన్ ఆఫ్టర్నూన్’ లాంటివి కథాసంకలనాలు. పాత్రికేయుడిగా పనిచేశాడు. కొంతకాలం కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు. 1956లో హంగెరీ మీద సోవియట్ రష్యా దండెత్తడంతో పార్టీ మీద భ్రమలు తొలగి రాజీనామా చేశాడు. చనిపోయేనాటికి అతి ఎక్కువగా అనువాదమైన ఇటాలియన్ రచయిత కాల్వీనో. -
క్యూబా అధ్యక్షుడిగా డియాజ్ కానెల్
హవానా: క్యూబా నూతన అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ అగ్రనేత మిగ్వెల్ డియాజ్ కానెల్(58) ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. క్యాస్ట్రో కుటుంబేతర వ్యక్తి ఈ పదవికి ఎన్నికవడం ఆరు దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. కానెల్ 2013 నుంచి క్యూబాకు తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. బుధవారం ఆయన్ని జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఫిడేల్ అనారోగ్యానికి గురికావడంతో 2006లో రౌల్ అధికారం చేపట్టారు. అయితే క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ అధినేతగా కొనసాగనున్న రౌల్ పర్యవేక్షణలోనే కానెల్ పాలించే వీలుంది. చిన్నచిన్న ప్రైవేట్ సంస్థలను దేశంలోకి ఆహ్వానించడం, చిరకాల ప్రత్యర్థి అమెరికాతో సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడం ఆయన ముందున్న సవాళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత కానెల్ కొంతకాలం ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. మితవాద భావాలతో ప్రశాంతంగా కనిపించే కానెల్..క్యూబా రెబెల్స్, అమెరికాపై మాత్రం తీవ్ర స్వరంతో స్పందించేవారు. -
అవగాహన లేమితోనే వైఫల్యం
భారత్‌లో 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం మరణించింది. కానీ 21వ శతాబ్దంలోకూడా అది తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక జవాబుదారితనం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్‌కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది. అందుకే.. వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావజాలం చిరకాలం వర్ధిల్లాలి. ఇటీవలే ఒక సోషల్ మీడియా కోణంగి నన్ను కమ్మీ–డాగ్ (కమ్యూనిస్టు కుక్క) అని పిలిచాడు. వెంటనే నేను తీవ్ర ఆలోచనలో మునిగిపోయాను. కుక్క అనే అంశాన్ని ఈ సందర్భంలో అర్థం చేసుకోవడం సులభమే. త్రిపురలో ప్రజా తీర్పు నేపథ్యంలో ప్రత్యేకించి బీజేపీ సోషల్ మీడియా పోకిరీలు పట్టలేని సంతోషంతో ఉండటమే కాకుండా కమ్యూనిస్టులపై తీవ్ర నిందాత్మక వ్యాఖ్యలు గుప్పిస్తున్న సందర్బం అది. దీన్ని పక్కనపెడితే, నేను కూడా తప్పకుండా కమ్యూనిస్టునే అయివుంటాను అని అతగాడు ప్రకటించిన అభిప్రాయమే నన్ను ఆలోచింపజేసింది. సోషల్ మీడియా కోణంగిలు నిరక్షర కుక్షిలే..! ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ఉత్పత్తి చేసిన కోణంగిల– ట్రోల్స్–నిరక్షరాస్యత కింద నేను దీన్ని కొట్టిపడేయాలి. నన్ను కమ్యూనిస్టుగా పిలవడానికి నాకున్న ఏకైక అర్హత ఏమిటంటే నేను జేఎన్‌యూలో చదవడం, గడ్డం పెట్టుకున్న వారిని సమర్థించడం, తరచుగా గుడ్డ సంచీ వాడటమే. ఇది మినహా నా జీవితం పొడవునా నేను కమ్యూనిస్టు సిద్ధాంతం, దాని ఆచరణను విమర్శిస్తూ వచ్చాను. విద్యార్థిగా నేను సమతా యువజన్ సభలో చేరాను. ఇది జేఎన్‌యూలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐకి వ్యతిరేకంగా పనిచేసే సంఘం. తర్వాత గాంధియన్–సోషలిస్ట్ స్రవంతికి చెందిన సమతా సంఘటన్, సమాజ్‌వాదీ పరిషత్‌తో పనిచేశాను. ఇవి కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలకు చాలా దూరంగా ఉంటాయి. విద్యావిషయకంగా నేను 1980లు, 1990లలో ప్రాబల్యంలో ఉండిన మార్క్సిస్ట్ ఛాందసత్వం పట్ల అసమ్మతి తెలి పాను. పైగా నేను పనిచేస్తున్న సీఎస్డీఎస్ (వర్ధమాన సమాజాల అధ్యయన కేంద్రం) తరచుగా వామపక్ష మేధావుల దాడికి గురయ్యేది. చాలా స్పష్టంగా ఈ బీజేపీ ట్రోల్స్‌కి ఇదేమాత్రం తెలీదన్నది స్పష్టం. నేను కొనసాగుతున్న మేధో ప్రపంచం అసలు ఉనికిలోనే ఉండదని వీళ్ల భావన కావచ్చు. వీళ్ల ప్రాపంచిక దృక్పథం చాలా సరళంగా ఉంటుంది. అదేమిటంటే పేదలు, విప్లవం గురించి మాట్లాడే ఎవరినైనా సరే వామపక్షం, కమ్యూనిస్టు, సోషలిస్టు, మావోయిస్టు, అర్బన్ నక్సలైట్, రెడ్ అని ముద్రలు వేసేయడమే వీరికి తెలిసిన విద్య. తగిన సాక్ష్యాధారాల విషయంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఈ ట్రోల్స్ మరికొంత లోతైన భావనను సూచిస్తున్నారు. అదేమిటంటే వామపక్షానికి మన కాలంలో అర్థం మారిందన్నదే. ఈరోజు వామపక్షానికి రెండు రకాల విశిష్ట అర్థాలున్నాయి. పాత అర్థంలో చూస్తే కమ్యూనిస్టులు అంటే మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నమ్మేవారు, సోవియట్ రష్యా తరహా ప్రభుత్వ సోషలిజాన్ని బలపర్చేవారు, భారత్‌లోని అనేక కమ్యూనిస్టు పార్టీలలో ఏదో ఒకదానికి చెంది ఉండేవారు అని అర్థం. వామపక్షానికి ప్రస్తుతం ఏర్పడిన కొత్త అర్థంలో సమానత్వ భావనవైపు నిలబడే ప్రతి ఒక్కరూ చేరతారు. కమ్యూనిస్టు వామపక్షాలు, గాంధియన్ సోషలిస్టులు, సోషలిస్టులు, అంబేద్కరి స్టులు, ఫెమినిస్టులు అందరూ ఈ కోవలోకి వస్తారు. ఈ అన్ని రకాల శ్రేణులకు చెందినవారు ఈ ముద్రను అంగీకరించరు. పైగా ఇది పెద్దగా ఉపయోగపడే వర్ణన కాదు కూడా. కానీ కొత్త ప్రపంచం వీళ్లను ఈ దృష్టితోనే చూస్తోంది. అంతర్గత పోరు అంతిమ పతనాన్ని ఆపగలదా? పాత వామపక్షం మరణించింది. త్రిపురలో 25 ఏళ్లుగా సాగిన సీపీఎం పాలన నాటకీయంగా పతనం కావడం.. భారతీయ కమ్యూనిస్టు పార్టీల పతనం, క్షీణతకు చెందిన సుదీర్ఘ ప్రక్రియను మరోసారి ఎత్తి చూపింది. 1970లలో వామపక్ష నిరోధక ప్రక్రియ మొదలయ్యాక, దాని ప్రభా వం కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురలకు, జేఎన్యూకు మాత్రమే పరిమితమైపోయింది. 2011లో పశ్చిమబెంగాల్లో వామపక్ష పరాజయంతో కమ్యూనిస్టు పార్టీల అంతిమ పతనం ప్రారంభమయింది. వారు ఇప్పుడు కేరళలో పాలనలో ఉన్నప్పటికీ, సీపీఎంలో తీవ్రమవుతున్న అంతర్గత ముఠా పోరు దాని అంతిమ పతనాన్ని తిరగతోడే అవకాశాలను ఏరకంగానూ పెంపొందించదు. ఇక పార్లమెంటేతర కమ్యూనిస్టులుగా పేరొందిన చిన్న బృందం మావోయిస్టులు రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అనే కాల్పనిక భ్రమను అనుసరిస్తున్నారు కానీ భారత భద్రతా బలగాల ముట్టడిలో అంతమయ్యేందుకు వీరు చేరువలో ఉన్నారు. స్వేచ్ఛ కోసం మానవ ఆకాంక్షను మరిస్తే ఎలా? పాత వామపక్ష మరణం అనేది ఏమాత్రం విస్మరించలేని ముగింపు. యుఎస్ఎస్ఆర్ తరహా సోవియట్ సోషలిజానికి చెందిన రాజకీయ, ఆర్థిక వ్యవస్థ విఫలమైంది. రాజ కీయంగా అది ప్రవచించిన సోషలిస్టు ప్రజాస్వామ్యం నియంతృత్వం ముసుగులో పార్టీ నియంతృత్వాన్ని ప్రతి పాదించే వాస్తవ ఉద్దేశాన్ని కలిగివుంది. సోవియట్ యూనియన్, తూర్పు యూరోపియన్ కమ్యూనిస్టు వ్యవస్థల పతనం ఆ తరహా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తీర్పును స్పష్టంగా సూచించింది. తన పాలనలో స్టాలిన్ లక్షలాదిమంది రైతులను వధించడం, పోల్‌పాట్ సాగిం చిన మారణకాండ వంటివి కమ్యూనిజం ముసుగులో కొనసాగిన నిరంకుశాధికారపు అతి చర్యలకు తిరుగులేని ఉదాహరణగా నిలిచిపోయాయి. కమ్యూనిస్టు రాజకీయ వ్యవస్థ స్వేచ్ఛకోసం మానవుడి తృష్ణను గుర్తించడంలో విఫలం కాగా, కమ్యూనిస్టు ఆర్థిక వ్యవస్థ మార్కెట్ తర్కాన్ని, ఆర్థిక ప్రోత్సాహకాల అవసరాన్ని గుర్తించడంలో విఫలమైంది. ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం ఒక రకం సమానత్వాన్ని సృష్టించింది కానీ ఆర్థిక వ్యవస్థను అది అత్యల్ప సమతుల్యస్థితికి కుదించివేసి వాణిజ్యతత్వాన్ని, సృజనాత్మకతను చంపేసింది. ఇక ప్రభుత్వ సోషలిజం సృష్టించి పెట్టిన నిరంకుశాధికార వైపరీత్యం మార్కెట్లు దాంతో నడవవు అనే సత్యానికి అద్భుత తార్కాణంగా నిలిచిపోయింది. పైగా, పర్యావరణం, నిర్ణయాలను తీసుకోవడంలో కేంద్రీకరణకు సంబంధించిన ఈ ఆర్థిక వ్యవస్థల రికార్డు భయానకంగా మిగిలిపోయింది. నిస్వార్థ త్యాగమూర్తులు జాతి వ్యతిరేకులా? అంతర్జాతీయ కారణాలతోపాటు, భారత్‌లో కమ్యూనిస్టు వామపక్షం కుప్పగూలడానికి ఇక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడంలో దానికి ఎదురవుతున్న అసమర్థతే ప్రధాన కారణం. మన కమ్యూనిస్టుల సైద్ధాంతిక పార్శ్వం లోకి యూరోకేంద్రకవాదం జొరబడింది. దీంతో తాము పనిచేస్తున్న సమాజాన్ని వ్యవస్థాగతంగానే వీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మన దేశంలో అసమానత్వ కేంద్రంగా కులం ఉందన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలో వీరు విఫలమయ్యారు. అలాగే భారత జాతీయ ఉద్యమం ప్రాధాన్యత స్వభావాన్ని అవగాహన చేసుకోవడంలో వైఫల్యం కూడా ఈ సమస్యలోంచే పుట్టుకొచ్చింది. మరింత లోతుగా చూస్తే, సగటు భారతీయుడి సాంస్కృతిక సున్నితత్వాన్ని తీర్చిదిద్దిన మత, సంప్రదాయిక ప్రపంచాన్ని గుర్తించి, ఎత్తిపట్టడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. వేలాది కమ్యూనిస్టుల నిస్వార్థపూరితమైన త్యాగాలను నిర్లక్ష్యం చేసి వారిని జాతి వ్యతిరేకులుగా ముద్రించడం తప్పే అవుతుంది. కానీ బయట నుంచి వారు భారత్‌కు తీసుకొచ్చిన సిద్ధాంతమే వారి అంతిమ వైఫల్యానికి దారితీయడం విషాదకరం. దీనర్థం ఏమిటంటే 20వ శతాబ్దపు కమ్యూనిస్టు వామపక్షం ధోరణి మరణించింది. ఇది ఒకందుకు మంచిదే, కానీ రెండో కోణంలో మరింత లోతుగా చూస్తే, వామపక్షం 21వ శతాబ్దంలోకూడా తన ప్రాసంగికతను కొనసాగిస్తోంది. ఈ కోణంలో వామపక్షం సమానత్వం కోసం, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామిక జువాబుదారీతనం కోసం, పర్యావరణ స్వావలంబన కోసం నిలబడుతోంది. దోపిడీ, అన్యాయంతో కూడిన బలమైన పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ అది ‘వామపక్షం’ గానే ఉంటూ కొనసాగుతోంది. కానీ ఈ లక్ష్య సాధన కోసం అది కొత్త మార్గాలను అన్వేషించడంలో తపన పడుతోంది. ఈ సానుకూల అర్థంలో వామపక్షం భారత్‌కు పరాయిది కాదు. నిజానికి సూటిగా చెప్పాలంటే మన రాజ్యాంగ నిర్మాణపు భావజాలమే వామపక్ష స్వభావంతో ఉంటోంది. చివరగా... వామపక్షం మరణించింది. కానీ వామపక్ష భావాలు చిరకాలం వర్ధిల్లాలి. - యోగేంద్ర యాదవ్ వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యులు 98688 88986 -
కమ్యూనిస్టు రారాజు!
సమష్టి నాయకత్వ ప్రాధాన్యతను ప్రవచించే కమ్యూనిస్టు పార్టీలు చివరకు వ్యక్తి ప్రాధాన్యమున్న పార్టీలుగా రూపాంతరం చెందడం ప్రపంచంలో కొత్తగాదు. అధికారం ఉన్నచోటా, లేనిచోటా ఇది కనబడుతూనే ఉంటుంది. చైనా కమ్యూనిస్టు పార్టీ కూడా అదే తోవన వెళ్లదల్చుకున్నదని ఆదివారం వెల్లడైన ప్రతిపాదనలు ధ్రువీకరిస్తున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను యావజ్జీవ అధ్యక్షుడిగా చేయడం, ఉపాధ్యక్ష పదవికి కూడా అదే వర్తింపజేయడం ఆ ప్రతిపాదనల్లో అతి కీలకమైనది. సోమవారం ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు మూడు రోజులు కొనసాగి బుధవారం ముగుస్తాయి. దీంతోపాటు మరో పది ప్రతిపాదనలను అది పరిశీలిస్తుంది. మిగిలినవాటి మాట అటుంచి షీ జిన్‌పింగ్‌కు శాశ్వత అధ్యక్ష పదవి కట్టబెట్టే ప్రతిపాదనకు ఏకగ్రీవ ఆమోదం లభించడం లాంఛనప్రాయమేనని వేరే చెప్పనవసరం లేదు. చైనా అధికారిక పత్రికలన్నీ ఇప్పటికే అందుకాయన అన్నివిధాలా అర్హుడంటూ స్తోత్రపాఠాలు ప్రారంభించాయి. పద్నాలుగేళ్ల తర్వాత దేశ రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించడం ఇదే మొదటిసారి. ఇప్పుడున్న రాజ్యాంగ నిబంధన ప్రకారం అయిదేళ్లపాటు ఉండే దేశాధ్యక్ష పదవిలో రెండు దఫాలు మించి ఉండటం సాధ్యపడదు. ఆ లెక్కన 2013లో అధ్యక్షుడిగా ఎన్నికైన షీ జిన్‌పింగ్ 2023 వరకూ ఆ పదవిలో ఉండాలి. సవరణకు కేంద్ర కమిటీ ఆమోదం లభించాక మార్చి 5న ప్రా రంభం కాబోయే చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పరిశీలనకు వెళ్తుంది. 2,924మంది సభ్యులుండే ఆ సభ దీనికి ఆమోదముద్ర వేయడం ఖాయం. నిరుడు అక్టోబర్‌లో జరిగిన పార్టీ కాంగ్రెస్‌లోనే షీ జిన్‌పింగ్ తిరుగులేని అధినాయకుడిగా రూపొందుతున్న దాఖలాలు కనబడ్డాయి. ఆ మహాసభల్లో జిన్‌పింగ్ వరసగా రెండోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతోపాటు దేశ చరిత్రలో అంతవరకూ మావో, డెంగ్ జియావో పింగ్లకు మాత్రమే దక్కిన అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ‘మావో ఆలోచనా విధానం’, ‘డెంగ్ జియావో పింగ్ సిద్ధాంతం’ వరసలో షీ జిన్‌పింగ్ ‘నూతన శకంలో చైనా విశిష్ట తలతో కూడిన సామ్యవాద ఆలోచనా విధానం’ కూడా చేరింది. మావో, డెంగ్లను మాత్రమే సంబోధించే ‘అధినేత’ పదాన్ని ఆయనకు కూడా ఉపయోగించడం ప్రారంభించారు. వాస్తవానికి నిరుడు జరిగిన పార్టీ కాంగ్రెస్ సందర్భంలోనే ‘శాశ్వత అధ్యక్ష పదవి’ షీ జిన్‌పింగ్ సొంతమవుతుందన్న ఊహాగానాలొచ్చాయి. ఎందుకంటే ఆ సమావేశాల్లో జిన్‌పింగ్ వారసుడిగా ఎవరినీ ప్రముఖంగా చూపలేదు. సాధారణంగా ప్రధాన కార్యదర్శితోపాటు రెండో స్థానంలో ఉండేవారికి పార్టీ కాంగ్రెస్ నిర్వహణలో ముఖ్య బాధ్యతలు అప్పజెబుతారు. ఆ రకంగా వారు ప్రచారంలోకొస్తారు. జిన్‌పింగ్‌ను తిరుగులేని అధినేతను చేయడానికి కొన్నేళ్లుగా చాలా ప్రయత్నాలే సాగుతున్నాయి. అందులో ‘అవినీతి వ్యతిరేక పోరు’ ప్రధానమైంది. జిన్‌పింగ్ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కాగలరనుకున్న చోంకింగ్ మున్సిపల్ కమిటీ మాజీ కార్యదర్శి సన్ ఝెం కాయ్ తోపాటు ఆయనకు మద్దతునీయగలరని భావించిన మరో 12మంది సీనియర్ నాయకులపై అవినీతి ముద్రవేసి పార్టీ నుంచి బయటకు నెట్టడం ఆ ప్రయత్నాల్లో ఒకటి. తన అధికార పీఠాన్ని సుస్థిరం చేసుకోవడానికి షీ జిన్‌పింగ్ చేస్తున్న ప్రయత్నాలు ఏకకాలంలో ఆయన బలాన్ని, బలహీనతలను సూచిస్తాయి. పార్టీలో ప్రత్యర్థుల మాట అటుంచి కనీసం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేవారెవరూ మిగల్లేదని ఈ పరిణామం తెలియజెబుతోంది. అది ఖచ్చితంగా ఆయన బలాన్నే సూచిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు అమల్లో ఉన్న నిబంధన ప్రకారం షీ జిన్‌పింగ్ పదవీకాలం మరో అయిదేళ్లుంటుంది. అది ముగిసే తరుణంలో శాశ్వత అధికారం కోసం ఆయన ప్రయత్నించవచ్చు. కానీ అప్పటికల్లా తనకు పార్టీపై పట్టు ఉంటుందో లేదోనన్న బెంగ ఆయనను పీడించడం వల్ల ముందే ఆ పని చేసినట్టు కనబడుతోంది. ఆర్థిక రంగంతోపాటు ఇతర రంగాల్లో తీసుకోబోయే అనేక చర్యలు తనకు అవరోధాలవుతాయన్న భావన ఆయనకు కలిగినట్టుంది. మావో హయాంలో, మరీ ముఖ్యంగా సాంస్కృతిక విప్లవకాలంలో ఘోర తప్పిదాలు జరిగాయని, దీనంతటికీ ఒకే వ్యక్తి వద్ద అధికారం కేంద్రీకృతం కావడమే కారణమని డెంగ్ జియావోపింగ్ నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆరోపించింది. ఇలాంటి ధోరణులు తలెత్తకుండా ఉండేందుకని 1982లో ఆమోదించిన దేశ రాజ్యాంగంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఎవరూ రెండు దఫాలకు మించి కొనసాగరాదన్న నిబంధన విధించారు. జిన్‌పింగ్‌కు ఇప్పుడున్న పదవులు తక్కువేమీ కాదు. ఆయన దేశాధ్యక్షుడు మాత్రమే కాక కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి. ఇవిగాక కేంద్ర మిలిటరీ కమిషన్ చైర్మన్, కేంద్ర జాతీయ భద్రతా కమిషన్ చైర్మన్, కేంద్ర సైనిక, పౌర ఏకీకృత అభివృద్ధి కమిషన్ తదితర అనేక పదవులున్నాయి. ఒక వ్యక్తి వద్ద పదవులన్నీ కేంద్రీకృతమైనప్పుడు, తిరుగులేని అధికారాలు చేజిక్కించుకున్నప్పుడు పర్యవసానాలెలా ఉంటాయో చరిత్ర నిండా మనకు దాఖలాలు కనబడతాయి. అలాంటివారు నియంతలుగా మారి దేశ ప్రజలపై స్వారీ చేయడమే కాదు...వేరే దేశాలకు ముప్పుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మతిమాలిన విధానాల వల్ల ప్రపంచంలో దాని స్థానం క్రమేపీ పలచనవుతోంది. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న చైనా దాన్ని భర్తీ చేయాలని చూస్తోంది. అదే సమయంలో ఈ ప్రాంతంలో తిరుగులేని శక్తిగా రూపొందాలనుకుంటోంది. ఇంటా బయటా ఇందుకెదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడానికి అవసరమైన సంపూర్ణమైన అధికారాలు తనకుండాలని షీ జిన్‌పింగ్ విశ్వసిస్తున్నారు. అది చివరకు జిన్‌పింగ్‌ను ఎక్కడికి తీసుకెళ్తుందో, చైనాను ఏ తీరానికి చేరుస్తుందో రాగలకాలంలో తెలుస్తుంది. -
చైనా కీలక నిర్ణయం.. ఫుల్ పవర్ ఆయనకే..
బీజింగ్ : చైనా అనూహ్య నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఆ దేశానికి అధ్యక్షుడుగా పనిచేస్తున్న జీ జిన్‌పింగ్‌ను నిరవధికంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకుగానూ ఆ దేశ రాజ్యాంగంలో మార్పులు చేయబోతోంది. ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడుగా కొనసాగాలనే నిబంధనను తొలగించాలని చైనా రూలింగ్ కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించినట్లు కీలక వర్గాల సమాచారం. 64 ఏళ్ల వయసున్న జీ జిన్‌పింగ్ తమ దేశ రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు ఐదేళ్లపాటు పనిచేసిన తర్వాత దిగిపోవాలి. అయితే, ఇప్పటికే ఒక దఫాను పూర్తి చేసుకున్న ఆయనను రెండోసారి ఎన్నుకునేందుకు మార్చి 5న పార్లమెంటు సమావేశం కానుంది. ఇప్పటికే ఆయన పార్టీ, మిలిటరీ చీఫ్‌గా నిరవధికంగా కొనసాగుతున్నారు. గతేడాది అక్టోబర్‌లోనే ఈ ప్రతిపాదనను ఆమోదించింది. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులు నిరవధికంగా కొనసాగేలా పార్టీ కేంద్ర కమిటీ ఓ కీలక ప్రతిపాదన చేసి చైనా అధికార మీడియా జినువా వెల్లడించింది. కాగా, చైనా ఆదర్శాలతో కూడిన సోషలిజంపై జీ జిన్‌పింగ్ ఆలోచనలను రాజ్యాంగంలో చేర్చాలనీ కూడా కేంద్ర కమిటీ ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈ మేరకు చేసిన రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. అయితే, చైనా పార్లమెంట్లో ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అందులో ఉన్నవారంతా కూడా పార్టీ విధేయులే. -
నేపాల్‌లో కీలక పరిణామం
కఠ్మాండు: నేపాల్‌లో రెండు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎన్–యూఎంఎల్, సీపీఎన్–మావోయిస్టు సెంటర్ చారిత్రక విలీన ఒప్పందానికి అంగీకారం తెలిపాయి. దీంతో నేపాల్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ ఆవిర్భావానికి బాటలు పడినట్లయింది. నేపాల్ సార్వత్రిక, ప్రావిన్షియల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈ కూటమి ఏకం కానుందని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిని నిజం చేస్తూ ఇప్పుడు ఒప్పందం కుదిరింది. ఈ రెండు పార్టీలు విలీనం కావడంతో నేపాల్‌లో రాజకీయ స్థిరత్వానికి అవకాశం లభిస్తుందని, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్–యూఎంఎల్, మాజీ ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్–మావోయిస్టు సెంటర్ కలసి డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. 275 మంది సభ్యుల పార్లమెంట్లో ఈ కూటమి 174 స్థానాలను దక్కించుకుని అధికారాన్ని కైవసం చేసుకుంది. -
‘ఎర్ర’కోటలో కాషాయ కాంతులు!
అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఈసారి త్రిపురలో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ రాష్ట్రం కోసం ‘కాంగ్రెస్ ముక్త భారత్’ విధానాన్ని మార్చుకుని.. ‘కమ్యూనిస్ట్ ముక్త త్రిపుర’ నినాదంతో దూసుకెళ్తోంది. 1972లో త్రిపుర ఏర్పాటైనప్పటినుంచి తొలిసారిగా ‘లెఫ్ట్–రైట్’ మధ్య పోటీ నెలకొందని ‘పీపుల్స్‌పల్స్’ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది. ప్రతి ఊరూ వామ‘పక్ష’మే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గుతున్నా వారికి కంచుకోటలా ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర చాలా కీలకమైనది. చిన్న రాష్ట్రమైనా 4 దశాబ్దాలుగా (1988–92 దఫా మినహా) అధికారంలో ఉండటంతో ఇంటింటికీ వేళ్లూనుకుపోయిన పరిస్థితి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వామపక్ష ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలదే పైచేయి. ‘ఎర్ర’కోటలో కమ్యూనిస్టులను ఎదుర్కొనేందుకు ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చాలా ప్రయత్నించింది. త్రిపురలో రెండే వర్గాలుంటాయి. ఒకటి సీపీఎం అనుకూల వర్గం (దాదాపు 60%), రెండోది వ్యతిరేక వర్గం (మిగిలిన 40%). సీపీఎంను దెబ్బతీస్తూ.. త్రిపురలో బెంగాలీల జనాభా ఎక్కువ. దీనికితోడు కొంతకాలంగా త్రిపురలో గిరిజన తెగల మధ్య (సీపీఎం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య) ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఇన్నిసార్లు మద్దతిస్తున్నా కాంగ్రెస్‌కు అధికారం దక్కకపోవటంతో సీపీఎం వ్యతిరేక వర్గం ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో అధికార వ్యతిరేక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మూడేళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలెట్టింది. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎంపై ప్రభుత్వ వ్యతిరేకతను, రాష్ట్రం వెనుకబాటుతనాన్ని ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. కమ్యూనిస్టులకు బలమైన అండగా నిలుస్తున్న కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు గాలం వేసేందుకు.. ‘అధికారంలోకి వస్తే ఏడో వేతనసవరణ అమలుచేస్తాం’ అని హామీ ఇచ్చింది. దీని ప్రభావం రాష్ట్రంలోని లక్షన్నర మంది ఉద్యోగులపై, వారి కుటుంబాలపై సానుకూల ప్రభావం చూపవచ్చని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. అటు, బెంగాలీలు, గిరిజనులను, ప్రభుత్వ అనుకూల వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నడూ లేనంతగా త్రిపురలో ప్రముఖులతో ప్రచారం నిర్వహిస్తూనే.. ఇంటింటికి చేరువవుతోంది. అయితే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ బలమైన కమ్యూనిస్టు కోటను ఈ ఒక్క ప్రయత్నంలోనే దెబ్బకొట్టలేరని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఈసారికి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కవచ్చని అభిప్రాయపడింది. అధికారం మాదే ఈ ఎన్నికల్లో త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. 20వ బీజేపీ పాలిత రాష్ట్రంగా త్రిపుర మారనుందని ఆయన అగర్తలాలో సోమవారం పేర్కొన్నారు. పార్టీ మేనిఫెస్టోను పూర్తిగా అమలుచేసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని ఓటర్లకు భరోసానిచ్చారు. మణిపూర్, అస్సాంలలోనూ గతంలో ఒక్కసీటు కూడా లేని పరిస్థితినుంచి ఏకంగా అధికారాన్ని అందుకున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. -
త్రిపుర ప్రజల్ని బానిసలు చేశారు
సోనామురా/కైలాషహర్: త్రిపురలో అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రజల జీవితాలను బానిస బతుకులు చేసిందని, ఆ పార్టీని గద్దె దించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో మోదీ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాణిక్ సర్కార్‌పై దుమ్మెత్తిపోసిన మోదీ..బీజేపీ అధికారంలోకి వస్తే త్రిపురలో ‘హీరా’(హెచ్–హైవేలు, ఐ–ఇంటర్నెట్, ఆర్–రోడ్లు, ఏ–ఎయిర్వేస్) అభివృద్ధి చెందుతుందని అన్నారు. 25 ఏళ్లుగా నిరంతరాయంగా పాలిస్తున్న కమ్యూనిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రేషన్ కార్డు లాంటి చిన్నాచితకా అవసరాలకూ ఆ పార్టీ తలుపులు తట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఎవరైనా హత్యకు గురైతే ఆ పార్టీ నుంచి అనుమతి రానిదే ఎఫ్ఐఆర్ నమోదుచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు ప్రతి దానికీ ప్రజలు తమపైనే ఆధారపడేలా చేసారని, బానిసత్వానికి ఇది కొత్త రూపమని అభివర్ణించారు. లెఫ్ట్ పాలనలో త్రిపురలో అభివృద్ధి ఇసుమంతైనా కనిపించడం లేదని ఆరోపించారు. తామొస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలుచేస్తామన్నారు. -
నేపాల్ పీఠంపై కమ్యూనిస్ట్ కూటమి!
కఠ్మాండు: నేపాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, డిసెంబర్ చివరినాటికి తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కమ్యూనిస్ట్ పార్టీల కూటమి ప్రకటించింది. ఇటీవల జరిగిన చరిత్రాత్మక ఎన్నికల్లో ఈ కూటమిలోని సీపీఎన్– యూఎంఎల్, సీపీఎన్–మావోయిస్ట్ సెంటర్ పార్టీలు స్పష్టమైన మెజారిటీ సాధించిన నేపథ్యంలో.. కూటమి అధికార ప్రతినిధి బిష్ను రిజాల్ మంగళవారం ఈ ప్రకటన చేశారు. మొత్తం 275 స్థానాల పార్లమెంటులో 165 స్థానాలకు ప్రత్యక్షంగా, 110 స్థానాలకు ప్రాతినిధ్య ఓటు విధానంలో ఎన్నికలు జరిగాయి. ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగిన స్థానాల్లో కమ్యూనిస్ట్ పార్టీల కూటమి 113 సీట్లు గెలిచింది. ఇందులో సీపీఎన్–యూఎంఎల్ 77 సీట్లను, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ 36 స్థానాలను గెలుచుకున్నాయి. అధికార నేపాలీ కాంగ్రెస్ 21 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. -
మావో సరసన జిన్‌పింగ్!
అయిదేళ్లకోసారి జరిగే అత్యంత కీలకమైన చైనా కమ్యూనిస్టు పార్టీ 19వ జాతీయ మహాసభలు బీజింగ్‌లో బుధవారం ప్రారంభం కాబోతున్నాయి. వారం రోజులపాటు కొనసాగే ఈ సమావేశాలు వచ్చే అయిదేళ్లలో పార్టీ చేపట్టవలసిన కార్య క్రమాలతోపాటు, భిన్న రంగాల్లో దేశం అనుసరించాల్సిన మౌలిక విధానాలను కూడా నిర్ణయిస్తాయి. లక్ష్య నిర్దేశం చేస్తాయి. వీటికి సారథ్యం వహించగల ఉన్నత స్థాయి నాయకత్వాన్ని ఎన్నుకుంటాయి. ఈ సమావేశాల్లో దేశాధ్యక్షుడు జీ జిన్ పింగ్‌ను వరసగా రెండోసారి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతోపాటు దేశ చరిత్రలో ఇంతవరకూ మావో, డెంగ్ జియావోపింగ్లకు మాత్రమే లభించిన అరుదైన గౌరవాన్ని కూడా అందుకోబోతున్నారు. ‘మావో ఆలోచనా విధానం’, ‘డెంగ్ జియావోపింగ్ సిద్ధాంతం’ వరసలో జీ జిన్‌పింగ్ రాజకీయ తాత్వికతకు కూడా పార్టీ నియమ నిబంధనావళిలో చోటు లభిం చబోతోంది. ఇందుకోసం దాన్ని సవరించాలని నిర్ణయించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ తాత్వికతను ఏ పేరుతో వ్యవహరించదల్చుకున్నదో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఆ తాత్వికతను ‘నాలుగంచెల సమగ్ర వ్యూహమ’ని అంటున్నారు. తగు విధమైన సంపద్వంత సమాజ నిర్మాణం, చట్టబద్ధ పాలన స్థిరపరచడం, పటిష్టమైన పార్టీ క్రమశిక్షణ, వేగవంతమైన సంస్కరణల సాధన–ఆ నాలుగంచెల సమగ్ర వ్యూహం లోని ప్రధానాంశాలు. వీటిని 2021లో జరగబోయే పార్టీ శత వసంతాల ఉత్సవాల కల్లా సాధించాలని జీ జిన్‌పింగ్ చెబుతున్నారు. ఆయన అనం తరం 2022లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అధిష్టించగలరని అందరూ భావించిన కీలక చోంకింగ్ మున్సిపల్ కమిటీ మాజీ కార్యదర్శి సన్ ఝెంకాయ్ తోపాటు 12మంది సీనియర్ నాయకులను ‘అవినీతి ఆరోపణల’ కారణంగా బహిష్కరించాలని ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది గనుక జీ జిన్ పింగ్‌కు పార్టీలో ఎదురుండదు. ఆయన 2022 తర్వాత కూడా మరో అయిదేళ్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగడానికి అవరోధాలుండవు. సంప్రదాయం ప్రకారమైతే రెండు దఫాలు మించి ఎవరూ ఆ పదవిలో కొనసాగటం లేదు. కానీ అది నియమావళిలో లేదని ఒక నాయకుడు చెబుతున్న మాటల్నిబట్టి జీ జిన్‌పింగ్ ఆ సంప్రదాయాన్ని పాటించక పోవచ్చునన్న ఊహా గానాలొస్తున్నాయి. జీ జిన్‌పింగ్ 2012లో జరిగిన పార్టీ జాతీయ మహాసభలో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టాక అప్పటికే పటిష్టంగా ఉన్న చైనా ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టించారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, మూడీస్ వంటి సంస్థల∙నివేదికలు ఈ సంగతి చెబుతున్నాయి. గత అయిదేళ్లలో వృద్ధి రేటు సగటు 7.2 శాతంగా ఉంది. ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 6.9 శాతానికి చేరుకుంది. ఆర్ధిక వృద్ధికి ప్రధానంగా దోహదపడే గృహ నిర్మాణ రంగం ఎగుడు దిగుళ్లను దాటుకుని గత మూడేళ్లలో సుస్థిరతను సంతరించుకుంది. నిరుటితో పోలిస్తే చైనా ఎగుమతులు 8.1 శాతం పెరిగాయి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తీరు తెన్నులు కూడా చైనా ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి. 2016లో నిరాశాజనకంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3.6 శాతం మేర వృద్ధి సాధించవచ్చునన్న అంచనాలున్నాయి. బ్యాంకింగ్, పరిశ్రమలు, మదుపు, రియల్ఎస్టేట్ రంగాల పని తీరు బాగుందని గణాంకాలు చెబుతున్నాయి. వీటికితోడు జీ జిన్‌పింగ్ మానస పుత్రిక అయిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టు రాగల కాలంలో చైనా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. ఇక చైనా ప్రజల జీవన ప్రమాణం చెప్పుకోదగ్గ రీతిలో మెరుగైంది. సగటు ఆయుర్దాయం 76.34 ఏళ్లుగా ఉంది. ఆసియా ఖండ దేశాల మౌలిక వసతులు మెరుగుపర్చడానికి అవసరమైన పెట్టుబడులు అందించేందుకు ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు (ఏఐడీబీ) నెలకొల్పడంలో చైనాదే కీలకపాత్ర. ఇలా భిన్న రంగాల్లో మెరుగ్గా ఉన్న చైనాకు అమెరికా అధ్యక్ష పీఠాన్ని డోనాల్డ్ ట్రంప్ అధిరోహించడం కలిసొచ్చింది. స్థిరచిత్తం కొరవడిన ట్రంప్ మాటెలా ఉన్నా తాను ప్రపంచీకరణకు, స్వేచ్ఛా వాణిజ్యానికి వెన్నుదన్నుగా ఉంటానని, కర్బన ఉద్గారాల తగ్గింపుపై కుదిరిన పారిస్ ఒడంబడికను ముందుకు తీసుకుపోయేం దుకు కృషి చేస్తానని మొన్న జనవరిలో దావోస్‌లో జీ జిన్‌పింగ్ ఇచ్చిన హామీ ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకునేలా చేసింది. చైనాపై కుదిరిన ఈ విశ్వాసానికి మూలం–దాని దగ్గరున్న వేలాదికోట్ల డాలర్ల నిధులు, ప్రపంచంలో ఏమూలనైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురికే తత్వం వగైరాలే. అమెరికాయే ఇప్పటికీ ప్రపంచంలో నంబర్ వన్ ఆర్ధిక వ్యవస్థ కావొచ్చుగానీ... గత దేశాధ్యక్షుల మాదిరి అంతర్జాతీయంగా ప్రభావవంతమైన ముద్రేయాలన్న ఆసక్తిగానీ, అందుకు కావల సిన శక్తిసామర్థ్యాలుగానీ ట్రంప్‌కు లేవు. అందుకే చైనాలో మాత్రమే కాదు.... ప్రపంచంలోనే జీ జిన్‌పింగ్ శక్తిమంతుడైన నాయకుడిగా ఎదగొచ్చునన్న అంచనా లున్నాయి. పాశ్చాత్య దేశాల ప్రమాణాలతో పోలిస్తే చైనా ఏక పార్టీ వ్యవస్థ అసలు ప్రజాస్వామికమైనదే కాదు. కానీ చైనా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం 8 కోట్ల 90 లక్షలు. జర్మనీ జనాభా కంటే ఇది అధికం. ఏడాదికోసారి సమావేశమయ్యే 205 మంది సభ్యులుండే కేంద్ర కమిటీ పార్టీ కాంగ్రెస్ నిర్ణయాల అమలు తీరును సమీక్షిస్తుంటుంది. దాని ఛత్రఛాయలో పనిచేసే 25మంది సభ్యుల పొలిట్‌బ్యూరో ప్రతి నెలా... ఏడుగురు సభ్యుల పొలిట్‌బ్యూరో స్థాయీ సంఘం వారానికోసారి సమావేశమై కేంద్ర కమిటీ నిర్ణయాల అమలును పర్యవేక్షిస్తాయి. విడిగా పనిచేసే కేంద్ర క్రమశిక్షణ కమిషన్ అవినీతిపరుల ఏరివేతలో నిమగ్నమై ఉంటుంది. కాలుష్యాన్ని తరిమి... అసమానతలను, అంతరాలనూ చక్కదిద్ది... గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలను పెంచి పట్టణాలు, నగరాలపై ఒత్తిళ్లు తగ్గించడం చైనా ముందున్న సవాళ్లు. వీటిని ఎదుర్కొనడానికి ఈ మహాసభలు ఎలాంటి దిశా నిర్దేశం చేస్తాయో వేచి చూడాలి. -
నేను తెలుసుకున్న కామ్రేడ్ సుందరయ్య
దక్షిణ భారతదేశంలోని తొలి తరం కమ్యూనిస్టు నేతల్లో నిరుపమాన వ్యక్తిత్వం కలిగిన ఒక గొప్ప నాయకుడి జ్ఞాపకాల కలబోత ‘నేను తెలుసుకున్న కామ్రేడ్ సుందరయ్య’. 1934లో కమ్యూనిస్టు పార్టీలో చేరినప్పటి నుంచి 1985 అస్తమయం వరకు పుచ్చలపల్లి సుందరయ్య సుదీర్ఘమైన రాజకీయ జీవితంలోని వివిధ చారిత్రక ఘట్టాల సమాహారం ఈ పుస్తకం. రెండు దశాబ్దాలపాటు సుందరయ్య వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ ఏపీ విఠల్ ఆయన జీవిత పరిణామక్రమాన్ని ఈ పుస్తకంలో వివరించారు. కమ్యూనిజం పేరు వింటేనే గొంగళిపురుగులు పాకినట్లు మధ్యతరగతి మేధావులు, సోషల్ మీడియా వ్యాఖ్యాతలు భావిస్తున్న ప్రస్తుత కాలంలో, దశాబ్దాలుగా శ్రామిక జనావళి విముక్తి ప్రదాతగా వెలుగొందిన కమ్యూనిస్టు ఉద్యమం వెనుకపట్టు పట్టినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో.. సుందరయ్య గురించి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఏమిటి? చట్టసభలో సభ్యులుగా ప్రమాణం కూడా చేయకముందే ఈ పార్టీనుంచి ఆ పార్టీలోకి ఫిరాయింపుదారులు జంప్ చేస్తున్న రోజుల్లో సుందరయ్య గొప్పతనం ఎవరికి కావాలి? అనేది మనముందు పెను ప్రశ్నగా నిలుస్తోంది. కానీ రాజకీయరంగంలో కనిపిస్తున్న విలువల దిగజారుడుతనం ఇలాగే కొనసాగితే నామమాత్రపు ప్రజాస్వామ్యంపైన కూడా ప్రజల విశ్వాసం పూర్తిగా క్షీణిస్తుంది. కేంద్రం, రాష్ట్రం అంటూ తేడా లేకుండా అన్ని పార్టీలూ, నేతలూ విలువల పతనం విషయంలో ఒకే తాను ముక్కలుగా ఉన్న స్థితిలో రాజకీయ రంగం ప్రక్షాళన కావాలంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, మానవీయ లక్షణాలను పుణికి పుచ్చుకోవడం, ప్రజలకోసం పోరాటం ఎలా చేయాలో, విరమిం చాల్సి వస్తే ఎలా విరమించాలో తెలిసి ఉండ టం... ఈ గుణాలకోసమే దేశంలోని, తెలు గు రాష్ట్రాల్లోని రాజ కీయ నాయకులతోపాటు యువతీయువకులు కూడా సుందరయ్య జీవిత విశేషాలు చదవటం అవసరం. 1930లో మాలపర్రు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు 18 ఏళ్లలోపు వయస్సులో అరెస్టయి తంజావూరు బోర్ట్సల్ స్కూలులో జైలు జీవితం సుందరయ్యను తీవ్ర అధ్యయన కర్తగా మార్చి కమ్యూనిస్టు భావజాలంతో పరి చయం కలిగించింది. విడుదలైన తర్వాత 1931లో అమీర్ హైదర్ ఖాన్‌తో కమ్యూనిస్టు పార్టీకి పూర్తికాలం కార్యకర్తగా ఉంటానని మాట ఇచ్చిన సుందరయ్య ఆ తర్వాత 1985లో కన్నుమూసేవరకు 55 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉమ్మడి సీపీఐలోనూ, తర్వాత సీపీఎంలోనూ కొనసాగారు. పార్టీ తాననుకున్న మార్గంలో నడవలేదని గ్రహించినప్పుడు సీపీఎం ప్రధాన కార్యదర్శిగా కేంద్రంలో తన పదవులకు 1978లో రాజీనామా చేసి పార్టీ లక్ష్యాల సాధనకు నాటి ఆంధ్రప్రదేశ్‌ను కార్యక్షేత్రంగా చేసుకుని జీవించినంత కాలం ఆ కర్తవ్యంలోనే గడిపిన జననేత సుందరయ్య. కేంద్ర కమిటీ నుంచి మళ్లీ కింది స్థాయిలోకి వచ్చి పనిచేయడం అత్యంత అరుదు. దానికీ సుందరయ్యే ఆద్యులు కావడం విశేషం. మద్రాసులో ఆంధ్రపత్రికలో పనిచేస్తున్న కార్మికుల డిమాండ్లను యాజమాన్యం తిరస్కరించినప్పుడు కార్మికులు సమ్మె చేస్తే పత్రిక వ్యవస్థాపకులు కాశీనాధుని నాగే శ్వరరావు సుందరయ్యతో సంప్రదింపులు జరిపి కొంతమేరకు కార్మికుల డిమాండ్లను ఆమోదించారు. ఈ సందర్భంగా కాశీనాథుని నాగేశ్వరరావు మాట్లాడుతూ కొంత అదనంగా సొమ్ము ఖర్చుపెట్టడం పెద్ద సమస్య కాదనీ, ఆంధ్రపత్రికలో కూడా సమ్మె అన్నది సంస్థ పరువుకు సంబంధించిన విషయమని, కొంచెం ముందుగానే నువ్వు నన్ను కలిసి వివరించి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని నొచ్చుకున్నారు. సమస్యను పట్టువిడుపుల వైఖరితో పరిష్కరించడంలో సుందరయ్య నేర్పును ఈ ఉదంతం తెలుపుతుంది. ఆయన పదేపదే చెప్పే విషయం ఏమిటంటే ‘‘ఈ సమాజగమనం ఒక్క మిల్లీమీటరయినా ముందుకు వెళ్లేం దుకు ప్రతి కమ్యూనిస్టూ ప్రయత్నించాలి. ఇదీ సాధ్యం కానప్పుడు కనీసం ఉన్న దశనైనా నిలబెట్టేందుకు కృషి చేయాలి. మన లక్ష్యం సిద్ధించిందా లేదా అన్నది ప్రధానం కాదు. దానిని బట్టి మన గమనాన్ని మార్చుకోవచ్చు. కానీ మనం అసలా దిశలో మానవాళి పురోగమన ప్రస్థానంలో నడుస్తున్నామా లేదా అన్నది ముఖ్యం’’. 55 సంవత్సరాల ఉద్యమ జీవితం సాక్షిగా మనిషి లక్ష్యం కోసం ఎందుకు నిలబడాలో చెబుతున్న సుందరయ్య జ్ఞాపకాలను అందుకే తెలుసుకోవాలి. ప్రతులకు: సాహితీ మిత్రులు– విజయవాడ ‘ మొబైల్: 93929 71359 కె. రాజశేఖరరాజు -
కేసీఆర్ చూపు.. నల్లగొండ వైపు!
-
కేసీఆర్ చూపు.. నల్లగొండ వైపు!
⇒ నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగే యోచన? ⇒ సన్నిహితుల వద్ద అంతరంగాన్ని వెలిబుచ్చి ఆరా తీసిన సీఎం సాక్షి, నల్లగొండ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లా వైపు దృష్టి సారించారా..? అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహం రచించారా? అందుకోసం వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి కూడా పోటీ చేయాలని భావిస్తున్నారా..? తద్వారా ఆ జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టవచ్చనీ యోచిస్తున్నారా..!?.. నాలుగైదు రోజులుగా నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్న అంశమిది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ నల్లగొండ జిల్లా నుంచి బరిలోకి దిగాలనే యోచిస్తున్నారని.. యాదృచ్ఛికంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారని అంటున్నారు. ఓ మిత్రుడి నుంచి ఆరా..! సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురితో రాజకీయంగా, వ్యక్తిగతంగా సంబంధాలున్నాయి. అలాంటి వారిలోని ఓ మిత్రుడు ఇటీవల కేసీఆర్‌ను కలిశారని.. ఆ సమయంలోనే నల్లగొండ జిల్లా నుంచి పోటీ విషయాన్ని కేసీఆర్ చూచాయగా వెల్లడించారని తెలుస్తోంది. ఆ జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలు, ప్రజల్లో తన పాలనపై ఉన్న అభిప్రాయం, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి విషయాలపైనా ఆ మిత్రుడి అభిప్రాయాన్నీ తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా.. ‘‘నేను ఈసారి ఎలాగూ రెండు చోట్ల పోటీ చేస్తాను. నల్లగొండ జిల్లా నుంచి చేద్దామనుకుంటున్నా.. ఎలా ఉంటుంది.. అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిపిస్తారా..’’అని ఆరా తీసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నల్లగొండపై దృష్టి సారించినట్టు అర్థమవుతోందని టీఆర్ఎస్ ముఖ్య నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ జిల్లా నుంచే ఎందుకు? నల్లగొండ జిల్లా నుంచి పోటీ చేయాలన్న కేసీఆర్ యోచన వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నల్లగొండ జిల్లాలో తొలినుంచీ కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలకు పట్టు ఉంది. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ ఆవిర్భావం, రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. అటు కాంగ్రెస్ కూడా దీటైన ఫలితాలనే సాధించింది. ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ మద్దతిచ్చిన సీపీఐ అభ్యర్థి ఒకరు గెలుపొందారు. ఇందులో కాంగ్రెస్ దిగ్గజాలైన కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా ఉన్నారు. జానారెడ్డి సీఎల్పీ నాయకుడిగా, కోమటిరెడ్డి సీఎల్పీ ఉపనాయకుడిగా, ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా కీలక పదవుల్లో ఉన్నారు. వీలున్నప్పుడల్లా ఈ ముగ్గురు అధికార టీఆర్ఎస్పై నిప్పులు చెరుగుతున్నారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల కాంగ్రెస్ కేడర్‌లోనూ ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలో 2015 డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించినా.. నల్లగొండ జిల్లాలో మాత్రం ఓడిపోయింది. ఇది టీఆర్ఎస్ శ్రేణులతో పాటు కేసీఆర్‌ను కూడా ఆలోచనలో పడేసింది. బలోపేతం చేసేందుకు.. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయిలో వ్యతిరేకత లేకపోయినా.. కొంతమేర స్థానిక నాయకత్వం, ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత వస్తోంది. కేసీఆర్ చేయించిన సర్వేల్లోనే ఈ విషయం వెల్లడైంది. అందులోనూ పాత నల్లగొండ జిల్లా పరిధిలో ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా చోట్ల టీఆర్ఎస్ నేతల గ్రాఫ్ పడిపోయినట్లు తేలింది. మరోవైపు కాంగ్రెస్ నేతల గ్రాఫ్ మెరుగుపడింది. ఇక పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గ్రూపు గొడవలు, సరైన నాయకత్వం లేకపోవడం వంటి సమస్యలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో పార్టీ బలాన్ని, ఊపును పెంచేందుకు వ్యూహం పన్నుతు న్నారని, అందులో భాగంగా అక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నా రని తెలుస్తోంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్
⇒ ఎమ్మెల్యే కోటాలో కృష్ణారెడ్డి, ఉళ్లోల్ల, మైనంపల్లి నామినేషన్లు దాఖలు ⇒ వీరి ఎన్నిక ఏకగ్రీవమే ⇒ 10న లాంఛనంగా ప్రకటన సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల కోటాలో టీఆర్ఎస్ పక్షాన నామినేషన్లను దాఖలు చేసిన ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఉళ్లోల్ల గంగాధర్‌గౌడ్, మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. ఈ కోటాలో ఖాళీ అయిన మూడు స్థానాలకు గడువు ముగిసే సమయానికి మూడు నామినేషన్లే దాఖలయ్యాయి. బుధవారం వీరి నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 10న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక, సాయంత్రం 3 గంటలకు వీరు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించి, సర్టిఫికెట్లను అందజేయడం లాంఛన ప్రాయమే. మంగళవారం శాసనసభ కార్యదర్శి రాజా సదారాంకు కృష్ణారెడ్డి, హనుమంతరావు, గంగాధర్‌గౌడ్ నామినేషన్న్లు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, కేటీఆర్, పద్మారావుగౌడ్, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కల్వకుంట్ల కవిత, మల్లారెడ్డి, చీఫ్ విప్‌లు కొప్పుల ఈశ్వర్, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ప్రశాంత్‌రెడ్డి, పాషాఖాద్రీ, శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజ్, రవీంద్రకుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, పలువురు నగర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్సీ అభ్యర్థులు నివాళులర్పించారు. బురద జల్లడమే విపక్షాల లక్ష్యం: నాయిని కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని హోంమంత్రి నాయిని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నాడని, మంత్రులపై ఆరోపణలు చేస్తే మీడియాలో వార్తలు వస్తాయని అదే పనిగా అబద్ధాలు చెపుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ లేదని, ఉత్తమ్ ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని, ఆ మాటలు నమ్మి దిగ్విజయ్ తన స్థాయిని దిగజార్చుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉంటే ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. ఇప్పటికైనా విపక్షాలు బుద్ది తెచ్చుకుని అనవసర విమర్శలు మాని ప్రజలతో ఉంటూ, అభివృద్ధికి సహకరిస్తే మంచిదని హితవు పలికారు. ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు, గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలు రాబోతుండడంతో మండలిలో టీఆర్ఎస్ బలం మరింత పెరుగుతుందన్నా రు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని ఆదరణ కేసీఆర్‌కు ఉందని, ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తున్నది టీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చౌరస్తాలో ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధమేనని ప్రతిపక్షాలకు నాయిని సవాల్ విసిరారు. -
యూపీలో విజయం మాదే
-
ప్రజలను రెచ్చగొడుతున్నాయి
కాంగ్రెస్, లెఫ్ట్‌లపై వెంకయ్య ధ్వజం ⇒ ఉనికికోసం వర్సిటీల్లో అశాంతిని సృష్టిస్తున్నాయి ⇒ జాతి వ్యతిరేక శక్తులకు వంతపాడుతున్నాయి ⇒ రాష్ట్రపతి పదవి రేసులో లేను సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కూడబలుక్కుని వర్సిటీల్లో అశాంతిని రేపుతూ అస్థిత్వాన్ని చాటుకునేందుకు ప్రయ త్నిస్తున్నాయని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ నోట్ల రద్దు తర్వాత కూడా పురోగమిస్తోందని, ప్రధాని మోదీ విజయాలను జీర్ణించుకోలేకే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్ని రెచ్చ గొడుతున్నాయని దుయ్యబట్టారు. మోదీకి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక, ప్రజలను కొత్త ఎత్తుగడలతో కులాలు, మతాల పేరుతో చీలుస్తున్నాయని ఆరో పించారు. ప్రధానిని ఎదుర్కోలేక జాతి వ్యతిరేక శక్తులకూ వంత పాడేందుకు సిద్ధపడుతున్నాయని మండిపడ్డారు. శుక్రవారం తన నివాసంలో పార్టీ నాయకులు నల్లు ఇంద్ర సేనారెడ్డి, కృష్ణసాగర్‌రావులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని, వామపక్షాలతో కలసి వర్సిటీల్లో అశాంతిని రాజేస్తున్నదని ఆరోపించారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో వాద, ప్రతివాదనలు సహజమన్నారు. ఏ సమస్యపై అయినా రాజకీయపార్టీలతో తాము చర్చకు సిద్ధమని చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ప్రాతిపదికన ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదన్నారు. తాను రాష్ట్రపతి పదవి కోసం రేసులో లేనని ఒక ప్రశ్నకు వెంకయ్య బదులిచ్చారు. తాను కేంద్ర మంత్రిగా ఉండడం మీడియాకు ఇష్టం లేదా అని సరదాగా ప్రశ్నించారు. బీజేపీ గెలుస్తుంది... ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే విశ్వాసం తనకుందని వెంకయ్య నాయుడు చెప్పారు. తన కంచుకోట అయిన అమేథీలోనూ కాంగ్రెస్ పార్టీ బీటలు వారుతోందని, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు సిద్ధాంతం విఫలమవు తోందని, వామపక్ష అతివాదాన్ని ప్రజలు తిరస్కరించారని అన్నారు. హత్యా రాజకీయా లు సీపీఎంకు ఏమాత్రం ఉపయోగపడవన్నారు. కేరళలో ఆరెస్సెస్ కార్యాలయాలు, బీజేపీ నాయకులపై దాడులకు దిగుతున్నారన్నారు. కాగా, కేరళ సీఎం విజయన్ను హత్య చేస్తే రూ. కోటి ఇస్తానంటూ ఓ ఆర్ఎస్ఎస్ నేత చేసిన ప్రకటనను ఖండిస్తున్నామన్నారు. -
చంద్రబాబు తేనె పూసిన కత్తి
సీపీఐ(మావోయిస్టు) ఏపీ కమిటీ ధ్వజం సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు తేనె పూసిన కత్తి అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) ఏపీ కమిటీ మండిపడింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో జరిగిన ఎన్కౌంటర్ పచ్చి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేసింది. మత్తు మందులు కలిపిన పదార్థాలను కోవర్టుల ద్వారా మావోయిస్టులకు తినిపించి దారుణానికి ఒడిగట్టారని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏఓబీలో జరిగిన హత్యాకాండకు చంద్రబాబు, అతడి హంతక పోలీసు ముఠా కారణమని పేర్కొంది. 15 ఏళ్లపాటు వందలాది హత్యలు చేయించిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టింది. తొమ్మిదేళ్లు రక్తం వాసనకు దూరంగా ఉన్న చంద్రబాబు గద్దెనెక్కిన మరుసటి రోజే 21 మంది ఎర్రచందనం కూలీలను దుర్మార్గంగా తన పోలీసులతో హత్య చేయించారని విమర్శించింది. రక్తం రుచిమరిగిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పన్నిన పన్నాగమే ఏఓబీ హత్యాకాండ అని స్పష్టం చేసింది. పోలీసు బలగాలతో వేలాది మందిని బలి తీసుకుంటున్న చంద్రబాబు, ఆయన కుమారుడు తప్పించుకోలేరని, అవసరమైతే ఆత్మాహుతి దాడి చేసి చంపుతామని హెచ్చరించింది. ప్రజల నెత్తురు తాగే చంద్రబాబుకు శిక్ష విధించి తీరుతామని తేల్చిచెప్పింది. ఈ ప్రకటనలో సీపీఐ(మావోయిస్టు) కమిటీ ఏమందంటే.. ద్రోహులను శిక్షిస్తాం.. మావోయిస్టులు తినే ఆహార పదార్థాల్లో కోవర్టుల ద్వారా మత్తుమందు కలిపారు. రాత్రి భోజనం తరువాత ఒక్కొక్కరుగా పడిపోయిన వారిపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. గాయపడిన కొందరిని మరో ప్రదేశంలో దాచి చిత్రహింసలకు గురిచేశారు. మంగళవారం నలుగురిని కాల్చి చంపారు. ప్రమాదవశాత్తు నీళ్లలో జారిపడి మరణించిన పోలీస్ కానిస్టేబుల్ మరణాన్ని ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారు. మావోయిస్టు పార్టీలో కొద్ది కాలంపాటు పనిచేసి బయటకు వెళ్లిన కొందరు మాజీలు డబ్బు, విలాసాల కోసం ప్రభుత్వంతో, పోలీసులతో చేతులు కలిపారు. పార్టీకి ద్రోహులుగా మారిన మాజీలను కఠినంగా శిక్షిస్తాం. అలాంటి ద్రోహుల చిట్టా తయారు చేయాల్సిందిగా ఇప్పటికే పార్టీ నాయకత్వం జిల్లా కమిటీలను ఆదేశించింది. -
'వెంకయ్య దొడ్డిదారిన మంత్రి అయ్యారు'
హైదరాబాద్ : ఒక్కసారి కూడా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కాకుండా పార్లమెంట్లో ప్రవేశించి.. మూడుసార్లు దొడ్డిదారిన కేంద్ర మంత్రి అయిన వెంకయ్యనాయుడికి కమ్యూనిస్టుపార్టీలను విమర్శించే హక్కు లేదని సీపీఐ నేత నారాయణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమ్యూనిస్టుపార్టీలను పార్లమెంట్ కు రాకుండా బయట మాట్లాడే స్వేచ్ఛను ప్రజలు కల్పించారని వెంకయ్య చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నామన్నారు. ఏనుగు చచ్చినా.. బతికినా వెయ్యి వరహాలేనని, కమ్యూనిస్టుపార్టీలు కూడా అంతేనన్నారు. ప్రజల ద్వారా లోక్‌సభకు ఎన్నిక కాలేక యాచకత్వం ద్వారా కర్ణాటక నుంచి రెండుసార్లు, రాజస్థాన్ నుంచి ఒకసారి వెంకయ్య రాజ్యసభకు నామినేట్ అయ్యారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కమ్యూనిస్టుపార్టీలను వెటకారం చేయడం, ఎగతాళి చేయడం మంచి పద్ధతి కాదని, దానిని మానుకోవాలని హితవుపలికారు. చేతనైతే ప్రత్యేక హోదాను తెప్పించి చూపాలి తప్ప వెటకారాలు మానుకోవాలని సూచించారు. గతంలో రాజ్యసభలో ఏపీకి అయిదేళ్ల పాటు ప్రత్యేకహోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని చెబితే, కాదు కాదు పదేళ్లు కావాల్సిందేనని పట్టుబట్టిన వెంకయ్య ఇప్పుడు దానిని అమలు చేయించలేక మాట మార్చడాన్ని బట్టి ఆయనకు జ్ఞాపకశక్తి దెబ్బతిన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ఆత్మహత్యకు ప్రధాని మోడీ కారణమని ఆరోపించారు. ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే యోచన మంచిదేనని అయితే మధ్యలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టకుండా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. -
సంగమ్మ చెక్కిన శిల్పం మా అమ్మ
ఎన్.శివరామిరెడ్డి ‘‘నాలో మీకు ఏదైనా మంచి లక్షణాలు కనిపిస్తే... అవి మా మేనత్త సంగమ్మ నేర్పించినవి, కమ్యూనిస్టు పార్టీ అలవరిచినవే. నాలో మీకు కనిపించే చెడు మాత్రం నాకు స్వతహాగా జన్మతః అబ్బిన గుణం’’... ఈ మాటలన్నది సీనియర్ నాయకులు నర్రెడ్డి శివరామిరెడ్డి. ఆయన స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధి. ఇప్పుడు 95వ ఏట భార్య కొండమ్మతోపాటు హైదరాబాద్‌లోని సిఆర్ (చండ్ర రాజేశ్వర్‌రావు) ఫౌండేషన్‌లో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘గంగమ్మ జన్మనిచ్చింది, సంగమ్మ మనిషిగా నిలబెట్టింది’ అన్నారు. ‘‘అమ్మకు నాకంటే ముందు ముగ్గురు పిల్లలు. నేను నాలుగోవాడిని. నాకు నాలుగేళ్లు నిండేలోపే మా అమ్మ పోయింది. మా మేనత్త సంగమ్మ పెంపకంలో నాకు అమ్మ లేదనే సంగతే గుర్తురాలేదు. మా నాయన, ఇద్దరు చిన్నాయనలు... ముగ్గురు సోదరులకు కలిపి మా మేనత్త ఒక్కటే ఆడపడుచు. ఆమె అంటే అందరికీ గారాబమే. పెళ్లి చేసి అత్తవారింటికి పంపించకుండా మామ కైలాస్నాథ్రెడ్డిని ఇల్లటం (ఇల్లరికం) తెచ్చుకున్నారు. అలా మా మేనత్త మా ఇంట్లోనే ఉండేది. పుట్టినప్పటి నుంచి నన్ను ఎత్తి తిప్పడం, అన్నం తినిపించడం అన్నీ తనే చేసేది. మా అమ్మ ఉన్నన్ని రోజులూ తన ముచ్చట కొద్దీ మాకు సేవలు చేసింది. అమ్మ పోయిన తర్వాత తానే మాకు అమ్మయింది. మాది వ్యవసాయ కుటుంబం. మూడు గాండ్ల ఎద్దులు (మూడు జతల ఎడ్లు), ఐదారు పాలిచ్చే గేదెలుండేవి. సేద్యగాళ్లతోపాటు ఇంట్లో అందరూ పని చేసేవాళ్లు. ఆడవాళ్లు కూడా పొలానికెళ్లి పనులు చేయించుకునే వాళ్లు. మా మేనత్త ఇంట్లో మమ్మల్ని చక్కబెటుకుని పొలానికెళ్లేది. జొన్న, కొర్ర, వేరుశనగ పంటలు, చీనీచెట్లలో పనులు దగ్గరుండి చేయించుకునేది. పండుగ వస్తోందంటే... నా కోసం కజ్జికాయలు, అత్తరాసాలు, లడ్డులు చేసి డబ్బాల్లో పెట్టేది. సెలవులకు ఇంటికి రాగానే ముందు వాటిని పెట్టి నేను తిన్న తర్వాతనే ‘ఎలా చదువుకుంటున్నావు’ అని అడిగేది. మా మేనత్త తన పిల్లల కంటే నా కోసమే ఎక్కువ ఆదుర్దా పడుతుంటుందని మా పిన్నమ్మలు, నానమ్మ అనేవారు. ‘కాలేజీలో ఏం పెడతారో, ఏం తింటాడో. మిగిలిన పిల్లలంతా ఇంట్లో ఉంటారు, ఎప్పుడేది కావాలంటే అది తింటారు. వాళ్లకు నేను చెప్పేదేముంటది’ అనేదట. మా ఇంట్లో నేను తొలితరం విద్యావంతుణ్ని. దాంతో నేనంటే పెద్దవాళ్లకు ఇష్టం, చిన్నవాళ్లకు గౌరవం. మా నాయన నా మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. పెద్ద చదువులు చదివించాలని, నేను పెద్ద ఉద్యోగం చేస్తే చూడాలని కలలు కన్నాడు. నేను లా కోర్సులో చేరిన తర్వాత లాయరుగా పేరు తెచ్చుకుంటే చూడాలనుకున్నాడు. అయితే... నేను ఇంగ్లిష్ చదువుల ప్రభావంతో ఆయన కోరుకున్నదానికంటే ఎక్కువ చైతన్యవంతం అయ్యాను. నేను నేర్చుకున్న సిద్ధాంతాలతో ఆయనను బేరీజు వేసుకుంటే నాయన తీరు నచ్చేది కాదు. దాంతో ఆయన్నే ప్రశ్నించేవాడిని. ఓ రోజు ఆయన దగ్గర వడ్డీకి డబ్బు తీసుకున్న వాళ్లందరినీ పిలిపించి, అప్పు తీర్చాల్సిన పని లేదని చెప్పి వాళ్లు రాసిచ్చిన దస్తావేజులను ఇచ్చేశాను. మా మేనత్తకు ఆస్తి పంపకంలో మా నాయన న్యాయంగా వ్యవహరించడం లేదనిపించింది. కొడుకుల ముగ్గురితోపాటు కూతురికి కూడా ఆస్తిలో సమభాగం ఇవ్వాలనుకున్నాడు మా తాత. ఆమె పెళ్లి సందర్భంగా అలా అంగీకారమైంది. ఆనాడే పంచి ఉంటే ఏ గొడవా ఉండేది కాదేమో. నా కళ్లెదురుగా మా మేనత్తకు అన్యాయం జరుగుతుంటే సహించలేకపోయాను. అలాగని నాయనను ఎదిరించి మాట్లాడితే పరిష్కారమయ్యే పరిస్థితీ కనిపించ లేదు. ఊరి వాళ్లకు దస్తావేజులు ఇచ్చేసినంత సులువుగా పరిష్కారమవుతుందని కూడా అనిపించలేదు. నాలో మేనత్తకు న్యాయం చేయాలనే ఆవేశం ఉంది కానీ స్వయంగా పరిష్కరించగలిగిన శక్తి ఉన్నట్లు అనిపించలేదు. దాంతో పక్క ఊళ్లకు వెళ్లి ఆ ఊళ్ల పెద్దవాళ్లకు చెప్పి, వారందరినీ తీసుకువచ్చి ఇంట్లో పంచాయితీ పెట్టించాను. అలా మా మేనత్తకు సమానంగా ఆస్తి వచ్చింది. అప్పుడామె నన్ను దగ్గరకు తీసుకుని ‘నిన్ను సాకిన రుణం ఇలా తీర్చుకున్నావా’ అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పరిస్థితిలో కూడా ‘నాన్నతో ఊరికే గొడవ పడొద్దు. నువ్వే పోయి పలకరించు’ అని చెప్పింది. సిద్ధాంతపరంగా విభేదించినా ఆత్మీయత పరంగా దూరం కాకూడదనే గొప్ప గుణం నాలో నెలకొల్పింది. ఆమె ఏ గొప్ప పుస్తకమో చదివి ఇంత గొప్ప మాట చెప్పలేదు. ఆమె మనసు అంత గొప్పది. అందుకే అలా చెప్పగలిగింది. మేనత్తకు నేను చేయగలిగింది చేశాను కానీ, నేను చేసింది రుణం తీరేటంత పెద్ద పని కాదు. ఏం చేసినా ఆ రుణం తీరదు. ఆమె ప్రేమను చెప్పడానికి... నాకు మాటలు చాలవు. ఆమె చూపిన ఆదరం, నా పట్ల వ్యక్తమైన ఆత్మీయతను నా కళ్లతో చూడాల్సిందే, నా మనసుతో తెలుసుకోవాల్సిందే’’. అమ్మ పోయిన తర్వాత మేనత్తే మాకు అమ్మయింది. మా కంట కన్నీరు రాకుండా పెంచడం తన బాధ్యత అన్నట్లు సాకింది. నేనేమి చేసినా, ఎంత చేసినా ఆ తల్లి రుణం తీరదు. ఆమె ప్రేమను చెప్పడానికి... అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని చెప్పలేను. ఆ ఆదరం నా కళ్లకే కనిపిస్తుంది. ఆ ఆత్మీయత నా మనసుకు మాత్రమే అర్థమవుతుంది. కడప జిల్లా గడ్డం వారి పల్లెలో పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. -వాకా మంజులారెడ్డి -
చైనాలో రంజాన్ ఉపవాసాలపై నిషేధం
బీజింగ్: ముస్లిం మైనారిటీలైన ఉయిఘర్లు అధికంగా ఉండే జిన్జియాంగ్లో ప్రభుత్వ ఉద్యోగులు, చిన్న పిల్లలు, విద్యార్థులు పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండటంపై ఈ ఏడాదీ చైనా నిషేధం విధించింది. నాస్తికత్వాన్ని అధికారికంగా పాటించే అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో వారిపై రంజాన్ ఉపవాసాలపై కొన్నేళ్లుగా నిషేధం విధిస్తూ వస్తోంది. -
ప్రశ్నించే గొంతే బలమైన ప్రతిపక్షం!
తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రశ్నించే గొంతు ఎవరిది కానుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రశ్నించే గొంతుక కోసం రాష్ట్ర ప్రజలు, విద్యావంతులు, తెలంగాణవాదులు ఆసక్తిగా గమనిస్తున్నారు. రోజు రోజుకు టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుండటం, ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో బలహీనపడటంతో ఈ చర్చ తెలంగాణలో మరింత విస్తృ తంగా సాగుతోంది. స్వాతంత్య్రం వచ్చి ఐదేళ్లు గడిచిన తర్వాత 1952లో జరిగిన ప్రప్రథమ సాధారణ ఎన్నికల్లో మళ్లీ ప్రధాన మంత్రిగా నెహ్రూ ఎన్నికైనప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్షంగా చాలా బలహీనంగా ఉండేది. ప్రతిపక్షాలు బలహీ నంగా ఉంటే ప్రభుత్వాలు తప్పిదాలు చేస్తాయని, నాయకు లకు గర్వం తలకెక్కుతుందని అప్పట్లో ప్రధానమంత్రి నెహ్రూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనివార్యంగా ఆత్మను కూడ పక్కనపెట్టి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అది వ్యక్తిగతంగా తనకు ఇష్టం లేక పోయినా, రాజకీయంగా అనివార్యమై ఆ పనులు చేసినట్లు నెహ్రూ అనేక పర్యాయాలు తన ఉపన్యాసాల్లో, రచనల్ల్లో పేర్కొన్నారు. బలమైన ప్రతిపక్షం లేనప్పుడు తనమీద తానే విమర్శనాత్మక వ్యాసాలను పత్రికల్లో కలం పేరుతో నెహ్రూ రాశారు. ప్రశ్నించే హక్కుతోనే న్యాయం పొందగలమని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. ఏ ప్రభుత్వానికైనా ప్రశ్నించే గొంతుక ఉంటేనే ప్రజాస్వామ్యం పదికాలాలపాటు బతుకు తుందని తరచుగా ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కె.రామచంద్రమూర్తి సైతం చెబుతుంటారు. ప్రజలం దరూ ప్రశ్నించకపోవచ్చు కానీ పౌర సమాజానికి ప్రాతినిథ్యం వహించే శక్తి కలిగిన వ్యక్తులు, సంస్థలు వారి ముందుకు రావాల్సిన చారిత్రాత్మక అవసరం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ప్రభుత్వం గుప్పిస్తున్న హామీలు అమోఘం అనీ, అవి ప్రజల జీవితాలను మౌలికంగానే మారుస్తాయని అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. కానీ వాటి అమలుపైనే ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉన్నాయి. వీటిని అధిగమిస్తారా.. అధిగమించారా అన్నది ప్రభుత్వ బాధ్యతే. ప్రశ్నించే గొంతు లేకపోవడంతో అధికార వికేంద్రీ కరణకు బదులు, కేంద్రీకరణకు దారితీస్తోంది. అయితే ప్రశ్నించే గొంతు అవసరమే కానీ ఆ గొంతు తన ఉనికి చాటుకునేందుకు కాకుండా రాజ్యాంగ విలువలకి, వ్యక్తి స్వేచ్ఛకు. ప్రజాస్వామ్యానికి సంకేతంగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. - జి. రాజు, సామాజిక కార్యకర్త, మహబూబ్‌నగర్ మొబైల్: 9000797618 -
క్యూబా గడ్డపై అమెరికా అధినేత
హవానాలో దేశాధ్యక్షుడు రావుల్ కాస్త్రోతో ఒబామా భేటీ ♦ సత్సంబంధాల కోసం చర్చలు హవానా: చిరకాల ప్రత్యర్థుల మధ్య మరింత సయోధ్యకు రంగం సిద్ధమైంది. 5 దశాబ్దాల శత్రుత్వానికి ముగింపు పలికే దిశగా క్యూబా, అమెరికాల మధ్య చర్చలు జరగనున్నాయి. క్యూబా అధ్యక్షుడు రావుల్ కాస్త్రోతో చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం క్యూబా రాజధాని హవానా చేరుకున్నారు. అనంతరం హవానాలోని ప్రధాన ప్రభుత్వ భవనం ‘ప్యాలెస్ ఆఫ్ రివల్యూషన్’లో రావుల్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు, ప్యాలెస్ వద్ద ఒబామాకు మిలటరీ బ్యాండ్‌తో ఘన స్వాగతం లభించింది. ఈ చరిత్రాత్మక పర్యటనలో ఒబామాతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా పాల్గొంటున్నారు. హవానా చేరుకోగానే స్థానిక భాషలో ఆత్మీయంగా ‘ఏంటి సంగతి.. క్యూబా!’ అని ఒబామా ట్వీట్ చేశారు. ‘ఇది చరిత్రాత్మక పర్యటన’ అని హవానాలో ఇటీవలే పునఃప్రారంభమైన అమెరికా ఎంబసీ అధికారులతో అన్నారు. తర్వాత, క్యూబా పౌరులు అమితంగా ఆరాధించే ఆ దేశ స్వాతంత్య్రోద్యమ నాయకుడు జోస్ మార్టిన్‌కు నివాళులర్పించారు. 1928లో కెల్విన్ కూలిజ్ పర్యటన తర్వాత క్యూబాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామానే. 1959 నాటి క్యూబా విప్లవం తర్వాత ఆ కమ్యూనిస్ట్ గడ్డపై అడుగుపెట్టిన తొలి యూఎస్ అధ్యక్షుడూ ఒబామానే. అమెరికా, క్యూబాల మధ్య సత్సంబంధాలకు 2014లోనే బీజాలు పడ్డాయి. సాధారణ సంబంధాలు నెలకొనేలా కృషి చేస్తామని 2014 డిసెంబర్లో ఒబామా, రావుల్ ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేశారు. 2015 ఏప్రిల్‌లో వారి చరిత్రాత్మక భేటీ జరిగింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాల జాబితా నుంచి 2015 మేలో క్యూబాను అమెరికా తొలగించింది. కానీ, ఆర్థిక, వాణిజ్య నిషేధాన్ని ఇంకా పూర్తిగా తొలగించలేదు. క్యూబాపై నిషేధం తొలగింపునకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి కాగా క్యూబాతో సత్సంబంధాల పునరుద్ధరణకు రిపబ్లికన్లు సుముఖంగా లేరు. దీంతో ఒబామా తాజా పర్యటన జరుగుతోంది. మరోవైపు, కీలక వ్యవస్థలన్నీ కమ్యూనిస్ట్ పార్టీ గుప్పిట్లో ఉన్న క్యూబాలో ఆ దేశ ప్రభుత్వానికి రుచించని విధంగా, చర్చల్లో మానవ హక్కుల అమలుకు అమెరికా ఒత్తిడి తేవొచ్చు. ఒబామా పర్యటనకు కొద్ది గంటల ముందే, నిషేధిత మానవహక్కుల సంఘానికి చెందిన పలువురిని క్యూబా అరెస్ట్ చేసింది. కాగా, ఒబామా పర్యటనతో క్యూబా రాజకీయ విధానాల్లో గొప్ప మార్పులేం ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, క్యూబాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనడానికి మరింత సమయం పట్టొచ్చని అంటున్నారు. క్యూబా పౌరుల నుంచి అమెరికా అధ్యక్షుడికి గొప్ప స్వాగతం లభించకూడదని రావుల్ భావిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఒబామాకు స్వాగతం పలికేందుకు రావుల్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లకపోవడాన్ని వారు గుర్తు చేశారు. ఒబామా పర్యటన సందర్భంగా హవానాలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో ఒబామా హక్కుల కార్యకర్తలను కలుసుకుంటారు. పగ.. ప్రేమ 1959: క్యూబా విప్లవం. దేశాధ్యక్షుడు, నియంత, అమెరికా మద్దతున్న ఫుల్జెన్షియొ బటిస్టాను పదవీచ్యుతుడిని చేసిన ఫిడెల్ కాస్త్రో నేతృత్వంలోని గెరిల్లా దళం. కాస్త్రో నేతృత్వంలోని నూతన ప్రభుత్వాన్ని గుర్తించిన అమెరికా. యూఎస్‌లో పర్యటించిన కాస్త్రో . ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో భేటీ. 1960: క్యూబాలోని అమెరికాకు చెందని చమురు శుద్ధి కార్మాగారాలు సహా అన్ని ప్రైవేటు కంపెనీలను జాతీయికరించిన కాస్త్రో ప్రభుత్వం. ఆ తరువాత అన్ని అమెరికా కంపెనీల స్వాధీనం. అక్టోబర్‌లో క్యూబా ఎగుమతులపై నిషేధం విధించి, ఆ దేశంతో దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకున్న అమెరికా. 1961: క్యూబా సోషలిస్ట్ దేశమన్న కాస్త్రో. ఏప్రిల్‌లో కాస్త్రో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా మద్దతుతో సాగిన ‘బే ఆఫ్ పిగ్స్’ చర్య విఫలం. 1962: క్యూబాతో వాణిజ్యం నిషేధం, ఇతర ఆంక్షల విధింపు. అక్టోబర్‌లో క్యూబాలోని రష్యా అణు క్షిపణులను తొలగించాలంటూ అమెరికా దిగ్బంధం. అణు యుద్ధం అంచున ప్రపంచం. 1977: క్యూబాతో సత్సంబంధాల పునరుద్ధరణకు నాటి యూఎస్ అధ్యక్షుడు కార్టర్ ప్రయత్నాలు. రీగన్ యూఎస్ అధ్యక్షుడవడంతో ఆగిన కృషి. 1991: చిరకాల మిత్రదేశం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో సంక్షోభంలో క్యూబా ఆర్థిక వ్యవస్థ. 2006: ఆనారోగ్యం బారిన ఫిడెల్ కాస్త్రో. సోదరుడు రావుల్ కాస్త్రోకు అధ్యక్ష బాధ్యతల అప్పగింత. 2014: దౌత్యసంబంధాల పునరుద్ధరణకు ఇరుదేశాల అంగీకారం. 2015: ఏప్రిల్‌లో ఒబామా, రావుల్ కాస్త్రోల చరిత్రాత్మక భేటీ. 2016: క్యూబా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ఒబామా. -
లంచగొండులపై ఉక్కుపాదం:3 లక్షల మందికి శిక్షలు
క్రమశిక్షణా పరిశీలన కమిటీ.. ఈ పేరు వింటేచాలు ప్రభుత్వాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. ఒక్కరూ ఇద్దరూ కాదు ఏటా దాదాపు 3 లక్షల మంది లంచగొండి ఉద్యోగుల్ని వల వేసిపట్టుకుని శిక్షలు విధిస్తున్నది ప్రభుత్వం.. అదృష్టవశాత్తు అవి మన ప్రభుత్వాలుకావనుకోండి.. చైనాలో! ప్రభుత్వ పథకాల అమలు, సాధారణ పనుల్లో అవినీతిని రూపుమాపేందుకు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ కమిటీ ఆఫ్ డిసిప్లిన్ ఇన్స్ పెక్షన్(కేంద్ర క్రమశిక్షణా పరిశీలన సంఘం) సోమవారం వెల్లడించిన నివేదికలో అవినీతి అధికారులకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాదిలో అవినీతికి పాల్పడిన 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను పట్టుబడ్డారని, వారిలో 2 లక్షల మందివి చిన్నస్థాయి నేరాలు కావడంతో సాధారణ శిక్షలతోపాటు జరిమానా విధించినట్లు, మరో 80 వేల మందిపై మాత్రం తీవ్రమైన శిక్షలు విధించినట్లు పరిశీలనా సంఘం తన నివేదికలో పేర్కొంది. అవినీతిని విషయంలో కఠినంగా వ్యవహరించాలంటూ అధ్యక్షుడు జింగ్ పింగ్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఉద్యోగుల కదలికలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సాధారణ శిక్షలు పూర్తిచేసిన్న 2 లక్షల మంది ఉద్యోగులు ఇటీవలి పార్లమెంట్ సమావేశాల సమయంలో విడుదలయ్యారు. ఇంకా జైళ్లలోనే ఉన్న 80 వేల మందిలో పలువురికి మరణశిక్ష పడే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ చైనా అధికారిక మీడియాలో ప్రతిరోజూ అవినీతి వార్తలు వెలుగులోకి వస్తుండటం గమనార్హం. -
‘అరుణతార’కు పునర్వైభవం
టీడీపీ ఆవిర్భావం తర్వాత కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎన్నికల రాజకీయాలలో భాగమయ్యాయన్న అపప్రథను మూటగట్టుకున్నాయి. దీంతో నాలుగు సీట్ల కోసం ఏ పార్టీతోనైనా జతకట్టేందుకు అవి సిద్ధపడతాయన్న చులకన ఏర్పడింది. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రా మం తరువాత దేశంలో జరి గిన రెండవ పెద్ద సాయుధ పోరాటంగా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పేరుగాంచింది. కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో జరిగిన ఆ మహత్తర పోరాటంలో, నాలు గైదు వేల మంది అసువులు బాశారు. లక్షమందికి పైగా చిత్రహింసలకు, నిర్బంధా లకు గురయ్యారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పరిధిలో దాదాపు 10 లక్షల ఎకరాలను పరాన్నభుక్కు లైన పెత్తందారీ భూస్వాముల నుండి స్వాధీనం చేసు కుని, రైతు కూలీలకు పంచింది వీర తెలంగాణ విప్ల వోద్యమం! ‘వెట్టి’ చాకిరిని నిర్మూలించింది. ఆ తదుపరి ఎన్నికల్లో కమ్యూనిస్టులు సాధించిన విజయాలు ఆ పోరాట పుణ్యమే. ఇప్పుడు పూలమ్మిన చోట కట్టెలమ్ముకునే స్థితి కమ్యూనిస్టు ఉద్యమానికి ఎందుకు పట్టింది? అని సాధా రణ జనాన్ని అడిగితే - ఇప్పుడు ఎక్కడ కమ్యూనిస్టు పార్టీ ఉందండీ? సుందరయ్య, రాజేశ్వరరావులతోనే అంతరించింది. వాళ్ల త్యాగమయ ఆదర్శ జీవిత మెక్కడ? నేటి కమ్యూనిస్టు నేతల స్వార్థ, పదవీ వ్యామోహ ఆడం బరమెక్కడ! పెద్ద పెద్ద భవనాలు, ఏసీ గదులు, కార్లు... అంటూ ఇలా తమకు తోచిన రీతిలో వ్యాఖ్యానిస్తుం టారు. కాని అది సంపూర్ణ సత్యం కాదు. పాలకపక్షాలతో పోలిస్తే కమ్యూనిస్టు కార్యకర్తలు నిజాయితీపరులని, త్యాగధనులనీ ఒక నమ్మకం ప్రజల్లో ఆనాడే కాదు ఈనాడు కూడా బలంగా ఉంటోంది. అంతమాత్రాన ప్రస్తుత కమ్యూనిస్టు కార్యకర్తలలో పదవీ వ్యామోహం, అధికార అహంకారం, ధనార్జన కాంక్ష, ఆడంబర జీవ నం వంటి దుర్లక్షణాలు లేవని కాదు. అయితే అవే నేటి కమ్యూనిస్టుల దుస్థితికి కారణంగా భావించలేం. ఎన్నికలు కూడా కమ్యూనిస్టు ఎత్తుగడల ప్రకారం ఒక పోరాట రూపమే. కానీ దురదృష్టవశాత్తు అదే ఏకైక రూపమనే ధోరణికి పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు వచ్చాయి. ఎన్నికలలో ఏదో విధంగా గెలవాలన్న ఆత్రం ఎక్కువైంది. ఎన్నికల మార్గం ఏదో విధంగా అందలమె క్కడానికే కాదు. ఆ వాతావరణం ఆసరాగా కమ్యూని స్టులు తమ ప్రత్యేకతను నిరూపించుకోవాలి. పార్టీ అవ గాహనలోనూ, ఆచరణలోనూ ఇలాంటి లోపాలే కాదు. అసలు మార్క్సిజాన్ని మన వాతావరణానికి ఇము డ్చుకోగలిగారా కమ్యూనిస్టులు అన్న ప్రశ్న కూడా ఉంది. చైనా నేత మావో తన ప్రజలకు సైద్ధాంతికంగా వివరించేందుకు అక్కడి కన్ఫ్యూషియస్ అనే తత్వవేత్త బోధనలనే చైనా ప్రజల పరిభాషలోకి తేగలిగారు. కానీ మార్క్సిజానికి ఉన్నంతలో సానుకూలంగా ఉన్న గౌతమ బుద్ధుణ్ణి కూడా ఇక్కడి కమ్యూనిస్టులు సొంతం చేసుకోలేకపోయారు. మార్క్స్ మహనీయుడు తన గతి తార్కిక (డెలైక్టికల్) దృక్పథాన్ని హెగెల్ నుండి స్వీకరిం చారు. మత తత్వశాస్త్రంలో ఉండే భావవాదం అటుంచి గతితర్కాన్ని అయినా మనం మన ప్రజల ముందుంచ లేదు. ఆదిశంకరుని వివేక చూడామణిలో ఉన్న గతితా ర్కికత గురించి, చండ్ర రాజేశ్వరరావు తన జీవిత చర మాంకంలో నాకు పరిచయమైన కొద్ది కాలంలో చర్చిం చారు! మార్క్సిజాన్ని మన ప్రజల ఆలోచనలో అంతర్భా గం చేయడానికి, తగిన రీతిలో మన తత్వశాస్త్రాన్ని అధ్య యనం చేయలేకపోయామని ఆయన గ్రహించారు. అంబేద్కర్ మహాశయుడు శ్రమ విభజన సర్వజనీ నంగానే ఉన్నది. కాని ప్రత్యేకతకి శ్రామిక (వర్గ) విభజన కూడా ఉందని గుర్తింపజేశారు. వర్ణవ్యవస్థ (కుల) అం దుకు కారణం. వర్గ దోపిడీతోపాటు నిచ్చెనమెట్ల కులవ్య వస్థలో ఈ నిమ్నకులాల వారిపై రాజకీయ ఆర్థిక, సామా జిక, సాంస్కృతిక దోపిడీ సైతం సాగుతున్నది. వర్గర హిత సమాజం అన్న లక్ష్యం ఇక్కడి కులవివక్షతోనే కా దు. కులరహిత సమాజ లక్ష్యంతో కూడా విడదీయరాని బంధంలో ఉందన్నది అంబేద్కర్ ఆవిష్కరణ! ఈ ద్విముఖ పోరాటానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం కాకు న్నా ఆచరణాత్మక చైతన్యం కొరవడిందని చెప్పుకోవాలి! కనుకనే బాబా సాహెబ్ అంబేద్కర్‌ను సైతం కమ్యూని స్టులు సొంతం చేసుకోలేకపోయారు. అంతేకాదు. ఇ లాంటి సామాజిక అస్తిత్వ ఉద్యమాలు, శ్రామికవర్గ ఉద్యమ ఐక్యతకు భంగం కలిగిస్తాయని, పెడదోవ పట్టి స్తాయన్న భయం కమ్యూనిస్టులను పూర్తిగా వీడలేదు. చివరిగా జాతుల సమస్య వంటి ప్రధాన సమస్య ను కూడా కమ్యూనిస్టులు తగిన శ్రద్ధతో విశ్లేషించడం లేదు. 1943లో కమ్యూనిస్టు పార్టీ ఈ సమస్యపై చేసిన తీర్మానమే పుచ్చలపల్లి సుందరయ్య ప్రఖ్యాత నినాదం ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’కి భూమిక! తెలుగు జాతి, నూతన ప్రజాస్వామిక పాలనగా స్వయం నిర్ణయాధికార హక్కుతో సహా ఏర్పడాలన్నది ఆ నినాద స్ఫూర్తి. దానిని కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు కుదించడం సరికాదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోని ప్రజావాంఛ. దాని ప్రజాస్వామిక స్వభా వం గుర్తెరగకుండా, సమైక్య నినాదంతో కమ్యూనిస్టులు ప్రత్యేకించి సీపీఎం తెలంగాణలో తన పార్టీ పరిస్థితిని చెరువు నుండి బయటపడిన చేపల పరిస్థితికి తెచ్చింది. ఈనాడు తెలంగాణ సీపీఎం తిరిగి జనజీవన స్రవంతిలో ఈదేందుకు ఎంతో శ్రమ చేయవలసి వస్తున్నది. మార్క్సిజం బోధించినట్లు భౌతికవాస్తవ పరిస్థితి పట్ల తగురీతిలో స్పందిస్తూ మార్క్సిజం సాధారణతతో పాటు మన ప్రత్యేకతపై కూడా ప్రత్యేకశ్రద్ధతో అధ్యయ నం చేస్తూ-తమ గత తరం నేతల త్యాగనిరతి, ప్రజా సేవానురక్తి ఆదర్శంగా ప్రజా ఉద్యమాలలో ఆయా సమ స్యలపై కలసి వచ్చే వారందరినీ కలుపుకుంటూ తమ పూర్వ వైభవాన్ని కమ్యూనిస్టులు మన దేశ, రాష్ట్ర, జాతి ప్రయోజనాల కోసం సాధిస్తారని ఆశిద్దాం! - వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు ఫోన్: 98480 69720 - డా॥ఏపీ విఠల్ -
లెఫ్ట్ ఫ్రంట్‌కు నో!
సాక్షి. హైదరాబాద్: రాష్ట్రంలో మితవాద, అతివాద, ఇతర కమ్యూనిస్టు పార్టీలన్నింటినీ కలుపుకొని లెఫ్ట్‌ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న యోచనను పలు వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నికల్లో పోటీ చేయడంపై సైద్ధాంతికంగా విభేదాలు, అభిప్రాయభేదాలు ఉన్నందున ఇది సాధ్యం కాదని స్పష్టం చేశాయి. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తొమ్మిది వామపక్షాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విస్తృత ప్రాతిపదికన అన్ని కమ్యూనిస్టు పార్టీలను ఒక వేదికపైకి తీసుకువద్దామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రతిపాదించగా.. మిగతా వామపక్షాలు వ్యతిరేకించినట్లు సమాచారం. ప్రజా సమస్యలు, ముఖ్యమైన అంశాలపై కలిసి ఉద్యమాలు చేయడం మినహా.. ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని ఆయా పార్టీల నాయకులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్, బీజేపీ వంటి బూర్జువా పార్టీల అనుబంధ రైతు విభాగాలు, ఎన్జీవో రైతు సంఘాలు లేకుండా తెలంగాణ రైతు సంఘాల జేఏసీని ఏర్పాటు చేసుకోవాలన్న అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. దీనిపై ఈనెల 24న సమావేశమై తుదినిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను 5 వేల ర్యాంకు వరకే పరిమితం చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులందరికీ పూర్తి ఫీజు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వామపక్షాల నేతలు నిర్ణయించారు. ఇక అన్ని వామపక్షాలకు ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని వరంగల్ ఎంపీ స్థానానికి పోటీకి నిలపాలని భేటీలో భావన వ్యక్తమైంది. మరోవైపు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం నేపథ్యంలో అవినీతి అంశంపై శనివారం పది వామపక్షాల సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), జానకిరాములు (ఆర్ఎస్పీ), మురహరి (ఎస్‌యూసీఐ), ఝాన్సీ (న్యూడెమోక్రసీ-రాయల), గుర్రం విజయ్‌కుమార్ (సీపీఐ-ఎంఎల్) తదితరులు పాల్గొన్నారు. -
అవసాన దశలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు
దొడ్డబళ్లాపురం : అవసాన దశలో ఉన్న దేశంలోని కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు త్వరలో కనుమరుగు కానున్నాయని, ఒక్క బీజేపీనే బలమైన పార్టీగా అవతరించనుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జి మురళీధర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం చివరి రోజు గురువారం ఆయన తాలూకాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా దొడ్డబళ్లాపురం తాలూకాలోని కొడళ్లి గ్రామానికి చేరుకున్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో అక్కడక్కడా కనిపిస్తోందని, అందుకే అది మ్యూజియం పార్టీగా మారి పోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో కనుమరుగు కానుందని అన్నారు. ఆయన యూపీలోని అమేథీ నుంచి గెలిచాడని, అయితే యూపీలో కాంగ్రెస్ గల్లంతయిందని, కావున రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వం వహిస్తే దేశంలో కాంగ్రెస్ గల్లంతవుతుందన్నారు. భూస్వాధీన చ ట్టం గురించి పార్లమెంట్లో చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరానికనుగుణంగా పలు మార్పులు సవరణలు కూడా చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ప్రస్తుతం దేశంలో 10 కోట్ల మంది సభ్యత్వం నమోదు చే యడం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తుడిచిపెట్టి బీజేపీ అధికారంలోకి రానుం దని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఉంటుందన్నారు.కొన్ని పార్టీలు కులాల ప్రాధాన్యంతో, మరి కొన్ని కుటుంబాల ప్రాధాన్యంతో నడుస్తాయని,బీజేపీ మాత్రం సిద్ధాంతాల ప్రాధాన్యంతో నడిచేపార్టీగా చెప్పుకొచ్చా రు. కార్యక్రమంలో సభ్యత్వ నమోదు సం చాలకులు, జెడ్పీ సభ్యుడు హనుమంతేగౌడ, సీనియర్‌నేత కేఎం హనుమంత రా యప్ప, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బీసీ నా రాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మంలో ఎరుపు.. మరుపు
ఖమ్మం: ‘ఖమ్మం ఒకప్పుడు ఎరుపుగా ఉండేది.. ఇప్పుడు అది మరుపు అయింది. ఇంకా కొన్ని రోజులైతే అదీ ఉండదు.. ఆ పార్టీల్లో త్యాగాలు చేసినవారు ఉన్నారు. కానీ ఇప్పుడు వారు అనుసరించే విధానాలు సరికావు’ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కమ్యూనిస్టు పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్రావు విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ, టీడీపీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘చైనానే కమ్యూనిజాన్ని వదిలేసింది.. రష్యాలో సోషలిజం లేదు. మన దేశంలో ఈ విధానాలు కావాలట..! ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినాదాలు ఇస్తారు. ఇక్కడైతే మేము వేరుగా ఉంటాం’ అనేలా కమ్యూనిస్టుల వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర స్థాయిలో చట్టాలపై సమగ్రంగా చర్చ జరిగేదే శాసన మండలని, దీనికి మంచి నాయకత్వ గుణం ఉన్న వారినే ఎన్నుకోవాలన్నారు. ఆ లక్షణాలు, దక్షత, ఓర్పు అన్నీ రామ్మోహన్రావులో ఉన్నాయని ఆయనకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీని, వ్యక్తిత్వాన్ని చూసి ఓటు వేయాలన్నారు. కేంద్రం స్కాలర్షిప్, సబ్సిడీలను నేరుగా అర్హుల ఖాతాలోనే వేస్తోందన్నారు. దేశాన్ని స్వచ్ఛ భారత్ దిశగా పయనింప చేయాలన్నది ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశమని.. ఆయన ఇచ్చిన నినాదాన్ని దేశ వ్యాప్తంగా ప్రజలు అందుకొని పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం హర్షించదగిన విషయమన్నారు. ఈ ఏడాది దేశంలోని అన్ని పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించాలని కేంద్రం సంకల్పించిందన్నారు. రామ్మోహన్రావు 20 ఏళ్లుగా పార్టీలకు అతీతంగా సామాజిక సేవ చేశారని, ఆయన్ను గెలిపిస్తే కేంద్రం నుంచి మూడు జిల్లాలకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మంత్రుల ప్రచారమా..?: రామ్మోహన్రావు టీఆర్ఎస్ డబ్బున్న అభ్యర్థిని బరిలో దింపిందని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్మోహన్రావు అన్నారు. ఈ ఎన్నిక కోసం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఏడుగురు మంత్రులను ప్రచారం కోసం తిప్పుతోందన్నారు. ముఖ్యమంత్రి ప్రతిపక్షం లేకుండా ఏకపక్షం చేయూలని చూస్తున్నారని అది ఎప్పటికీ సాధ్యంకాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యువతకు ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం శోచనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. నామా జన్మదిన వేడుకలు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేదికపైనే నామా కేక్ కట్ చేశారు. బీజేపీ, టీడీపీ నేతలు నామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, రాష్ర్ట ఉపాధ్యక్షులు ఎం.ధర్మారావు, కార్యవర్గ సభ్యులు గెంటల విద్యాసాగర్, దుద్దుకూరి వెంకటేశ్వర్రావు, నేతలు చందా లింగయ్య, జిల్లా కార్యదర్శి గెల్లా సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వీరభద్రప్రసాద్, కిసాన్‌మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంగల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు గోవర్దన్, జయచంద్రారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, నేతలు బేబి స్వర్ణకుమారి, ఫణీశ్వరమ్మ పాల్గొన్నారు. -
అవలక్షణాలను సీపీఐ అధిగమించగలదా?
తన సామాజిక వ్యవస్థను నెలకొల్పే సుదీర్ఘ మహాప్రస్థానంలో కమ్యూనిస్టు పార్టీకి ఇప్పటికి 90 ఏళ్లు వచ్చాయి. దశాబ్దాలు గడుస్తున్నా ఎక్కడా ప్రభావం చూపని నిస్సహాయస్థితిలో కమ్యూనిస్టులు ఉంటుంటే ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు నెలల్లోపే అధికారానికి ఎగబాకుతున్నాయి. లోపం ఎక్కడుందో కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికైనా ఆత్మశోధన చేసుకోవాలి. త్యాగాల పునాదుల మీద పుట్టింది కమ్యూనిస్టు పార్టీ. సామాజిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి నూతన వ్యవస్థను నెలకొల్పడం పార్టీ లక్ష్యం. సుదీర్ఘమైన ఈ మహా ప్రస్థానంలో కమ్యూనిస్టు పార్టీకి ఇప్పటికి 90 ఏళ్లు వచ్చాయి. దేశంలో 1925 డిసెంబర్ 26న కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటైతే ఆ తర్వాత పదేళ్లకు ఆంధ్రాలో పురుడు పోసుకుంది. ఆ నాడు పార్టీ సభ్యుల సంఖ్య 40 మాత్ర మే. 1936 జనవరి 29న తూర్పు గోదావరి జిల్లా కాకినా డలో తొలి మహాసభను జరుపుకున్న సీపీఐకి పుచ్చల పల్లి సుందరయ్య కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మద్దు కూరి చంద్రశేఖరరావు, పోలేపెద్ది నరసింహమూర్తి, చలసాని వాసుదేవరావు, తనికెళ్ల వెంకటచలపతి, కొస రాజు శేషయ్య, అల్లూరి సత్యనారాయణ కార్యవర్గ సభ్యు లుగా ఉన్నారు. అనేక అవాంతరాలు, బ్రిటీష్ ప్రభుత్వ ఆంక్షల మధ్యే పార్టీని విస్తరింపజేసేందుకు అవిరళ కృషి, అపార త్యాగం చేశారు. విజయవాడలో 1943లో జరిగి న మూడో మహాసభల నాటికి చండ్ర రాజేశ్వరరావు లాంటి ఉద్దండులు తోడవడంతో కమ్యూనిస్టు పార్టీకి తిరుగులేకుండా పోయింది. కార్మికులు, కర్షకులు, కష్ట జీవుల పార్టీగా అవతరించింది. అణగారిన వర్గాలకు అరుణ పతాకం అండగా మారింది. కులాల అంతరాన్ని తరిమి కొట్టడానికి, సమాజాభివృద్ధికి, సాహిత్య వికాసా నికి అవిరళ కృషి చేసింది. యువతకు కొత్త ప్రేరణ ఇచ్చింది. దోపిడీ, పీడనకు మారు పేరుగా నిలిచిన నైజాం సర్కార్ వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటానికి అండగా నిలిచింది. బందూకులు పట్టింది. ఊళ్లకు ఊళ్ల ను విముక్తం చేసింది. పేదలకు లక్షలాది ఎకరాల భూమి పంచింది. ఈ సాయుధ పోరాటంలో అశ్రుతర్పణలు చేసింది. అదేసమయంలో పార్లమెంటరీ వ్యవస్థలోనూ పైచేయి చాటింది. 1955 మధ్యంతర ఎన్నికల్లో అధికా రం అంచుల దాకా వెళ్లింది. వ్యతిరేకశక్తుల దుష్ర్పచారం, ఎన్నికల ఎత్తుగడల్లో వైఫల్యంతో ప్రతిపక్ష హోదాకు పరిమితమైంది. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో విలీనమైన తర్వాత 1956 జూలైలో హైదరాబాద్‌లో ఏడో మహా సభను ఉమ్మడిగా నిర్వహించుకున్న తెలంగాణ, ఆంధ్రా కమ్యూ నిస్టులు 9వ మహాసభ నాటికి అంటే 1960 నాటికి తీవ్ర కుదుపునకు లోనయ్యారు. 9వ మహాస భను ఓ వర్గం అనంతపురంలో నిర్వహించుకుంటే మరో వర్గం రాజమండ్రిలో నిర్వహించుకుంది. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన విభేదాలు, ఇతరత్రా విధానపరమైన కారణాలతో కమ్యూనిస్టు పార్టీ రెండు ముక్కలైంది. ఎర్రజెండాపై ఆంధ్రా ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. పార్టీ చీలిక నేపథ్యంలో పదో మహాసభ 1964 నవంబర్‌లో గుంటూరులో జరిగింది. చీలిక తర్వాత జరిగిన ఆ తొలి మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నీలం రాజశేఖరరెడ్డి పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు అహరహం కృషి చేసినా ఫలితం లేకపోయింది. పరస్ప ర హననానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎం) పాల్పడడంతో రెండు పార్టీలూ పుట్టేవాళ్లకు అన్నలా, పెరిగే వాళ్లకు తమ్ముడిలా మారాయి. వరంగల్ లో 1998లో జరిగిన సీపీఐ రాష్ట్ర 20వ మహాసభ ప్రత్యేక తెలంగాణకు జై కొడితే సీపీఎం సమైక్యాంధ్రకు కట్టుబడింది. 2015 మార్చి 3 నుంచి విజయవాడలో జరగనున్న మహాసభ పరిశేష ఆంధ్రప్రదేశ్‌కు తొలి మహాసభ అయితే పాత లెక్కల ప్రకారం 25వ మహాసభ. రాష్ట్ర విభజన, సమైక్య ఉద్యమంలో కకావికలైన పార్టీలలో సీపీఐ ఒకటి. ప్రజా పునాదులు కోల్పోయింది. 1955 ఎన్నికల్లో సత్తా చాటిన పార్టీకి 2014 ఎన్నికల్లో చట్టస భల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఆనాడు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి సుమారు 30 శాతానికి పైగా ఓట్లు వస్తే నేడు రెండు శాతానికి (ఉభయ కమ్యూని స్టులకు కలిపి) పరిమితమైంది. తొలినాళ్లలో ఏ వర్గాలైతే అండగా ఉన్నాయో అవి పాలకవర్గ పార్టీలకు వెళ్లిపోయా యి. సీట్లు, ఓట్ల మోజులో పడిన పార్టీకి- కొందరైతే సభ్యులున్నారేమో గానీ పాలక పార్టీల అవలక్షణాలకు ఏమాత్రం తీసిపోరని చెప్పవచ్చు. దేశంలో ప్రవేశించిన ఉదార విధానాలతో పాటే పార్టీలోనూ ఉదారవాదం పెరిగిపోయింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండ డం, ఉద్యమాలను తేలిగ్గా చూడడం, సాహిత్య కృషి క్షీణించడం, బాధ్యతా రాహిత్యం, అవినీతి, జవాబుదారీ తనం లేమి వంటి సవాలక్ష అవలక్షణాలు అబ్బాయి. పార్టీలో ముఠాతత్వం, కులతత్వం పెరిగింది. ఆడంబ రాలు, విలాసాలు పెరిగాయి. చెప్పేదొకటి చేసే దొకటి షరా మామూలైంది. పదవులపై లాలస పెరిగింది. ఏళ్ల తరబడి ఒకే వ్యక్తి పదవుల్లో కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టమని పార్టీ కురువృద్ధుడు ఏబీ బర్దన్ పదేపదే చెబుతుంటారు. కానీ సీపీఐలో ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. పార్టీకి నూతన జవసత్వాలను అందిం చే విద్యా, యువజన విభాగాలు నామమాత్రమయ్యా యి. వచ్చే వాళ్ల పట్ల ఆదరణ తగ్గుతోంది. కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం అలంకార భూషణం కాదంటూనే దాన్ని కాపాడుకోవడానికి నానా కుట్రలు, కుతంత్రాలు పన్ను కోవడం షరామామూలైంది. విశాల దృక్పథంతో వ్యవహరించడానికి బదులు చాలా సంకుచితంగా వ్యవ హరిస్తున్నారు. ఫలితంగా పార్టీ అంటే ఏ కొన్ని వర్గాలకో పరిమితమన్న భావన కలుగుతోంది. దశాబ్దాలు గడుస్తు న్నా ఎక్కడా ప్రభావం చూపని నిస్సహాయస్థితిలో కమ్యూనిస్టులుంటుంటే ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు ఆరేడు నెలల్లో అధికారానికి ఎగబాకుతున్నాయి. లోపం ఎక్కడుందో కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికైనా ఆత్మ శోధన చేసుకోవాలి. కమ్యూనిస్టు పార్టీ ఆదిలో ఏమి చేసిందో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే చేసింది. పేదలుండే బస్తీల్లో తిష్ట వేసింది. వారితో మమేకమైంది. గుడిశ మీటింగులు పెట్టింది. జనాన్ని ఆకట్టుకుంది. ఫలితం-ఎక్కడైతే అధికారాన్ని పొగొట్టుకున్నారో అక్కడే గెలవడం. నిస్వార్ధం, త్యాగం, పారదర్శకత, జవాబు దారీ తనం, కాలానుగుణంగా మారడం వంటివి రాజకీ య కార్యకలాపాల నివేదికలకే పరిమితం చేయకుండా కసితో అమలు చేసే దిశగా కదలాలి. ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న వారిని ఏరిపారేయండి, కొత్త శక్తులకు ఊతమివ్వండి. పూర్వవైభవానికి నడుంకట్టండి. ఈ మహాసభలు అందుకు ఉపయోగపడాలని, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చెబుతున్న వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యతకు చిత్తశుద్ధితో క్రియాశీల పోరాటాలతో ముందుకు సాగాలన్నది ఆకాంక్ష. (సీపీఐ 25వ రాష్ట్ర మహాసభలు రేపటి నుంచి విజయవాడలో జరుగుతున్న సందర్భంగా) ఎ.అమరయ్య మొబైల్ : 9912199494 -
ఎవరిపై ఈ అభాండాలు
నిరుపేద కూలీ మల్లీశ్వరి తన పసికూనకు పాలివ్వడానికి కూడా కాం ట్రాక్టర్ అనుమతి ఇవ్వకపోవడంతో పసిపాప ఏడ్చి, ఏడ్చి ప్రాణాలు వదలడం యావత్ సమాజానికే తలవంపులు తెచ్చే ఘటన. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిచాల్సిందే. ఖండించడంతో సరిపెట్టుకోకుండా శక్తి మేరకు ఉద్యమించడం, బాధితుల పక్షం నిలిచి గొంతెత్తడం తక్షణ కర్త వ్యం. కానీ ఇంత దారుణం జరుగుతున్నా కమ్యూనిస్టులేం చేస్తున్నారు అని ఈ నెల 20న సాక్షి పత్రికలో ఎ. ప్రదీప్ రాసిన లేఖ ప్రశ్నించింది. అయితే అన్నిటికంటే ముందు ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చి, ప్రచురించిందీ, ప్రసారం చేసిందీ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోని మీడియానే. పైగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో సీఐటీయూ, సీపీఎం మహిళా సంఘం కార్యకర్తలు తహసీల్దారును అడ్డుకుని న్యాయవిచా రణ జరిపించాలని ధర్నా చేశారు. సంఘటనపై కొనసాగింపు కార్య క్రమం చేసిందీ, చేస్తున్నదీ, అలాగే మల్లీశ్వరితో పోలీస్ కంప్లయింట్ చేయించి వారికి రక్షణ కల్పించింది కూడా వారే. కాగా ముఖ్యమంత్రి కదిలి న్యాయం చేయాలని అభ్యర్థించిన ఈ లేఖలో.. సమస్యను వెలు గులోకి తీసుకొచ్చిన వారిని విస్మరించడం సబబు కాదు. మల్లీశ్వరిని కడుపు కోతకు గురిచేసిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఆమె ముగ్గురు కూతుళ్లకూ చదువు చెప్పించాలని డిమాండ్ చేద్దాం. నేటికీ స్పందించని ప్రజాప్రతినిధులను, మంత్రులను నిలదీద్దాం. నాగటి రవీంద్ర హైదరాబాద్ -
కెరీర్ బయోగ్రఫీలో ఇంకా చెప్తాను!
సీనియర్ పాత్రికేయులు ఎబికె ప్రసాద్. ఒక తరం తెలుగు పత్రికలన్నింటిలోనూ ఆయన ముద్ర ఉంది. ఆయన వేసిన బీజాలతో మొలకెత్తిన మొక్కలు శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షాలయ్యాయి. విస్తృతమైన జీవితాన్ని, సమాజాన్ని చూసిన అనుభవం ఆయనది, అభ్యుదయ భావాల ఈ కలం వీరుడి అంతరంగ వీక్షణానికి ఓ ప్రయత్నం. కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశాను. పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. తర్వాత ఆ ఇంటినీ అమ్మేసి ఆ డబ్బుతో నేను, నా భార్య సుధ ఇద్దరం హైదరాబాద్, కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌లో జీవిస్తున్నాం. ఎబికె ప్రసాద్ - అంతర్వీక్షణం మీరు పుట్టింది ఎప్పుడు? ఎక్కడ? 1935వ సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన కృష్ణాజిల్లా ఉయ్యూరులో పుట్టాను. మీ సొంతూరు ఉయ్యూరా? అమ్మానాన్నలు... సొంతూరు కృష్ణాజిల్లా ఉప్పలూరు. మా మేనమామ చలసాని వాసుదేవరావు ఉయ్యూరు దగ్గర భట్ల పెనుమర్రులో ఉండేవారు. అమ్మ చంద్రావతమ్మ, నాన్న బుచ్చివీరయ్య. నాన్న నా ఐదవయేటనే పోయారు. నన్ను అమ్మ పెంచింది. మీరు ఏం చదివారు? ఎం.ఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్కంటిన్యూ చేశాను. ఎందుకలా?... నాగపూర్‌లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ‘విశాలాంధ్ర’ పత్రికకు రిపోర్ట్ చేసేవాడిని. అలా ఫైనలియర్‌కి వచ్చేటప్పటికి నాకు కావలసింది ఈ కోర్సులో ఏమీ ఉండదనిపించి చదువు మానేసి ఉద్యోగంలో చేరాను. మీ తొలి ఉద్యోగం ఎక్కడ? విజయవాడలో, ‘విశాలాంధ్ర’ పత్రికలో. మీ పాత్రికేయ జీవితానికి ఎన్నేళ్లు? 1958లో విశాలాంధ్రలో సబ్ఎడిటర్గా చేరాను. అప్పటి నుంచి లెక్కిస్తే 56 ఏళ్లు. నా కలం మరో నాలుగేళ్లు పెద్దది. బి.ఎ రోజుల్నుంచి రాస్తున్నాను. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు? కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశాను. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మా మేనమామ వాసుదేవరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, మాకినేని బసవపున్నయ్య లాంటి ప్రముఖుల చర్చలను ప్రత్యక్షంగా చూశాను. నన్ను వాళ్లు చాలా ప్రభావితం చేశారు. అప్పటి రాజకీయాలతో మీకు ప్రత్యక్ష సంబంధాలుండేవా? పునాదిపాడులో ఎనిమిది- తొమ్మిది తరగతులు చదువుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుణ్ణయ్యాను. కొద్దికాలానికే బయటికొచ్చేశాను. ఆర్ఎస్ఎస్ నచ్చలేదా? గాంధీజీ హత్యతో ఆర్ఎస్ఎస్ పట్ల విముఖత కలిగింది. గాంధీజీ హత్య మిమ్మల్ని తీవ్రంగా గాయపరచినట్లుంది! నిజమే. ఊరు ఊరంతా అట్టుడికిపోయింది. పెద్దవాళ్లందరూ గాంధీజీ దేశం కోసం జీవితాన్ని అర్పించడాన్ని చెప్పుకోవడం విని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. సంపాదకులుగా ఎన్ని పత్రికలను నడిపించారు? ఆంధ్రపత్రిక, సాక్షిలో తప్ప తెలుగులో అన్ని పత్రికలకూ పనిచేశాను. ఈనాడు, ఉదయం, వార్త(విజయవాడ, వైజాగ్ ఎడిషన్లు) పత్రికలకు ప్రారంభ సంపాదకుడిని కూడా. వృత్తిపరమైన ఒడుదొడుకులు...! ‘జనశక్తి’ సంపాదకుడిగా నా మీద కేసులు ఫైలయ్యాయి. జైలుకెళ్లాను కూడ. జైలు జీవితం దుర్భరంగా అనిపించిందా? పుస్తకాలు చదువుకునే వాడికి జైలు దుర్భరంగా ఉండదు. కావలసినంత సమయం దొరికినట్లవుతుంది. అక్కడ జక్కా వెంకయ్య, డాక్టర్ శేషారెడ్డి వంటి పార్టీ సీనియర్ నాయకులతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం వచ్చింది. వందలాది అంశాల మీద వేలాదిగా వ్యాసాలు రాసి ఉంటారు? తాజాగా ఏం రాస్తున్నారు? నా కెరీర్ బయోగ్రఫీ ఈ డిసెంబర్లో మొదలు పెడతాను. అందులో చాలా విషయాలను చెప్తాను. సంతోషం కలిగించే విషయం! అనేక పత్రికలకు ప్రారంభ సంపాదకుడిని కావడం. తరచూ పత్రికలు మారతారనే అపప్రథ కూడా ఉంది కదా! కొత్తగా పత్రిక పెట్టే వారికి నా సేవలు కావాలి. బండి పట్టాలెక్కిన తర్వాత నా ముక్కుసూటితనాన్ని భరించాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు. రాజీ పడి ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు. జీవితంలో రాజీ పడాల్సిన సందర్భం వచ్చిందా? రాజీ పడాల్సిన సందర్భాలు ఎవరికైనా సరే చాలానే వస్తాయి. రాజీ పడి ఉంటే పొలాలు, ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఉద్యోగాలు మారేవాడినీ కాదేమో. రాజీలేని జీవితంతో తృప్తి కలుగుతోందా? చాలా తృప్తిగా ఉన్నాను. తృప్తిని మించిన ఆస్తి లేదు. సంపాదకుడి ప్రతిభకు కొలమానం ఉంటుందా? ఉంటుంది. పత్రిక అమ్మకాలు పెరగడం, తగ్గడం- రెండూ సంపాదకుడి ప్రతిభకు గీటురాళ్లే. విమర్శలను ఎలా స్వీకరిస్తారు? కుత్సితాల లోయలోకి వెళ్లేకొద్దీ మనలోని నైపుణ్యాలు అణగారిపోతాయి. కుహనా విమర్శను అక్కడితోనే వదిలేయాలి. మనసులోంచి తుడిచేయాలి. అప్పుడే లక్ష్యాలను చేరగలం. మీరు నమ్మే సిద్ధాంతం? ఎన్ని అడ్డంకులు ఎదురైనా మానసికంగా దెబ్బతినకూడదు. ఎంచుకున్న బాటను వదల కూడదు. పాత్రికేయులకు మీరిచ్చే సందేశం? ప్రతి వాక్యాన్నీ బాధ్యతగా రాయాలి. ఆ సంస్థను వదిలి వెళ్లేటప్పుడు రాసిన చివరి వాక్యం కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు రాసినట్లే రాయాలి. రాసిన ప్రతి వాక్యానికీ బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉండాలి. - వాకా మంజులారెడ్డి -
ఏటికి ఎదురీదిన విప్లవ స్వాప్నికుడు
ఆలూరి భుజంగరావుగారు ఈ లోకాన్ని విడిచి వెళ్లి సంవత్సరమైంది. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లినా, మా స్మృతిపథంలో నిలిచేవుంటారు. ఆయన జీవితం, ఆచరణ మాలాంటి వారికి మార్గదర్శకాలే. భుజంగరావుగారి జీవితం చిన్నతనం నుంచీ దుర్భర దారిద్య్రంతో, నిరంతర పోరాటంగానే సాగింది. ఆ వయసు నుంచే హోటల్ కార్మికునిగా పనిచేశారు. ‘శారద’ అనే నటరాజన్‌తో కలసి సాహి త్య సాధన చేశారు. తోటి కార్మికులతో కలసి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సంబంధాలలోకి వెళ్లారాయన. పార్టీ నుంచి అందుకున్న రాజకీయ చైతన్యం, శారద వంటి స్నేహితుల సాంగత్యం భుజంగరావుగారు తన రచనా వ్యాసంగాన్ని మెరుగుపరుచుకునేందుకు దోహదం చేశాయి. అయితే తనను ‘రచయితగా తీర్చి దిద్దింది దేశంలోని కోటానుకోట్ల దరిద్రజీవులే’నని సగర్వంగా ఆయన చెప్పేవారు. సమస్త జ్ఞానవిజ్ఞానాలూ, సుఖసంపద లూ అన్నీ శ్రమజీవుల చెమట చుక్కల నుంచి వచ్చాయని నమ్మారు. కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించిన తరువాత, ‘మీ బతుకులు మీరే బతకండి’ అని తన సాహిత్య సాంస్కృతిక కార్యకర్తలకు చెప్పడంతో చాలామంది ఎలాగ బతకడం అని ప్రశ్నించుకున్నారు. చాలామంది అందిన రంగాలలో కుదురుకున్నారు. క్రమక్రమంగా కమ్యూనిస్టు చైతన్యానికి దూరమయ్యారు. పార్టీ పార్లమెం టరీ రాజకీయాల ఊబిలో కూరుకుపోయింది. ఇందుకు భి న్నంగా భుజంగరావుగారు హిందీ పరీక్షలు రాశారు. ఆ భాష మీద పట్టు సాధించారు. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినా కష్టాలు తప్పలేదు. మార్క్సిస్టు దృక్పథం నుంచి భూత భవి ష్యత్ వర్తమానాల చరిత్రను అవగాహనకు తేగల రాహుల్ సాంకృత్యాయన్ రచనలను విరివిగా అ నువదించారు. ఇల్లు చిన్నది. కుటుంబం పెద్దది. ఆ స్థితిలో రా హుల్జీ, యశ్పాల్, ప్రేమ్‌చంద్ రచనలను అనువదించ డం ఎంత కష్టమో ఊహించవచ్చు. ఇక్కడ నా గొడవ కొంచెం. చిన్నతనంలో నాకు రాహుల్జీ ‘ఓల్గా సే గంగ’ తెలుగు అనువాదం (అల్లూరి సత్యనారాయణరాజు) దొరికింది. తరువాత నేను పుట్టిన బ్రాహ్మణ ‘తత్వ’ భావజాలం మీద వ్యతిరేకత మొదలైంది. కమ్యూనిస్టుల మీద సానుభూతి కలిగింది. అప్పుడే ‘పుట్టిల్లు’ సినిమా పరాజయంతో రాజమండ్రి వచ్చిన డాక్టర్ రాజారావు గారి దగ్గర నాటకాల కోసం చేరాను. సినిమా తీయాలని మళ్లీ మద్రాసుకు వెళ్లినప్పుడు ఆయన వెనకే నా సహచరితో మద్రాసు చేరాను. అక్కడ ఆయన కల్పించిన నాటక వాతావరణం, కన్నెమెరా లైబ్రరీ నుంచి తెచ్చుకున్న రాహుల్జీ అనువాద నవలలు, నా ఆలోచనా విధానంలో మార్పును త్వరితం చేశాయి. ఈ మార్గాన్వేషణలో నాకు దోహదం చేసిన విజ్ఞుల్లో భుజంగరావు గారిని పరోక్ష మార్గదర్శకులుగా భావిస్తున్నాను నేను. భుజంగరావు గారు ‘అరణ్యకాండ’ లాంటి కథలను రాశారు. అది చదివితే వారి కథన నైపుణ్యం తెలుస్తుంది. ‘గమనాగమనం’ పేర జీవిత కథని రచించారు. ఆయన అనువాద సాహిత్యంలో ‘సింహావలోకనం’కి ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశాన్ని భవిష్యత్తు వైపు నడిపిస్తున్న ఒకే ఒక్క వేగుచుక్కలా ‘భగత్‌సింగ్’ని మన స్మృతి పథంలో అది నిలుపుతుంది. ‘దర్శన్ దిగ్దర్శన్’ ప్రపంచ తాత్విక జ్ఞానాన్ని పరిచ యం చేసింది. ఆచరణపరంగా కూడా భజంగరావుగారు నాకు మార్గదర్శకులుగా నిలిచారని నేను ‘విరసం’కి దగ్గరయ్యే వరకూ తెలియలేదు. భుజంగరావు గారు ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమాల కాలం నుంచి నక్సల్బరీ మీదుగా ‘విరసం’ సభ్యులు గా, విప్లవాభిమానిగా ముందుకు నడిచారు. స్వచ్ఛందంగా ముందుకు రాదల్చుకున్న పిల్లల్ని, సహచరిని విప్లవోద్యమంలోకీ, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలోకీ వచ్చేందుకు ప్రోత్సహించారు. ఆలూరి లలితా పరమేశ్వరిగారు కూడా నీడలా ఆయన్ని అనుసరించడంతో ఆగిపోకుండా, వారు కీర్తిశేషులయ్యాక ఆయన సభ్యత్వాన్ని ‘విరసం’లో కొనసాగిస్తూ నేను ఉన్నంత వరకూ మేం ఇద్దరం వస్తున్నట్లే భావించమని కోరారు. ఇది సభ్యులకు, సభ్యులు కాని సహచరులకు స్ఫూ ర్తినిచ్చే సంప్రదాయం. భుజంగరావు గారు భౌతికంగా మన మధ్య లేకున్నా విప్లవకారుల, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమ సహచరుల, విప్లవసానుభూతిపరుల స్మృతి పథంలో సదా నిలిచేవుంటారు. జీవితాంతం ఏటికెదురీదిన విప్లవ స్వాప్నికుడు భుజంగరావు. ఆ అమరునికి రెడ్ శాల్యూట్స్. - కాకరాల (వ్యాసకర్త రంగస్థల, సినీ నటుడు, వామపక్ష ఉద్యమశీలి) -
అవకాశవాద పొత్తులు ఎండనుబట్టి గొడుగులు
ఎన్నికల్లో పొత్తులకు... స్నేహాలకు సంబంధించి చంద్రబాబుకు సిద్ధాంతాలేం లేవు... కేవలం అవసరాలే. ఎన్టీఆర్ ఉన్నప్పుడు 1994 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. 1999 ఎన్నికల్లో బాబు కమ్యూనిస్టులకు కటీఫ్ చెప్పి బీజేపి పంచన చేరారు. 2004లో తిరిగి బీజేపీతోనే ముందుకు వెళ్లారు. 2009లో బీజేపీకి కటీఫ్ చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలతో, తెరాసాతో పొత్తు పెట్టుకుని మహాకూటమి ఏర్పాటు చేశారు. మతతత్వ పార్టీ బీజేపీతో జీవితంలో కలిసే ప్రసక్తే లేదన్నారు. మోడీ వంటి నరహంతకుని హైదరాబాద్‌లో అడుగు పెట్ట నిచ్చేది లేదని హెచ్చరించారు. తనను మించిన సెక్యులర్ ఇంకెవరూ లేరన్నారు. ప్రస్తుత ఎన్నికల నగారా మోగిన తర్వాత కూడా రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందన్నారు. చివరి నిమిషంలో అదే బీజేపీతో స్నేహం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రాపకం కోసం బాబు తాపత్రయం మరీ విడ్డూరం. జూనియర్ ఎన్టీఆర్‌తో 2009 ఎన్నికల ప్రచారాన్ని చేయించుకున్న చంద్రబాబు ఈ సారి జూనియర్ స్థానంలో పవన్‌కల్యాణ్‌ను తిప్పాలనుకున్నారు. మోడీకి జై కొడుతోన్న పవన్ కాస్తా టీడీపీ ఊసెత్తకపోయే సరికి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కనపెట్టి... పవన్ కల్యాణ్ ఇంటికి తానే ఫోను చేసి మరీ తేనీటికి వస్తున్నానని చెప్పి వెళ్లి పార్టీకి ప్రచారం చేసి పెట్టమని ప్రాధేయపడ్డారు. 1994 ఎన్నికల్లో జనామోదం పొందిన ఎన్టీఆర్‌ను ఏడాదికే అన్యాయంగా పదవిలో నుంచి దించి 1995లో పాలనా పగ్గాలు చేపట్టిన బాబు, 1996లో వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా ముద్ర వేయలేక పోయారు. పార్టీ అధినేతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే 1998 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని, లేదంటే 1999 శాసనసభ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదని ఆయనకు బాగా తెలుసు. దాంతో, అప్పటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేసిన బాబు కాంగ్రెస్‌తో పాటు బీజేపీపైనా ధ్వజమెత్తారు. అది మతతత్వ పార్టీ అని గొంతు చించుకుని ప్రచారం చేశారు. ముస్లిం మైనారిటీ ఓట్ల మీద కన్నేశారు. విజయవాడలో ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ, బీజేపీ ఎంత మతతత్వ పార్టీ అంటే, అది మసీదు (బాబ్రీ మసీదు)లను కూలుస్తుంది అన్నారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా 1998లోనూ టీడీపీకి ఆశించిన స్ధాయిలో లోక్‌సభ స్థానాలు రాలేదు. అలా బాబు లెక్క తప్పింది. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాదరణ దక్కుతుందన్న భరోసా కలగలేదు. మరి దొడ్డిదారిన తెచ్చుకున్న అధికారం నిలుస్తుందో, లేదో! ఈ సందేహంతో బాబు సతమతమయ్యారు. లౌకికవాదపు రంగు పులుముకుని అంతకు ముందు దాకా తాను చెప్పిన మాటలన్నీ మరచి బీజేపీతో అంటకాగారు బాబు. ఆయన అదృష్టం బాగుండి ఆ ఎన్నికల్లో గండం గట్టెక్కారు. అలా ఆయన సీఎం పీఠం నిలబడ్డా ఆయన లౌకిక వాదం మాత్రం గాలికి పోయింది. గోధ్రా అనంతర అల్లర్లకు కారకుడైన నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీల్లేదని, వెంటనే ఆయన్ని మార్చాలని టీడీపీ పొలిట్‌బ్యూరో 2002 ఏప్రిల్ 11న తీర్మానం చేసింది. మోడీని తక్షణం గద్దె దించకపోతే తాము ప్రజా విశ్వాసం కోల్పోతామని టీడీపీ భీష్మించింది కూడా. అయినా బీజేపీ నాయకత్వం వీసమెత్తు కూడా ఖాతరు చేయలేదు. గుజరాత్ మత అల్లర్లకు సంబంధించి మోడీపై వాజ్‌పేయి ఆగ్రహంగా ఉన్నారని అందిన గాలి వార్త ఆధారంగా, దాన్నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు బాబు నెత్తికెత్తుకున్న ‘మోడీని మార్చాల్సిందే’ నినాదపు ఎత్తుగడ అలా వికటించింది. 2003లో అలిపిరిలో మందుపాతర పేలుడు ఉదంతం తర్వాత మరోమారు సానుభూతి పవనాల సాయంతో గట్టెక్కాలని ఎంతగానో ఆశపడ్డారు. చన్నీళ్లకు వేన్నీళ్లు తోడన్నట్టు బీజేపీతో పొత్తు సాగిస్తూనే 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ జనాగ్రహం దెబ్బకు తాను మునగడమే గాక కేంద్రంలో ఎన్డీఏ కూటమినీ, దాని ప్రధాన భాగస్వామి బీజేపీనీ ముంచారు. తానూ తేలిపోయారు. 2004లో అధికారం దూరమైన నాటి నుంచి చంద్రబాబు మళ్లీ మాట మార్చారు. ఎన్డీఏతో పొత్తు తప్పేనని, గోధ్రా అల్లర్ల ప్రభావం తమపైనా పడి ముస్లిం మైనారిటీలు టీడీపీకి దూరమయ్యారని పాత పాట అందుకున్నారు. 2009 ఎన్నికల ముందు పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడుతో ఈ మేరకు బహిరంగ ప్రకటన ఇప్పించారు. నెపాన్ని బీజేపీపై నెట్టి, నెమ్మదిగా ఇతర పక్షాలకు దగ్గరయ్యే యత్నాలను ముమ్మరం చేశారు. తెలంగాణ ఉద్యమ వాతావరణాన్ని, దాన్ని బలంగా వ్యతిరేకిస్తున్న జాడల్లేని సీమాంధ్ర రాజకీయ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త ఎత్తుగడకు దిగారు. అది కాస్తా చివరికి మహా భంగపాటుకే దారి తీసింది. ‘బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకోవడం తప్పయింది. మేం అధికారంలో ఉన్నప్పటి మా విధానం వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం’ అంటూ 2011 మేలో జరిగిన టీడీపీ మహానాడులో బహిరంగంగానే బాబు చెంపలేసుకున్నారు. ‘గోధ్రా అనంతర ఘటనలకు బీజేపీ నాయకత్వమే కారణం. అదే గనక జరిగి ఉండకపోతే కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో మేం అధికారంలోకి వచ్చి ఉండేవాళ్లం’అని పార్టీ 30వ వ్యవస్థాపన దినం సందర్భంగా 2012 మార్చి 29న అసెంబ్లీ ఆవరణలో మీడియాతో పలికారు. అదే అసెంబ్లీ వేదిక నుంచి, అంతకు ముందే ముస్లిం మైనారిటీలకు క్షమాపణ చెబుతూ, ‘జీవితంలో మరోమారు బీజేపీ వైపు వెళ్లను గాక వెళ్లను’ అని కూడా అన్నారు. ‘బీజేపీతో పొత్తు జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు. దాన్ని భవిష్యత్తులో మళ్లీ చేయను’ అని 2013 జూన్ 11న మైనారిటీలతో జరిగిన సదస్సులో కూడా చెప్పారు బాబు. తాజాగా దేశంలో మోడీ గాలి వీస్తోందంటూ మీడియా కథనాలు రాగానే, బీజేపీ పిలవకపోయినా బాబు అటువైపు అదేపనిగా పరుగులు తీశారు. గతమంతా నీటి మూటే అయింది. తానే పలికిన లౌకికవాదం గాలి మాటగా మిగిలింది. తప్పని చెంపలేసుకున్న బీజేపీతో పొత్తే మళ్లీ ముద్దయింది. విశ్వసనీయత అడుగంటిన టీడీపీతో పొత్తు వద్దుగాక వద్దంటూ బీజేపీ స్థానిక నాయకత్వమంతా ఎంతగా మొరపెట్టుకున్నా, పక్షం రోజుల పాటు ఇదో రాజకీయ వివాదంగా మారినా... బాబు పట్టుబట్టి మరీ ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. చంద్రబాబు మార్కు అవకాశవాదానికి ఇవి కొన్ని మచ్చుతునకలు. బాబుపై వేసిన చార్జిషీట్‌ను మరచిందా బీజేపీ? టీడీపీ, బీజేపీల మధ్య సంబంధాలు, సంభాషణలను గుర్తుచేసుకుంటే... ఆ రెండింటి మధ్య పొత్తు చారిత్రక పొత్తా? చరిత్ర హీనమైన పొత్తా? అనేది అవగతమవుతుంది. 1998లో బాబు పరిపాలనలో వంద తప్పులు అంటూ బీజేపీ చార్జిషీట్ వేసింది. తాము అధికారంలోకి వస్తే బాబుపై సీబీఐ విచారణ జరిపించి కటకటాల వెనక్కి పంపిస్తామంది. -
సీపీఐతో పొత్తు ప్రసక్తేలేదు: జేఎస్పీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో పొత్తు లేదా ఎన్నికల సర్దుబాట్లకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) ససేమిరా అంటోంది. సీపీఎంతో మాత్రమే సర్దుబాట్లు చేసుకోవాలని జేఎస్సీ నాయకత్వం భావిస్తోంది. ఈమేరకు సీపీఎం నేతలు పి.మధు, పాటూరి రామయ్య ఇటీవల జేఏస్పీ నేతలు కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, తులసిరెడ్డితో తొలివిడత చర్చలు జరిపారు. ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారో చర్చించుకున్నారు. అయితే సీపీఐతో పొత్తు ప్రతిపాదనను జేఎస్పీ ప్రెసిడెన్షియల్ బ్యూరో తోసిపుచ్చింది. విభజనకు సీపీఐ మద్దతు ఇచ్చినందున ఆ పార్టీతో కలిసి పోటీ చేయాలనుకోవడం లేదని స్పష్టం చేసింది. -
మొదట 'చేయి' కామ్రేడ్లదే...!
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తుగా ఉన్న హస్తంను మొదటి సార్వతిక ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలకు కేటాయించారు. 1952లో కాంగ్రెస్ పార్టీది కాడెడ్ల గుర్తు. దీంతోనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేసింది. హైదరాబాద్ సంస్థానం మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు కంకికొడవలి గుర్తుపై పోటీ చేశాయి. హైదరాబాద్ సంస్థానంలో నిషేధం ఉండటంతో ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరిట ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల సంఘం పీడీఎఫ్ అభ్యర్థులకు హస్తం గుర్తును కేటాయించింది. 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలకు కంకికొడవలి గుర్తే లభించింది. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. 1970లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోవడంతో ఇందిరాగాంధీ అభయహస్తం గుర్తును స్వీకరించారు. అప్పటి నుంచి అదే గుర్తును కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోంది. తొలుత కమ్యూనిస్టులకు కేటాయించిన చెయ్యి గుర్తు కాలక్రమంలో కాంగ్రెస్‌కు శాశ్వత గుర్తుగా మిగిలింది. -
అసలు నేను ఎన్టీఆర్ పార్టీ!
చిన్నప్పుడు, నాకు ఊహ తెలిసేసరికి రెండే రెండు పార్టీలు ఉండేవి. మీరు, కాంగ్రెస్ - కమ్యూనిస్టు పార్టీ అనుకుంటే, కాలే పప్పులో కాలేసినట్లే. ఎన్.టి.ఆర్. పార్టీ - ఎ.ఎన్.ఆర్. పార్టీలు అవి. నేను లాగుల్లో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్. పార్టీ. మా అమ్మమ్మ వాళ్లూళ్లో, డేరా టాకీస్‌లో నేలలో కూచుని సిన్మా చూస్తూ, ఎన్.టి.ఆర్. కత్తి తిప్పుతుంటే - గుర్రం తోలుతుంటే ఆయనతో పాటు నేను కూడా ఎక్కడికో వెళ్లిపోయేవాణ్ని. ఆ తర్వాత లాగుల్లోంచి ప్యాంటుల్లోకి ఎదిగినప్పుడు, నూనూగు మీసాలొచ్చినప్పుడు, అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించేసి, ఎ.ఎన్.ఆర్. పార్టీలోకి జంప్ అయిపోయాను. కారణం ఏం లేదు. పిల్ల వేషాల నుంచి ‘పిల్ల’ కోసం రొమాంటిక్ వేషాలేసే స్టేజ్‌కి, మనసు, శరీరం ప్రమోట్ అయిపోవడమే! కత్తి తిప్పుతూ, ఒక్క కాలు మీద గెంతుతూ (అది కూడా టైట్ ప్యాంట్స్‌లో) - ‘‘వగల రాణివి నీవే’’ అని పాడితే, ఆడపిల్లలు ఇంప్రెస్ అవ్వరని, స్టైల్‌గా సిల్క్ షర్ట్‌లో, పియానో ముందు కూచుని, ‘‘నా హృదయంలో నిదురించే చెలీ’’ అని అరమోడ్పు కన్నులతో పాడితే, అతివలందరూ అతి చేరువవుతారనీ - ఓ లవ్ గురు చెప్పడం వల్ల ఎ.ఎన్.ఆర్. పార్టీలో చేరిపోయా. అక్కడి నుంచీ ఎ.ఎన్.ఆర్. నన్ను వదిలిపెట్తే ఒట్టు. అసలు నన్నడిగితే, 60, 70ల్లో లవ్‌లో పడ్డ ప్రతి కుర్రాడూ తెలుగునాట ఎ.ఎన్.ఆర్. వల్లే ఇన్స్పైర్ అయి ఉంటాడని నా గట్టి నమ్మకం. నా నడకా, మాటా, నవ్వూ, చూపూ అన్నీ ఎ.ఎన్.ఆర్.లాగా ఫీల్ అయ్యేవాణ్ణి. ఒక్క రొమాన్సే కాదు, నా కెరీర్ కూడా ఎ.ఎన్.ఆర్. ప్రభావితమే. ఎన్టీఆర్ ఫ్యాన్‌గా ఉన్నప్పుడు, నేను పెద్దయినాక, గుర్రాల ట్రైనర్‌ని అవుదామనుకున్నాను. అలాంటిది, ‘ఆరాధన’, ‘డాక్టర్ చక్రవర్తి’ సిన్మాలు చూసి, అర్జెంట్‌గా డాక్టరైపోదామని డిసైడ్ అయ్యాను. ఈ రకంగా, ఎ.ఎన్.ఆర్. తన పరిచయానికి ముందే నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. 1995లో నా కుమార్తె కావ్య యాక్ట్ చేయగా, గుణ్ణం గంగరాజు డెరైక్ట్ చేసిన ‘లిటిల్ సోల్జర్స్’ వచ్చింది. ఆ చిత్రాన్ని సమర్పించిన అక్కినేని వెంకట్ ద్వారా నాకు మొదటిగా ఎ.ఎన్.ఆర్.గారితో పరిచయం అయింది. నేను రాణిగారిని వదిలేసి ఇంగ్లండ్ నుంచి వెనక్కి వచ్చి, హైదరాబాదులో ప్రాక్టీస్ పెట్టిన తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారింది. అన్నపూర్ణమ్మగారి మోకాలు ఆపరేషన్లలో నేను కూడా భాగస్వామినవడం వల్ల, మా స్నేహం అనుబంధంగా మారింది. ఇప్పుడు, అక్కినేని కుటుంబం సభ్యులందరితో నా రిలేషన్ ‘గురవారెడ్డిగారు’ నుంచి ‘గురివి’కి ఎదిగింది - ఒదిగింది. వ్యక్తిగతంగా నేను ఇన్స్పైరైన విషయాలు చెప్తాను. నాగేశ్వర్రావ్గారి డిసిప్లెయిన్ చూస్తే, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఉదయం 6 గంటలకి ఎండైనా, వానైనా వాకింగ్ చేయాల్సిందే (అదీ, అప్పుడే ఇస్త్రీ చేసినట్టు అగుపడే తెల్లని డ్రెస్‌లో). అలానే, ఎవరు డిన్నర్‌కి పిల్చినా, టంచన్‌గా వస్తారు. రాత్రి 9 గంటలకి ఇంటికి వెళ్లిపోవాల్సిందే. ఎ.ఎన్.ఆర్. గారి సమయపాలనా నిబద్ధత తెలుసుకున్న హోస్ట్‌లు అందరూ ఆయన ఒక్కరి కోసమన్నా ఆ టైమ్‌కి భోజనం ఏర్పాటు చేసి ‘అమ్మయ్య’ అనుకుంటుంటారు. రెండో విషయం - అంత పెద్ద సెలెబ్రిటీ ఫ్యామిలీలో తన పెద్దరికాన్ని ఆయన హ్యాండిల్ చేసే వైనం. అది అద్భుతం. అందరం ఊహించుకునేది - ‘పెదరాయుడు’ టైప్‌లో కుటుంబాన్నంతా వేలి మీద ఆడిస్తూ, చండశాసనుడిలా పాలిస్తూ ఉంటారని. కానీ నిజం ఏమిటంటే, మనవళ్లతో సహా అందరితో స్నేహితుడిలా ఉంటారు. అడిగితేనే సలహాలిస్తారు. ఫ్యామిలీ అంతా ఆయనకిచ్చే గౌరవం అపురూపం. సరే! వ్యక్తిత్వం, అలవాట్లు, క్రమశిక్షణ మనం ఎలాగోలా కష్టపడో, ఇష్టపడో ఏర్పరుచుకుంటాం. అంటే ఒక రకంగా ఇవన్నీ మనసుకు సంబంధించిన నియంత్రణలు. అదే రకంగా శరీరాన్ని లోనున్న ఫిజియాలజీని మనం నియంత్రించడం కష్టమైన విషయం. కానీ అదేం చిత్రమో - నాగేశ్వర్రావ్గారి బాడీ కూడా ఆయన చెప్పుచేతల్లో ఉండేది. ఇరవై ఏళ్ల కింద అమెరికాలో - ‘‘ఈయన గుండెని రిపేర్ చేయడం మావల్ల కాదు’’ అని ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు పంపేశారు. చివరి వరకు ఆయన హార్ట్ పర్ఫెక్ట్. ఆ డాక్టర్లందరూ ముక్కున వేలేసుకుని, నోట్లో కాలేసుకుని, ఎ.ఎన్.ఆర్.గారి మీద డాక్యుమెంటరీ చేస్తున్నారు - ‘లాంగెస్ట్ సర్వైవ్డ్ పేషెంట్ ఫ్రమ్ దెయిర్ ఇన్స్టిట్యూట్’ అని. ఆయన నిల్చోవడం - నడవడం ఎప్పుడన్నా చూశారా? ఓ అంగుళం కూడా వంగరు. నిటారుగా మేరు నగం లాగ. ఆయనలో సగం వయసున్నవాళ్లు కూడా వంగి, వంగిపోయి మెడ నొప్పో, నడుం నొప్పో అంటూ మూలుగుతుంటారు. అక్కినేనిగారితో పరిచయం నా అదృష్టం. నాకు ఇష్టమైన పాటల్లో మొదటిది - ‘వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా..’ ‘ఆరాధన’లో పాట. నాకిష్టమైన సిన్మాల్లో మొదటిది ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఈ రెండు సిన్మాల్లో హీరో నాగేశ్వర్రావ్గారే! నాకు కుర్ర వయసులో ఆయనే ఇన్స్పిరేషన్. నా వృద్ధాప్యంలోనూ ఆయనే. ఆ వయసులో, ఆయనలా నడవగల్గినా, నడుచుకోగలిగినా మహదానందం. (ఈ రచయిత రాష్ట్రంలోని ప్రముఖ డాక్టర్లలో ఒకరు) -
ఆ పార్టీలతో ప్రజాస్వామ్యానికి ముప్పు
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీతో ప్రజా స్వామ్యానికి ముప్పు ఉందని భాతర కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక ఇందిరాగాంధి నగర్‌లోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల జనరల్‌బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కుంభకోణాలతో కాంగ్రెస్ పాలన అవినీతి కంపు కొడుతుందన్నారు. బీజేపీ అంటే గుజరాత్లో జరిగినలో మత ఘర్షణలు గుర్తుకు వస్తాయన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాష్ట్ర రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంపై ఆయన అభ్యంతకరం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు దాన ధర్మాలు చేసే సంస్థలు కాదని చెప్పడం సరైంది కాదన్నారు. పేదలు ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, గాస్ సిలిండర్లపై రాయితీలు, రైతులు ఉచిత విద్యుత్ వంటివి ఆశించరాదని ఇందులో అర్థముందర్నారు. మరో విషయంగా సంకీర్ణ ప్రభుత్వాలు సరైన పరిపాలన అందించడం లేదని, సుస్థిర ప్రభుత్వాని ఎన్నుకోవాలని సూచించడం సరైంది కాదన్నారు. చిన్న, ప్రాంతీయ, ఇతర పార్టీలకు ఓట్లు వేయకుండా కాంగ్రెస్‌కు లేదా బీజేపీకే ఓట్లు వేసి గెలింపించాలన్నదే ఆయన మాటల్లోని మర్మమన్నారు. రాష్ట్రపతి హోదాలో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరే విషయాలను ప్రస్తావించారన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, తెలుగుదేశం అవకాశవాదంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అసెంబ్లీలో మూడు నాలుగు గంటలు మాట్లాడి కాంగ్రెస్ వాది, సమైక్యవాది అని చెప్పుకోవడం సరి కాదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో ప్రజా సమస్యలను విస్మరించిన పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. అల్కాలీస్ పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు అల్లాడుతుంటే మంత్రి టీజీ వెంకటేష్ అధికార బలంతో సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఆపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు టి. షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, నరగ కార్యదర్శి గౌస్‌దేశాయ్, జిల్లా కమిటీ సభ్యులు నిర్మల, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీ ‘మాదల’ కన్నుమూత
సాక్షి, గుంటూరు: సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ మాదల నారాయణస్వామి(99) సోమవారం గుంటూరులో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడులో జన్మించిన ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1948లో రహస్య జీవితంతో పాటు 1962లో భారత-చైనా సరిహద్దు వివాదంలో రెండేళ్ల పాటు ఆయన జైలు జీవితం గడిపారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయగానే 1952లో ఒంగోలు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున 1962లోనే ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు. నారాయణస్వామి అంత్యక్రియలు మంగళవారం గుంటూరులో జరగనున్నాయి. -
గతం ‘గర్జన’ విందాం
నవంబర్ 7వ తేదీకి మానవేతిహాసంలో మహోన్నత స్థానం ఉంది. 1917లో (96 ఏళ్ల క్రితం) రష్యాలో లెనిన్ నేతృత్వంలో, కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో కష్టజీవులు సంఘటితమై దోపిడీ వర్గాల పాలనను అంతమొందించారు. శ్రమజీవుల రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అదే యుఎస్ఎస్ఆర్ అప్పటికి రష్యా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. 13 శాతం మంది మాత్రమే పారిశ్రామిక కార్మి కులు ఉండేవారు. దేశంలో అత్యధిక భాగంలో ‘కులక్’ (జమీందారుల వంటి భూస్వాముల) పెత్తనం ఉండేది. ప్రజలు ఆ భూస్వామ్య ప్రభువుల దోపిడీ, దుర్మార్గం, అణ చివేతలను అనుభవిస్తుండేవారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడంతోనే జారీ చేసిన తొలి ‘డిక్రీ’ (చట్టం) భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసిం ది. ‘భూదేవి! నువ్వు సహజంగా నీ సహచరుడైన రైతు కూ లి స్వేదంతో మమేకమై పుష్పించి ఫలించాలని ఆరాటపడతావు. అలాంటి వాంఛకు విరుద్ధంగా భూస్వాములు ని న్ను తమ నిర్బంధంలో ఉంచుకున్నారు. నేటితో నీకు విముక్తి లభిస్తున్నది. నీ ప్రియమైన రైతుకూలితో కలిసి ఆనం దించు’ అంటూ హృద్యంగా సాగుతుంది ఆ డిక్రీ పాఠం. రష్యాలో శ్రామికరాజ్యం మార్క్స్ ప్రవచించిన దానికి మక్కికి మక్కీగా ఏర్పడలేదు. పెట్టుబడిదారీ విధానం పూర్తిగా అభివృద్ధి చెందిన తదనంతర పరిణామంగా కాకుండా, భూస్వామ్య వ్యవస్థలోనే ‘సోషలిస్టు రాజ్యం’గా ఆవిర్భవించింది. ఆకలి, దారిద్య్రం, అవిద్య, అజ్ఞానం, అణచివేత, నిరుద్యోగం వంటి వాటిని నిర్మూలించే దిశగా, అలాగే స్త్రీల, మైనారిటీల అణచివేతను నిర్మూలించే దిశగా యూఎస్ఎస్ఆర్లో కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానాన్ని ఆరం భించింది. యూఎస్ఎస్ఆర్ నాటి ప్రపంచ కష్టజీవులకు ఆదర్శప్రాయమై, దోపిడీ సామ్రాజ్యవాద శక్తులకు పక్కలో బల్లెమైంది. విమోచన కోసం పోరాడుతున్న జాతులకు అండగా నిలిచింది. వియత్నాం, క్యూబా విప్లవాలకు రష్యా ఇచ్చిన చేయూత అనితరసాధ్యమైంది. సోవియట్ యూనియన్ వెన్నుదన్నుగా నిలువకపోయి ఉండినట్లయి తే చైనాలో మావో నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ విజ యం మరింత జటిలం, ఘోరమూ అయి ఉండేది! సోవి యట్ రష్యా ప్రసక్తి లేకుండా, తూర్పు యూరప్ రాజ్యా లతో సోషలిస్టు శిబిరం సాధ్యమై ఉండేది కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో పరమ కిరాతకమైన ఫాసిస్టు హిట్లర్ నేతృత్వంలోని, నాజీ సైన్యాన్ని ఓడించడంలో సోవియట్ యూనియన్ ధైర్యమూ, కృషీ, త్యాగమూ మరువలేనివి. నూతనంగా స్వాతంత్య్రం పొందిన భారత్, ఈజిప్టు వంటి దేశాలకు, తొలినాళ్లలో సోవియట్ అందించిన సాయం నిర్మాణాత్మకమైనది. భారీ పరిశ్రమల ఏర్పాటుకై నెహ్రూ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు పశ్చిమ దేశాలు తొంటి చెయ్యి చూపితే రష్యా సాయం చేసింది. అంతరి క్షంలోకి తొలి వ్యోమగామిని పంపి శాస్త్రసాంకేతిక రంగా లలో సైతం శ్రమజీవుల రాజ్య ప్రాధాన్యాన్ని చాటింది. కానీ ఆ తర్వాత అదే మార్గాన యుఎస్ఎస్ఆర్ ప్రస్థా నం సాగలేదు. ఇప్పుడు యుఎస్యస్ఆర్ ప్రపంచ చిత్ర పటంలో లేదు. విచ్ఛిన్నమైన రష్యా భూభాగాలలో సైతం సోషలిజం లేదు. కష్టజీవుల రాజ్యం స్థానంలో తిరిగి పెట్టు బడిదారీ రాజ్యం వచ్చింది. ఎందుకలా జరిగింది? ఈ చిన్న వ్యాసంలో ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అసా ధ్యం. కానీ మార్క్స్ ప్రవచించిన చారిత్రక భౌతికవాద క్రమానికి సోవియట్ అవతరణ ఒక నిరూపణ చేసే ఘట్టం అని మాత్రం చెప్పగలం. పారిస్ కమ్యూన్ 72 రోజులు ఉంది. ఆ సమయం లోనే నూతన మార్గాన్ని పారిస్ నగరంలో ప్రవేశపెట్టింది. సోవియట్ యూనియన్ 72 ఏళ్లు ఉంది. ఆ వెలుగులు ‘ప్రపంచ పారిశ్రామికులారా ఏకమవండి. పోరాడితే మీకు పోయేదేమీలేదు. బానిస బంధనాలు తప్ప’ అన్న మార్క్స్ పిలుపు ఆచరణ రూపం దాల్చగలిగితే ప్రపంచం ఎలా ఉం టుందో చెప్పే చిత్రాన్ని మనముందుంచింది. నేడు వియత్నాం, క్యూబా, చైనా వంటి దేశాలు ఆ మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నాయి. అదంతా ప్రచార్భాట మని కొట్టిపారవేయనవసరం లేదు. కానీ సోవియెట్ ‘రష్యా’ అదృశ్యం కావడానికి ఏ ఆర్థిక, స్వకీయ కార ణాలు దోహదం చేశాయో ఆ కారణాలు నేటి ప్రపంచం మొత్తంలో పొంచి ఉన్నాయన్నది నిజం. -డా॥ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు (నవంబర్ 7 రష్యా విప్లవ దినోత్సవం) -
చైనా కమ్యూనిస్టు పార్టీ నేతకు జీవితఖైదు
జినాన్/బీజింగ్: అవినీతి ఆరోపణలపై కమ్యూనిస్టు పార్టీ మాజీ అగ్రనేత బోగ్జిలాయ్కి చైనా కోర్టు జీవితఖైదు విధించింది. షాన్డాంగ్ కోర్టు ఆది వారం బోగ్జిలాయ్ని అవి నీతి, అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం అభియోగాల్లో దోషిగా తేల్చింది. బోగ్జిలాయ్కు లంచం తీసుకున్నారన్న అభియోగాలపై జీవితఖైదు, నిధుల దుర్వినియోగం అభియోగాలపై 15 ఏళ్లు, అధికార దుర్వినియోగం అభియోగంలో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. -
తమ్మారెడ్డి కృష్ణమూర్తి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు, కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుడు, అభ్యుదయ చిత్రాల నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఉదయం మరణించారు. నగర శివార్లలోని కొండాపూర్ చండ్రరాజేశ్వరరావు ఫౌండేషన్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఉంటున్న తమ్మారెడ్డి బాత్రూంలోనే కుప్పకూలి చనిపోయారు. ఆయన వయస్సు 94 ఏళ్ళు. ఆయనకు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు లెనిన్‌బాబు మృతిచెందగా, మరొకరు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. కృష్ణమూర్తి మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, బంధుమిత్రులు వృద్ధాశ్రమానికి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని నాగార్జుననగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించి మూడు గంటలపాటు ఉంచారు. ఈ సమయంలో అనేక మంది ప్రముఖులు తమ్మారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు. ఆ తర్వాత సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. జీవనయానం ఇలా...: కృష్ణా జిల్లా చినపాలపర్రులో 1920 అక్టోబర్ 4న జన్మించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తమ్మారెడ్డి సత్యనారాయణకి స్వయానా సోదరుడు. తన అన్నతో పాటే ఆయన కూడా కృష్ణాజిల్లా గుడివాడలో సీపీఐ పూర్తికాలపు కార్యకర్తగా పని చేశారు. యువజన, విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన ప్రజానాట్యమండలి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్య్ర పోరాటంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1949లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు ఆయన మద్రాసు వెళ్లి సినీరంగ ప్రవేశం చేశారు. చిత్రసీమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంతో ఆయన కూడా ఇక్కడకు వచ్చారు. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పేరిట ఓ సంస్థను నెలకొల్పి ఎన్నో అభ్యుదయ, సందేశాత్మక చిత్రాలను నిర్మించారు. లక్షాధికారి, జమీందార్, బంగారుగాజులు, ధర్మదాత, ఇద్దరు కొడుకులు, దత్తపుత్రుడు వంటి చిత్రాలు ఆయన నిర్మించినవే. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2007లో రఘుపతి వెంకయ్య అవార్డు గెలుచుకున్నారు. రాష్ట్రంలో ప్రజానాట్యమండలి పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన కృష్ణమూర్తి తుది శ్వాస విడిచేవరకు ఆ సంస్థతోనూ, కమ్యూనిస్టు పార్టీతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వృద్ధాశ్రమంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అన్ని విధాలుగా సహాయసహకారాలను అందించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
వీర తెలంగాణ పోరుకు 66 ఏళ్లు!
సాక్షి, హైదరాబాద్: భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం బందూకులు చేత బట్టి రజాకార్లను తరిమికొట్టిన వీరతెలంగాణ సాయుధ పోరాటం 66వ వార్షికోత్సవాలను వివిధ కమ్యూనిస్టు పార్టీలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, ఎంసీపీఐ-యు, సీపీఐ ఎంఎల్ (లిబరేషన్) సంయుక్తంగా వార్షికోత్సవ సభను నిర్వహిస్తున్నాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం ఆరింటికి జరిగే ఈ కార్యక్రమంలో బీవీ రాఘవులు, కె.నారాయణ, గుర్రం విజయ్‌కుమార్, ఎండీ గౌస్, ఎన్.మూర్తి పాల్గొంటున్నారు. తారీఖులు, దస్తావేజులను పక్కనబెడితే ఈ పోరాటానికి 1947 సెప్టెంబర్ 11న అంకురార్పణ జరిగిందని కమ్యూనిస్టులు చెబుతుంటారు. బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ మొదలు పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం వరకు ఎందరెందరో ఈ వీరోచిత పోరాటానికి నాయకత్వం వహించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి : బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(సెప్టెంబర్ 17) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రాజేశ్వరరావు, అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.ప్రకాశ్‌రెడ్డిలు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజలు, పార్టీలే స్వచ్ఛందంగా జాతీయ పతాకాలను ఆవిష్కరించి విమోచన దినోత్సవ చరిత్రను భావితరాలకు గుర్తు చేయాలని పిలుపునిచ్చారు. -
ఏవీ ఆ అడుగుజాడలు?
సంస్మరణం: తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధికారికంగా గుర్తించి నిర్వహించడం లేదు. దీనితో తమ ప్రత్యేకతను ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరించిందన్న భావనకు తెలంగాణ వారిలో బీజం పడింది. ఆగస్టు 15, 1947 దేశానికి స్వాతంత్య్రం లభిస్తే, తెలంగాణ సహా నిజాం సంస్థానంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సెప్టెం బర్ 17, 1948న స్వాతంత్య్రం లభించింది. హైదరాబాద్ సం స్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయడానికి సెప్టెం బర్ 13, 1948 నుంచి సెప్టెం బర్ 18, 1948 వరకు జరిగిన పోలీసు చర్య ఫలితంగా నిజాం ప్రభువు చేతులెత్తి తన సుముఖతను వ్యక్తం చేశాడు. స్వతంత్ర ప్రతిపత్తిని వదులుకుని, కొన్ని సదుపాయాలను రాబట్టుకుని సంస్థానాన్ని విలీనం చేశాడు. నిజాం సంస్థానంలో ఒకప్పుడు భాగంగా ఉండి, ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో భాగమైన ప్రాం తాలలో ఆ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను సాధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నాయి. కానీ తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధికారికంగా గుర్తించి నిర్వహించడం లేదు. దీనితో తమ ప్రత్యేకతను ఆరంభంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరించిందన్న భావనకు తెలంగాణ వారిలో బీజం పడింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా తెలంగాణ వారికి ఇచ్చిన హామీలు, ఇరువురి మధ్య జరిగిన ఒప్పం దాలు, 610 జీవో వంటి కీలక అంశాలు నీటిమూటలుగా మిగిలిపోయాయనీ, ఆంధ్ర ప్రాంత పాలకుల నిర్లక్ష్యానికి తాము గురయ్యామనీ; రాజకీయంగా, సాంస్కృతికంగా వెనుకబడిపోవడానికి ఇవి కారణమైనాయనీ ఆ ప్రాంత ప్రజానీకం భావించడం మొదలుపెట్టింది. ఇదే నివురుగప్పిన నిప్పులా ఉండి, నిరసనల రూపంలో బయటపడుతూనే ఉంది. ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం కోసమే ఈ ఉపోద్ఘాతం చెప్పవలసివచ్చింది. నిజాం పాలనలో ఆయన తాబేదార్లు, భూస్వాములు, దుర్మార్గంగా సాగిన స్థానిక పాలన కారణంగా రైతులు, సామాన్య ప్రజలు, కష్టజీవులు, అణగారిన కులాల వారు తీవ్ర నిర్బంధానికీ, దోపిడీకి గురవుతూ ఉండేవారు. ప్రజాబాహుళ్యం మాట్లాడే తెలుగు భాష, అందులో వచ్చిన సాహిత్యం కూడా అణచివేతకు గురయ్యేవి. ఈ సాంస్కృతిక దాడికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఉద్యమించింది. ‘భూమి కోసం’, ‘భుక్తి కోసం’, ‘అణచివేత నుంచి విముక్తి కోసం’ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన రైతాంగం గొప్ప ప్రజా ఉద్యమం నిర్వహించింది. జూలై 4, 1946న దొడ్డి కొమరయ్య అమరత్వం ఆ పోరుకు నాందీ వాచకం కాగా, ముగింపు అక్టోబర్ 21, 1951న జరిగింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల లో ప్రధానంగా పోరాటం జరిగినప్పటికీ మిగిలిన తెలంగాణ ప్రాంతాలలో కూడా ఎన్నో త్యాగాలు జరిగాయి. నాలుగు వేలకు పైగా యోధులు అసువులు బాశారు. నిర్బంధాలకూ, చిత్రహిం సలకు ఇక లెక్కలేదు. తెలంగాణ ఆడపడుచులు పురుషులతో పాటు పోరు బాట పట్టి వారితో సమంగా ఇక్కట్లు అనుభవించారు. నిజాం సైన్యాలే కాక, నెహ్రూసైన్యాలు, భూస్వాముల తొత్తులవల్ల కూడా స్త్రీలు అవమానాలకు, అరాచకాలకు గురయ్యారు. కానీ వారి పోరాటం ఫలితంగానే భూమి సమస్య ఎజెండాగా ముందుకు వచ్చింది. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో పది లక్షల ఎకరాలను పేద రైతులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ‘దొరలు’ గడీలు కూడా విడిచిపెట్టి హైదరాబాద్ నగరానికి బతుకుజీవుడా అనుకుంటూ పోయారు. కాల్మొక్కుత భాం చన్ అన్న గొంతులే, గోల్కొండ ఖిల్లా కింద నీ గోరీ కడతామని హెచ్చరించేందుకు ఉద్యమం ధైర్యమిచ్చింది. నవాబును, ఆయన తాబేదార్లను, గూండాలను ఆ పోరాటమే చావుదెబ్బ తీసింది. కేవలం సెప్టెంబర్ 13 నుంచి ఆరంభమైన పోలీసు చర్యతో నాలుగు రోజులలోనే నిజాం లొంగి పోయాడంటే, అప్పటికే ఆయన బలహీనపడ్డాడన్నమాట. 1952-1956 మధ్య జరిగిన అనేక పరిణామాల మధ్య తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదే శ్‌గా అవతరించాయి. పాలకుల నిర్లక్ష్యం, తెలంగాణ పట్ల వివక్ష వల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆరంభమైంది. అప్పటికే చీలిక వచ్చినప్పటికీ 1969లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో జరిగిన ఉద్యమ సమయంలో కమ్యూనిస్టులు రాష్ట్ర సమైక్యతకు కృషి చేశారు. ఆ సమయంలోనే భీమిరెడ్డి నరసింహారెడ్డి (నాటి శాసనసభ్యుడు) సభలోనే ‘‘చెన్నారెడ్డీ! నువ్వు పొట్టకూటి కోసం ఆంధ్ర నుంచి వచ్చిన కూలీలను, చిరుద్యోగులను హైదరాబాద్ నుంచి తరిమివేస్తానంటున్నావు. అలాగే చెయ్యి! ఈ సమయంలో మేం (కమ్యూనిస్టులం) గ్రామాలలో తిరిగి ప్రవేశించి భూస్వాములను, దొరలను తరిమికొడతాం!’’ అని గర్జించాడు. 1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత చరిత్రలో పేర్కొనదగినది తెలంగాణ సాయుధ పోరాటం. (నేడు తెలంగాణ విముక్తి దినోత్సవం సందర్భంగా...) -
మరో భూబాగోతం కారాదు
విశ్లేషణ: భూసంస్కరణల బిల్లు 1972లో మన రాష్ట్రంలో ఆమోదం పొందింది. దానికి మళ్లీ కాంగ్రెస్ పార్టీయే తూట్లు పొడిచి ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి కారణమైంది. తెల్లకాగితాలపై భూమి మార్పిడి జరిగినా, దానికి చట్టబద్ధత లేదని కోర్టు చెప్పినా లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అయితే ఆ కుట్రలు ఎన్నాళ్లో సాగలేదు. మంత్రతంత్రాలతో పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేస్తున్న వారు కూడా భూసంస్కరణల నుంచి భూమిని కాపాడుకోవడానికి బరితెగించారు. ‘ఒంటె అందాన్ని చూసి గాడిద ఆశ్చర్యపోతే, గాడిద రాగాన్ని విని ఒంటె మూర్ఛపోయిందట’.. సెప్టెంబర్ 8న సీసీఎల్ఏ కార్యాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తరువాత ఈ సామెతే గుర్తుకు వచ్చింది. రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశ చర్చనీయాంశం - కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న భూసంస్కరణల బిల్లు ముసాయిదాపై చర్చ. ప్రభుత్వం తెచ్చే భూసం స్కరణల స్వరూపం ఎలా ఉంటుందో మనకి గతాను భవాలు చాలా ఉన్నాయి. వాటిని గమనించడం అవసరం. అడపాదడపా జరిగే భూపంపిణీ వ్యవహారం కూడా ప్రహసనాన్ని మరిపిస్తూనే ఉంటుందన్న సంగతి కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. కొత్త బిల్లు నేపథ్యంలో వీటి సమీక్ష అవసరం. కేంద్రం ఆశయం సరే... ముసాయిదాలో ఒకటి, రెండు ప్రధాన అంశాలు ఆసక్తి కలిగించాయి. నీటి పారుదల సౌకర్యం గల భూమి 5-10 ఎకరాలకు, మెట్ట ప్రాంతంలో 10-15 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదన ఇందులో ఒకటి. దీనిని కాంగ్రెస్ పార్టీ అంగీకరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. హర్షించాల్సిన సందర్భమే అయినా, ఇది రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా చేసుకున్న ముసాయిదా అని చెప్పక తప్పదు. భూసమస్య తీసుకుంటే, దేశంలో 50 శాతం ప్రజలు భూమిలేని పేదలే. అందులో దళితులు, పేద వర్గాలు దాదాపు 60 శాతం ఉంటారు. 55 శాతం భూమి మీద 10 శాతం కుటుంబాలే ఆధిపత్యం కలిగి ఉన్నాయని ముసాయిదాలోనే తెలియజేశారు. అయితే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నా, మన రాష్ట్ర నాయకత్వం నీటి సౌకర్యమున్న భూమి 5-10 ఎకరాలకు, మెట్ట 10-15 ఎకరాలకు పరిమితం చేయాలన్న ప్రతిపాదనతిరస్కరించి, ఆ సంగతిని బహిరంగంగానే ప్రకటిం చటం ఆశ్చర్యకరం. ఇవన్నీ జరిగాకే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. భూసమస్యపై స్పష్టతతో, అంకితభావంతో ఉన్న వామపక్షాలు, కొన్ని ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రతిపాదనను ఆమోదించాయి. మిగిలిన బూర్జువా పార్టీలు వ్యతిరేకించాయి. గత అనుభవాలు భూ సంస్కరణల బిల్లు 1972లో మన రాష్ట్రంలో ఆమోదం పొందింది. దానికి మళ్లీ కాంగ్రెస్‌పార్టీయే తూట్లు పొడిచి ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి కారణమైంది. తెల్లకాగితాలపై భూమి మార్పిడి జరిగినా, దానికి చట్టబద్ధత లేదని కోర్టు చెప్పినా లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అయితే ఆ కుట్రలు ఎన్నాళ్లో సాగలేదు. మంత్రతంత్రాలతో పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేస్తున్న వారు కూడా భూసంస్కరణల నుంచి భూమిని కాపాడుకోవడానికి బరితెగిం చారు. ఆ సందర్భంగానే ఆనాటి కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యులు మందపాటి నాగిరెడ్డి అసెంబ్లీలోనే ‘అధ్యక్షా నాకు హోం పోర్టు ఫోలియో ఒక్క రోజు ఇవ్వం డి, కొన్ని వందల వ్యభిచార కేసులు నమోదు చేయిస్తా’నని ప్రకటించారు. అంటే బూటకపు విడాకుల ద్వారా భూమిని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. నేను చిత్తూరు జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేసినప్పటి అనుభవాలను ఇక్కడ ఉదహరించాలి. రెవెన్యూ శాఖ మాజీ అధికారులు, భూకబ్జాదారులు కలిపి పాత స్టాంపు పేపర్లు సంపాదించేవారు. వాటిని కుండలో వేసి వేడిచేసి పురాతన కాలపు పత్రాల రూపు తెచ్చేవారు. ఇలా వేలాది ఎకరాలు మీద సంపన్నులు బినామీ పట్టాలు సృష్టిస్తూ ఉంటే అలాంటి ఘటనలు వెలుగులోకి తెచ్చాం. ఫలితంగా ఆనాటి కలెక్టర్ నాగార్జున కె.వి.బి.పురం ఎమ్మార్వోను సస్పెండ్ చేశారు. వెంటనే నాగార్జున గుంటూరు జిల్లాకు బదిలీ కావడం ఇక్కడ కొసమెరుపు. నాగార్జున వెళ్లినా ఆ ప్రక్రియ కొనసాగించడానికి ప్రయత్నించిన ఆనాటి జాయింట్ కలెక్టర్‌పై కూడా బదిలీ వేటు పడింది. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. గత అనుభవాలను బట్టి ఇప్పుడు మన ముందున్న ముసా యిదా సంగతి చూస్తే, ఒక పక్క రాష్ర్ట నాయకత్వం వ్యతిరేకిస్తున్నది. మరోపక్క సాంకేతికంగా అమలయ్యేలా చేసి ప్రచారం చేసుకొని ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నం కూడా జరగవచ్చు. భూవైశాల్యం పెరగదు. జనాభా పెరుగుతుంది. కాబట్టి ఉన్న భూమిని ప్రజానీకానికి అందుబాటులో ఉంచకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ భూమి, వక్ఫ్‌బోర్డు ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయి. ఆ భూమిని లీజుకిస్తే ఎంత ఆదాయం దేవాలయాలకు వస్తున్నది? భూమిలేని పేద ప్రజలకు ఆ భూమిని కేటాయిస్తే పేదలకు, నైవేద్యానికి కూడా ఉపయోగపడుతుంది. భూమికి రక్షణ కరవు ఆనాటి కమ్యూనిస్టులు భూపోరాటాలు సాగించారు. వినోబా వంటి వారు పోరాటం లేకుండానే భూములు వస్తాయని భ్రమపెట్టారు. దీనికే భూస్వా ములు పనికిరాని భూమి ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కీసరలో ఉన్న ఇలాంటి భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముకోవడానికి పూనుకున్నారు. దానిని సీపీఐ వెలుగులోకి తెచ్చింది. ఆ భూమికి ఒక చివరన ఎమ్మార్వో కార్యాలయం మరో చివరన పోలీస్ స్టేషన్ ఉంటాయి. కానీ భూదానంతో వచ్చిన భూమికి రక్షణ కరువైంది. అలాగే రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో 60 ఎకరాల భూదాన భూమిలో ప్రైవేట్ ఎస్ఎల్సీ ఇంజనీరింగ్ కాలేజీ వెలసి బాగా విద్యావ్యాపారం చేసుకుంటున్నది. కుంట్లూరు గ్రామ సర్వే నెంబర్ 215 నుంచి 224 వరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలాంటి సంబంధంలేని సంప న్నులు రెండు పార్టీలుగా చీలి కోర్టుకు వెళ్లారు. కోర్టులో కేసు జరుగుతుండగానే రాజీపడ్డారు. రాజీపడిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ 41 ఎకరాల బినా మీలకు ఓఆర్సీ మంజూరు చేశారు. అలాగే మణికొండలో ప్లాట్లు వేసి అమ్ము కుంటున్నారు. ఇవన్నీ చట్ట విరుద్ధమే. అటవీ + రెవెన్యూ ఆటలు ఇవి మరింత ఆశ్చర్యకరం. విజయనగరం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు వేలాది ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్ల పట్టాలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఆ భూమిపై అటవీ శాఖ కంచె వేసి అర్హులను రాకుండా ఆటంక పరుస్తున్నది. విజయనగరం జిల్లా బాడంగి మండలంలో, శ్రీకాకుళం జిల్లాలో కొత్తవలస, చిత్తూరు జిల్లాల్లో శ్రీకాళహస్తి ప్రాంతాలలో నేనే స్వయంగా ఆందోళనలో పాల్గొన్నాను. శ్రీకాళహస్తి వద్ద గొల్లపల్లిలో రెండు వేల ఎకరాలకు పట్టాలిచ్చినా అటవీశాఖ వారు అనుమతివ్వకపోగా, అక్కడి గిరిజనులతో కలిసి ఆ భూమిలో వ్యవసాయం చేయించడానికి ప్రయత్నిస్తే ఎస్పీ నాయకత్వాన పోలీసులు, రెవెన్యూ, ఫారెస్టు అధికారులు మూకుమ్మడిగా వచ్చారు. ఒకవైపు రెవెన్యూ, మేమే పట్టాలిచ్చామని చెబుతున్నా, ఫారెస్టు అధికారులు అంగీకరిం చకపోవడంతో పోలీసు అధికారులు నిమిత్తమాత్రులయ్యారు. వీటి గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. ఇక గ్రామాల నుంచి పట్టణాలకు వలసల మాట నిజమే అయినా 79 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. భవిష్యత్తు వ్యవసాయ రంగానిదే. ప్రభుత్వ పాత్ర భూమి హక్కును ఇవ్వడమేకాదు, దాని పరిరక్షణలో కూడా ప్రభుత్వ బాధ్యత చాలా ఉంటుంది. పారిశ్రామిక రంగంపై చూపే శ్రద్ధ వ్యవసాయ రంగంపైనా చూపించాలి. సహకార రంగాన్ని సమర్థంగా పనిచేయించాలి. పంటల మార్కె టింగ్‌కు సాయపడాలి. ఉత్పత్తికి, రవాణాకు, ధాన్యం ప్రాసెసింగ్‌కు చర్యలు తీసుకోవాలి. కూరగాయలు పండించేందుకు, అమ్మకాలకు తోడ్పడాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ‘‘వ్యవసాయ రంగం నష్టం కాదు. దేశానికి లాభం’’ అనే విధానం ప్రభుత్వం అవలంబిస్తే అంతా సక్రమంగా జరుగు తుంది. పారిశ్రామికవేత్తలు విలాసాల కోసం వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగనామం పెడితే, ఆ ప్రజాధనాన్ని ప్రభుత్వం ‘నిరర్ధక ఆస్తులుగా’ ప్రకటించి మోసం చేస్తున్నది. కానీ సబ్సిడీ ద్వారా రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నించలేదు. ప్రభుత్వ దివాళాకోరు తనం వలన వ్యవసాయరంగం దెబ్బతిన్నది. మార్క్స్ చెప్పినట్లు ‘ఒక వ్యక్తి కేవలం తన జానెడు పొట్ట నింపుకోవడానికే ఉత్పత్తి చేయడు, కొన్ని పదుల, వందల, వేల పొట్టలు నింపడానికి తన శ్రమ శక్తిని వినియోగిస్తాడు’. ఇంతకీ ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయమని తెలిసినా వామపక్షాలు ఎందుకు బలపరుస్తున్నాయి? ‘వారు ఒకందుకు బిల్లు పెట్టారు. మనం ఒక విధంగా సమర్థిస్తున్నాం’. ఈ ప్రయత్నం కేంద్రం ఎన్నికల జిమ్మిక్కని కొట్టిపారేయడం కన్నా, సమర్థించి భవిష్యత్తు ఉద్యమానికి బలం చేకూర్చడం ఉత్తమం. -
మాజీ ఎమ్మెల్యే సీకే నారాయణ రెడ్డి కన్నుమూత
న్యూస్‌లైన్, పీలేరు : పేదల పెన్నిధిగా గుర్తింపు పొందిన భారత కమ్యూనిస్టు పార్టీ యోధుడు, పీలేరు మాజీ ఎమ్మెల్యే సీకే. నారాయణరెడ్డి(85) ఇకలేరన్న వార్త పీలేరు ప్రజలను కలచివేసింది. 1962 నుంచి 1967 వరకు పీలేరు ఎమ్మెల్యేగా పని చేసిన నారాయణరెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొం దుతూ శుక్రవారం పరమవదించారు. రొంపిచెర్ల క్రాస్ చల్లావారిపల్లెకు చెందిన నారాయణరెడ్డి భారత కమ్యూనిష్టు పార్టీ తరపున పీలేరు నియోజకవర్గం నుంచి 1962లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. తన పదవీ కాలంలో పేదల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారు. పీలేరు పట్టణంలోని ఉన్నత పాఠశాల అభివృద్ధికి కృషిచేయడంతోపాటు పేద విద్యార్థుల కోసం మొట్టమొదటిసారిగా హాస్టల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన ఆహార పదార్థాలను దాతల నుంచి సేకరించి హాస్టల్‌ను నిర్వహించేవారు. ఆయన సతీమణి జయప్రద బీఎడ్ సైన్స్ అసిస్టెంట్ పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసి ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేసి ఆదర్శ ఉపాధ్యాయినిగా గుర్తింపు పొందారు. రాజకీయ నేతల ఒత్తిళ్ల ప్రభావంతో పదేపదే బదిలీలకు గురవుతుండడంతో మనస్తాపం చెంది ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం భార్యభర్తలు హైదరాబాద్‌లో స్థిరపడి అక్కడ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి విద్యాసంస్థ ఏర్పాటు చేశారు. దీంతోపాటు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరుతో అనేక సాహితీ ప్రచురణలను ముద్రించి సామాన్య పాఠకులకు తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చారు. స్వతహాగా ఆయనిది జమీందారీ కుటుంబం అయినప్పటికీ తన ఆస్తులన్నీ పేదలకు దానం చేశారు. నారాయణరెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు గౌతమ్, కోడలు ఇరువురూ వైద్యవృత్తిని స్వీకరించి మదనపల్లెలో వైద్యసేవలందించేవారు. 90వ దశకంలో బెంగళూరులో జరిగిన సార్క్ సమావేశాలకు హాజరై తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పెద్ద కుమార్తెను అనంతపురంలో ఇచ్చి వివాహం చేశారు. రెండో కుమార్తె హైదరాబాద్ డాక్టర్ వృత్తిలో ఉన్నారు. ఆమె వద్ద వృద్ధ దంపతులు ఉంటున్నారు. సీకే. నారాయణరెడ్డి మృతి వార్త తెలిసిన వెంటనే శాసనమండలి సభ్యులు యండ పల్లె శ్రీనివాసులురెడ్డి, చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ వి. సిద్దరామిరెడ్డి తదితరులు హైదరాబాద్‌లో నారాయణరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.