గతం ‘గర్జన’ విందాం | Russian history, a must to reiterate | Sakshi
Sakshi News home page

గతం ‘గర్జన’ విందాం

Published Thu, Nov 7 2013 3:00 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

గతం ‘గర్జన’ విందాం - Sakshi

గతం ‘గర్జన’ విందాం

నవంబర్ 7వ తేదీకి మానవేతిహాసంలో మహోన్నత స్థానం ఉంది. 1917లో (96 ఏళ్ల క్రితం) రష్యాలో లెనిన్ నేతృత్వంలో, కమ్యూనిస్టు పార్టీ సారథ్యంలో కష్టజీవులు సంఘటితమై దోపిడీ వర్గాల పాలనను అంతమొందించారు. శ్రమజీవుల రాజ్యాన్ని స్థాపించుకున్నారు. అదే యుఎస్‌ఎస్‌ఆర్ అప్పటికి రష్యా పారిశ్రామికంగా అభివృద్ధి చెందలేదు. 13 శాతం మంది మాత్రమే పారిశ్రామిక కార్మి కులు ఉండేవారు. దేశంలో అత్యధిక భాగంలో ‘కులక్’ (జమీందారుల వంటి భూస్వాముల) పెత్తనం ఉండేది. ప్రజలు ఆ భూస్వామ్య ప్రభువుల దోపిడీ, దుర్మార్గం, అణ చివేతలను అనుభవిస్తుండేవారు.
 
 కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడంతోనే జారీ చేసిన తొలి ‘డిక్రీ’ (చట్టం) భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసిం ది. ‘భూదేవి! నువ్వు సహజంగా నీ సహచరుడైన రైతు కూ లి స్వేదంతో మమేకమై పుష్పించి ఫలించాలని ఆరాటపడతావు. అలాంటి వాంఛకు విరుద్ధంగా భూస్వాములు ని న్ను తమ నిర్బంధంలో ఉంచుకున్నారు. నేటితో నీకు విముక్తి లభిస్తున్నది. నీ ప్రియమైన రైతుకూలితో కలిసి ఆనం దించు’ అంటూ హృద్యంగా సాగుతుంది ఆ డిక్రీ పాఠం. రష్యాలో శ్రామికరాజ్యం మార్క్స్ ప్రవచించిన దానికి మక్కికి మక్కీగా ఏర్పడలేదు. పెట్టుబడిదారీ విధానం పూర్తిగా అభివృద్ధి చెందిన తదనంతర పరిణామంగా కాకుండా, భూస్వామ్య వ్యవస్థలోనే ‘సోషలిస్టు రాజ్యం’గా ఆవిర్భవించింది. ఆకలి, దారిద్య్రం, అవిద్య, అజ్ఞానం, అణచివేత, నిరుద్యోగం వంటి వాటిని నిర్మూలించే దిశగా, అలాగే స్త్రీల, మైనారిటీల  అణచివేతను నిర్మూలించే దిశగా యూఎస్‌ఎస్‌ఆర్‌లో కమ్యూనిస్టు పార్టీ ప్రస్థానాన్ని ఆరం భించింది. యూఎస్‌ఎస్‌ఆర్ నాటి ప్రపంచ కష్టజీవులకు ఆదర్శప్రాయమై, దోపిడీ సామ్రాజ్యవాద శక్తులకు పక్కలో బల్లెమైంది. విమోచన కోసం పోరాడుతున్న జాతులకు అండగా నిలిచింది. వియత్నాం, క్యూబా విప్లవాలకు రష్యా ఇచ్చిన చేయూత అనితరసాధ్యమైంది. సోవియట్ యూనియన్ వెన్నుదన్నుగా నిలువకపోయి ఉండినట్లయి తే చైనాలో మావో నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ విజ యం మరింత జటిలం, ఘోరమూ అయి ఉండేది! సోవి యట్ రష్యా ప్రసక్తి లేకుండా, తూర్పు యూరప్ రాజ్యా లతో సోషలిస్టు శిబిరం సాధ్యమై ఉండేది కాదు. రెండవ ప్రపంచ యుద్ధంలో పరమ కిరాతకమైన ఫాసిస్టు హిట్లర్ నేతృత్వంలోని, నాజీ సైన్యాన్ని ఓడించడంలో సోవియట్ యూనియన్ ధైర్యమూ, కృషీ, త్యాగమూ మరువలేనివి.
 
 నూతనంగా స్వాతంత్య్రం పొందిన భారత్, ఈజిప్టు వంటి దేశాలకు, తొలినాళ్లలో సోవియట్ అందించిన సాయం నిర్మాణాత్మకమైనది. భారీ పరిశ్రమల ఏర్పాటుకై నెహ్రూ ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు పశ్చిమ దేశాలు తొంటి చెయ్యి చూపితే  రష్యా సాయం చేసింది. అంతరి క్షంలోకి తొలి వ్యోమగామిని పంపి శాస్త్రసాంకేతిక రంగా లలో సైతం శ్రమజీవుల రాజ్య ప్రాధాన్యాన్ని  చాటింది.
 
 కానీ ఆ తర్వాత అదే మార్గాన యుఎస్‌ఎస్‌ఆర్ ప్రస్థా నం సాగలేదు. ఇప్పుడు యుఎస్‌యస్‌ఆర్ ప్రపంచ చిత్ర పటంలో లేదు. విచ్ఛిన్నమైన  రష్యా భూభాగాలలో సైతం సోషలిజం లేదు. కష్టజీవుల రాజ్యం స్థానంలో తిరిగి పెట్టు బడిదారీ రాజ్యం వచ్చింది. ఎందుకలా జరిగింది? ఈ చిన్న వ్యాసంలో ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అసా ధ్యం. కానీ మార్క్స్ ప్రవచించిన చారిత్రక భౌతికవాద క్రమానికి సోవియట్ అవతరణ ఒక నిరూపణ చేసే ఘట్టం అని మాత్రం చెప్పగలం.  పారిస్ కమ్యూన్ 72 రోజులు ఉంది. 

 

ఆ సమయం లోనే  నూతన మార్గాన్ని పారిస్ నగరంలో ప్రవేశపెట్టింది. సోవియట్ యూనియన్ 72 ఏళ్లు ఉంది. ఆ వెలుగులు ‘ప్రపంచ పారిశ్రామికులారా ఏకమవండి. పోరాడితే మీకు పోయేదేమీలేదు. బానిస బంధనాలు తప్ప’ అన్న మార్క్స్ పిలుపు ఆచరణ రూపం దాల్చగలిగితే ప్రపంచం ఎలా ఉం టుందో చెప్పే చిత్రాన్ని మనముందుంచింది. నేడు వియత్నాం, క్యూబా, చైనా వంటి దేశాలు ఆ మార్గాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నాయి. అదంతా ప్రచార్భాట మని కొట్టిపారవేయనవసరం లేదు. కానీ సోవియెట్ ‘రష్యా’ అదృశ్యం కావడానికి  ఏ ఆర్థిక, స్వకీయ కార ణాలు దోహదం చేశాయో ఆ కారణాలు నేటి ప్రపంచం మొత్తంలో పొంచి ఉన్నాయన్నది నిజం.
 -డా॥ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు
 (నవంబర్ 7 రష్యా విప్లవ దినోత్సవం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement