సాక్షి, కృష్ణా: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కమ్యూనిస్ట్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది’ అంటూ తన ట్విటర్ ఖాతాలో శనివారం పోస్ట్ చేశారు. కేశినేనికి చెందిన ట్రావెల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది పాత బకాయిలు చెల్లించాలని శుక్రవారం నిరసస దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు స్థానిక కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ దుమారం రేపుతోంది. ఆయనపై కమ్యూనిస్ట్‌లు భగ్గుమంటున్నారు. కేశినేని వ్యాఖ్యలను వెనక్కితీసుకుకోవాలని విజయవాడ నగర సీపీఐ కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. కార్మికులకు జీతాలు ఎగ్గొట్టిన నాని.. తమ పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కార్మికులకు న్యాయం చేసేంత వరకు తమ పారాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. కాగా మొన్నటి వరకు టీడీపీ నేతలపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించిన నాని.. తాజాగా కమ్యూనిస్ట్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగామారి పోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది.
— Kesineni Nani (@kesineni_nani) July 27, 2019
Comments
Please login to add a commentAdd a comment