ఆంధ్రప్రదేశ్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో పొత్తు లేదా ఎన్నికల సర్దుబాట్లకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) ససేమిరా అంటోంది.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో పొత్తు లేదా ఎన్నికల సర్దుబాట్లకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) ససేమిరా అంటోంది.
సీపీఎంతో మాత్రమే సర్దుబాట్లు చేసుకోవాలని జేఎస్సీ నాయకత్వం భావిస్తోంది. ఈమేరకు సీపీఎం నేతలు పి.మధు, పాటూరి రామయ్య ఇటీవల జేఏస్పీ నేతలు కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్, తులసిరెడ్డితో తొలివిడత చర్చలు జరిపారు.
ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారో చర్చించుకున్నారు. అయితే సీపీఐతో పొత్తు ప్రతిపాదనను జేఎస్పీ ప్రెసిడెన్షియల్ బ్యూరో తోసిపుచ్చింది. విభజనకు సీపీఐ మద్దతు ఇచ్చినందున ఆ పార్టీతో కలిసి పోటీ చేయాలనుకోవడం లేదని స్పష్టం చేసింది.