పాత సరుకులన్నీ చంద్రబాబుకే | ‘We will restore the glory of Telugu-speaking people’ | Sakshi
Sakshi News home page

పాత సరుకులన్నీ చంద్రబాబుకే

Published Fri, Apr 11 2014 2:35 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

పాత సరుకులన్నీ చంద్రబాబుకే - Sakshi

పాత సరుకులన్నీ చంద్రబాబుకే

 జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ ఎద్దేవా
 కదిరి, న్యూస్‌లైన్: టీడీపీలోకి వెళుతున్న కాంగ్రెస్ నేతలందరూ పాడుబడ్డ సామాన్లతో సమానమని, ఆ పాత సరుకులన్నీ చంద్రబాబుకే వదిలేశామని జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
 
 అలాంటి వారు తన వెంట రాకపోవడంతో నష్టం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ నీ పాలనలో కేవలం రూ.50 పెన్షన్ ఇచ్చేందుకు ఏడ్చావు.. ప్రజల్ని ఏడ్పించావు. కొత్తగా పెన్షన్ కావాలని అడిగితే ఎవరైనా చస్తే ఇస్తామని చెప్పావు. ఇప్పుడు అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.1,000 ఇస్తానని ప్రజలను మభ్యపెబుతున్నావ’ని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన టీడీపీకి ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement