చైనా కమ్యూనిస్టు పార్టీ నేతకు జీవితఖైదు
జినాన్/బీజింగ్: అవినీతి ఆరోపణలపై కమ్యూనిస్టు పార్టీ మాజీ అగ్రనేత బోగ్జిలాయ్‌కి చైనా కోర్టు జీవితఖైదు విధించింది. షాన్‌డాంగ్ కోర్టు ఆది వారం బోగ్జిలాయ్‌ని అవి నీతి, అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం అభియోగాల్లో దోషిగా తేల్చింది. బోగ్జిలాయ్‌కు లంచం తీసుకున్నారన్న అభియోగాలపై జీవితఖైదు, నిధుల దుర్వినియోగం అభియోగాలపై 15 ఏళ్లు, అధికార దుర్వినియోగం అభియోగంలో ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.